న్యూఢిల్లీ: దేశంలో కొత్త చట్టాలు జూన్ 30 అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)ని భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్)గా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ)ని భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ)ను భారతీయ సాక్ష్య అధినీయం(బీఎస్‌ఏ)గా మార్చారు. ఈ క్రమంలో తొలి కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది.
దేశ రాజధాని ప్రాంతంలోనే తొలి కేసు నమోదు కావడం గమనార్హం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ చిరు వ్యాపారి మీద గత అర్ధరాత్రి ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. పోలీసులు పాట్రోలింగ్ నిర్వహిస్తున్న టైంలో.. ఆ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్ బాటిల్స్ అమ్ముతూ కనిపించాడు. ఆ దుకాణం రోడ్డుగా అడ్డంగా ఉండడంతో పాటు.. దానిని తీసేయాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతను వినలేదని పోలీసులు చెబుతున్నారు.
భారతీయ న్యాయ్ సంహిత క్రిమినల్ కోడ్‌లోని సెక్షన్ 285 ప్రకారం.. అతనిపై కేసు నమోదు అయినట్లు సమాచారం. నిందితుడు బీహార్ పట్నాకు చెందిన పంకజ్ కుమార్‌గా గుర్తించారు. ఈ సెక్షన్ ప్రకారం.. రోడ్లను అతిక్రమించడం, తద్వారా ప్రమాదాలకు కారణం కావడం లాంటి చర్యలు నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. ఆ జరిమానా ఐదు వేల రూపాయల దాకా ఉంటుంది.
ఇదిలా ఉంటే.. కొత్త చట్టాల అమలుపై పోలీసు సిబ్బందికి మే 24 నుంచి జూన్ 25 వరకు శిక్షణను అందిన విషం తెలిసే ఉంటుంది. మూడు చట్టాల ద్వారా మారుతున్న డిజిటల్ యుగంలో సాంకేతికతను వాడుకునేందుకు సౌకర్యంగా తీర్చిదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment