హ్యూమన్మెటాప్ న్యుమో వైరస్(HMPV) భయం లేదు.. ఆందోళన లేదు అనుకుంటూ ఉండగానే మాయదారి వైరస్ మన దేశంలోకి కూడా ప్రవేశించింది.
ప్రస్తుతం చైనా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైరస్ క్రమంగా ఇండియాతోపలు పలు దేశాల్లోతన ఉనికిని చాటుకుంటోంది. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత్ ఆరోగ్య అధికారులు నొక్కి చెప్పారు. అలా ప్రకటించారో లేదో ఇలా హెచ్ఎంపీవీ వైరస్ తొలి కేసు కర్ణాటక రాజధాని బెంగళూరులో నమోదైంది. ఈవైరస్ బారిన శిశువుకు వైద్యం చేస్తుండగానే మరో చిన్నారికి కూడా ఇలా మూడు కేసులు నమోదు కావడంతో దేశంలో అందోళన మొదలైంది.
కొత్తది కాదు
మనదేశంలో విస్తరించకుండా ఉండాలేంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. HMPV వైరస్ కొత్తతేదీ కాదు. న్యుమోవిరిడే కుటుంబానికి చెందిన మెటాప్న్యూమోవైరస్ ఒక సాధారణ శ్వాసకోశ వైరస్. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ అంటే జలుబుకు కారణమవుతుంది. శీతాకాలంలో సాధారణంగా వచ్చే జలుబు..శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్, ఫ్లూ లాంటిదే అంటున్నారు వైద్యులు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే సరిపోతుంది.
టీకా లేదు
అయితే ప్రస్తుతానికి దీనికి టీకా అందుబాటులో లేదు కనుక కొన్ని కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్క్, శానిటైజేషన్, హ్యాండ్ వాష్, సామాజికి దూరం చాలా ముఖ్యం. 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరాన్ని పాటించాలి. వైరస్‌బారిన పడిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ పాటించడం ఉత్తమం.
ఎలా వ్యాపిస్తుంది
HMPV సోకిన వ్యక్తిదగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపరల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్-కలుషితమైన వాతావరణాలకు గురికావడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది.
మాస్కే మంత్రం!
మాస్క్ కచ్చితంగా ధరించాలి
చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
సామాజిక దూరాన్ని పాటించాలి.
పదే పదే కళ్ళు, ముక్కు , నోటిని తాకడం మానువాలి.
అనారోగ్యంగా అనిపిస్తే లేదా దగ్గు, గొంతు నొప్పి లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే, చికిత్స తీసుకోవాలి.
వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉండాలి
డోర్ నాబ్‌లు, లైట్ స్విచ్‌లు , స్మార్ట్‌ఫోన్‌లు వంటి కలుషితమైన ఉపరితలాలను క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి.
అనారోగ్యం సంకేతాలను చూపించే వ్యక్తుల నుండి సురక్షితమైన దూరం పాటించాలి.
ఈ వైరస్ ఎక్కువగా, పిల్లలు, వృద్ధుల్లో కనిపిస్తోంది కనుక వీరి పట్ల మిగిలిన కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలి.
వేడి నీటిని తాగుతూ, ఆహార పదార్థాలను వేడి వేడిగా తింటూ ఉండాలి.
బయటి ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.
హెచ్ఎంపీవీ లక్షణాలు
దగ్గు, జ్వరం. జలుబు,
గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం
ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్, కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది.
లక్షణాలు మరింత ముదిరితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)గా మారవచ్చు.
నోట్: జలుబు, ఫ్లూ లక్షణాలు కనిపిస్తే అందోళన పడకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. లక్షణాలున్నవారు ఐసోలేషన్‌గా ఉంటే ఇంకా మంచిది. ఇంట్లో చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నవారు మాస్క్, హ్యాండ్ వాష్, స్వీయ శుభ్రత పాటించాలి.
Comments
Please login to add a commentAdd a comment