జైపూర్: రాజస్తాన్‌లో జికా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 55 మందికి ఈ వైరస్ సోకినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు శనివారం ధ్రువీకరించారు. చికిత్సపొందిన తరువాత 38 మంది పరిస్థితి మెరుగైందని తెలిపారు. జైపూర్‌లోని పలు ప్రాంతాల నుంచి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ బృందాలు దోమ లార్వాల నమూనాలను సేకరించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు చెప్పాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఫాగింగ్ కొనసాగిస్తున్నారు. 11 మంది గర్భిణులకూ జికా వైరస్ సోకింది. పరిస్థితిని పర్యవేక్షించడానికి ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment