మొక్కల నుంచి మానవుని వ్యాధులు సోకుతాయా అని చూసే అరుదైన ఘటన ఇది. ఈ ఘటన కోలకతాలో చోటు చేసుకుంది. ప్రొఫెషనల్ మైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న 61 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధి బారినపడ్డాడు. అతను కుళ్లిపోతున్న పదార్థాలు, పుట్టగొడుగులు, వివిధ మొక్కల శిలింద్రాలపై అధ్యయనం తదితరాలు అతని పరిశోధన కార్యక్రమాల్లో భాగం. ఒక రోజు సడెన్‌గా ఆ వ్యక్తి గొంతు బొంగురుపోవడం, దగ్గు, అలసట కనీసం మింగ లేకపోవటం తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. గత మూడు నెలలుగా ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఇక చేసేది లేక వైద్యలును సంప్రదించగా.. ఈ అరుదైన వ్యాధి గురించ బయటపడింది.
ఈ విషయాన్ని కోల్‌కతాలోని కన్సల్టెంట్ అపోలో మల్టిస్పెషాలిటీ హాస్పిటల్స్‌కు చెందిన పరిశోధకలు డాక్టర్ సోమదత్తా, డాక్టర్ ఉజ్వాయిని రే తమ నివేదికలో వివరించారు. అతనికి వచ్చింది కిల్లర్ ఫ్లాంట్ ఫంగస్ అని నిర్ధారించారు. ఇది ముఖ్యంగా గులాబీ కుటుంబానికి చెందిన మొక్కజాతుల్లోని ఆకుల్లో వస్తుందని చెప్పారు. ఈ కేసు మానవులలో వ్యాధి కలిగించే పర్యావరణ మొక్కల శిలీంద్రా సామర్థ్యాన్ని హైలెట్ చేయడమే గాక కారక శిలీంద్ర జాతులను గుర్తించేందుకు పరమాణు పద్ధతుల ప్రాముఖ్యతను నొక్కి చెబుతోందన్నారు డాక్టర్లు.
ఈ శిలింద్రాలను మాక్రోస్కోపిక్ లేదా మెక్రోస్కోపిక్ ద్వారా మాత్రమే గుర్తించగలమని చెప్పారు. ఇది వ్యాప్తి చెందగలదా లేదా అన్నది తెలియాల్సి ఉందని చెప్పారు వైద్యులు. ఆ వ్యక్తికి ఈ ఫంగస్ కారణంగా మెడపై గడ్డ ఏర్పడిందని, దాన్ని తొలగించి యాంటి ఫంగస్ మందులతో చికిత్స చేసినట్లు తెలిపారు. రెండేళ్ల పర్యావేక్షణ అనంతరం కోలుకుని బయటపడటమే గాక పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వెల్లడించారు వైద్యులు.
(చదవండి: అమృత్‌పాల్ కోసం డేరాల్లో గాలింపు)
Comments
Please login to add a commentAdd a comment