చైనాలో మరో వైరస్‌, ఒకరు మృతి | Monkey B Virus China first human infection dies | Sakshi
Sakshi News home page

Monkey B Virus: చైనాలో తొలి కేసు, పశువైద్యుడు మృతి

Published Sat, Jul 17 2021 3:28 PM | Last Updated on Sat, Jul 17 2021 5:21 PM

Monkey B Virus China first human infection dies - Sakshi

బీజింగ్‌: చైనాలోని వూహాన్ ల్యాబ్‌లోనే కరోనా మహమ్మారి పుట్టిందన్న విమర్శల మధ్య చైనాలో మనుషుల్లో మరో వైరస్‌ ఉనికి కలకలం రేపుతోంది. మంకీ బీ వైరస్‌ సోకి తొలిసారిగా  బీజింగ్‌కు చెందిన పశువుల వైద్యుడు (53) కన్నుమూశాడు. ఈ మంకీ బీవైరస్ (బీవీ)  సోకిన తొలి  మానవ కేసుగా చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శనివారం వెల్లడించింది. అయితే అతనితో సన్నిహితంగా మెలిగిన వారు ప్రస్తుతం సురక్షితంగా  ఉన్నట్టు తెలిపింది. 

నాన్‌-హ్యూమన్‌ ప్రైమేట్లపై పరిశోధన చేస్తున్న సంస్థలో పనిచేసే పశువైద్యుడు మంకీ బీవీ వైరస్‌ బారినపడ్డాడు. మొదట వికారం వాంతులు లాంటి లక్షణాలతో బాధపడ్డాడు. అనేక ఆసుపత్రులలో చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో  చివరికి మే 27న మరణించాడు. మార్చి ప్రారంభంలో చనిపోయిన రెండు కోతులను విడదీసిన ఒక నెల తరువాత అతను వైరస్‌ బాడిన పడ్డారని సీడీసీ వెల్లడించింది. 

ఏప్రిల్‌లో అతని సెరెబ్రోస్పానియల్ ద్రవాన్ని సేకరించిన పరిశోధకులు అతన్ని మంకీ బీవీకి పాజిటివ్‌గా గుర్తించారు, అయితే అతని దగ్గరి పరిచయాలున్నవారి నమూనాల పరీక్షలు నెగిటివ్‌ వచ్చాయి.  1932 లో గుర్తించిన ఇది మకాకా జాతికి చెందిన మకాక్లలో ఆల్ఫాహెర్పెస్వైరస్ ఎంజూటిక్. డైరెక్ట్‌ లేదా శారీరక స్రావాల ద్వారా సోకుతుంది. మరణాల రేటు 70 శాతం నుండి 80 శాతం వరకు ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement