first case
-
భారత్‌లో తొలి మంకీపాక్స్ ‘క్లేడ్ 1బీ’ కేసు నమోదు
న్యూఢిల్లీ: అనేక దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్‌కు సంబంధించి భారత్‌లో మరో కేసు నమోదైంది. కేరళకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ క్లేడ్ 1బీ వేరియంట్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం పేర్కొంది. కాగా ఈ రకం కేసు దేశంలో నమోదవ్వడం ఇదే తొలిసారి. గతవారం కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన వ్యక్తికి క్లేడ్ 1బీ వేరియంట్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రతినిధి మనీషా వర్మ తెలిపారు. కేరళకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి యూఏఈ నుంచి ఇటీవల వచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా క్లేడ్ 1గా నిర్ధారణ అయ్యింది. ప్రపంచ ‘ఆరోగ్య ఆత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్ 1బీ’ స్ట్రెయిన్‌గా దీన్ని గుర్తించారు. అయితే, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.కాగా ప్రపంచ వ్యాప్తంగా 120కిపైగా దేశాల్లో ఎంపాక్స్ కేసులు వెలుగుచూశాయి. 2022 నుంచి 204 జూలై నాటికి లక్షకుపైగా కేసులు నమోదయ్యాయిఈ కేసుల్లో సగానికి పైగా ఆఫ్రికా ప్రాంతం, మరో 24శాతం అమెరికా, యూరోపియన్ ప్రాంతంలో 11శాతం కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. చదవండి: ప్రధానికి ‘మన్‌కీ బాత్’ పైనే ఎక్కువ దృష్టి: రాహుల్ -
భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు
న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌లో తొలి మంకీపాక్స్(ఎంపాక్స్) కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేసింది. ఢిల్లీలో ఇద్దరు వ్యక్తుల్లో లక్షణాలు గుర్తించిన ఆరోగ్య శాఖ.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే నిర్ధారణ పరీక్షల్లో ఇద్దరిలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు తేలింది.బాధితుడిని ఆదివారం ఐసోలేషన్‌లో ఉంచి నమూనాలు సేకరించామని, ఎంపాక్స్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. అయితే.. అతనికి సోకిన వేరియెంట్ క్లేడ్-2 అని, అది అంత ప్రమాదకరం కాదని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గతంలో( (జులై 2022 టైంలో) భారత్‌లో ఇలాంటి కేసులే 30 దాకా నమోదయ్యాయి. ఇక.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అందుకు కారణం క్లేడ్-1 రకం. పశ్చిమాఫ్రికా నుంచి ఈ వేరియెంట్ విజృంభించి.. ప్రపంచ దేశాలను వణికించింది. #UPDATE | The previously suspected case of Mpox (monkeypox) has been verified as a travel-related infection. Laboratory testing has confirmed the presence of Mpox virus of the West African clade 2 in the patient. This case is an isolated case, similar to the earlier 30 cases… https://t.co/R7AENPw6Dw pic.twitter.com/ocue7tzglR— ANI (@ANI) September 9, 2024మంకీపాక్స్ లక్షణాలు.. జ్వరం, చర్మం మీద నొప్పితో కూడిన దద్దు, పొక్కులు ఏర్పడటం ప్రధాన లక్షణాలు. పొక్కులకు చీము కూడా పట్టొచ్చు. వైరస్ ఒంట్లోకి ప్రవేశించిన 717 రోజుల తర్వాత దద్దు రూపంలో బయటపడుతుంది. ఎంపాక్స్‌లో ముందు తీవ్రమైన జ్వరం, తర్వాత చర్మం మీద దద్దు తలెత్తుతుంది. మొదట్లో జ్వరంతో పాటు తీవ్ర అలసట, ఒళ్లునొప్పులు, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆకలి లేకపోవటం, గొంతులో గరగర, గొంతునొప్పి ఉంటాయి. ఇవి తీవ్రంగానూ ఉంటాయి. జ్వరం తగ్గిన తర్వాత దద్దు మొదల వుతుంది. ఇది చాలావరకు ముఖం లేదంటే చేతుల మీద ఆరంభ మవుతుంది.ఆపై ఛాతీ, పొట్ట, వీపు మీదికి విస్తరిస్తుంది. అరిచేతులు, అరికాళ్లలోనూ పొక్కులు ఏర్పడొచ్చు. శరీరం మీద దద్దు చాలా నెమ్మదిగా విస్తరిస్తుంది. పొక్కులు కూడా నెమ్మదిగా వస్తాయి కాబట్టి మానటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. దురద అంత ఎక్కువగా ఏమీ ఉండదు. 46 రోజుల తర్వాత కొత్త పొక్కులేవీ ఏర్పడవు. పొక్కులు మానిన తర్వాత మచ్చలు పడతాయి. పొక్కులు మాని, చెక్కు కట్టిన తర్వాత వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. లింఫ్‌గ్రంథులు పెద్దగా అవటం మరో ప్రత్యేక లక్షణం. దద్దు రావటానికి ఒకట్రెండు రోజుల ముందు మెడ, చంకలు, గజ్జల వద్ద బిళ్లలు కడతాయి. ఇవి బాగా నొప్పి పెడతాయి. ఇదీ చదవండి: మంకీపాక్స్ ఎంపాక్స్‌గా ఎందుకు మారిందంటే..జాగ్రత్తలు ఎంపాక్స్ అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పీసీఆర్ పరీక్ష చేయించు కోవాలి. బయట తిరగకూడదు. ఇంట్లో కుటుంబ సభ్యులంతా మాస్కు ధరించాలి. ఇన్ఫెక్షన్ గలవారు వాడే దుస్తులు, వస్తువుల వంటివి విడిగానే ఉంచాలి. మిగతా వాటితో కలపకూడదు. వీరికి సపర్యలు చేసేవారు గ్లౌజులు, మాస్కు విధిగా ధరించాలి. తొలిసారి గుర్తించారిలా.. మంకీపాక్స్ వ్యాధిని 1958లో తొలిసారి గుర్తించినప్పటికీ.. మొదటిసారి 1970లో ఓ మనిషికి ఇది వ్యాప్తి చెందింది. ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా ఈ వ్యాధి కనిపించేది. అయితే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేయడంతో.. 2022లో భారీ స్థాయిలో మంకీపాక్స్ వ్యాపించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలను స్టార్ట్ చేశాయి. మంకీపాక్స్‌లో రెండు వేరియంట్లు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.. ఒకటి క్లాడ్-1 (కాంగోబేసిన్ క్లాడ్), రెండు క్లాడ్-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్)ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్-1 ఐబీ వేరియంట్ విజృంభిస్తోంది. లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఎంపాక్స్ ఎలా సోకుతుందంటే.. ఇన్ఫెక్షన్కు గురైన జంతువులకు గానీ మనుషులకు గానీ సన్నిహితంగా మెలిగినప్పుడు ఎంపాక్స్ సంక్రమిస్తుంది. ఇన్ఫెక్షన్కు గురైనవారి ఉమ్మి, మూత్రం వంటి శరీర స్రావాలు చర్మానికి తగిలినప్పుడు ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తుంది. ముఖానికి ముఖం, చర్మానికి చర్మం, నోటికి నోరు, నోటికి చర్మం తగలటం.. ఇలా ఏ రూపంలోనైనా సోకొచ్చు. ఇది ఒంట్లోకి ప్రవేశించటానికి తగిన పరిస్థితులూ కలిసి రావాలి. చర్మం ఎక్కడైనా గీసుకుపోయినా, గాయాలైనా, పుండ్లు పడినా.. అక్కడ ఇన్ఫెక్షన్కు గురైనవారి శరీర స్రావాలు అంటుకుంటే వైరస్ ప్రవేశిస్తుంది. పెద్దవాళ్ల కన్నా పిల్లలకు.. ముఖ్యంగా పదేళ్ల లోపు వారికి ముప్పు ఎక్కువ. ఇన్ఫెక్షన్ గలవారితో లైంగిక సంపర్కంలో పాల్గొన్నా సంక్రమించొచ్చు. చికిత్స ఉంది, కానీ.. ఇప్పుడు ఎంపాక్స్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నప్పటికీ కొత్త జబ్బేమీ కాదు. దీని గురించి ఇంతకు ముందే తెలుసు. చికిత్సలూ ఉన్నాయి. జ్వరం తగ్గటానికి పారాసిటమాల్ ఉపయోగపడుతుంది. పొక్కులు చీము పట్టే అవకాశముంది కాబట్టి యాంటీబయాటిక్స్ అవసర మవుతాయి. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా తగినంత నీరు, ద్రవాహారం తీసుకోవాలి. మంచి పోషకాహారం తినాలి. కొందరికి రక్తనాళం ద్వారా సెలైన్ ఎక్కించాల్సి రావొచ్చు. ఉపశమన చికిత్సలతోనే చాలా మంది కోలుకుంటారు. భయమేమీ అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండటం అవసరం. సమస్య తీవ్రమైతే ప్రాణాంతకంగా పరిణమించొచ్చు. -
కొత్త చట్టాలు.. దేశంలోనే తొలి కేసు నమోదు!
న్యూఢిల్లీ: దేశంలో కొత్త చట్టాలు జూన్ 30 అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)ని భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)గా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)ని భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ)ను భారతీయ సాక్ష్య అధినీయం(బీఎస్ఏ)గా మార్చారు. ఈ క్రమంలో తొలి కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది.దేశ రాజధాని ప్రాంతంలోనే తొలి కేసు నమోదు కావడం గమనార్హం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ చిరు వ్యాపారి మీద గత అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. పోలీసులు పాట్రోలింగ్ నిర్వహిస్తున్న టైంలో.. ఆ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్ బాటిల్స్ అమ్ముతూ కనిపించాడు. ఆ దుకాణం రోడ్డుగా అడ్డంగా ఉండడంతో పాటు.. దానిని తీసేయాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతను వినలేదని పోలీసులు చెబుతున్నారు. భారతీయ న్యాయ్ సంహిత క్రిమినల్ కోడ్‌లోని సెక్షన్ 285 ప్రకారం.. అతనిపై కేసు నమోదు అయినట్లు సమాచారం. నిందితుడు బీహార్ పట్నాకు చెందిన పంకజ్ కుమార్‌గా గుర్తించారు. ఈ సెక్షన్ ప్రకారం.. రోడ్లను అతిక్రమించడం, తద్వారా ప్రమాదాలకు కారణం కావడం లాంటి చర్యలు నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. ఆ జరిమానా ఐదు వేల రూపాయల దాకా ఉంటుంది.ఇదిలా ఉంటే.. కొత్త చట్టాల అమలుపై పోలీసు సిబ్బందికి మే 24 నుంచి జూన్ 25 వరకు శిక్షణను అందిన విషం తెలిసే ఉంటుంది. మూడు చట్టాల ద్వారా మారుతున్న డిజిటల్ యుగంలో సాంకేతికతను వాడుకునేందుకు సౌకర్యంగా తీర్చిదిద్దారు. -
అరుదైన ఘటన: మొక్కల్లో వచ్చే శిలింద్ర వ్యాధి సోకిన వ్యక్తి
మొక్కల నుంచి మానవుని వ్యాధులు సోకుతాయా అని చూసే అరుదైన ఘటన ఇది. ఈ ఘటన కోలకతాలో చోటు చేసుకుంది. ప్రొఫెషనల్ మైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న 61 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధి బారినపడ్డాడు. అతను కుళ్లిపోతున్న పదార్థాలు, పుట్టగొడుగులు, వివిధ మొక్కల శిలింద్రాలపై అధ్యయనం తదితరాలు అతని పరిశోధన కార్యక్రమాల్లో భాగం. ఒక రోజు సడెన్‌గా ఆ వ్యక్తి గొంతు బొంగురుపోవడం, దగ్గు, అలసట కనీసం మింగ లేకపోవటం తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. గత మూడు నెలలుగా ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఇక చేసేది లేక వైద్యలును సంప్రదించగా.. ఈ అరుదైన వ్యాధి గురించ బయటపడింది. ఈ విషయాన్ని కోల్‌కతాలోని కన్సల్టెంట్ అపోలో మల్టిస్పెషాలిటీ హాస్పిటల్స్‌కు చెందిన పరిశోధకలు డాక్టర్ సోమదత్తా, డాక్టర్ ఉజ్వాయిని రే తమ నివేదికలో వివరించారు. అతనికి వచ్చింది కిల్లర్ ఫ్లాంట్ ఫంగస్ అని నిర్ధారించారు. ఇది ముఖ్యంగా గులాబీ కుటుంబానికి చెందిన మొక్కజాతుల్లోని ఆకుల్లో వస్తుందని చెప్పారు. ఈ కేసు మానవులలో వ్యాధి కలిగించే పర్యావరణ మొక్కల శిలీంద్రా సామర్థ్యాన్ని హైలెట్ చేయడమే గాక కారక శిలీంద్ర జాతులను గుర్తించేందుకు పరమాణు పద్ధతుల ప్రాముఖ్యతను నొక్కి చెబుతోందన్నారు డాక్టర్లు. ఈ శిలింద్రాలను మాక్రోస్కోపిక్ లేదా మెక్రోస్కోపిక్ ద్వారా మాత్రమే గుర్తించగలమని చెప్పారు. ఇది వ్యాప్తి చెందగలదా లేదా అన్నది తెలియాల్సి ఉందని చెప్పారు వైద్యులు. ఆ వ్యక్తికి ఈ ఫంగస్ కారణంగా మెడపై గడ్డ ఏర్పడిందని, దాన్ని తొలగించి యాంటి ఫంగస్ మందులతో చికిత్స చేసినట్లు తెలిపారు. రెండేళ్ల పర్యావేక్షణ అనంతరం కోలుకుని బయటపడటమే గాక పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వెల్లడించారు వైద్యులు. (చదవండి: అమృత్‌పాల్ కోసం డేరాల్లో గాలింపు) -
ఓ మై గాడ్ ఒమిక్రాన్.. అక్కడంతా భయం భయం
సాక్షి,ముస్తాబాద్(సిరిసిల్ల): ఒమిక్రాన్ వేరియంట్ మండలంలోని గూడెం గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తుంది. ఇటీవల దుబాయి నుంచి వచ్చిన వ్యక్తికి సోమవారం ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అతన్ని వెంటనే వై ద్యాధికారులు హైదరాబాద్‌కు తరలించగా, కు టుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు. సెకండ్ వేవ్ కరోనాతో తీవ్రంగా నష్టపోయిన గ్రామస్తులు.. తొలి ఒమిక్రాన్ కేసు గూడెంలో నమోదుకావడం ఆందోళన చెందుతున్నారు. ఎవరెవరిని కలిశాడో ? గూడెంకు చెందిన వ్యక్తి ఈ నెల 16న దుబాయ్ నుంచి వచ్చాడు. ఎవరెవరిని కలిశాడోనని భ యాందోళన గ్రామస్తుల్లో మొదలైంది. ప్రైమరీ కాంటాక్ట్‌లపై వైద్య, పోలీస్‌శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి చిప్పలపల్లికి చెందిన వ్యక్తితో కారులో కలిసి వచ్చాడని తెలుసుకున్న వైద్యాధికారులు సదరు వ్యక్తి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశారు. నాలుగు రోజుల్లో సిరిసిల్లలోని బంధువులు, ఆస్పత్రికి, బైక్ షోరూంలను సందర్శించినట్లు తెలిసింది. అలాగే నారాయణపూర్‌లోని బంధువుల ఇంట్లో జరిగిన దావత్‌కు హాజరైనట్లు సమాచారం. గూడెంలో 14, చిప్పలపల్లిలో ఇద్దరిని హోమ్ క్వారంటైన్ చేశారు. స్కూళ్లకు హాజరుకాని విద్యార్థులు గూడెంలో జెడ్పీ ఉన్నత పాఠశాలతోపాటు ప్రాథమిక పాఠశాలలకు విద్యార్థులు మంగళవారం హా జరుకాలేదు. తల్లిదండ్రులు ముందస్తుగా తమ పిల్లలను పాఠశాలలకు పంపించలేదు. మూడు అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులు రాలేదు. గ్రా మంలో దుకాణాలు, హోటళ్లు తెరువలేదు. ప్రధా న రహదారిపైకి ఎవరూరావడం లేదు. వైద్య, పో లీస్ అధికారుల రాకపోకలతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ముందస్తు చర్యలు గూడెంలో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. వైద్యశాఖ ఏఎన్ఎం, ఆశకార్యకర్తలతో ఇంటింటా సర్వే చేపట్టారు. కరోనా లక్షణాలతో బాధపడితే తెలియజేయాలని కోరుతున్నారు. దుకాణాలను మూసివేయించారు. ప్రధాన వీధులతోపాటు ఒమి క్రాన్ పాజిటివ్ వ్యక్తి ఇంటి ఆవరణను కంచెతో మూసివేశారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావాణాన్ని ఊరంతా పిచికారీ చేశారు. గల్ఫ్ నుంచి వస్తున్న వారిపై ఆరా.. వారం రోజులుగా గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వారిపై పోలీసులు, వైద్యశాఖ నిఘా పెట్టింది. సౌదీఅరేబియా, దుబాయ్, ఓమన్, బహ్రెయిన్, కువైట్ దేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ వైరస్‌ను సాధ్యమైనంతగా అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. అవగాహన కల్పిస్తున్నాం గూడెంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా పెట్టాం. గూడెం, చిప్పలపల్లి గ్రామాల్లో పలువురిని క్వారంటైన్ చేశాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తిని హైదరాబాద్‌కు తరలించాం. ప్రజలందరు మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలి. ఎవరూ ఆందోళన చెందవద్దు. – సంజీవ్‌రెడ్డి, వైద్యాధికారి చదవండి: పొద్దంతా కూలి పని.. అందరూ నిద్రపోయాక అసలు పని మొదలుపెడతారు -
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
సాక్షి, విజయనగరం: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా, ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఐర్లాండ్ నుంచి ఏపీకి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయ్యింది. తొలుత అతనికి ముంబైలోని ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందులో నెగెటివ్ వచ్చింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి గత నెల (నవంబరు) 27న విశాఖ చేరుకున్నాడు. అక్కడ కూడా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చింది. కాగా, తాజాగా ఆ వ్యక్తికి మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా ఒమిక్రాన్ పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు వ్యక్తి నమునాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పరీక్షల కోసం పంపించారు. ఆ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్థారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. మొత్తం 15 మంది నమునాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా, పది నమూనాలలో ఒకరికి మాత్రమే ఒమిక్రాన్ సోకినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఐదుగురి వివరాలు రావాలన్న ఆరోగ్యశాఖ ప్రజలు అనవసర వదంతులు నమ్మవద్దని తెలిపింది. ప్రజలు కోవిడ్ నిబంధలను పాటించాలని కోరింది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ -
కోవిడ్ మొదలైన రెండేళ్లకు తొలికేసు.. ఎక్కడంటే..
వెల్లింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కంటిమీద కునుకులేకుండా చేసిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ ధాటికి ఇప్పటికీ అనేక దేశాలు వణికి పోతున్నాయి. అయితే, చాలా దేశాలు కరోనా నిబంధలను, వ్యాక్సిన్లు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్గించాయి. దీంతో కొన్ని చోట్ల వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గింది. కరోనా వైరస్ బయట పడిన రెండేళ్లకు న్యూజిలాండ్‌లోని ఒక దీవిలో తొలికేసు నమోదైంది. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. కాగా, దక్షిణ పసిఫిక్ దేశంలో కుక్ ఐలాండ్ అనే దీవి ఉంది. ఆ దీవిలో 17000 మంది జనాభా ఉన్నారు. కరోనా వెలుగు చూసిన నాటి నుంచి ఆ దీవిలో కరోనా ఆంక్షలు, టీకాలు వేసుకునేలా ఆ దీవి ప్రధాని మార్క్ బ్రౌన్ అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు ఆ దీవిలో 96 శాతం మంది ప్రజలు రెండు డోసుల టీకాలు వేసుకున్నారు. కొత్తగా న్యూజిలాండ్ నుంచి వచ్చిన పదేళ్ల బాలుడిలో కరోనా వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆ బాలుడి కుటుంబం న్యూజిలాండ్ నుంచి, కుక్ ఐలాండ్ దీవికి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. వెంటనే బాలుడిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచారు. వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు స్థానిక వైద్య సిబ్బంది తెలిపారు. వారి రిపోర్టు రావాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరి నుంచి కుక్ ఐలాండ్ దీవికి పర్యాటకులను అనుమతించే క్రమంలో తొలి కేసు నమోదుకావడం పట్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రపంచం వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
కరోనా తొలిసారిగా సోకింది ఆమెకే..
బీజింగ్: చైనాలోని వూహాన్ మార్కెట్లో సీఫుడ్ అమ్మే ఒక మహిళ కరోనా వైరస్ సోకిన మొట్ట మొదటి వ్యక్తి అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వూహాన్‌కి దూరంగా నివసించే ఒక అకౌంటెంట్ కోవిడ్–19 తొలి రోగి అని ఇన్నాళ్లు భావిస్తున్నది తప్పని జర్నల్ సైన్స్ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. కరోనా వైరస్ మూలాలు కనుక్కోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) చేసిన విచారణ కూడా తప్పుదారిలోనే నడిచిందని అభిప్రాయపడింది. వూహాన్‌లోని మాంసం అమ్మే హోల్‌సేల్ ఫుడ్ మార్కెట్లో మహిళే మొట్టమొదటి కరోనా రోగి అని ఆ అధ్యయనం తేల్చింది. 2019 డిసెంబర్ 11న సీఫుడ్ అమ్మే ఒక మహిళలో లక్షణాలు బయటపడ్డాయని వెల్లడించింది. -
Bird Flu Strain H10N3: చైనాలో మనుషులకీ బర్డ్ ఫ్లూ
బీజింగ్: ప్రపంచంలో తొలిసారిగా బర్డ్ ఫ్లూ వైరస్‌లో కొత్త స్ట్రెయిన్ మనుషులకి సోకడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డాయి. చైనాలో ఈ వైరస్ తొలిసారిగా ఒక వ్యక్తికి సోకిందని అక్కడి ప్రభుత్వం నిర్ధారించింది. తూర్పు జియాంగ్సు ప్రావిన్స్‌లో 41 ఏళ్ల వ్యక్తికి మే 28న బర్డ్ ఫ్లూ వైరస్‌లోని ‘హెచ్10ఎన్3 రకం’ సోకినట్టుగా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. అయితే అతనికి వైరస్ ఎలా సోకింది? ఎక్కడ్నుంచి వచ్చింది వంటివేవీ ఆరోగ్య శాఖ వెల్లడించలేదు. హెచ్10ఎన్3 వైరస్ మనుషులకి సోకడం ప్రపంచంలో ఇదే తొలిసారిని మాత్రం పేర్కొంది. మరోవైపు ఈ వైరస్‌తో వచ్చే ప్రమాదం ఏమీ లేదంటూ తక్కువగా చేసి చూపించే ప్రయత్నాలు డ్రాగన్ దేశం మొదలుపెట్టింది. పక్షుల నుంచి మనుషులకి ఈ వైరస్ చాలా అరుదుగా సోకుతుందని వెల్లడించిన ఆరోగ్య శాఖ వైరస్‌తో పెద్దగా ప్రమాదం ఏమీ లేదని పేర్కొంది. బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రేపో మాపో డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయంటూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సీజీటీఎన్ టీవీ వెల్లడించింది. ఇప్పటివరకు కోళ్లకు, ఇతర పక్షులకు ప్రాణాంతకంగా మారిన హెచ్5ఎన్8 రకం మనుషులకి సోకే ప్రమాదం చాలా తక్కువ. కోళ్ల ఫామ్స్‌లో పని చేసే వారికి మాత్రమే ఈ వైరస్ ముప్పు ఉండేది. ఇప్పుడు హెచ్10ఎన్3 రకం వైరస్ సోకడం ఆందోళన రేపుతోంది. జ్వరం వంటి సాధారణ ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ వచ్చిన ఆ వ్యక్తికి పరీక్షల్లో బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు. -
కలకలం: తొలిసారిగా మానవుడికి సోకిన బర్డ్ ఫ్లూ
బీజింగ్: పక్షులకు వ్యాపించే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వస్తుందని ఇన్నాళ్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. చైనాలో తొలిసారిగా బర్డ్ ఫ్లూ ఓ వ్యక్తికి సోకింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) మంగళవారం ప్రకటించింది. హెచ్10ఎన్3 స్ట్రెయిన్ వ్యాపించిందని వెల్లడించింది. వెంటనే వైద్యారోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే మానవుడికి బర్డ్ ఫ్లూ వ్యాపించిన వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది. తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల పురుషుడికి బర్డ్ ఫ్లూ సోకిందని జాతీయ ఆరోగ్య కమిషన్ వివరించింది. ప్రపంచంలోనే తొలిసారిగా బర్డ్ ఫ్లూ కేసు తమ దేశంలోనే మానవుడికి సోకిందని కమిషన్ తన వెబ్సైట్లో పేర్కొంది. వ్యాధుల గుర్తింపు నియంత్రణ (సీడీసీ) వారం కింద రక్త పరీక్షలు చేయగా అతడికి బర్డ్ ఫ్లూ సోకిందని ఫలితాల్లో నిర్ధారణ అయ్యింది. అతడికి బర్డ్ ఫ్లూ సోకడంతో వెంటనే అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు అతడికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అతడి ఎవరెవరిని కలిశారో వారిని గుర్తించి వారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అయితే బర్డ్ ఫ్లూ వ్యాప్తి తక్కువగా ఉంటుందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని జాతీయ ఆరోగ్య కమిషన్ స్పష్టం చేసింది. చదవండి: జూన్‌లోనే తగ్గుముఖం పడుద్ది -
తొలిసారి స్థానిక వ్యక్తికి కోవిడ్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో తొలిసారిగా స్థానిక వ్యక్తికి కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి వచ్చిన హైదరాబాద్ వ్యాపారి ద్వారా ఆయన కుమారుడి (35 ఏళ్లు)కి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారికే పాజిటివ్ రావడం.. స్థానికంగా ఎవరికీ సోకకపోవడంతో డాక్టర్లు ధీమాతో ఉన్నారు. అయితే తొలిసారిగా స్థానికుడికి కూడా సోకడంతో ఇప్పుడు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అమెరికాలో క్రూజ్ ల్యాన్సర్‌లో పనిచేస్తున్న 33 ఏళ్ల వ్యక్తి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చాడు. అతడికి కూడా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 21కి చేరాయి. కాగా, స్థానిక వ్యక్తికి కోవిడ్ అంటించిన వ్యాపారి ఈ నెల 14న దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. సికింద్రాబాద్‌కు చెందిన ఆ వ్యాపారికి 17న కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. 19న కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆ వ్యాపారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించారు. వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. కోవిడ్ సోకిన వ్యాపారి కుమారుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. కాగా, అతడు నివసించిన ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిలో 50 బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి కోవిడ్‌పై ఆరా తీయనున్నాయి. ఎవరికైనా కోవిడ్ లక్షణాలుంటే గాంధీ ఆస్పత్రికి తరలిస్తారు. ఒకవేళ లక్షణాలు లేకపోయినా కూడా వారిని ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాల్సిందిగా సూచించనున్నారు. అలాగే ఇండొనేసియా నుంచి కరీంనగర్‌కు వచ్చి కోవిడ్ సోకిన వారితో కాంటాక్టు అయిన 35 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, వారికి నెగెటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే వారందరినీ కూడా ఛాతీ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. (జనతా కర్ఫ్యూ : సకలం బంద్) రెండో దశకు చేరుకున్న కోవిడ్.. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి వచ్చిన వారికే పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి కోవిడ్ పాజిటివ్ వ్యక్తి 86 మందితో కలసినా.. అతడు తన తండ్రితో కలసి ఒకే మంచంలో పడుకున్నా.. ఎవరికీ కోవిడ్ పాజిటివ్ రాలేదు. ఆ తర్వాత వచ్చిన 13 పాజిటివ్ కేసుల వరకు కూడా వారితో కాంటాక్ట్ అయిన వారికి కూడా కోవిడ్ నమోదు కాలేదు. ఇప్పటివరకు నమోదైన 21 కేసుల్లో 10 మంది ఇండోనేసియన్లకు, ఒక ప్రవాస భారతీయుడికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మిగిలిన వారంతా కూడా విదేశాల నుంచి మన రాష్ట్రానికి చెందిన వారికి వైరస్ సోకింది. కాగా, రాష్ట్రంలో తొలి కేసు మార్చి 2న నమోదైంది. ఇప్పటివరకు స్థానికులకు ఎవరికీ పాజిటివ్ రాలేదు. కానీ శనివారం విదేశీ చరిత్రలేని స్థానికుడికి వ్యాప్తి చెందడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అంటే వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించినట్లుగా భావించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వాస్తవంగా తొలి కేసులో 86 మందితో కాంటాక్టు అయినా ఒక్కరికీ రాలేదు. స్కాట్లాండ్ నుంచి వచ్చిన మూడో బాధితుడితో 69 మంది కాంటాక్ట్ అయ్యారు. వారిలోనూ ఏ ఒక్కరికీ పాజిటివ్ రాలేదు. కోవిడ్ సోకిన 10 మంది ఇండోనేసియన్లతో కలసి ఉన్న స్థానికులెవరికీ రాలేదు. దీంతో మన దగ్గర ఉన్న వాతావరణ పరిస్థితులకు కోవిడ్ రెండో దశకు రాదన్న ధీమా కనిపించింది. కానీ శనివారం స్థానిక వ్యక్తికి వైరస్ రావడంతో పరిస్థితి తారుమారైంది. స్థానికంగా వైరస్ మరింత విస్తరించకుండా ఆపగలిగితేనే ఉపద్రవం నుంచి బయట పడగలుగుతాం. లేకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రెండో దశకు చేరిన వైరస్‌ను ఆపగలగడమే ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్. స్థానికంగా పెరగకుండా ఆపడం అంటే అంత ఈజీ కాదు. రోగితో కాంటాక్టు అయిన వారిని గుర్తించడం అంత సులువు కాదు. వారిని గుర్తించకపోతే మరొకరికి, ఇలా వారి ద్వారా ఇంకొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. సీఎం కఠిన నిర్ణయాలు.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సీఎం కేసీఆర్ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. పరిస్థితి చేజారకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అవసరమైతే అన్నీ షట్‌డౌన్ చేస్తామని పేర్కొనడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. రాష్ట్ర సరిహద్దులను మూయడంతో పాటు అత్యవసర సర్వీసులు మినహా అన్నింటినీ బంద్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. మహారాష్ట్రలో కేసులు మరింత పెరగడంతో పక్కనే ఉన్న మన రాష్ట్రంపై తీవ్రమైన ప్రభావం పడనుంది. అవసరమైతే వీధుల్లోకి ఎవర్నీ రానీయకుండా చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన దాదాపు 9 వేల మందిని గుర్తించి వారి ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు శనివారం జరిగిన సమీక్షలో సీఎస్ తెలిపారు. వారందరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బార్కాస్‌లో కలకలం.. సౌదీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా లక్షణాలున్నాయన్న విషయం చాంద్రాయణగుట్ట బార్కాస్‌లో కలకలం రేపింది. బార్కాస్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు ఫిబ్రవరి 9న సౌదీ నుంచి వచ్చాడు. 15 రోజుల నుంచి దగ్గు, జ్వరంతో బాధ పడుతుండగా, గమనించిన స్థానికులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు గాంధీకి వెళ్లాలని సూచించారు. దీంతో గాంధీకి తీసుకెళ్లగా నెగెటివ్ అని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
సైన్యంలో తొలి కరోనా కేసు
సాక్షి, న్యూఢిల్లీ : భారత సైన్యంలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. జమ్ము కశ్మీర్‌లోని లీ ప్రాంతానికి చెందిన సైనికుడికి వైరస్ సోకినట్టు వెల్లడైంది. కాగా బాధిత సైనికుడు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకూ సెలవులో ఉన్నారు. సైనికుడి తండ్రి ఇటీవల ఇరాన్ యాత్ర ముగించుకుని వచ్చినట్టు సమాచారం. ఇక భారత్ వైరస్ వ్యాప్తిలో మూడవ దశలో లేదని, రెండవ దశలో ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో టెస్టింగ్ కోసం 72 పంక్షనల్ లేబొరేటరీలు అందుబాటులో ఉన్నాయని, ఈవారాంతానికి మరో 49 ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. డెడ్లీ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విదేశీయుల ప్రవేశంపై నిషేధం సహా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ భారత్‌లో కరోనా కేసులు 137కి పెరిగాయి. ఇక రైల్వేలు సైతం వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు 85 రైళ్లను రద్దు చేశాయి. చదవండి : ‘ఇలాగైతే అమెరికాలో 22 లక్షల మరణాలు’ -
నెల్లూరు యువకుడికి కరోనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 (కరోనా వైరస్) తొలి పాజిటివ్ కేసు నమోదైంది. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరుకు చెందిన ఓ యువకుడు కరోనా వైరస్ బారిన పడినట్లు నిర్ధారించారు. బాధితుడు ఈనెల 6వ తేదీన ఇటలీ నుంచి చెన్నై వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు చేరుకున్నాడు. వైరస్ లక్షణాలు కనిపించడంతో మరుసటి రోజు నెల్లూరు బోధనాసుపత్రిలో చేరాడు. గత ఐదు రోజులుగా వైద్యుల పరిశీలనలో ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఆ యువకుడు కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాడని, 14 రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ►కరోనా బాధితుడి రిపోర్టులు, వీడియోలను ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్)కి పంపగా వైరస్ సోకినట్లు గురువారం నిర్ధారించారు. ►బాధితుడి తల్లిదండ్రులతోపాటు కారు డ్రైవర్, పనిమనిషి, ఆమె భర్తకు కూడా వైరస్ సోకి ఉండవచ్చనే అనుమానంతో నెల్లూరు బోధనాస్పత్రిలో ప్రత్యేక వార్డుకు తరలించారు. ►నెల్లూరులో ముందు జాగ్రత్తగా సుమారు 15 వేల ఇళ్లలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ►కరోనా బాధితులకు చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పడకలను సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ మినహాయింపు కరోనా వైరస్‌పై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కొద్ది రోజుల పాటు బయోమెట్రిక్ నుంచి మినహాయింపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులంతా రిజిస్టర్లో సంతకాలు చేసి యథావిధిగా విధులు చేపట్టాలి. ఈ ఆదేశాలు నేటినుంచే అమల్లోకి రానున్నాయి. ఆందోళన చెందొద్దు.. ‘కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనంత మాత్రాన ఆందోళన అక్కర్లేదు. బాధితుడికి వైద్యం అందుతోంది. ఆరోగ్యంగా ఉన్నాడు. రాష్ట్రంలో వైద్యులందరినీ అప్రమత్తం చేశాం. సమన్వయంతో ముందుకెళుతున్నాం’ –డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి (వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి) -
‘కోవిడ్’ మృతులు 1,115
బీజింగ్: రోజులు గడుస్తున్నా చైనాలో కోవిడ్–19 (కరోనా వైరస్) కల్లోలానికి అంతం లేకుండా పోతోంది. గత ఏడాది డిసెంబర్లో తొలికేసు నమోదైన నాటి నుంచి చూస్తే మంగళవారం నాటికి వైరస్ బాధితుల మరణాల సంఖ్య 1,115కు చేరింది. ప్రస్తుతం 44,763 మంది వ్యాధి బారినపడినట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం తెలిపారు. జపాన్ తీరంలో లంగరేసిన డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ నౌకలో తాజాగా 39 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో నౌకలో వైరస్ బాధితుల సంఖ్య 174కు చేరింది. మొత్తం 3700 మంది ప్రయాణీకులు ఉన్న ఈ నౌకలో ఇంకా వందలాది మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉందని జపాన్ ఆరోగ్య మంత్రి కట్సునోబూ కాటో తెలిపారు. కోవిడ్ బారిన పడినట్లు అనుమానిస్తున్న ఇద్దరు మహిళలు రష్యాలోని ఆసుపత్రి నుంచి పరారైనట్లు రష్యా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు సరిగా సహకరించకపోవడం, ఆసుపత్రిలోని పరిస్థితులు, వైరస్ సోకుతుందేమో అన్న భయం కారణంగానే తాము పారిపోయినట్లు ఆ మహిళలు చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇద్దరు భారతీయులకు కోవిడ్ టోక్యో: జపాన్‌లో క్రూయిజ్ నౌకలో చిక్కుకున్న 138 మంది భారతీయుల్లో ఇద్దరికి కోవిడ్ సోకినట్లు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. వ్యాధి సోకిన వారిని ఆస్పత్రులకు తరలించి జపనీస్ నియమనిబంధనల ప్రకారం చికిత్స అందిస్తున్నామని జపాన్ అధికారులు పేర్కొన్నారు. కోవిడ్ వైరస్ ఉన్నందున ఈ నెల 19 వరకూ క్రూయిజ్ నౌకను తమ అదుపులోనే ఉంచుకోనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలు తెలుకునేందుకు భారత రాయబార అధికారులు జపాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
భారత్‌లో... తొలి కరోనా కేసు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో తొలి కేసు నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థినికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని గురువారం భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ యువతిని ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. తదుపరి పరీక్షల అనంతరం శుక్రవారం పేషెంట్‌కి సంబంధించిన తుది నివేదికను వెల్లడిస్తామని ఐసీఎంఆర్ – ఎన్ఐవి పూణె డైరెక్టర్ ప్రియా అబ్రహం తెలిపారు. కరోనా వైరస్‌కు సంబంధించి దేశంలోని పలు నగరాల్లో అనుమానిత కేసులు నమోదయ్యాయి. కానీ వైరస్ సోకినట్లు ధ్రువీకరించిన తొలి కేసు ఇదే. కేరళ వైద్యాధికారులు బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం 800 మందిని పలు ఆసుపత్రుల్లో పరిశీలనలో ఉంచారు. చైనా నుంచి భారతీయులు వెనక్కి చైనాలోని వుహాన్ నుంచి భారతీయులను తిరిగి వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న హ్యుబయి రాష్ట్రం నుంచి భారత పౌరులను వెనక్కి రప్పించేందుకు రెండు విమానాలకు అనుమతినివ్వాలని చైనాను భారత్ కోరింది. అందుకు చైనా ఓకే చెప్పిందని వూహాన్‌లోని భారత ఎంబసీ తెలిపింది. చైనా నుంచి వచ్చే వారిని 14 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతామని తెలిపింది. భారీగా నిధులు వెచ్చిస్తోన్న చైనా చైనాలో కరోనా వైరస్ బారినపడి 170 మంది మరణించారు. మరో 7,711 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా 17 దేశాలకు విస్తరించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల నిధులను చైనా ప్రభుత్వం కేటాయించింది. ఈ వైరస్‌పై యుద్ధానికి ఆర్థిక వనరుల లోటు రాకూడదని చైనా భావిస్తోంది. అలాగే వైరస్‌ని నివారించే వాక్సిన్ని కనుగొనే ప్రయత్నంలో భాగంగా పరిశోధనలకు సైతం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. -
రాజస్తాన్‌లో తొలి జికా కేసు
జైపూర్: రాజస్తాన్‌లో ఆదివారం తొలి జికా కేసు నమోదైంది. జైపూర్‌లోని శాస్త్రి నగర్‌కు చెందిన ఓ మహిళ కళ్లు ఎర్రబా రడం, కీళ్లనొప్పులు, బలహీనత వంటి లక్షణాలతో ఈ నెల 11న స్థానిక స్వామి మాన్ సింగ్ (ఎస్ఎమ్ఎస్) ఆస్పత్రిలో చేరింది. తొలుత వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ లేవని నిర్ధారణ అయింది. దీంతో జికా సోకిందనే అనుమా నంతో ఆమె రక్త నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపించారు. పరీక్షల్లో జికా వైరస్ సోకినట్లు తేలిందని ఎస్ఎమ్ఎస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, వైద్యుడు యూఎస్ అగర్వాల్ ప్రకటిం చారు. రాష్ట్రంలో ఇదే మొదటి జికా కేసు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాము రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. -
మరోసారి పోలియో పడగ
కీవ్: ఉక్రెయిన్‌లో రెండు పోలియో కేసులు నమోదయ్యాయి. ఓ పదేళ్ల బాలికకు, నాలుగేళ్ల చిన్నారికి పోలియో సోకినట్లు ఉక్రెయిన్ వైద్యాధికారులు ధృవీకరించారు. దీంతో గత 2010 నుంచి ఇప్పటి వరకు యూరప్‌లో తొలి పోలియో కేసు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ఓ) తెలిపింది. కాగా, చిట్టచివరిగా ఉక్రెయిన్‌లో మాత్రం 1996లో పోలియో కేసు నమోదైనట్లు వెల్లడించింది. తాజాగా నమోదైన రెండు కేసులు కూడా ఉక్రెయిన్‌లోని జకర్పాట్యా ప్రాంతానికి చెందినవి. దీంతో ఆ ప్రాంతంలో మరోసారి పోలియో నివారణ చర్యలకు కోసం తామే ప్రత్యేకంగా శ్రద్ధ వహించినట్లు డబ్ల్యూ హెచ్ఓ తెలిపింది. ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో వ్యాక్సిన్ చేరవేయడంలో నిర్లక్ష్యం వహించడంతోపాటు పంపించే ప్రాంతాలకు కూడా తక్కువ మోతాదులో పంపించడం వల్లే తాజాగా పోలియో వైరస్ బయటకు రావడానికి కారణమైందని వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు పోలియో రహిత దేశాలుగా నమోదవ్వగా తాజాగా తలెత్తిన పరిస్థితి మరోసారి పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. -
శిశు విక్రయంపై తొలి కేసు
సాక్షి, సంగారెడ్డి: ఎట్టకేలకు శిశు విక్రయాలపై తొలి కేసు నమోదైంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చట్ట విరుద్ధంగా దత్తత తీసుకున్న దంపతులతో పాటు మధ్యవర్తిత్వం నెరిపిన దళారులపై శివ్వంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామ పరిధిలోని తౌర్యతండాకు చెందిన పతలోత్ బన్య, సునీత దంపతులకు 2013 నవంబర్ 23న మూడో కాన్పులో ఆడ శిశువు జన్మించింది. తొలి రెండు కాన్పుల్లో ఇద్దరు కుమార్తెలు జన్మించగా మూడో కాన్పులోనైనా మగ శిశువు పుడుతుందని ఆశించారు. కానీ మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో వారు ఆ శిశువును విక్రయించాలనుకున్నారు. ఈ వ్యవహారంలో శిశువు రెండుసార్లు చేతులు మారింది. తాళ్లపల్లితండాకు చెందిన కంసి, లాలూ దంపతులు 2013 డిసెంబర్ 4న తౌర్యతండాకు వెళ్లి బన్య దంపతులకు రూ.2 వేలు చెల్లించి 10 రోజుల వయస్సు గల శిశువును తీసుకెళ్లారు.ఈ దంపతులు ఆ శిశువును సంగారెడ్డికి చెందిన విష్ణువర్ధన్ గౌడ్, ఉమాదేవి దంపతులకు అప్పగించారు. వారి నుంచి సంగారెడ్డికి చెందిన ఏటీ శేఖర్, నాగరత్నం దంపతులు శిశువును కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో విష్ణువర్ధన్ గౌడ్ దంపతులు కీలక పాత్ర పోషించినట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ విచారణలో తేలింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా పీడీ ఫిర్యాదు మేరకు విష్ణువర్దన్ గౌడ్ దంపతులను ప్రధాన నిందితులుగా పేర్కొంటూ మొత్తం 8 మందిపై శివ్వంపేట పోలీసులు 2013 డిసెంబర్ 27న ఐపీసీ సెక్షన్ 317 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. 12 ఏళ్ల వయస్సున్న శిశువులను వదిలించుకోవడం/ అమ్మివేయడం లాంటి ఆరోపణలపై ఈ సెక్షన్ వర్తిస్తుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక శిశు విక్రయాల రాకెట్ హస్తం ఉన్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నా.. అలాంటిదేం లేదని పోలీసులు కొట్టిపారేస్తున్నారు. నిందితులను గతంలోనే అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.