USA vs India live updates and highlights:
అమెరికాపై భారత్ ఘన విజయం
టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. న్యూయర్క్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో సూపర్-8కు టీమిండియా అర్హత సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా కొంచెం కష్టపడింది.
బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్‌పై భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేజ్ చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(42), శివమ్ దూబే(28) పరుగులతో ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి తమ జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్‌లో భారత టాపర్డర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి(0), రోహిత్ శర్మ(3), రిషబ్ పంత్(18) పరుగులతో నిరాశపరిచారు. అమెరికా బౌలర్లలో నెత్రావల్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. అలీ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు
13 ఓవర్లకు టీమిండియా స్కోర్: 60/3
13 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(23), శివమ్ దూబే(13) ఉన్నారు.
మూడో వికెట్ డౌన్..
39 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రిషబ్ పంత్.. అలీ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే(3), సూర్యకుమార్ యాదవ్(20) ఉన్నారు.
రెండో వికెట్ డౌన్.. రోహిత్ ఔట్
10 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ..త్రవల్కర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(9), సూర్యకుమార్ యాదవ్(12) పరుగులతో ఉన్నారు.
టీమిండియాకు బిగ్ షాక్.. కోహ్లి ఔట్
111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే నేత్రవల్కర్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
నిప్పులు చేరిగిన అర్ష్‌దీప్.. భారత టార్గెట్ 111 పరుగులు
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా అమెరికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా భారత బౌలర్లు దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది.
అమెరికా బ్యాటర్లలో నితీష్ కుమార్(27), టేలర్(24) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. పాండ్యా రెండు, అక్షర్ పటేల్ ఒక్క వికెట్ సాధించారు.
18 ఓవర్లకు అమెరికా స్కోర్: 100/7
18 ఓవర్లు ముగిసే సరికి అమెరికా 7 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. 17వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా ఎటువంటి పరుగులివ్వకుండా ఓ వికెట్ పడగొట్టాడు.18 ఓవర్‌లో అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హర్మీత్ సింగ్ ఔటయ్యాడు.
ఐదో వికెట్ డౌన్..
81 పరుగులు వద్ద అమెరికా నాలుగో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన నితీష్ కుమార.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి అమెరికా 5 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.
నాలుగో వికెట్ డౌన్
56 పరుగులు వద్ద అమెరికా నాలుగో వికెట్ కోల్పోయింది.24 పరుగులు చేసిన టేలర్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.14 ఓవర్లు ముగిసే సరికి అమెరికా 4 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. 14 ఓవర్లు ముగిసే సరికి అమెరికా 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. క్రీజులో కోరీ ఆండర్సన్(8), నితీష్ కుమార్(27) పరుగులతో ఉన్నారు.
హార్దిక్ ఎటాక్.. అమెరికా మూడో వికెట్ డౌన్
కెప్టెన్ ఆరోన్ జోన్స్ రూపంలో అమెరికా రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన జోన్స్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి నితీష్ కుమార్ వచ్చాడు.
6 ఓవర్లకు అమెరికా స్కోర్: 18/2
6 ఓవర్లు ముగిసే సరికి అమెరికా రెండు వికెట్లు కోల్పోయి 18 పరుగులు చేసింది. క్రీజులో టేలర్(5), జోన్స్(10) పరుగులతో ఉన్నారు.
వారెవ్వా అర్ష్‌దీప్.. ఒకే ఓవర్‌లో 2 వికెట్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అమెరికాకు భారీ షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్‌లో అమెరికా రెండు వికెట్లు కోల్పోయింది. జహీంగర్ డకౌట్ కాగా.. గౌస్ రెండు పరుగులు చేసి ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి అమెరికా రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు మాత్రమే చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన అమెరికా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఎస్‌ఎ తొలి వికెట్ కోల్పోయింది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తొలి బంతికే ఓపెనర్ జహీంగర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
బౌలింగ్ ఎంచుకున్న భారత్..
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆసక్తికర సమరానికి రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా న్యూయర్క్ వేదికగా భారత్, అమెరికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. అమెరికా మాత్రం రెండు మార్పులు చేసింది. ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా కెప్టెన్ మోనాంక్ పటేల్ దూరమయ్యాడు.
అతడి స్ధానంలో జోన్స కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు స్పిన్నర్ నోస్తుష్ కెంజిగే కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. జహంగీర్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్ తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్
అమెరికా: స్టీవెన్ టేలర్, షాయన్ జహంగీర్, ఆండ్రీస్ గౌస్(వికెట్ కీపర్), ఆరోన్ జోన్స్(కెప్టెన్), నితీష్ కుమార్, కోరీ ఆండర్సన్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, జస్దీప్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment