న్యూఢిల్లీ: అనేక దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్‌కు సంబంధించి భారత్‌లో మరో కేసు నమోదైంది. కేరళకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ క్లేడ్ 1బీ వేరియంట్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం పేర్కొంది. కాగా ఈ రకం కేసు దేశంలో నమోదవ్వడం ఇదే తొలిసారి. గతవారం కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన వ్యక్తికి క్లేడ్ 1బీ వేరియంట్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రతినిధి మనీషా వర్మ తెలిపారు.
కేరళకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి యూఏఈ నుంచి ఇటీవల వచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా క్లేడ్ 1గా నిర్ధారణ అయ్యింది. ప్రపంచ ‘ఆరోగ్య ఆత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్ 1బీ’ స్ట్రెయిన్‌గా దీన్ని గుర్తించారు. అయితే, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కాగా ప్రపంచ వ్యాప్తంగా 120కిపైగా దేశాల్లో ఎంపాక్స్ కేసులు వెలుగుచూశాయి. 2022 నుంచి 204 జూలై నాటికి లక్షకుపైగా కేసులు నమోదయ్యాయిఈ కేసుల్లో సగానికి పైగా ఆఫ్రికా ప్రాంతం, మరో 24శాతం అమెరికా, యూరోపియన్ ప్రాంతంలో 11శాతం కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితి ప్రకటించింది.
చదవండి: ప్రధానికి ‘మన్‌కీ బాత్’ పైనే ఎక్కువ దృష్టి: రాహుల్
Comments
Please login to add a commentAdd a comment