![Woman Tests Positive For Zika In Rajasthan - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/24/zikz.jpg.webp?itok=BaRHbDn5)
జైపూర్: రాజస్తాన్‌లో ఆదివారం తొలి జికా కేసు నమోదైంది. జైపూర్‌లోని శాస్త్రి నగర్‌కు చెందిన ఓ మహిళ కళ్లు ఎర్రబా రడం, కీళ్లనొప్పులు, బలహీనత వంటి లక్షణాలతో ఈ నెల 11న స్థానిక స్వామి మాన్ సింగ్ (ఎస్‌ఎమ్‌ఎస్) ఆస్పత్రిలో చేరింది. తొలుత వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ లేవని నిర్ధారణ అయింది. దీంతో జికా సోకిందనే అనుమా నంతో ఆమె రక్త నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పంపించారు. పరీక్షల్లో జికా వైరస్ సోకినట్లు తేలిందని ఎస్‌ఎమ్‌ఎస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, వైద్యుడు యూఎస్ అగర్వాల్ ప్రకటిం చారు. రాష్ట్రంలో ఇదే మొదటి జికా కేసు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాము రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment