డెన్వర్: అగ్రరాజ్యం అమెరికాలో పురుషులు, మహిళలు కాని ఎల్‌జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గం పౌరుల హక్కులను గుర్తించే ప్రక్రియలో కీలకమైన అడుగు పడింది. అమెరికా ప్రభుత్వం ‘ఎక్స్’ జెండర్ హోదా కలిగిన తొలి పాస్‌పోర్టు జారీ చేసింది. ఇది చరిత్రాత్మక పరిణామం, పండుగ చేసుకోవాల్సిన సందర్భం అని ఎల్‌జీబీటీ హక్కుల కార్యకర్త జెస్సికా స్టెర్స్ వ్యాఖ్యానించారు. అయితే, ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టును ఎవరికి జారీ చేశారన్న వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు.
గోప్యతను కాపాడాలన్న సంకల్పంతో పోస్‌పోర్టు దరఖాస్తుదారుల సమాచారాన్ని బహిర్గతం చేయబోమని అధికారులు చెప్పారు. కొలరాడోలో నివసించే డానా జిమ్ అనే వ్యక్తి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టు కోసం 2015 నుంచి అమెరికా ప్రభుత్వంతో పొరాడుతున్నారు. పురుషుడిగా జన్మించి డానా జిమ్ కొంతకాలం అమెరికాలో సైన్యంలో పనిచేశారు. లింగ మార్పిడి చేయించుకొని మహిళగా మారారు. తనలాంటి వారి హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. తొలి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టును డానా జిమ్‌కే జారీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment