బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం కొనసాగుతోంది. ఇదే సమయంలో బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ ఉందని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్‌సింగ్ కుష్వాహ ప్రకటించడం విశేషం. ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు పూరిగా నిరాధారమన్నారు. అధికారం కోల్పోయిన తరువాత ప్రతిపక్షం రాజకీయ నిరుద్యోగిగా మారింది. నితీష్ కుమార్ పార్టీ(జేడీయూ)ని విచ్ఛిన్నం చేయడం అసాధ్యం. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు నిరాధారమైన, అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నాయని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు.
గందరగోళ పరిచే రాజకీయాలు ఎప్పటికీ ఫలించవు. చివరికి ‘వారికి’ నిరాశే మిగులుతుంది. రాష్ట్రంలో ఎన్‌డీఏకి 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇది మెజారిటీ కంటే ఆరు ఎక్కువ. ఈ లెక్కలు ఎన్‌డీఏకి అనుకూలంగా ఉన్నాయి. దీనికి భయపడే కాంగ్రెస్ తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు తరలించింది. ఎదుటివారి ఇళ్లను ధ్వంసం చేసేందుకు కుట్ర చేసే ముందు ప్రతిపక్షాలు సొంత ఇంటి గురించి ఆలోచించాలని ఉమేష్‌సింగ్ కుష్వాహ సూచించారు.
బీహార్ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజున అంటే సోమవారం(ఫిబ్రవరి 12) బలపరీక్ష జరగనుంది. దీనికి ముందు శనివారం పట్నాలో జేడీయూకి చెందిన మంత్రి శ్రవణ్ కుమార్ నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎమ్మెల్యేలంతా హాజరు కావాలిన జేడీయూ ఆహ్వానించింది. ఈ విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే ఆదివారం మంత్రి విజయ్ చౌదరి నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేల విందు కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment