దేశరాజధాని ఢిల్లీలో ఉక్కపోతల కాలం మొదలయ్యింది. ఢిల్లీలో ఉష్ణోగ్రత 33 డిగ్రీలు దాటింది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న మూడునాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.
రానున్న రోజుల్లో విపరీతమైన వేడి వాతావరణం ఉండనుందని, పలు రాష్ట్రాల్లో వేడిగాలులు మొదలు కానున్నాయిని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. సోమవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత కనిష్ట ఉష్ణోగ్రత 15.8 డిగ్రీల సెల్సియస్, ఇది సీజన్ సగటు కంటే ఒక డిగ్రీ తక్కువ. తేమ శాతం 40 నుంచి 94 శాతం వరకు ఉంటున్నదని వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం రాబోయే రెండుమూడు రోజుల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు చేరుకోనుంది. కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ)తెలిపిన వివరాల ప్రకారం మార్చి 26న ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్‌లోని ఉప-హిమాలయ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment