తప్పుడు అడ్రస్ ఇచ్చి అడ్డంగా బుక్కైంది..
బైరెల్లీః తప్పుడు సమాచారం ఇచ్చి, పాస్ పోర్టు పొందిన ఓ మహిళ అడ్డంగా బుక్కైంది. మొరాకోకు చెందిన సదరు మహిళ మహానగర్ ప్రాంతంలో ఉంటున్నట్లుగా తప్పుడు చిరునామాను సమర్పించి అక్రమంగా పాస్ పోర్టు పొందినట్లు పోలీసుల ఎంక్వయిరీలో తేలడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఇజ్జత్ నగర్ పోలీసులు తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ బైరెల్లీ పరిథిలోని హర్నామ్ కాఖడ్ అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు సమాచారం అందించి పాస్ పోర్టు పొందిందన్న ఆరోపణలతో కాఖడ్ పై ఇజ్జత్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె స్థానిక మహానగర్ ప్రాంతంలో ఉంటున్నట్లుగా పాస్ పోర్టులో ఇచ్చిన సమాచారం తప్పుడుదని తేలడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పాస్పోర్ట్ కార్యాలయం ద్వారా జరిపిన విచారణలో కాఖడ్ మొరాకో స్థానికత కలిగిన మహిళగా తేలిందని ఎస్పీ సమీర్ సౌరభ్ తెలియజేశారు. పాస్ పోర్ట్ కార్యాలయానికి తప్పుడు వివరాలు అందించినందుకు గాను ఆమె పాస్ పోర్టును రద్దు చేయడంతోపాటు ఆమెపై కేసు నమోదు చేసి, సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్పీ తెలిపారు.