అబార్షన్లకు అనుమతివ్వండి..
రియోడిజెనీరో: జికా వైరస్తో ఉక్కిరిబిక్కిరవుతున్న బ్రెజిల్ వాసులు అబార్షన్లకు అనుమతివ్వాలని కోరుతున్నారు. బ్రెజిల్ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు జికా వైరస్ బారినపడిన వారికి అబార్షన్కు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. బ్రెజిల్ చట్టాల ప్రకారం అబార్షన్లు చట్టవిరుద్ధం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో.. రేప్కు గురైన బాధితులకు, పిండంలో మెదడు సంబంధింత రుగ్మతలు ఉన్నప్పుడు మాత్రమే అబార్షన్కు అనుమతిస్తారు.
ఈ సంవత్సరం లాటిన్ అమెరికా దేశాల్లో 40 లక్షల మంది జికా వైరస్ వైరస్ బారినపడే అవకాశాలు ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జికా మహమ్మారిని నిర్మూలించేందుకు అబార్షన్లకు అనుమతివ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.