
వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్(70) అనారోగ్యంతో గత సోమవారం నుంచి విధులకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఆయన వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నట్లు పెంటగాన్ తెలిపింది.
స్వల్ప శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం సమస్యలు తలెత్తడంతో సోమవారం ఆయన్ను మెడికల్ సెంటర్‌లో చేరి్పంచినట్లు పెంటగాన్ ప్రతినిధి ఎయిర్ ఫోర్స్ మేజర్ జనరల్ ప్యాట్ రైడర్ శుక్రవారం(స్థానిక కాలమానం ప్రకారం) చెప్పారు. ఆయన కోలుకుంటున్నారని, ఈ రోజే ఆయన విధుల్లో చేరే అవకాశాలున్నాయని తెలిపారు. వ్యక్తిగత గోప్యత, వైద్యపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి ఆస్టిన్ ఆస్పత్రిలో చేరిన విషయాన్ని బయటకు వెల్లడించలేదని తెలిపారు. అవసరమైన పక్షంలో సహాయ మంత్రి కాథ్లీన్ హిక్స్ ఆయన స్థానంలో బాధ్యతలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు.