అమెరికాను వణికిస్తున్న వైరస్.. | 3 people test positive for Zika in New York: US authorities | Sakshi
Sakshi News home page

అమెరికాను వణికిస్తున్న వైరస్..

Published Sat, Jan 23 2016 7:44 PM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

అమెరికాను వణికిస్తున్న వైరస్..

అమెరికాను వణికిస్తున్న వైరస్..

న్యూయార్క్‌: గత ఏడాది బ్రెజిల్ వాసులను గజగజలాడించిన జికా వైరస్ ప్రస్తుతం అమెరికాలో వ్యాపించింది. ఈ వైరస్‌ లాటిన్‌ అమెరికాలో వేగంగా విస్తరించి అక్కడి ప్రజలను వణికిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్‌లోనూ పలు చోట్ల జికా వైరస్‌ కేసులు నమోదైనట్లు అధికారులు శనివారం వెల్లడించారు. వైరస్ వ్యాప్తితో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. న్యూయార్క్‌లో నమోదైన మూడు జికా వైరస్‌ కేసులలో బాధితులు వైరస్‌ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి వచ్చినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ముగ్గురిలో ఒకరికి నయంకాగా, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. లాటిన్‌ అమెరికా, కరేబియన్‌లలో 22 జికా వైరస్‌ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా అధికారులు గర్భిణీ స్త్రీలను హెచ్చరించారు.

జికా వైరస్‌ ఎడిస్‌ ఈజిప్టీ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకితే చిన్నారులు అసాధారణంగా చిన్న తలతో జన్మిస్తారు. ఇది చిన్నారుల మెదడుపై ప్రభావం చూపుతుంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ కారణంగా మెదడులో లోపాలతో పిల్లలు పుడతారు. ఈ వ్యాధిని అరికట్టేంత వరకు తమ దేశ మహిళలు గర్భం దాల్చకుండా ఉండడమే ఉత్తమమని అధికారులు పేర్కొన్నారు. కొలంబియాలో దాదాపు13,500 కేసులు, బ్రెజిల్‌లో 3,800కు పైగా జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. 

దోమల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించడంతప్ప, ఈ  వైరస్ వ్యాప్తిని ఏవిధంగా అరికట్టాలన్న దానిపై ఇప్పటివరకు వైద్యులకు స్పష్టత లేదు. జికా వైరస్ గా పిలవబడుతున్న వెస్ట్ నిలే వ్యాధి కారకాన్ని 70 ఏళ్ల క్రితం ఆఫ్రికా అడవి కోతుల్లో తొలిసారిగా గుర్తించారు. దీని కారణంగా నాడీ సంబంధ రుగ్మతలు సంభవిస్తాయని, కొన్నిసార్లు మరణం సంభవించే అవకాశముందని అధికారులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement