అమెరికా ప్రజలారా.. కండోమ్స్ వాడండి! | US advises abstinence, condom use to prevent Zika spread | Sakshi
Sakshi News home page

అమెరికా ప్రజలారా.. కండోమ్స్ వాడండి!

Published Sat, Feb 6 2016 10:51 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికా ప్రజలారా.. కండోమ్స్ వాడండి! - Sakshi

అమెరికా ప్రజలారా.. కండోమ్స్ వాడండి!

వాషింగ్టన్: లాటిన్ అమెరికాను గతేడాది హడలెత్తించిన ప్రమాదకర 'జికా' వైరస్ నిర్మూలనకు అగ్రదేశం అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అమెరికాలోనూ జికా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు అక్కడి ప్రభుత్వం కొన్ని సూచనలు, సలహాలు ఇస్తుంది. జికా వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాలకు వెళ్లి స్వదేశానికి తిరిగొచ్చిన మగవాళ్లు కొన్ని రోజులపాటు సెక్స్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. శారీరక సంబంధాలు కొనసాగించాలనుకుంటే కచ్చితంగా కండోమ్ వాడాలని సూచించింది. ముఖ్యంగా భార్యలు గర్భవతులుగా ఉన్నప్పుడు వారితో కలవాలనుకునే భర్తలు నిరోధ్ వాడటం వల్ల జికా వైరస్ భారిన పడకుండా తప్పించుకునే అవకాశం ఉంది.

డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సెంటర్ దేశ ప్రజలకు ఈ సూచనలు ప్రకటించింది. జికా ప్రభావం ఉన్న ప్రాంతాలకు వెళ్లొచ్చిన మహిళలు రెండు నుంచి 12 వారాల సమయంలో వైరస్ భారినపడే అవకాశం ఉందని, వాళ్లు కచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వివరించారు. సాధారణంగా దోమలు కుట్టడం వల్ల ప్రాథమికంగా ఈ వ్యాప్తి జరుగుంది.. అయితే, సెక్స్ లో పాల్గొనడం వల్ల కూడా వైరస్ వ్యాపిస్తుందని భావించిన సీడీసీ అమెరికా వాసులను హెచ్చిరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement