ముంబై: మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోప్ బుధవారం తెలిపారు. పుణెకు సమీపంలోని బెస్‌లార్ గ్రామానికి చెందిన ఓ 50 ఏళ్ల మహిళకు జికా వైరస్ సోకినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఆరుగురు వ్యక్తులకు చికెన్ గున్యా, ఒకరికి డెంగ్యూ వచ్చినట్లు చెప్పారు. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఫాగింగ్, నీరు నిలువ ఉన్న ప్రాంతాలను శుభ్రపరచాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. మరోవైపు కరోనా వైరస్ కేసుల సంఖ్య కూడా కొల్హాపూర్, సాహ్ని, సతారా, పుణె జిల్లాల్లో తగ్గడంలేదని తెలిపారు. కరోనా కేసుల నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాజేశ్ తోప్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment