ప్రమాదకర జికా వైరస్‌ను గుర్తించే పరీక్షను బ్రెజిల్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
బ్రెసీలియా: ప్రమాదకర జికా వైరస్‌ను గుర్తించే పరీక్షను బ్రెజిల్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని సాయంతో ఐదు గంటల వ్యవధిలోనే వైరస్‌ను గుర్తించవచ్చని వారు చెబుతున్నారు. యూనికాంప్ యూనివర్సిటీ పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో సావ్ పాలో యూనివర్సిటీ, సావ్ పాలో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సైతం పాలుపంచుకున్నారు.
రోగుల రక్త, మూత్ర, లాలాజల నమూనాల ఆధారంగా వైరస్‌ను గుర్తించవచ్చని వీరు వివరించారు. ప్రస్తుతం బ్రెజిల్‌లో రెండు రకాలుగా రోగ నిర్ధారణ చేస్తున్నారు. వీటి ద్వారా ఫలితాలు వెలువడేందుకు ఐదు నుంచి ఎనిమిది రోజుల సమయం పడుతోంది. దీంతో ప్రస్తుత పరిశోధనకు ప్రాముఖ్యం ఏర్పడింది. త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రయోగించే అవకాశం ఉంది.