సాక్షి, ముంబై: జికా వైరస్ దేశంలో పంజా విసురుతోంది. గతనెలలో తొలికేసు నమోదైన రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్లో జికా విజృంభిస్తోంది. ఇది మరిన్ని రాష్ట్రాలకు సోకనుందనే వార్తలు మరింత ఆందోళన పుట్టిస్తున్నాయి. జైపూర్లో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య తాజాగా 22కి చేరింది. ఇప్పటివరకూ 22 కేసులను గుర్తించామనీ, ఎన్‌సీడీసీ పరిస్థితిని సమీక్షిస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది దీంతో రంగంలోకి దిగిన కేంద్రం సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా కోరింది.
తాజాగా 22 మందికి పాటిజివ్ గా తేలడంతో ప్రధానమంత్రి కార్యాలయం ఒక నివేదికను కోరిందని అధికారులు వెల్లడించారు. అటు ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీ) లో ఒక కంట్రోల్ రూంను ఏర్పాటుచేయడంతో పాటు ఒక ఉన్నతస్థాయి కమిటీ జైపూర్‌కు తరలి వెళ్లింది. మరోవైపు బీహర్ లోనూ జికా వైరస్ లక్షణాలు కనిపిస్తుండటంతో అక్కడి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. దాదాపు 38 జికా అలర్ట్ జారీ చేశారు. జికా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలనీ, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment