ఢిల్లీ: జనతాదళ్(యునైటెడ్)పార్టీ అధ్యక్షుడిగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఆగస్టు 29(గురువారం) ఈ ఫిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. జేడీయూ మాజీ సభ్యుడు గోవింద్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌కు అర్హత లేదని, అంతర్గత పార్టీ మార్పులపై కోర్టు జోక్యం చేసుకోవడానికి బలమైన కారణం లేదని జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ అన్నారు.
‘‘ఈ పిటీషన్‌ను విచారించే మెరిట్ లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 అధికార పరిధికి సంబంధం లేకుండా ఉంది.పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో పాటు రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’’ అని ఢిల్లీ కోర్టు పేర్కొంది. 2016, 2019, 2022 సంవత్సరాల్లో జేడీయూ నిర్వహించిన పార్టీ అంతర్గత ఎన్నికలు పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించాయని ప్రకటించాలని గోవింద్ యాదవ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని గతంలోనూ జేడీయూ పార్టీలోని ఒక వర్గం లేవనెత్తగా.. 2017లో ఎన్నికల సంఘం నితీశ్‌కుమార్‌కు అనుకూలంగా తీర్పునిచ్చిందని హైకోర్టు పరిశీలించింది.
Comments
Please login to add a commentAdd a comment