![China Reports Human Case Of H10N3 Bird Flu - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/1/Bird-Flu.jpg.webp?itok=5iE1nKOO)
బీజింగ్: పక్షులకు వ్యాపించే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వస్తుందని ఇన్నాళ్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. చైనాలో తొలిసారిగా బర్డ్ ఫ్లూ ఓ వ్యక్తికి సోకింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) మంగళవారం ప్రకటించింది. హెచ్10ఎన్3 స్ట్రెయిన్ వ్యాపించిందని వెల్లడించింది. వెంటనే వైద్యారోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే మానవుడికి బర్డ్ ఫ్లూ వ్యాపించిన వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది.
తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల పురుషుడికి బర్డ్ ఫ్లూ సోకిందని జాతీయ ఆరోగ్య కమిషన్ వివరించింది. ప్రపంచంలోనే తొలిసారిగా బర్డ్ ఫ్లూ కేసు తమ దేశంలోనే మానవుడికి సోకిందని కమిషన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. వ్యాధుల గుర్తింపు నియంత్రణ (సీడీసీ) వారం కింద రక్త పరీక్షలు చేయగా అతడికి బర్డ్ ఫ్లూ సోకిందని ఫలితాల్లో నిర్ధారణ అయ్యింది.
అతడికి బర్డ్ ఫ్లూ సోకడంతో వెంటనే అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు అతడికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అతడి ఎవరెవరిని కలిశారో వారిని గుర్తించి వారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అయితే బర్డ్ ఫ్లూ వ్యాప్తి తక్కువగా ఉంటుందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని జాతీయ ఆరోగ్య కమిషన్ స్పష్టం చేసింది.
చదవండి: జూన్‌లోనే తగ్గుముఖం పడుద్ది
Comments
Please login to add a commentAdd a comment