
ఈ దోమలతో డెంగీకి చెక్!
మెల్‌బోర్న్: డెంగీ, జికా వైరస్‌లను ఎదుర్కోడానకి ‘సూపర్ ఇన్‌ఫెక్టెడ్ దోమల’ను తయారు చేశారు. ఏడిస్ ఏజిప్టి అనే దోమలో వోల్‌బాకియా అనే బ్యాక్టీరియా స్ట్రైన్స్‌ను ప్రవేశ పెట్టి అభివృద్ధి చేశారు. వీటితో డెంగీ వ్యాప్తిని అడ్డుకోవచ్చని మెల్‌బోర్న్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. దోమలోని వోల్‌బాకియా డెంగీ వైరస్‌తో పాటు జికా, చికన్‌గున్యా వంటి వైరస్‌లను సైతం ప్రభావవంతంగా అడ్డుకోగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డెంగీ తదితర వైరస్ సోకిన వ్యక్తులను ఈ దోమ కుట్టినపుడు వోల్‌బాకియా బ్యాక్టీరియా స్ట్రైన్స్ ఆ వైరస్‌ను ఇతరుల్లోకి వెళ్లకుండా నిరోధిస్తాయన్నారు.