![India top source of social media misinformation on COVID-19 - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/16/CORONAVIRUS-IN-INDIA-E15994.gif.webp?itok=bsWbWwO0)
న్యూఢిల్లీ: కరోనాపై ఇంటర్నెట్ ద్వారా అత్యధిక అసత్య సమాచారం వ్యాపించిన దేశాల లిస్టులో భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయం సేజెస్ ఇంటర్నేషన్ ఫెడరేషన్ ఆఫ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. మొత్తం 138 దేశాల్లలో ఈ పరిశోధన నిర్వహించగా, అందులో భారత్ టాప్‌లో నిలిచిందని జర్నల్ పేర్కొంది. భారత్‌లో ఇంటర్నెట్ విరివిగా అందుబాటులో ఉండటం, అదే సమయంలో ఇంటర్నెట్ అక్షరాస్యత తక్కువగా ఉండటమే దీనికి కారణమని అధ్యయనం అభిప్రాయపడింది.
138 దేశాల్లో..
138 దేశాల్లో 9,657 భాగాల సమాచారాన్ని ఆన్‌లైన్ నుంచి సేకరించారు. ఆయా సమాచారాన్ని ఫ్యాక్ట్–చెక్ చేసేందుకు 94 సంస్థల సహాయం తీసుకున్నారు. ఇందులో భారత్ 18.07 శాతంతో ప్రపంచంలోనే అత్యధిక కరోనా అసత్య సమాచారాన్ని ఉత్పత్తి చేసినట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రత్యేకించి సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారం విరివిగా ప్రచారమైనట్లు కనుగొన్నారు. భారత్‌లో ఇంటర్నెట్ తక్కువ ధరకే ఎక్కువ మందికి అందుబాటులో ఉండటం, సోషల్ మీడియా వాడకం ఎక్కువగా ఉండటం, ఇంటర్నెట్ అక్షరాస్యత తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల అసత్య సమాచారం విరివిగా ప్రచురితమైందని జర్నల్ పేర్కొంది.
ఇతర దేశాల్లో..
కరోనా అసత్య సమాచారన్ని ప్రచారం చేసిన దేశాల్లో భారత్ (18.07శాతం), అమెరికా (9.74 శాతం), బ్రెజిల్ (8.57 శాతం), స్పెయిన్ (8.03) టాప్–4లో ఉన్నాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఇందులో సోషల్ మీడియాలో (84.94 శాతం), ఇంటర్నెట్‌లో (90.5 శాతం) అసత్య సమాచారాలు పోస్ట్ అయ్యాయని పేర్కొంది. అన్నింటికి మించి ఒక్క ఫేస్‌బుక్‌లోనే (66.87) శాతం అసత్య సమాచారం ప్రచురితమైందని పరిశోధన తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment