passport issued
-
అమెరికాలో తొలి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టు
డెన్వర్: అగ్రరాజ్యం అమెరికాలో పురుషులు, మహిళలు కాని ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గం పౌరుల హక్కులను గుర్తించే ప్రక్రియలో కీలకమైన అడుగు పడింది. అమెరికా ప్రభుత్వం ‘ఎక్స్’ జెండర్ హోదా కలిగిన తొలి పాస్‌పోర్టు జారీ చేసింది. ఇది చరిత్రాత్మక పరిణామం, పండుగ చేసుకోవాల్సిన సందర్భం అని ఎల్జీబీటీ హక్కుల కార్యకర్త జెస్సికా స్టెర్స్ వ్యాఖ్యానించారు. అయితే, ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టును ఎవరికి జారీ చేశారన్న వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. గోప్యతను కాపాడాలన్న సంకల్పంతో పోస్‌పోర్టు దరఖాస్తుదారుల సమాచారాన్ని బహిర్గతం చేయబోమని అధికారులు చెప్పారు. కొలరాడోలో నివసించే డానా జిమ్ అనే వ్యక్తి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టు కోసం 2015 నుంచి అమెరికా ప్రభుత్వంతో పొరాడుతున్నారు. పురుషుడిగా జన్మించి డానా జిమ్ కొంతకాలం అమెరికాలో సైన్యంలో పనిచేశారు. లింగ మార్పిడి చేయించుకొని మహిళగా మారారు. తనలాంటి వారి హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. తొలి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టును డానా జిమ్‌కే జారీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
తప్పుడు అడ్రస్ ఇచ్చి అడ్డంగా బుక్కైంది..
బైరెల్లీః తప్పుడు సమాచారం ఇచ్చి, పాస్ పోర్టు పొందిన ఓ మహిళ అడ్డంగా బుక్కైంది. మొరాకోకు చెందిన సదరు మహిళ మహానగర్ ప్రాంతంలో ఉంటున్నట్లుగా తప్పుడు చిరునామాను సమర్పించి అక్రమంగా పాస్ పోర్టు పొందినట్లు పోలీసుల ఎంక్వయిరీలో తేలడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఇజ్జత్ నగర్ పోలీసులు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ బైరెల్లీ పరిథిలోని హర్నామ్ కాఖడ్ అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు సమాచారం అందించి పాస్ పోర్టు పొందిందన్న ఆరోపణలతో కాఖడ్ పై ఇజ్జత్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె స్థానిక మహానగర్ ప్రాంతంలో ఉంటున్నట్లుగా పాస్ పోర్టులో ఇచ్చిన సమాచారం తప్పుడుదని తేలడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పాస్‌పోర్ట్ కార్యాలయం ద్వారా జరిపిన విచారణలో కాఖడ్ మొరాకో స్థానికత కలిగిన మహిళగా తేలిందని ఎస్పీ సమీర్ సౌరభ్ తెలియజేశారు. పాస్ పోర్ట్ కార్యాలయానికి తప్పుడు వివరాలు అందించినందుకు గాను ఆమె పాస్ పోర్టును రద్దు చేయడంతోపాటు ఆమెపై కేసు నమోదు చేసి, సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. -
'త్వరలో10 రోజుల్లోనే పోలీస్ వెరిఫికేషన్'
న్యూఢిల్లీ : పాస్‌పోర్ట్ జారీలో పోలీస్ వెరిఫికేషన్ 16 రోజుల్లో పూర్తి చేస్తునందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం అవార్డులు అందచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంటెలిజెన్స్ అధికారి అనురాధ, తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారి సురేందర్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి శ్రీకర్ రెడ్డి మాట్లాడుతూ 16 రోజుల్లోనే పోలీస్ వెరిఫికేషన్ పూర్తి చేసి, వేగంగా పాస్‌పోర్టులు జారీ చేయటాన్ని కేంద్రం గుర్తించిందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రపద్రేశ్, తెలంగాణ ప్రభుత్వాలే ఈ ప్రక్రియలో ముందున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ అందరి సహకారాలతో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. ముందు ముందు పది రోజుల్లోనే వెరిఫికేషన్ పూర్తయ్యేల చూస్తామని ఆయన తెలిపారు.