first place
-
ఐదేళ్లలో రూ.9.63 లక్షలకోట్ల సంపద సృష్టి
ఇన్వెస్టర్ల సంపద సృష్టికి గత ఐదేళ్ల కాలం(2018–23)లో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ చెయిర్‌ను అలంకరించింది. ఈ బాటలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ రెండో ర్యాంకులో నిలవగా.. లాయిడ్స్ మెటల్స్, అదానీ గ్రూప్ సైతం ఇదే బాటలో నడవడం గమనార్హం! వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్)లో పలు దిగ్గజాలు గత ఐదేళ్లలో జోరు చూపాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అత్యధికంగా రూ. 9,63,800 కోట్ల మార్కెట్ క్యాప్‌ను జమ చేసుకుంది. నంబర్‌వన్ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్(టీసీఎస్) రూ. 6,77,400 కోట్ల విలువను జత చేసుకోవడం ద్వారా తదుపరి ర్యాంకును సాధించింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ నివేదిక ప్రకారం సంపద సృష్టిలో అదానీ ఎంటర్ప్రైజెస్ ఆల్‌రౌండ్ ప్రతిభను కనబరిచింది. స్టాక్ మార్కెట్లో వివిధ కంపెనీల పనితీరును పరిశీలించిన మోతీలాల్ ఓస్వాల్ ఆర్ఐఎల్ వరుసగా ఐదో ఏడాదిలోనూ టాప్‌లో నిలిచినట్లు పేర్కొంది. ఐసీఐసీఐ, ఎయిర్టెల్ 2018–23 కాలంలో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ. 4,15,500 కోట్లమేర బలపడగా.. ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ విలువ రూ. 3,61,800 కోట్లు పుంజుకుంది. మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ రూ. 2,80,800 కోట్లను జత చేసుకుంది. అయితే లాయిడ్స్ మెటల్స్ అత్యంత వేగంగా 79 శాతం సంపదను పెంచుకున్న కంపెనీగా ఆవిర్భవించింది. ఈ బాటలో అదానీ ఎంటర్ప్రైజెస్ 78 శాతం వార్షిక వృద్ధితో ద్వితీయ ర్యాంకును సాధించింది. ఈ కాలంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్‌ను మించుతూ అత్యంత నిలకడగా పురోగమించిన కంపెనీగా క్యాప్రి గ్లోబల్ నిలిచింది. ఏడాదికి 50 శాతం చొప్పున లాభపడింది. రూ. 10 లక్షలు.. ఐదేళ్లలో రూ.కోటి గత ఐదేళ్లుగా అత్యున్నత ర్యాలీ చేసిన టాప్–10 కంపెనీలలో 2018లో రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. 2023కల్లా ఈ పెట్టుబడి రూ. కోటికి చేరి ఉండేదని నివేదిక పేర్కొంది. -
Shanya Gill: పన్నెండు సంవత్సరాల వయసులోనే ఫైర్–డిటెక్షన్ డివైజ్ ఆవిష్కరణ
సైన్స్ పాఠాలను కూడా చందమామ కథల్లా ఆసక్తిగా వింటుంది శణ్య గిల్. ఆ ఆసక్తి వృథా పోలేదు. చిన్నవయసులోనే ఆవిష్కర్తను చేసింది. థర్మో ఫిషర్ సైంటిఫిక్ జూనియర్ ఇన్వెంటర్స్ ఛాలెంజ్–2023లో పన్నెండు సంవత్సరాల శణ్య గిల్ తయారు చేసిన ఫైర్–డిటెక్షన్ డివైజ్ ప్రథమ స్థానంలో నిలిచింది... కాలిఫోర్నియా(యూఎస్)లో సిక్త్స్–గ్రేడ్ చదువుతుంది శణ్య. సైన్స్, సైంటిస్ట్‌లు తనకు బాగా ఇష్టం. సైన్స్‌లో కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవడం అంటే ఆసక్తి. శణ్య గిల్ ఇంటికి సమీపంలోని ఒక రెస్టారెంట్లో అగ్నిప్రమాదం జరిగి భారీ నష్టం సంభవించింది. ఇంటా బయటా ఈ ప్రమాదానికి సంబంధించిన రకరకాల మాటలు ఎక్కడో ఒక చోట వినేది శణ్య గిల్. అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఒక పరికరం తయారు చేయాలనుకుంది. రకరకాల ప్రయోగాలు చేసింది. ఆ ప్రయోగాలు వృథా పోలేదు. కంప్యూటర్‌కు అనుసంధానించిన థర్మల్ కెమెరాను ఉపయోగించి సమర్థవంతమైన ఫైర్–డిటెక్షన్ సిస్టమ్‌ను రూపొందించింది శణ్య. శణ్య తయారు చేసిన ఫైర్–డిటెక్షన్ డివైజ్ సాధారణ సంప్రదాయ స్మోక్ డిటెక్టర్ కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. నష్టం జరగకుండా అప్రమత్తం చేస్తుంది. ‘రెస్టారెంట్ అగ్నిప్రమాదం ప్రభావంతో అమ్మ రకరకాలుగా భయపడేది. కిచెన్‌లోని స్టవ్ ఆఫ్ అయిందో లేదో అమ్మ ఒకటికి రెండుసార్లు చెక్ చేసేది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది. మరోవైపు ఎక్కడ చూసినా ఆ అగ్నిప్రమాదానికి సంబంధించే మాట్లాడుకునేవారు. ఇదంతా చూసిన తరువాత అగ్నిప్రమాదాలను నివారించే పరికరాన్ని తయారు చేయాలనుకున్నాను. నేను తయారు చేసిన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ద్వారా ఎంతో మందిని అగ్నిప్రమాదాల బారిన పడకుండా కాపాడవచ్చు’ అంటుంది శణ్య గిల్. శణ్యకు సైన్స్‌తోపాటు ఆటలు, క్రాఫ్టింగ్, కోడింగ్ అంటే ఇష్టం. జూనియర్లకు పాఠాలు చెప్పడం అంటే ఇష్టం. బయో మెడికల్ ఇంజనీర్ కావాలనేది శణ్య గిల్ లక్ష్యం. -
సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో సిద్దిపేట టాప్
సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛ సర్వేక్షణ్–2023లో భాగంగా పట్టణంలో చెత్త సేకరణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా, పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయా? అని ఇలా పది రకాల ప్రశ్నలతో స్వచ్ఛత యాప్ ద్వారా సిటిజన్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. లక్షకు పైగా జనాభా కలిగిన పట్టణాల ఫీడ్ బ్యాక్‌లో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 సంయుక్త ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2023 పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. దేశంలోని 4,355 పట్టణా లు ఇందులో మెరుగైన ర్యాంకింగ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. గతేడాది స్వ చ్ఛ సర్వేక్షణ్–2022లో తెలంగాణలోని మున్సిపాలి టీలు, కార్పొరేషన్లు 16 అవార్డులు సాధించాయి. ఫీడ్ బ్యాక్‌లో టాప్‌లో సిద్దిపేట: సిటిజన్ ఫీడ్ బ్యాక్ స్వీకరణ ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దేశ వ్యాప్తంగా 4,355 పట్టణాలుండగా లక్షకు పైగా జనా భా ఉన్నవి 427, లక్షలోపు 3,928 పట్టణాలున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగిన 427 పట్టణాల ఫీడ్ బ్యా క్లో తొలి స్థానంలో సిద్దిపేట నిలిచింది. సిద్దిపేట మున్పిపాలిటీలో 1,16,583 జనాభా ఉండగా 76, 283 మంది.. అంటే ఉన్న జనాభాలో 65.43 శాతం మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. 32.61 శాతం మంది ఫీడ్ బ్యాక్‌తో 4వ స్థానంలో మహబూబ్‌నగర్, 8.88 శాతంతో 24వ స్థానంలో వరంగల్ ఉంది. ఫీడ్ బ్యాక్‌కు 600 మార్కులు: స్వచ్ఛ సర్వేక్షణ్ లో మొత్తం 9,500 మార్కులు కేటాయించనున్నా రు. అందులో సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్‌కు 4,830, సర్టిఫికేషన్‌కు 2,500, సిటిజన్ వాయిస్‌కు 2,170 కేటాయించగా, సిటిజన్ ఫీడ్ బ్యాక్‌కు 600 మార్కులను కేటాయించనున్నారు. జిల్లాలోని ము న్సిపాలిటీలు ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్–2023కు ఆన్లైన్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారు. వాటి ప్రకారం పట్టణం ఉందా? లేదా? అని ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేయనున్నారు. -
అమెరికాలో భారతీయ విజయపతాక!
వినూత్న ఆలోచనలతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొని భారతీయులు అమెరికాలో సత్తా చాటుతున్నారు. యూనికార్న్ స్టార్టప్స్ స్థాపించడంలో ప్రవాస భారతీయులు మొదటి స్థానంలో నిలిచారు. 2022 వరకు అమెరికాలో 582 యూనికార్న్ స్టార్టప్స్ ఏర్పాటు కాగా, అందులో 66 ప్రవాస భారతీయులు ఏర్పాటు చేశారు. అమెరికాలో మొత్తం యూనికార్న్ స్టార్టప్స్‌లో ఇండియా, ఇజ్రాయెల్‌కు చెందిన ప్రవాసులు స్థాపించిన కంపెనీలు 20 శాతం ఉన్నాయి. సాక్షి, అమరావతి: ‘ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’.. ఇదే కోవలో వినూత్న ఆలోచనలతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొని భారతీయులు అమెరికాలో సత్తా చాటుతున్నారు. భారతీయ విజయపతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తున్నారు. యూనికార్న్ స్టార్టప్స్ స్థాపించడంలో అమెరికాలోని భారతీయులు మొదటి స్థానంలో నిలిచారు. 2022 వరకు యూఎస్‌లో 582 యూనికార్న్ స్టార్టప్స్ ఏర్పాటు కాగా, అందులో 319 స్టార్టప్స్ విదేశీయులు/విదేశీ మూలాలున్న వ్యక్తులు స్థాపించినవే. వీటిలో 66 యూనికార్న్ స్టార్టప్స్‌ను ప్రవాస భారతీయులు ఏర్పాటు చేయడం విశేషం. వీరిలో ఎక్కువ మంది ఉన్నత చదువుల కోసం యూఎస్‌కు వెళ్లిన వారే కావడం గమనార్హం. అలాగే కొంత మంది బాల్యంలోనే తల్లిదండ్రులతో కలిసి యూఎస్‌కు వచ్చిన వారూ ఉన్నారు. ఈ వివరాలను నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఏపీ) తాజాగా వెల్లడించింది. బిలియన్ డాలర్ల కంపెనీలుగా.. ఒక స్టార్టప్ కంపెనీ విలువ ఒక బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.8 వేల కోట్లు మించి) దాటితే దాన్ని ‘యూనికార్న్ స్టార్టప్’గా వ్యవహరిస్తారు. ప్రవాస భారతీయులు స్థాపించిన యూనికార్న్ స్టార్టప్స్‌లో భారీగా ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చాయి. సరాసరి ఒక్కో కంపెనీ 859 ఉద్యోగాలు సృష్టించినట్లు ఎన్ఎఫ్ఏపీ అధ్యయనంలో తేలింది. అమెరికాలో నంబర్ 1 గ్రోసరీ డెలివరీ కంపెనీగా ఉన్న ‘ఇన్‌స్టాకార్ట్’ను అపూర్వ మెహతా ఏర్పాటు చేశారు. ఆయన తల్లిదండ్రులు అపూర్వ చిన్నతనంలోనే అమెరికా వెళ్లారు. అక్కడే చదువుకున్న ఆయన తర్వాత విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. 31 శాతం ఇండియా, ఇజ్రాయెల్ నుంచే.. కాగా అమెరికాలో మొత్తం యూనికార్న్ స్టార్టప్స్‌లో ఇండియా, ఇజ్రాయెల్‌కు చెందిన ప్రవాసులు స్థాపించిన కంపెనీలు 20 శాతం ఉన్నాయి. ఒక్కో యూనికార్న్ స్టార్టప్‌కి ఒకరి కంటే ఎక్కువ మంది వ్యవస్థాపకులు ఉన్నారు. వీరిలో ఇండియా, ఇజ్రాయెల్‌కు చెందిన ప్రవాసులు 31 శాతం మంది ఉండటం విశేషం. అలాగే దాదాపు సగం మంది ఇండియా, ఇజ్రాయెల్, యూకే, కెనడా, చైనా దేశాల నుంచే ఉన్నారు. -
అదిగో మన పి.టి.ఉష
జూలై 13, గురువారం. బ్యాంకాక్‌లో ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 100 మీటర్ల హర్డిల్స్ పోటీ. ట్రాక్ మీద జ్యోతి యర్రాజీ చిరుతలా సిద్ధంగా ఉంది. కాని ఆ రోజు వాతావరణం ఆమె పక్షాన లేదు. వాన పడటం వల్ల ట్రాక్ తడిగా ఉంది. 100 మీటర్ల హర్డిల్స్‌ను జాతీయ స్థాయిలో 12.82 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సాధించి ఉంది జ్యోతి. ఇప్పుడు అంతకన్నా తక్కువ సమయంలో పూర్తి చేస్తే మరో రికార్డు స్థాపించవచ్చు. పోటీ మొదలైంది. అందరూ వాయువేగంతో కదిలారు. వింటి నుంచి సంధించిన బాణంలా జ్యోతి దూసుకుపోతోంది. హర్డిల్స్ మీదుగా లంఘిస్తూ గాలిలో పక్షిలా సాగుతోంది. కాని 6వ హర్డిల్కు వచ్చేసరికి తడి వల్ల కొద్దిగా రిథమ్ తప్పింది. వెంటనే సర్దుకుని పోటీని 13.09 సెకన్లలో పూర్తి చేసి మొదటిస్థానంలో నిలిచింది. 50 ఏళ్లుగా సాగుతున్న ఆసియా అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో తొలి స్వర్ణపతకం సాధించిన ఘనమైన రికార్డు ఇప్పుడు జ్యోతి వశమైంది. బుడాపెస్ట్‌లో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఎంపికైంది. అక్కడ ప్రతిభ చూపి ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావడం కోసం ఇదే 100 మీటర్ల హర్డిల్స్‌ను 12.77 సెకన్లలో పూర్తి చేయగలిగితే చాలు ఆ పోటీల్లో పాల్గొని ఒలింపిక్స్ విజేతగా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. అందుకే క్రీడాభిమానులు ఆమెపై ఆశలు పెట్టుకున్నారు. ఆమెను హర్షధ్వానాలతో ప్రోత్సహిస్తున్నారు. సెక్యూరిటీ గార్డు కూతురు జ్యోతి యర్రాజీ విశాఖ పోర్ట్ స్కూల్లో చదువుకుంది. ఆటలు తెలిసిన కుటుంబం కాదు. తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డ్. తల్లి ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఆయాగా పని చేసేది. వారిరువురికీ కుమార్తెను చదివించడమే ఎక్కువ. స్పోర్ట్స్‌లో ప్రవేశపెట్టడం కష్టం. కాని జ్యోతి డ్రిల్ పీరియడ్‌లో తోటి పిల్లలతో పరుగెత్తేది. పాఠశాలకు చేరువలోనే విశాఖ పోర్ట్ స్టేడియం ఉండటంతో అక్కడ సీనియర్ అథ్లెట్ల ప్రాక్టీస్‌ను పరిశీలించడం దినచర్యగా చేసుకుంది.తొలుత సబ్ జూనియర్ స్థాయిలో అంతర పాఠశాలల అథ్లెటిక్స్ మీట్లో పాల్గొనేది. 2015 రాష్ట్రస్థాయి పోటీల్లో పసిడి పతకం సాధించడంతో తోటి అథ్లెట్ల సలహాతో హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ హాస్టల్లో కోచ్ రమేష్ వద్ద శిక్షణ పొందింది. ఆమె ఆర్థిక స్థితి చూసి ఊరు వెళ్లాలంటే రమేషే డబ్బు ఇచ్చేవారు. అలాగే ఆమె సీనియర్ కర్నాటపు సౌజన్య (అప్పట్లో సికింద్రాబాద్–లింగంపల్లి రూట్ టి.సిగా పని చేసేది) కూడా ఆర్థికంగా సాయం చేసేది. జూనియర్ స్థాయి వరకే అక్కడ సదుపాయం ఉండటంతో సీనియర్స్ స్థాయిలో గుంటూరులోని అథ్లెటిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీకి వచ్చింది. విదేశీ కోచ్‌ల ప్రోత్సాహం దక్కడంతో నేషనల్స్ మెడల్ సాధించగలిగినా సెంటర్ కొనసాగకపోవడంతో అన్వేషణ తిరిగి మొదలైంది. మలుపుతిప్పిన భువనేశ్వర్ అయితే జ్యోతి ప్రతిభ జాతీయ స్థాయిలో తెలియడం వల్ల 2019లో రిలయన్స్ ఆధ్వర్యంలో ఒడిశాలోని భువనేశ్వర్‌లో నడిచే అథ్లెటిక్స్ హై–పెర్ఫార్మెన్స్ సెంటర్ నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. 5.9 అడుగుల ఎత్తు, పొడుగు కాళ్లు ఉన్న జ్యోతికి వంద మీటర్ల పరుగుతో పాటు హర్డిల్స్‌లో కూడా శిక్షణనివ్వడం మొదలు పెట్టాడు ఇంగ్లండ్ నుంచి వచ్చిన కోచ్ జేమ్స్ హిల్లర్. దాంతో కర్ణాటకలో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్–యూనివర్శిటీ అథ్లెటిక్స్ మీట్లో 100 మీటర్ల హర్డిల్స్‌ను 13.03 సెకన్లతో పూర్తి చేసి స్వర్ణం గెలుచుకుంది జ్యోతి. 2020 ఫిబ్రవరిలో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో మరో స్వర్ణం వచ్చింది. 2022 సెప్టెంబర్‌లో గుజరాత్లో జరిగిన జాతీయ పోటీల్లో 12.79 సెకన్లతో రికార్డు స్థాపించింది. ఇప్పుడు బ్యాంకాక్ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ‘ఫాస్టెస్ట్ ఆసియన్ ఉమెన్ ఇన్ హండ్రెడ్ మీటర్స్ హర్డిల్స్’ రికార్డు స్థాపించింది. ఆమెకు జాతీయ క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ అభినందనలు తెలియచేశారు. – డాక్టర్ మాడిమి సూర్యప్రకాశరావు, సాక్షి విశాఖ స్పోర్ట్స్ -
పనితీరులో సింగపూర్ టాప్
బెర్లిన్: అంతర్జాతీయంగా అగ్రరాజ్యాలైన బ్రిటన్, అమెరికా ప్రభ మరింతగా దిగజారిపోతున్నట్టుగా కనిపిస్తోంది. బ్రిటన్ను అత్యుత్తమ దేశంగా అక్కడ ప్రజలు అనుకుంటారేమో కానీ జర్మనీకి చెందిన వర్జ్‌బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో టాప్ –10 దేశాల్లో బ్రిటన్‌కు చోటు లభించలేదు. అత్యంత సమర్థంగా పని చేస్తున్న దేశాల జాబితాలో ఫిన్లాండ్ వంటి దేశాల తర్వాత 13వ స్థానంలో బ్రిటన్ నిలిస్తే, అగ్రరాజ్యం అమెరికా 23వ స్థానంలో ఉంది. నిఫ్తీ పొలిటికల్ టూల్ సాయంతో 173 దేశాల్లో రోడ్లు, నీళ్లు, విద్యుత్, స్కూళ్లు, ఆస్పత్రులు, పోలీసులు వంటివన్నీ పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చారు. డాక్టర్ దగ్గర వేచి చూసే సమయం దగ్గర్నుంచి విద్యుత్ సదుపాయం వరకు ప్రతీ రంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక అత్యుత్తమ పని తీరు కనబరిచిన దేశంగా సింగపూర్ అగ్రభాగంలో ఉంటే లిబియా అట్టడుగున నిలిచింది. సింగపూర్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఎస్తోనియా అగ్రభాగంలో ఉన్నాయి. భారత్ 110వ స్థానంలో ఉంది. -
వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్
మాంట్‌మెలో (స్పెయిన్): ఫార్ములా వన్ స్పానిష్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మొదటి స్థానంతో మొదలు పెడతాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ పోల్ పొజిషన్ సాధించాడు. ల్యాప్‌ను అతను అత్యుత్తమంగా 1 నిమిషం 12.272 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ సీజన్లో ఏడు రేస్‌లలో నాలుగో సారి వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్ లభించింది. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ), ల్యాండో నోరిస్ (మెక్లారెన్) రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. మెర్సిడెజ్‌కు చెందిన లూయీస్ హామిల్టన్‌కు ఐదో స్థానం దక్కింది. ఈ సీజన్లో రెండు రేస్‌లు నెగ్గిన వెర్స్టాపెన్ రెడ్‌బుల్ సహచరుడు సెర్గియో పెరెజ్ 11వ స్థానంనుంచి ప్రధాన రేస్‌ను ప్రారంభిస్తాడు. -
ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఇతడే..
World Richest Person Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న టెస్లా సీఈఓ 'ఎలాన్ మస్క్' (Elon Musk) ఎట్టకేలకు మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించాడు. ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితాలో ఆయన అగ్రస్థానంలో నిలిచాడు. ద్రవ్యోల్బణం నేపథ్యంలో టెక్ పరిశ్రమ కష్టాల కారణంగా ఆర్నాల్ట్ డిసెంబర్లో మస్క్‌ను అధిగమించారు. అయితే ఎట్టకేలకు మళ్ళీ ఆ స్థానాన్ని మస్క్ సొంతం చేసుకున్నారు. (ఇదీ చదవండి: భారతీయ వంటకాలపై మనసులో మాట చెప్పిన ఎలాన్ మస్క్) బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ అందించిన సమాచారం ప్రకారం.. ఎలాన్ మస్క్ సంపద సుమారు 192.3 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా ఇప్పుడు రెండవ స్థానానికి చేరిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 186.6 బిలియన్ డాలర్లు. ఏప్రిల్ నుంచి LVMH షేర్లు క్రమంగా తగ్గుముఖం పట్టి 10 శాతం పడిపోయాయి. ఈ కారణంగా ఆర్నాల్డ్ నికర విలువ ఒక్క రోజులోనే 11 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి. దీంతో ఎలాన్ మస్క్ మళ్ళీ మొదటి స్థానం సొంతం చేసుకున్నాడు. -
పెరుగుతున్న హైరైజ్ ప్రాజెక్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్లలో ఎక్కువగా కనిపించే హైరైజ్ నిర్మాణాలు క్రమంగా హైదరాబాద్‌లోనూ జోరందుకుంటున్నాయి. అత్యంత ఎత్తులో నివాసం ఉండాలని కోరుకునే వాళ్ల సంఖ్య పెరగడం, భవనాల ఎత్తుకు నిబంధనలను లేకపోవటం, స్థలాల కొరత వంటివి నగరంలో ఆకాశహర్మ్యాల పెరుగుదలకు కారణం. గతేడాది హైదరాబాద్‌లో 10, అంతకంటే ఎత్తయిన హైరైజ్ ప్రాజెక్ట్‌లు 57 ప్రారంభం కాగా.. బెంగళూరులో 51, చెన్నైలో 10 ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలలోనే భాగ్యనగరం ప్రథమ స్థానంలో నిలిచిందని అనరాక్ రిపోర్ట్ తెలిపింది. దేశంలో అత్యధికంగా ముంబైలో 263 , పుణేలో 170 హైరైజ్ ప్రాజెక్ట్‌లు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో ఏటా సగటున 1,400 అపార్ట్మెంట్లు నిర్మాణం చేపడితే అందులో సగటున 200 వరకు ఐదు అంతస్తుల పైన ఉండే బహుళ అంతస్తుల నివాస సముదాయాలుంటాయి. ఇందులో నాలుగో వంతు 10 అంతకంటే ఎక్కువ అంతస్తులపైన ప్రాజెక్ట్‌లుంటాయి. 2019లో 236 ఐదు ఫ్లోర్లపైన నివాసాల బహుళ నిర్మాణ ప్రాజెక్ట్‌లు వస్తే.. 2020లో కోవిడ్ లాక్‌డౌన్‌తో 115కి తగ్గాయి. 2021లో మళ్లీ పుంజుకుంది. 2020తో పోలిస్తే గతేడాది హైరైజ్ భవనాల లాంచింగ్స్‌లో 41 శాతం వృద్ధి రేటు నమోదయింది. గతేడాది గ్రేటర్ పరిధిలో 140 ప్రాజెక్ట్‌లకు అనుమతి లభించగా.. ఇందులో 57 హైరైజ్ భవనాలే. పశ్చిమ హైదరాబాద్‌లోనే.. షేక్‌పేట, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, ఖాజాగూడ, పుప్పాలగూడ, గండిపేట, కోకాపేట, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలలో ఎక్కడ చూసినా ఆకాశహర్మ్యాలే కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతాల్లో గతేడాది మరిన్ని కొత్త ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయి. సహజంగానే ఇక్కడ కొలువు ఉండే ఐటీ ఉద్యోగుల నుంచి డిమాండ్ ఉండటంతో ఎకరాల విస్తీర్ణంలో ఆకాశాన్నంటే ఎత్తయిన గృహ సముదాయాలను నిర్మిస్తున్నారు. జీవనశైలికి అనుగుణంగా.. ముంబై వంటి ప్రాంతాల్లో స్థలాల లభ్యత తక్కువ కాబట్టి వర్టికల్ నిర్మాణాలు సహజమే. హైదరాబాద్‌కు ఆ సమస్య లేదు. ఔటర్ చుట్టుప్రక్కల కొన్ని వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా ఆకాశహర్మ్యాలు పెరగడానికి కారణం సిటీలోనే ఉండాలని ఎక్కువ మంది కోరుకోవటమే అంటున్నారు నిపుణులు. అందుకే బంజారాహిల్స్, సోమాజిగూడ, పంజాగుట్ట, ఉప్పల్, బేగంపేట, సంతోష్‌నగర్, అత్తాపూర్, అప్పా జంక్షన్, బాచుపల్లి, మియాపూర్, సికింద్రాబాద్, బొల్లారం వంటి ప్రాంతాలలో భారీ భవంతులు వస్తున్నాయి. పాత వాటి స్థానంలో ఎత్తయిన నిర్మాణాలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధి చెంది ఉండటం, మెరుగైన రవాణా సదుపాయాలు, దగ్గర్లో విద్యా, వైద్య సదుపాయాలు ఉండటం అన్నింటికీ మించి సకల సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దుతుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏటేటా ఈ తరహా ఎత్తయిన గృహ సముదాయాలు పెరుగుతున్నాయి. -
ఆకాశమే హద్దుగా కొత్త ఇళ్ల లాంచింగ్స్...! హైదరాబాద్ జోరు మాత్రం తగ్గేదేలే..!
సాక్షి, హైదరాబాద్: కొత్త గృహాల ప్రారంభంలో హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. 2021 నాల్గో త్రైమాసికం (అక్టోబర్ – డిసెంబర్)లో లాంచింగ్స్ లో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని జేఎల్ఎల్ రెసిడెన్షియల్ మార్కెట్ రిపోర్ట్ వెల్లడించింది. అంతకుక్రితం త్రైమాసికంతో పోలిస్తే క్యూ4లో లాంచింగ్స్‌లో 26.1 శాతం వృద్ధి నమోదు కాగా.. పుణేలో 17.6 శాతం, బెంగళూరులో 16.4 శాతం, ముంబైలో 16.1% పెరుగుదల కనిపించిందని వివరించింది. నగరంలో గృహాల అమ్మకాలు కరోనా ముందస్తు స్థాయికి చేరుకున్నాయి. 2019లో 15,805 ఇళ్లు విక్రయం కాగా 2020లో 9,926, 2021లో 15,787 యూనిట్లు అమ్ముడుపోయాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్ పెరగడం, రియల్టీ మార్కెట్ సెం టిమెంట్ బలపడటం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడు తుండటంతో డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారం భం వైపు దృష్టిసారిస్తున్నారు. దేశంలోని ఏడు ప్రధా న నగరాలలో 2021 నాల్గో త్రైమాసికంలో 45,383 అపార్ట్మెంట్లు లాంచింగ్ అయ్యాయి. క్యూ3తో పో లిస్తే ఇది 38% ఎక్కువ. ఇందులో 19 % యూనిట్లు పుణేలో ప్రారంభం కాగా.. బెంగళూరు, హైదరాబాద్ ఒక్కోటి 17% వాటాను కలిగి ఉన్నాయి. -
కరోనాపై అసత్య సమాచారం.. మనమే ఫస్ట్
న్యూఢిల్లీ: కరోనాపై ఇంటర్నెట్ ద్వారా అత్యధిక అసత్య సమాచారం వ్యాపించిన దేశాల లిస్టులో భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయం సేజెస్ ఇంటర్నేషన్ ఫెడరేషన్ ఆఫ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. మొత్తం 138 దేశాల్లలో ఈ పరిశోధన నిర్వహించగా, అందులో భారత్ టాప్‌లో నిలిచిందని జర్నల్ పేర్కొంది. భారత్‌లో ఇంటర్నెట్ విరివిగా అందుబాటులో ఉండటం, అదే సమయంలో ఇంటర్నెట్ అక్షరాస్యత తక్కువగా ఉండటమే దీనికి కారణమని అధ్యయనం అభిప్రాయపడింది. 138 దేశాల్లో.. 138 దేశాల్లో 9,657 భాగాల సమాచారాన్ని ఆన్లైన్ నుంచి సేకరించారు. ఆయా సమాచారాన్ని ఫ్యాక్ట్–చెక్ చేసేందుకు 94 సంస్థల సహాయం తీసుకున్నారు. ఇందులో భారత్ 18.07 శాతంతో ప్రపంచంలోనే అత్యధిక కరోనా అసత్య సమాచారాన్ని ఉత్పత్తి చేసినట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రత్యేకించి సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారం విరివిగా ప్రచారమైనట్లు కనుగొన్నారు. భారత్‌లో ఇంటర్నెట్ తక్కువ ధరకే ఎక్కువ మందికి అందుబాటులో ఉండటం, సోషల్ మీడియా వాడకం ఎక్కువగా ఉండటం, ఇంటర్నెట్ అక్షరాస్యత తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల అసత్య సమాచారం విరివిగా ప్రచురితమైందని జర్నల్ పేర్కొంది. ఇతర దేశాల్లో.. కరోనా అసత్య సమాచారన్ని ప్రచారం చేసిన దేశాల్లో భారత్ (18.07శాతం), అమెరికా (9.74 శాతం), బ్రెజిల్ (8.57 శాతం), స్పెయిన్ (8.03) టాప్–4లో ఉన్నాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఇందులో సోషల్ మీడియాలో (84.94 శాతం), ఇంటర్నెట్లో (90.5 శాతం) అసత్య సమాచారాలు పోస్ట్ అయ్యాయని పేర్కొంది. అన్నింటికి మించి ఒక్క ఫేస్‌బుక్‌లోనే (66.87) శాతం అసత్య సమాచారం ప్రచురితమైందని పరిశోధన తేల్చింది. -
వ్యాక్సిన్‌లో భారత్ రికార్డ్: ప్రపంచంలోనే తొలిస్థానం
న్యూఢిల్లీ: మహమ్మారి వైరస్ వ్యాప్తి నిరోధానికి వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. ప్రపంచదేశాల్లో ప్రస్తుతం వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అయితే ప్రపంచ దేశాల్లో కన్నా భారత్‌లోనే అత్యధికంగా వ్యాక్సిన్లు వేసినట్లు తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలే చెబుతున్నాయి. భారత్ కన్నా ముందే అమెరికా, బ్రిటన్ సహా చాలా దేశాలు టీకాలు పంపిణీ మొదలుపెట్టాయి. కానీ వాటన్నిటి కన్నా వేగంగా టీకాలు వేయడంలో భారతదేశం ముందుంది. 13 రోజుల్లో 30 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా రికార్డు సృష్టించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ డేటా చెబుతోంది. అయితే ఇదే 30 లక్షల మార్క్ చేరుకోవడానికి అమెరికాకు 18 రోజులు పట్టగా... ఇజ్రాయెల్‌కు 33 రోజులు పట్టింది. బ్రిటన్‌కు 36 రోజులు పట్టింది. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్, సీరమ్ తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 16వ తేదీన మొదలుపెట్టారు. ఆ ప్రక్రియ నిర్విరామంగా.. సజావుగా సాగుతోంది. ఈ వ్యాక్సిన్లతో దుష్ప్రభావం జరిగిన సంఘటనలు చాలా తక్కువగా ఉండడం హర్షించదగ్గ విషయం. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వ్యాక్సినేషన్ పంపిణీ వేగంగా సాగుతోంది. వ్యాక్సినేషన్లో కర్ణాటక (2,86,089) మొదటి స్థానంలో ఉంది. అనంతరం మహారాష్ట్ర (2,20,587), రాజస్థాన్ (2,57,833), ఉత్తరప్రదేశ్ (2,94,959) ఉన్నాయి. రోజుకు సగటున 5 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు. భారతదేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1,07,20,048, మృతుల సంఖ్య 1,54,010. ప్రస్తుతం దేశంలో కరోనా అదుపులోకి వచ్ -
మాయదారి మహమ్మారి
సాక్షి, హైదరాబాద్: కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయంకరమైన వైరస్.. దీని దెబ్బకు ప్రపంచమే చిగురుటాకులా వణుకుతోంది. రోజుకు 459 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రెండు నెలల్లోనే ప్రపంచంలోని టాప్ 10 భయంకర వ్యాధుల జాబితాలో కరోనా వైరస్ చేరిందంటే దీని ప్రతాపం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరో గ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం ఇప్పటివరకు క్షయ (టీబీ) అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. దీని దెబ్బకు రోజు భూమిపై 3014 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో హెపటైటిస్ (2430 మంది), న్యుమోనియా (2215 మంది), హెచ్ఐవీ (2110 మంది), మలేరియా (2002 మంది) నిలిచాయి. ఇందులో టీబీ, హెపటైటిస్, న్యుమోనియా లాంటి చాలా వ్యాధులు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నవే. కానీ కరోనా (కోవిడ్–19) ఉనికి బయట పడిన రెండు నెలల్లోనే ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచాని వణికిస్తున్న అతి భయంకరమైన వ్యాధుల్లో ఒకటిగా ఆవిర్భవించడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది. వాటిని ఎప్పుడో దాటేసింది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భయంకర వ్యాధుల్లో డెంగీ, ఆటలమ్మ, పొంగు, ఎబోలా, సార్స్, మెర్స్ వ్యాధులను కరోనా ఎప్పుడో దాటేసింది. వీటి వల్ల రోజుకు చనిపోతున్న వారి సంఖ్య రెండు నుంచి 50 మంది ఉండగా, కరోనా వల్ల రోజుకు ప్రపంచవ్యాప్తంగా సగటున 459 మంది మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 440 మందిని బలి తీసుకునే వూఫింగ్ కఫ్, 396 మందిని బలితీసుకున్న టైఫాయిడ్లను కూడా కరోనా దాటేయడం గమనార్హం. ఐరోపా, అమెరికా దేశాల్లో కరోనా జడలు విప్పింది. కానీ ఉష్ణ దేశాల్లో పరిస్థితి కాస్త ఆశాజనకంగానే ఉంది. మొదటి స్థానానికి ఎగబాకుతుందా..? జనవరి ఆఖరి వారంలో కరోనా వైరస్ కారణంగా మరణ మృదంగం మొదలైంది. రోజురోజుకు మరణాల సంఖ్య తీవ్రమవుతోంది. తొలివారంలో కేవలం 20 మరణాలు సంభవించాయి. ఈ వ్యాధి ప్రపంచదేశాలకు విస్తరించిన దరిమిలా కొన్ని దేశాల్లో రోజుకు 600 నుంచి 800 మందికి పైగా ప్రజల ప్రాణాలకు హరించేస్తోంది. ఇప్పటిదాకా ఈ కరోనా వైరస్ 35,349 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ కరోనా వైరస్ సాగిస్తున్న మరణ మృదంగం ఇలాగే కొనసాగితే త్వరలోనే అతి భయంకరమైన వ్యాధుల జాబితాలో మొదటి స్థానానికి ఎగబాకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లోపు వ్యాధి నియంత్రణ, వ్యాక్సిన్ అందుబాటులోకివస్తే ఈ మరణాలకు అడ్డుకట్ట వేయొచ్చు. అందరం ఊపిరి పీల్చుకోవచ్చు. పలు వ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజువారీ మరణాలు.. -
ఆసియా అపర కుబేరుడు జాక్ మా!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రతకు ప్రపంచ దేశాలు మాంద్యంలోకి జారుకుంటాయన్న భయాలతో సోమవారం స్టాక్‌మార్కెట్లు కుప్పకూలిన నేపథ్యంలో .. పలువురు బిలియనీర్ల స్థానాలు మారిపోయాయి. ఇప్పటిదాకా ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో ఉంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మార్కెట్ పతనంలో ఆయన సంపద విలువ 5.8 బిలియన్ డాలర్ల మేర హరించుకుపోవడం ఇందుకు కారణం. దీంతో 44.5 బిలియన్ డాలర్ల సంపదతో చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు మళ్లీ నంబర్‌వన్ స్థానంలో నిల్చారు. అంబానీ కన్నా ఆయన సంపద సుమారు 2.6 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది. 2018 మధ్యలో జాక్ మా ఆసియాలో నంబర్ 1 హోదాను కోల్పోయారు. అపర కుబేరుల సంపద లెక్కించే బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ద్వారా ఇది వెల్లడైంది. ‘చమురు’ వదులుతోంది... ముడి చమురు రేట్లు భారీగా పతనమైన నేపథ్యంలో రిలయన్స్ నిర్దేశించుకున్నట్లుగా 2021 నాటికి రుణరహిత సంస్థగా మారే అవకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీకి రిలయన్స్ చమురు, పెట్రోకెమికల్స్ విభాగంలో వాటాల విక్రయ డీల్ సజావుగా జరగడంపైనే ఇదంతా ఆధారపడనుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. మరోవైపు, కరోనా వైరస్ దెబ్బతో జాక్ మా ఆలీబాబా వ్యాపారం కాస్త దెబ్బతిన్నా.. ఆ గ్రూప్‌లోని క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, మొబైల్ యాప్స్‌కి డిమాండ్ పెరగడంతో పెద్దగా ప్రతికూల ప్రభావం పడలేదు. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి అలాంటి వెసులుబాటు లేకుండా పోయింది. సోమవారం స్టాక్ మార్కెట్ పతనంలో రిలయన్స్ షేర్లు ఏకంగా 12 శాతం పడిపోయాయి. 2009 తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రథమం. -
పెరట్లో వన రాజా కోళ్ల పెంపకం
గత రెండు దశాబ్దాలుగా కోళ్ల పరిశ్రమ మన దేశంలో బాగా విస్తరిస్తోంది. ముఖ్యంగా మాంసం, గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండటానికి ఇదే కారణం. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలతోపాటు ఇతర కుటుంబాలు కూడా పెరటి కోళ్లను పెంచుకుంటారు. పెరటి కోళ్ల పెంపకం అభివృద్ధికి తక్కువ పెట్టుబడి, పెట్టుబడి పెట్టిన కొద్ది కాలంలోనే లాభాలు రావటం, కోళ్ల పెంట ఎరువుగా ఉపయోగపడటం వంటి అనేక కారణాలున్నాయి. నాటు కోళ్లకు గిరాకీ పెరుగుతుండడంతో పెరటి కోళ్ల పెంపకానికి ఈ మధ్య రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. పెరట్లో పెంపకానికి వనరాజా కోళ్లు అనువైనవన్న సంగతి తెలిసిందే. వనరాజా కోళ్ల విశిష్టతలు ► వివిధ రంగుల ఈకలు ఉండటం వలన నాటు కోళ్లను పోలి ఉంటాయి. ► వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. ► పొడవైన కాళ్లు ఉండటం వలన త్వరగా కదలగలవు. కుక్కల బారి నుంచి తప్పించుకోగలవు. ► గుడ్ల ఉత్పత్తికి, మాంసం ఉత్పత్తికి పనికివస్తాయి. వనరాజా కోళ్ల సామర్థ్యం ► మొదటి గుడ్డు పెట్టే రోజు నుంచి 175–180 రోజుల వరకు గుడ్లు పెడతాయి. 160 గుడ్లు పెడతాయి. ► 6వ వారంలో శరీర బరువు 2,000–2,200 గ్రాములు. ► గుడ్ల బరువు 28వ వారంలో 48–50 గ్రాములు. 40వ వారంలో 52–58 గ్రాములు. ► మొదటి 6 వారాల వరకు మరణాల శాతం 2 శాతం కంటే తక్కువ. ► ఎక్కువ సంఖ్యలో వనరాజా కోడి పిల్లలను పెంచేటప్పుడు శాస్త్రీయ పద్ధతిలో బ్రూడర్స్‌ను ఏర్పాటు చేయాలి. పిల్లలు షెడ్లకు రాక ముందు 2–3 అంగుళాల వరకు వరి పొట్టు / రంపపు పొట్టు లిట్టరు లాగా పోయాలి. అది మేయకుండా కాగితాలు పరవాలి. బ్రూడర్స్ చుట్టూ నీటి, మేత తొట్టెలను అమర్చాలి. కరెంటు బల్బులలతో ప్రతి కోడికి 2 వ్యాట్ల చొప్పున వేడినివ్వాలి. ► మేతలో 2,400 కేలరీల శక్తి , 16 శాతం ప్రొటీన్లు, 0.77% లైసిన్, 0.36% మిధియోనిన్, 0.36% భాస్వరం, 0.7% కాల్షియం ఉండాలి. ► ఆరువారాల వయస్సు దాటిన తర్వాత వాటిని పెరట్లో విడిచి పెట్టాలి. పెరట్లో లభించే చిన్న చిన్న మొక్కలు, నిరుపయోగ ధాన్యాలు, క్రిమి కీటకాలు, గింజలు మొదలైన వాటిని తింటూ పగలంతా తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తాయి. ► వివిధ జబ్బుల నుంచి రక్షించుకోవడానికి పిల్ల పుట్టిన ఒకటో రోజున, 7వ రోజున, 14వ రోజున, 28వ రోజున, 36–42 రోజుల మధ్య, 8వ వారంలో టీకాలను విధిగా వేయించాలి. ► ఆర్థిక లాభాల కోసం కోడి పెట్టలను ఒకటిన్నర సంవత్సరం, కోడి పుంజులను 14 లేదా 16 వారాల వయస్సు వచ్చే వరకు పెంచాలి. ఒక్కో పెట్ట 160 గుడ్లు పెడుతుందనుకుంటే రూ. 5 చొప్పున రూ. 800ల ఆదాయం పొందవచ్చు. ► దాణాను అధిక ధరకు కొనుగోలు చేయడం కన్నా రైతు తన దగ్గర ఉన్న దాణా దినుసులతో చౌకగా తయారు చేసుకుంటే, గుడ్ల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ , (99485 90506), ప్రొఫెసర్–అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవస్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
డేటా... దూకుడు!
ఉదయాన్నే లేస్తూ ఓ సెల్పీ.. వెంటనే దానిని ఫేస్బుక్, వాట్సాప్‌ల్లో పోస్టింగ్.. కొత్త సాంగ్ వచ్చిందా.. కొత్త స్టెప్పులు నేర్చుకుని వెంటనే టిక్‌టాక్‌లో డాన్సింగ్.. ఈసారి నా డబ్స్మాష్ వీడియో యూట్యూబ్‌లో ఎలాగైనా సరే వైరల్ అవ్వాల్సిందే.. ఇవీ భారతీయుల ఆలోచనలు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇంటర్నెట్ను తెగ వాడేస్తున్నారు. ఎంతలా అంటే ప్రపంచంలో డేటా వినియోగిస్తున్న వారిలో మనమే టాప్‌లో ఉండేంతలా. ఇదే విషయాన్ని మొబైల్ యాప్స్‌ల రేటింగ్లను నిర్ధారించే ‘సెన్సర్ టవర్ డేటా’ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ప్రస్తుత దేశ జనాభా దాదాపు 130 కోట్లు. ప్రపంచ దేశాలన్నింటికీ అతిపెద్ద మార్కెట్ మన దేశమే. అందుకు సోషల్ మీడియా ఏమీ తీసి పోదు. అందుబాటులోకి వస్తోన్న స్మార్ట్‌ఫోన్ ధర లు, ఇంటర్నెట్ డేటా ప్యాకేజీల వల్ల సోషల్ మీడియా వాడకంలో పట్టణాలు, పల్లెల్లోనూ అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. ఎంత లా అంటే ప్రపంచ సోషల్‌మీడియా వాడకంలో మనదే 40% భాగస్వామ్యం ఉండేంతలా. సోషల్ మీడియాలో ఎన్ని కొత్త యాప్‌లు వచ్చిన ఇండియాలో వాటికి కొత్త వినియోగదారులు పుట్టుకొస్తూనే ఉన్నారు. టిక్‌టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్‌లకు సంబంధించి ఇండియన్ల వినియోగం అసాధా రణ స్థాయిలో ఉంది. అమెరికా, యూరప్‌లను తలదన్ని మనదేశం అగ్రస్థానం దక్కించుకుంది. టిక్‌టాక్.. కొంతకాలంగా టిక్‌టాక్ సృష్టిస్తోన్న హంగామా అంతా ఇంతా కాదు. యువత, టీనేజీ, పిల్లలు, వృద్ధులు అంతా దీన్ని తెగవాడేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ యాప్‌ను అధికం(44 శాతం)గా మనమే డౌన్లోడ్ చేసుకున్నాం. ఒక్క సెప్టెంబర్‌లోనే 6 కోట్ల మంది ఈ యాప్‌ను కొత్తగా డౌన్లోడ్ చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ యాప్ క్రేజ్ ఎంతగా ఉందో. మార్చిలో టిక్‌టాక్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది డౌన్లోడ్ చేయగా అందులో 8 కోట్ల మంది భారతీయులే కావడం గమనార్హం. 15 సెకన్లకు ఓ కొత్త వీడియో ఇందులో అప్లోడ్ అవుతోంది. ప్రధాన సోషల్ మీడియా యాప్‌లైన ఫేస్బుక్, వాట్సాప్‌లకు ఇది తీవ్ర పోటీనిస్తోంది. వినియోగంలో భారత్ టాప్‌ప్లేస్‌లో ఉండగా.. అమెరికా, టర్కీ తర్వాత స్థానాల్లో నిలిచాయి. మరికొన్ని విశేషాలు ►టిక్‌టాక్‌లో 41 శాతం మంది 16 నుంచి 24 ఏళ్ల వయసులోపు వారే. ►యూజర్లలో 56 శాతం పురుషులు,44 శాతం మహిళలు. ►ప్రతీరోజు సగటు వినియోగదారుడు గడుపుతున్న సమయం 52 నిమిషాలు. ►90 శాతం వినియోగదారులు రోజుకు ఒక్కసారైనా యాప్ ఓపెన్ చేస్తున్నారు. ►ఇంతవరకూ టిక్‌టాక్ చూసిన వారి సంఖ్య సరాసరిగా 100 కోట్లు. ఫేస్బుక్.. ఫేస్బుక్ యూజర్లు ఇండియా 24.1 కోట్లు అమెరికా 24 కోట్లు ఇండోనేషియా 13 కోట్ల ఫేస్బుక్ విషయానికి వస్తే.. గత నెలలో ఇండియన్లు అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్‌ల్లో ఇది రెండోస్థానంలో నిలిచింది. ఈ సెప్టెంబర్‌లో ఇండియాలో కొత్తగా 5 కోట్ల మంది ఫేస్బుక్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా డౌన్లోడ్ చేసుకున్న 100 శాతంలో భారత్ భాగస్వామ్యం 23 శాతంగా నమోదైంది. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా భారతీయులు అధికంగా వినియోగిస్తున్న యాప్‌ల్లో ఫేస్బుక్ కూడా ఒకటి. ఎన్ని యాప్లొచ్చినా దీనికి ఉండే ఆదరణ తగ్గకపోవడం గమనార్హం. ఫేస్‌బుక్‌కి అగ్రరాజ్యం అమెరికాలో 24 కోట్ల మంది యూజర్లు ఉండగా.. భారత్‌లో మాత్రం 24.1 కోట్ల మంది ఉన్నారు. జనవరి నుంచి జూన్ వరకు ఫేస్బుక్ యూజర్ల పెరుగుదల భారత్‌లో 12 శాతంగా నమోదైంది. యూట్యూబ్ యూజర్లు అమెరికా50 కోట్లు ఇండియా 24 కోట్లు జపాన్12 కోట్లు యూట్యూబ్‌కు సైతం.. ఇండియాలో ఆదరణ పెరుగు తున్న వాటిలో యూట్యూబ్ కూడా ముందువరసలో ఉంది. మన దేశంలో 26.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 1,200 చానళ్లకు 10 లక్షలకుపైగా సబ్‌స్క్రై బర్లు ఉన్నారు. ఐదేళ్ల క్రితం కేవలం 2 చానళ్లకు మాత్రమే 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండేది. కాలక్రమంలో ఈ చానళ్లకు మంచి ఆదరణ దక్కుతోంది. వీటిలో 95 శాతం ప్రాంతీయ భాషలకు చెందినవి కావడం గమనార్హం. నీల్సన్ సర్వే ప్రకారం.. అధికంగా ఆదరణ ఉన్న వీడియోల్లో స్పోకెన్ ఇంగ్లిష్, ఇతర విద్యా సంబంధమైన కంటెంట్ ఉంది. -
ఉత్తమ ‘జీవన’ నగరం.. వియన్నా
న్యూఢిల్లీ: ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరాల జాబితాలో ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారి 118వ స్థానంలో నిలచింది. గతేడాది మొదటి స్థానంలో నిలిచిన వియన్నా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అత్యుత్తమ నగరాన్ని ఎంపిక చేసేందుకు ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా 140 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలను బుధవారం వెల్లడించింది. నేరాలు పెరగడం, ప్రాణవాయువు నాణ్యత తగ్గడం వంటి కారణాల రీత్యా ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారింది. సాంస్కృతిక విభాగంలో తక్కువ పాయింట్లు రావడంతో ముంబై రెండు స్థానాలు దిగజారి 119వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రియా రాజధాని వియన్నా జీవించదగ్గ ఉత్తమ నగరంగా ఎంపికై మొదటి స్థానంలో నిలిచింది. కెనాడాలోని సిడ్నీ, జపాన్‌లోని ఒసాకాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఫస్ట్ వియన్నా.. లాస్ట్ డమాస్కస్ నివాసానికి ఆమోదయోగ్య నగరాల జాబితాలో 99.1 పాయింట్లతో వియన్నా తొలిస్థానంలో నిలిచింది. ఇందులో న్యూఢిల్లీకి 56.3 పాయింట్లు రాగా, ముంబైకి 56.2 పాయింట్లు వచ్చాయి. చివరి స్థానంలో నిలిచిన సిరియాలోని డమాస్కస్ పట్టణానికి 30.7 పాయింట్లు లభించాయి. పాకిస్తాన్‌లోని కరాచీ 136వ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 138వ స్థానంలో నిలిచింది. చైనా రాజధాని బీజింగ్ 76వ స్థానంలో నిలవగా, లండన్ 48, న్యూయార్క్ 58వ స్థానాల్లో నిలిచాయి. మీడియా స్వేచ్ఛ విషయంలో కూడా భారత్ మరింత దిగజారిందని నివేదిక తెలిపింది. -
నెట్లో మోదీ, కాంగ్రెస్ టాప్
ఇప్పటికే ట్విట్టర్ ఫాలోయింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా మొదటి స్థానం సంపాదించారు. ఇంటర్నెట్లో అత్యధికులు శోధించిన భారత రాజకీయ నేతగా మోదీ రికార్డు నెలకొల్పారు. తర్వాత స్థానంలో రాహుల్ గాంధీ నిలిచారు. ఎక్కువ మంది నెటిజన్లు శోధించిన రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ ముందుంది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఎస్ఈఎంరష్ అనే సంస్థ జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2018లో 72 లక్షల 40వేల మంది మోదీ కోసం శోధించారు. 2019లో 18 లక్షల 20 వేల మంది శోధించారు. 2019లో రాహుల్‌గాంధీ కోసం 15 లక్షల మంది ఇంటర్నెట్లో శోధించారని ఆ సంస్థ నివేదిక తెలిపింది. 2018 డిసెంబర్లో నెటిజన్లు ఎక్కువ సెర్చ్ చేసింది కాంగ్రెస్ పార్టీనేనని తేలింది. ఈ మధ్యనే కాంగ్రెస్ క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీకి కూడా నెట్ పాపులారిటీ బాగా పెరిగింది. 2019లో 12 లక్షల 20వేల మంది ప్రియాంక కోసం శోధించారు. 2018లో ఈ సంఖ్య 7 లక్షలు మాత్రమేనని అధ్యయన నివేదిక వెల్లడించింది. నెటిజన్లలో అత్యధికులు ‘నరేంద్రమోదీ ఎవరు? అన్న పేరుతో ఆయన గురించి శోధించారని సంస్థ ప్రతినిధి ఫెర్నాండో తెలిపారు. ఇదిలా ఉండగా, ఫేస్బుక్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న రాజకీయ నాయకుల్లో మోదీ మొదటి స్థానంలో ఉన్నారని కూడా ఆయన చెప్పారు. 2019 ఫిబ్రవరి, మార్చి మధ్య మోదీ ప్రొఫైల్ 68.22 శాతం పెరిగింది. అధ్యయనం కోసం తాము ఎనిమిది మంది భారత రాజకీయవేత్తలను ఎంపిక చేసుకున్నామని, 2018 ఫిబ్రవరి నుంచి 2019 ఫిబ్రవరి వరకు వారిలో ఎవరిని ఎన్నిసార్లు నెటిజన్లు శోధించారో లెక్కించి నివేదిక తయారు చేశామని ఫెర్నాండో వివరించారు. -
బొటాస్‌కు తొలి పోల్
వియన్నా: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ ఈ సీజన్లో తొలి పోల్ పొజిషన్ సంపాదించాడు. శనివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 03.130 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ రెండో స్థానం నుంచి... ఫెరారీ డ్రైవర్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును మొదలు పెడతారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా 11వ, 17వ స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. -
అత్యుత్తమ సేవల్లో నం.1
హైదరాబాద్: ‘ఏ’కేటగిరీ పాస్‌పోర్టు కార్యాలయాల్లో (ఏడాదికి 5 లక్షలకు పైగా పాస్‌పోర్టులు అందించేవి) ఒకటైన హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం అత్యుత్తమ సేవలు అందించి 2017– 18 సంవత్సరానికి మొదటి స్థానం దక్కించుకుంది. బుధవారం సికింద్రాబాద్‌లో హైదరాబాద్ ప్రాంతీ య పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి మీడి యాకు వివరాలు వెల్లడించారు. వేగంగా పాస్‌పోర్టు అందించడం, పెండింగ్‌లను తగ్గించడం, ఫిర్యాదులను పరిష్కరణ తదితర అంశాలను పరిశీలించి విదేశీ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రకటించినట్లు చెప్పా రు. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ను కేవలం 4 రోజుల్లోనే పూర్తి చేస్తున్న రాష్ట్ర పోలీసులు కూడా అత్యుత్తమ సేవల్లో మొదటి స్థానం దక్కించుకున్నారన్నారు. మూడోసారి రాష్ట్ర పోలీసులు ఈ అవార్డు అందు కుని హ్యాట్రిక్ సాధించారన్నారు. ఈ నెల 26న ఢిల్లీలో జరిగే అఖిల భారత పాస్‌పోర్టు అధికారుల సదస్సులో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఈ అవార్డును అందిం చనున్నట్లు వివరించారు. అలాగే, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించిందన్నారు. దేశంలో మొత్తం 214 పీవోపీఎస్‌కేలు ఉండగా రాష్ట్రంలో 7, ఏపీలో 13 ఉన్నాయన్నారు. పీవోపీఎస్కేల్లో దరఖాస్తు తీసుకుంటున్నా.. అవి హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చాకే జారీ ప్రక్రియ జరుగుతుందన్నా రు. ఈ జాప్యాన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మొదట వరంగల్‌లోని పీవోపీఎస్కేను ఇలా మారుస్తున్నామన్నారు. -
అత్యాచారాల్లో.. మొదటిస్థానంలో గంజాం జిల్లా
బరంపురం : మహిళలపై అత్యాచారాల కేసుల్లో రాష్ట్రంలో గంజాం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఇటీవల ఒక సర్వేలో తేలిందని రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు జయంతి పోడియారి ఆరోపించారు. స్థానిక రామలింగేశ్వర్ ట్యాంక్ రోడ్లో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ మహిళా సురక్షా యాత్ర సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు జయంతి పోడియారి మాట్లాడుతూ రాష్టాంలో బీజేడీ ప్రభుత్వం మహిళల హక్కులను కాల రాస్తోందని మండిపడ్డారు. ఇందుకు స్వయా న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లా ఉదాహరణగా నిలుస్తోందని విమర్శించారు. జిల్లాలో ప్రతి రోజూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో గంజాం జిల్లా నిలిచిందని ఆవేదన వెలిబుచ్చారు. భారత రాజ్యాంగం కల్పించిన మహిళల హక్కుల కోసం అందరం కలిసికట్టుగా పోరాటం సాగించాలని ఇందుకు అందరూ కృషి చేయాలని కోరారు. బహిరంగ సభలో బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సుభాషిణి పట్నాయక్, బీఎంసీ కార్పొరేటర్ నమి తా పాఢి, మాజీ మంత్రి సురమా పాఢి తదితర వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. -
పదిలో మెరిసిన ప్రకాశం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రకాశం జిల్లా మొదటి స్థానం సాధించింది. రాష్ట్ర విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. ప్రకాశం జిల్లా 97.93 శాతం ఉత్తీర్ణతలో మొదటి స్థానం సాధించినట్లు ప్రకటించారు. పది ఉత్తీర్ణతలో జిల్లాకు మొదటి స్థానం దక్కడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, అటు విద్యాసంస్థలు, ఉపాధ్యాయ వర్గాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. 2007లో 10వ తరగతి ఉత్తీర్ణతలో ప్రకాశం జిల్లాకు మొదటి స్థానం దక్కింది. ఆ తర్వాత పది సంవత్సరాలకు మరోమారు జిల్లా మొదటి స్థానం దక్కించుకుంది. జిల్లా వ్యాప్తంగా 180 పరీక్ష కేంద్రాల పరిధిలో 38,642 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా 37,841 మంది ఉత్తీర్ణత సాధించారు. 19,780 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 19,361 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక 18,862 మంది బాలికలు పరీక్షలు రాయగా 18,480 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురలో 419 మంది, బాలికల్లో 382 మంది మాత్రమే ఫెయిలయ్యారు. 2,087 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించారు. 2017 విద్యా సంవత్సరంలో 1060 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించగా ఈ ఏడాది సంఖ్య రెట్టింపయింది. గతంతో పోలిస్తే 8 శాతంకుపైగా పాస్ పర్సంటేజీ పెరిగినట్లు విద్యాశాఖాధికారులు ప్రకటించారు. 2016 ఏడాదిలో 90.50 శాతం ఉత్తీర్ణత సాధించగా 2017లో 91.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది అది ఏకంగా 97.93 శాతానికి పెరిగింది. నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన పొతకమూరు జడ్పీ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో దర్శి మండలం పొతకమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూరు శాతం ఉత్తీర్ణత సాధించింది. 38 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా 38 మంది పాసయ్యారు. చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన ఝాన్సీ అత్యధికంగా 9.7 పాయింట్లు సాధించారు. మిగిలిన వారిలో ఇద్దరు విద్యార్థులు 9.5, ముగ్గురు 9.3, ఒక విద్యార్థి 9.2, ఒక విద్యార్థి 9.0 పాయింట్లు సాధించటం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలో నూరు శాతం ఉత్తీర్ణతను సాధించటం పట్ల విద్యాశాఖ వారిని అభినందించింది. ఇది ప్రభుత్వ పాఠశాలలకు, ఉపాధ్యాయులకు మరింత స్ఫూర్తిగా నిలుస్తుందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందరి కృషితోనే జిల్లాకు ప్రథమస్థానం ఒంగోలు టూటౌన్: అందరి కృషితోనే పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపామని జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్ సుబ్బారావు తెలిపారు. పదవ తరగతి ఫలితాలు విడుదలైన సందర్భంగా తన ఛాంబర్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి మొత్తం 38,642 మంది విద్యార్థులు హాజరుకాగా 37,841 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. వీరిలో బాలురు 97.88 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 97.97 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. 2,087 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారన్నారు. గత ఏడాది 91.78 శాతం ఉత్తీర్ణత సాధించి 10వ స్థానంలో నిలవగా ఈ ఏడాది 97.93 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలవడం గర్వంగా ఉందన్నారు. విద్యలో వెనకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ అవర్లు ఏర్పాటు చేసి చదివించామన్నారు. ప్రతి హాస్టల్‌ను రాత్రిళ్లు తనిఖీ చేసి వార్డెన్ల చేత చదివించామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయులు, టీచర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలిపారు. అందరి కృషితోనే పదేళ్ల తరువాత జిల్లా ప్రథమస్థానంలో నిలిచినట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్వశిక్షఅభియాన్ పీఓ ఎం. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా బాణసంచా కాల్చారు. తరువాత వివిధ పాఠశాలల హెచ్ఎంలు, టీచర్లు, ఉపాధ్యాయల సంఘాల నాయకులు విద్యాశాఖాధికారిని అభినందించారు. -
హైదరాబాద్‌కు మరో ఘనత
న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరానికి మరోసారి గుర్తింపు లభించింది. స్వల్ప కాలంలో వృద్ధి పరంగా అంతర్జాతీయంగా టాప్ 30 నగరాల్లో మొదటి స్థానంలో నిలిచింది. బెంగళూరు రెండో స్థానంలో ఉండగా, పుణె 4, కోల్‌కతా 5, ఢిల్లీ 8, చెన్నై 14, ముంబై 20వ స్థానంలో ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ (జోన్స్ లాంగ్ లాసల్లే) తెలిపింది. భారత నగరాలు స్వల్పకాలంలో వృద్ధిని సూచించే జేఎల్ఎల్ సిటీ ‘మూమెంటమ్ ఇండెక్స్ 2018’లో ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఈ సూచీ పట్టణాల ఆర్థిక వృద్ధి, రియల్టీ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది. చాలా వేగంగా వృద్ధి చెందుతున్న 30 పట్టణాలను ఈ సూచీలోకి చేర్చింది. మానవ వనరులు, అనుసంధానత, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్రాపర్టీ ధరలు, ఆర్థిక ఉత్పాదకత, కార్పొరేట్ కార్యకలాపాలు, నిర్మాణం, రిటైల్ విక్రయాల్లో భారత నగరాలు మెరుగైన పనితీరు ప్రదర్శించాయి. ‘‘షార్ట్ టర్మ్ మూమెంటమ్ ర్యాంకుల్లో భారత్ తన పూర్వ వైభవాన్ని కొనసాగించింది. అంతర్జాతీయంగా జనాభా, ఆర్థిక వృద్ధి పరంగా భారత నగరాలు అధిక రేటును నమోదు చేశాయి. మౌలిక రంగంలో పెట్టుబడులు, సులభతర వ్యాపార నిర్వహణ కోసం ప్రభుత్వం చేస్తున్న యత్నాలు ఈ విషయంలో తోడ్పడ్డాయి’’ అని జేఎల్ఎల్ నివేదిక పేర్కొంది. దీర్ఘకాలం పాటు తమ వృద్ధిని కొసాగించేందుకు గాను ఈ నగరాలు భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మార్కెట్లను తీర్చిదిద్దాలని, నివాసయోగ్యత, అందుబాటు ధరలు, నియంత్రణల్లో పారదర్శకతపై దృష్టి పెట్టాలని సూచించింది. -
అన్నింట్లో ఫస్ట్
సాక్షి, కడప : జిల్లా రవాణాశాఖ రాబడిలో దూసుకుపోవడంతోపాటు అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలువడంతో సంబంధితశాఖ మంత్రి, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించాయి. రవాణాశాఖను అభివృద్ధి బాటలో నడిపిస్తూనే ప్రమాదాల నివారణ, అధిక రాబడి సాధించిన నేపథ్యంలో ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ మల్లెపల్లె బసిరెడ్డిని సత్కరించారు.2016–17లో రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్ జిల్లా అన్ని పన్నుల వసూళ్లతోపాటు లక్ష్యాలను అధిగమించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. 2017–18 సంవత్సరానికి సంబంధించి ఆరు నెలల పన్నుల వసూళ్లలో కూడా రాష్ట్ర స్థాయిలో మళ్లీ మొదటి స్థానం సాధించింది. ఇందుకుగాను మంత్రి, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించి బహుమతులను అందజేశారు.పలువురు బసిరెడ్డికి అభినందనలు తెలియజేశారు. వైఎస్సార్ జిల్లా రవాణాశాఖ డీటీసీగా పనిచేస్తున్న బసిరెడ్డి కర్నూలుకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన రవాణాశాఖ రాబడి పెంచుతూనే లక్ష్యాలను అధిగమించడం, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయడం పట్ల బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద సత్కరించారు. విజయవాడలోని రవాణాశాఖ కమిషనరేట్ కార్యాలయంలో ఆ శాఖ మంత్రి అచ్చెంనాయుడు, కమిషనర్ బాలసుబ్రమణ్యం అభినందించారు. మిగతా అధికారులు ఈయనను స్ఫూర్తిగా తీసుకుని వృత్తిలో రాణించాలని వారు సూచించారు. -
గన్ లైసెన్సుల్లో యూపీ టాప్
న్యూఢిల్లీ: ఎక్కువ మంది పౌరులు తుపాకీ లైసెన్సులు పొందిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. యూపీలో 12.77లక్షల మందికి గన్ లైసెన్సు ఉంది. ఇక వేర్పాటువాదంతో సమస్యాత్మకంగా మారిన జమ్మూ కశ్మీర్లో 3.69లక్షల మంది గన్ లైసెన్సు పొందారు. గత ఏడాది డిసెంబర్ 31నాటి గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 33,69,444 మంది గన్ లైసెన్సులు సంపాదించారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. తమ వ్యక్తిగత భద్రతను కారణంగా చూపి యూపీలో ఎక్కువ మంది లైసెన్సులు పొందారు. పంజాబ్‌లో 3,59,349 మంది, మధ్యప్రదేశ్‌లో 2,47,130 మంది, హరియాణాలో 1,41,926 మంది, రాజస్తాన్‌లో 1,33,968 మంది, కర్ణాటకలో 1,13,631 మంది, మహారాష్ట్రలో 84,050 మంది, బిహార్‌లో 82,585 మంది, హిమాచల్‌ప్రదేశ్‌లో 77,069 మంది, ఉత్తరాఖండ్‌లో 64,770 మంది, గుజరాత్లో 60,784 మంది, పశ్చిమబెంగాల్లో 60,525 మంది, ఢిల్లీలో 38,754 మంది తమిళనాడులో 22,532 మంది, కేరళలో 9,459 మంది గన్ లైసెన్సులు పొందారు. అత్యంత తక్కువగా దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ కేంద్రపాలిత ప్రాంతాల్లో చెరో 125 మంది గన్ లైసెన్సులు సంపాదించారు. -
భగీరథ జ(ఫ)లాలు
వచ్చేస్తున్నాయ్.. ఇంటింటికీ నీళ్లు.. ♦ మిషన్ భగీరథ పనుల్లో జనగామ జిల్లా ఫస్ట్ ♦ వందశాతం పురోగతితో రాష్ట్రంలో తొలిస్థానం ♦ తరువాతి స్థానాల్లో మేడ్చల్, వనపర్తి, సిద్దిపేట ♦ చివరి స్థానంలో నిలిచిన కొమురంభీం జిల్లా ♦ తొలి విడతలో మరో 12 జిల్లాలపై ఫోకస్ ♦ డిసెంబర్ చివరి నాటికి పనుల పూర్తే లక్ష్యం జనగామ నుంచి ఇల్లందుల వెంకటేశ్వర్లు : ప్రతి జనావాసానికి స్వచ్ఛమైన తాగునీటిని అందిం చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ ఫలాలు ప్రజలకు అంద బోతున్నాయి. మిషన్ భగీరథ పనుల పురోగతిలో జనగామ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. హైద రాబాద్ మినహా మిగతా 30 జిల్లాల్లో భగీరథ పను లను చేపట్టారు. ఇందులో జనగామ ప్రజలకు తొలి ఫలితాలు అందుతుండగా తరువాత సిద్దిపేట జిల్లాకు చేరుతున్నాయి. పైపులైన్ నిర్మాణంతోపాటు ట్యాంకు ల నిర్మాణం, ఇంటింటికీ నల్లా కనెక్షన్ల పనుల తదితర అంశాల్లో జనగామ మొదటి స్థానంలో ఉంది. 12 జిల్లాలపై ఫోకస్.. భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేయడం కోసం తొలి విడతలో 12 జిల్లాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు తొలి విడతలో జనగామ, సంగారెడ్డి, జగిత్యాల, నిర్మల్, మెదక్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, కామారెడ్డి, వనపర్తి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలను ఎంచుకున్నారు. ఈ జిల్లాల్లో 60 శాతం వరకు పనులు కావడంతో మిగిలిన పనులను డిసెంబర్ వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడువు కంటే ముందే నీళ్లు.. గడువు కంటే ముందే భగీరథ జలాలు ఇంటింటికీ వస్తున్నాయి. మూడు నెలల ముందుగానే జనగామలో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. జనగామ, సిద్దిపేట, మేడ్చల్, వనపర్తి జిల్లాల్లో ట్రయల్ రన్ పూర్తి చేసి నీటిని అందిస్తున్నారు. జనగామలో 704 ఆవాసాలకు తాగునీరు అందించాల్సి ఉండగా ఇప్పటివరకు 704 గ్రామాల్లో ట్రయల్ రన్ పనులను నిర్వహించారు. ఇందులో 684 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తు న్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో జరుగుతున్న నేషనల్ హైవే నిర్మాణ పనుల కారణంగా 20 గ్రామాలకు నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. రోజుకు మూడు గంటల పాటు నీటి సరఫరా.. మిషన్ భగీరథ ద్వారా ట్రయల్‌రన్ చేస్తున్న గ్రామాల్లో రోజుకు మూడు గంటల చొప్పున నీటిని పంపింగ్ చేస్తున్నారు. పంప్ హౌస్‌ల నుంచి నేరుగా గ్రామాలకు నీటిని తరలిస్తు న్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విడతల వారీగా నీటిని వదులుతున్నారు. కరెంటుతో సంబంధం లేకుండా పంప్‌హౌస్‌ల నుంచి నీటిని వదులుతున్నారు. గతంలో కరెంటు ఉంటేనే మోటార్ల ద్వారా ట్యాంకులకు నీటిని వదిలి పెట్టేవారు. కానీ ఇప్పుడు పంప్‌హౌస్‌ల నుంచే నీటిని గ్రామాలకు అందిస్తున్నారు. ట్రయల్ రన్ చేస్తున్న గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల బాధ తప్పినట్టయింది. విద్యుత్ బిల్లులు ఆదా.. జనగామ మున్సిపాలిటీకి తాగునీటిని అందించడం కోసం నెలకు రూ.8 లక్షల మేర కరెంటు చార్జీల రూపంలో బిల్లు వస్తుండేది. కానీ రెండు నెలల నుంచి ఎలాంటి బిల్లులు లేకుండానే భగీరథ ద్వారా జిల్లా కేంద్రంలోని ప్రజలకు తాగునీటిని అందిస్తుండడం విశేషం. మిషన్ భగీరథ పథక వ్యయం రూ.45,000 కోట్లు ఇప్పటికి వరకు పథకం పూర్తి అయినది 65% . తాగునీరు అందనున్న ఆవాసాలు 24,215 రూ.35,000 కోట్లు మెయిన్ గ్రిడ్ వ్యయం 39,509 కి.మీ ఇంట్రా విలేజ్ పైపులైన్ 95,000 కి.మీ మెయిన్ గ్రిడ్ పైపులైన్ ఇంట్రా విలేజ్ వ్యయం రూ.10,000 కోట్లు -
భాగ్యనగరి నం:1
రియల్టీ పెట్టుబడుల్లో ఆసియా పసిఫిక్ రీజియన్‌లో తొలి స్థానంలో హైదరాబాద్ ♦ వాణిజ్య, కార్యాలయాల విభాగాల అభివృద్ధే ఇందుకు కారణం ♦ రెండో స్థానంలో బ్యాంకాక్; 6, 7వ స్థానాల్లో బెంగళూరు, ముంబయి ♦ 2017లో 611 బిలియన్ డాలర్ల పెట్టుబడులొస్తాయని అంచనా ♦ రీట్స్, రెరా, జీఎస్టీ, బినామీ చట్టాలతో రియల్టీలో పారదర్శకత హైదరాబాద్.. రియల్టీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఆసియా పసిఫిక్ రీజియన్ (ఏపీఏసీ) లోనే తొలిస్థానం కైవసం చేసుకుంది. ఏపీఏసీ నగరాల జాబితాలో బ్యాంకాక్, మనీలా, గ్యాంగ్జూ వంటివి ఉన్నాయ్! మన దేశంలో అయితే బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్లూ ఉన్నాయ్!! అయినా సరే భాగ్యనగరమే ప్రపంచ ఇన్వెస్టర్లను కట్టిపడేసిందని.. నగరంలో వాణిజ్య, కార్యాలయాల విభాగాల అభివృద్దే ఇందుకు కారణమని ప్రాపర్టీ కన్సల్టెన్సీ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ‘బెట్టింగ్ ఆన్ ఆసియా పసిఫిక్ నెక్ట్స్ కోర్ సిటీస్’ నివేదిక తెలిపింది. సాక్షి, హైదరాబాద్: ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల కారణంగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రాంగూడ, మాదాపూర్, కొండాపూర్ వంటి పశ్చిమ ప్రాంతాల్లో వాణిజ్య, కార్యాలయాల సముదాయాలకు డిమాండ్ బాగుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, ఒరాకిల్, ఉబర్, ఐబీఎం, పొలారిస్, డెలాయిట్ వంటి సంస్థలు తమ కార్యకలాపాల కోసం నగరాన్ని ఎంచుకున్నాయి. కొన్ని సంస్థలు విస్తరణ ప్రణాళికల్లోనూ హైదరాబాద్‌కే ప్రాధాన్యమిస్తున్నాయి. నగరానికి చెందిన నిర్మాణ సంస్థలతో పాటూ పొరుగు రాష్ట్రాల్లోని దివ్య శ్రీ డెవలపర్స్, సాలార్పూరియా సత్వా, ఎంబసీ, ఆర్ఎంజీ కార్ప్, ప్రెస్టీజ్, కల్పతరు వంటి సంస్థలు నగరంలో నివాస, వాణిజ్య సముదాయాలకు శ్రీకారం చుట్టాయి. ప్రధాన నగరంలో నెమ్మది.. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు కారణంగా తూర్పు ప్రాంతాల్లోనూ వాణిజ్య, ఆఫీసు స్థలాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఉప్పల్, హబ్సిగూడ, రామాంతపూర్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాల్లో స్థానిక డెవలపర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే నగర ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, హిమాయత్‌నగర్ వంటి ప్రైమ్ ఏరియాలు కేవలం వాణిజ్య సముదాయాలకే పరిమితమవుతున్నాయి. అవి కూడా రిటైల్, మల్టిప్లెక్స్లకే. ఉత్తర, తూర్పు ప్రాంతాలతో పోలిస్తే ప్రధాన నగరంలో ఆఫీసు సముదాయాల విపణి నెమ్మదించింది. నెలకు అద్దె చ.అ. రూ.45–60.. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, ఇతర రాష్ట్రాలతో కనెక్టివిటీ.. ఇవీ పెట్టుబడిదారులను కట్టిపడేస్తున్న ప్రధాన అంశాలు. వీటికి తోడు మెరుగైన మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరలు, అపారమైన మానవ వనరులు, శాంతి భద్రతలు అదనపు అంశాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అసోసియేషన్ (ట్రెడా) జనరల్ సెక్రటరీ బి. సునీల్ చంద్రారెడ్డి ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ‘‘హైదరాబాద్‌లో గ్రేడ్–ఏ భవన సముదాయంలో నెలకు అద్దె చ.అ. రూ.45–60 మధ్య ఉంటుంది. అదే బెంగళూరు, చెన్నై నగరాల్లో అయితే రూ.85కు పైమాటే. ముంబై, ఎన్సీఆర్లో అయితే అంతకంటే ఎక్కువే ఉంటుందని’’ వివరించారు. నిర్మాణంలో ఆధునికత వినియోగంతో పాటూ స్థానిక ఆర్కిటెక్ట్‌లు అంతర్జాతీయ డిజైన్లను రూపొందిస్తున్నారు. అందుకే సాధారణ భవనాలతో పాటూ స్టెప్ట్, పిరమిడ్ ఆకారంలోనూ నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. వాణిజ్య స్థలం కొనేముందు.. ⇔ వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయంన, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో మదుపు చేయాలి. ⇔ ఒక ప్రాంతంలో కట్టే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశముందా అనే విషయాన్ని బేరీజు వేయాలి. ⇔ భవనాన్ని నిర్మించే డెవలపర్ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి భవనాల్లో నిర్వహణ మెరుగ్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది. ⇔ మీరు వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగానికి ఆస్కాముందా? ఆయా ప్రాంతంలో జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి. ⇔ మీరు కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడుంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి. ⇔ వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలన్న నిర్ణయానికి వచ్చేముందు.. నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం భీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఈ ఏడాది 611 బిలియన్ డాలర్లకు.. 2017 తొలి త్రైమాసికంలో ఆసియా పసిఫిక్ రీజియన్‌లో రియల్టీ పెట్టుబడులు 136 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ముగింపు నాటికివి 611 బిలియన్ డాలర్లకు చేరుతాయని కుష్మన్ వేక్ఫీల్డ్ నివేదిక అంచనా వేసింది. మన దేశ గణాంకాలను పరిశీలిస్తే.. 2016లో స్థిరాస్తి రంగంలో 6 బిలియన్ డాలర్లు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. 2015లో ఇవి 4.8 బిలియన్ డాలర్లు. అంటే ఏడాదిలో 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం సంవత్సరంలో వాణిజ్య, ఆఫీసు విభాగాల్లోని డీల్స్, వాటాలు, విలువలను గమనిస్తుంటే.. 2017లోనూ ఇదే తరహా వృద్ధిని సాధిస్తుందని నివేదిక అంటోంది. అందరి దృష్టీ మన దేశం వైపు ఎందుకంటే? అయితే ఒక్కసారిగా దేశీయ స్థిరాస్తి రంగం ఆసియా పసిఫిక్ రీజియన్ (ఏపీఏసీ)లో గుర్తింపు రావటానికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలేనని నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్), రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్లు (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్టీ), బినామీ ట్రాన్సాక్షన్ చట్టం వంటివి స్థిరాస్తి రంగంలో పారదర్శకతను తీసుకొచ్చిందని.. దీంతో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయని కుష్మన్ వేక్ఫీల్డ్ రీసెర్చ్ సర్వీస్ సీనియర్ డైరెక్టర్ సిద్దార్థ్ గోయల్ తెలిపారు. ⇔ ఏపీఏసీలో కేవలం ఇండియాలో మాత్రమే కార్యాలయాల సముదాయాలకు డిమాండ్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. గత మూడేళ్లుగా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 32–35 మిలియన్ చ.అ. వాణిజ్య స్థలాలు లీజు, కొనుగోలు లావాదేవీలు జరిగాయి. ఇందులో ఐటీ, బీపీఎం రంగాల వాటా 52–55 శాతం. గతేడాది ఈ రంగాల వాటా 65–70 శాతం. ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు నగరాలతో పాటూ ద్వితీయ శ్రేణి మార్కెట్లయిన చెన్నై, హైదరాబాద్, పుణెల్లోనూ పారిశ్రామిక, ఈ–కామర్స్, గిడ్డంగుల మార్కెట్ అభివృద్ధి చెందుతోంది. ఏపీఏసీలోనే పెట్టుబడుల ఆకర్షణలో హైదరాబాద్ తొలిస్థానంలో నిలవటమే ఇందుకు ఉదాహరణ. 6, 7వ స్థానాల్లో బెంగళూరు, ముంబయి.. ఏపీఏసీలోని ఇతర నగరాలతో పోలిస్తే.. ఈ ఏడాది వాణిజ్య, ఆఫీసు విభాగాల్లో ప్రపంచ పెట్టుబడులు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్, హైదరాబాద్, పుణె, ముంబై నగరాలకే ఎక్కువగా వచ్చాయి. అయితే ర్యాంకింగ్‌లను గమనిస్తే మాత్రం.. బెంగళూరు, ముంబైలో 6, 7వ స్థానాల్లో నిలిచాయి. పుణె, చెన్నై, ఢిల్లీ నగరాలైతే వరుసగా 8, 9, 10వ స్థానాలకు పరిమితమయ్యాయి. ⇔ రెండు, మూడో స్థానంలో బ్యాంకాక్, మనీలా నగరాలు నిలవగా.. చైనాకు చెందిన గ్యాంగ్జూ, శెన్జైన్ నగరాలు వరుసగా 4, 5వ స్థానాల్లో నిలిచాయి. -
‘డిజిటల్ బోధన’ లో గొల్లప్రోలు ప్రథమ స్థానం
రాష్ట్రంలో ద్వితీయస్థానం గొల్లప్రోలు : జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోధనలో గొల్లప్రోలు జెడ్పీ బాలుర పాఠశాల రాష్ట్రంలో ద్వితీయస్థానం, ల్లాలో ప్రథమ స్థానం సాధించింది. జిల్లా వ్యాప్తంగా గత నవంబర్‌లో వందపాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించారు. ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సులభమైన, ఆసక్తికరమైన పద్ధతుల్లో బోధన చేయడానికి డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేశారు. అందులోభాగంగా గొల్లప్రోలు జెడ్పీసూ్కల్ 188 గంటల పాటు డిజిటల్ క్లాసులు నిర్వహించినట్టు జిల్లావిద్యాశాఖ వెలువడించింది. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా మందస మండలం వీరగున్నమాపురం ప్రథమస్థానంలో నిలిచింది. జిల్లాలో కరప హైసూ్కల్ ద్వితీయస్థానంలో నిలిచింది. ఈమేరకు పాఠశాలలో డిజిటల్ క్లాసుల నిర్వహణకు కృషి చేసిన ఇ¯ŒSచార్జి జే.కామేశ్వరరావును, ప్రధానోపాధ్యాయులు జీఏ ప్రశాంతిని పలువురు అభినందించారు. -
పన్ను వసూళ్లలో GHMC దేశంలోనే టాప్
-
కాసుల పంట
లాభాల్లో అమలాపురం ఆర్టీసీ డిపో ఈ ఏడాది రూ.1.32 కోట్లు ఆర్జితం జోన్లో ప్రథమస్థానం రాష్ట్రంలో 4వ స్థానం అమలాపురం రూరల్ : రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉన్నా అమలాపురం డిపో మాత్రం కాసులు కురిపిస్తూ లాభాలు గడిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్æనుంచి ఆగస్టు నాటికి రూ.1.32కోట్ల లాభాన్ని ఆర్జించి విజయనగరం జోన్‌లోని 27 డిపోల్లో ప్రథమస్థానంలో నిలిచింది. డిపో నిర్వహణ ఖర్చు తగ్గించి ఆక్యుపెన్సీని 68 శాతం పెంచడానికి అ«ధికారులు, కార్మికులు శ్రమించారు. 2011లో రూ.75.32 లక్షల లాభాల్లో ఉన్న డిపో 2012 మార్చికి రూ. 9.53 లక్షల నష్టాల్లో ఉంది. 2015 ఆగస్టు నాటికి రూ.1 కోటి లాభాన్ని ఆర్జించింది. రాష్ట్రంలో ఏడు డిపోలు మాత్రమే లాభాల్లో.. రాష్ట్రంలో ఉన్న 126 డిపోల్లో 7 డిపోలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. అవి... అమలాపురం, విజయవాడ, ఆటోనగర్, తిరుపతి, అలిపిరి, కాకినాడ, కనిగిరి. విజయవాడ, అటోనగర్ డిపోలు, çపల్లెవెలుగు బస్సులు నడపడం లేదు. తిరుపతి, అలిపిరి డిపోలు శ్రీవేంకటేశ్వర స్వామి కొండపైకి బస్సులు నడపడం ద్వారా లాభాలు సాధించాయి. డిపో కృషి.. అమలాపురం డిపో నుంచి కోనసీమలోని పలు గ్రామాలకు 40 పల్లెవెలుగు బస్సులు నడపడం ద్వారా కిలోమీటర్‌కు రూ. 12 నష్టం వస్తోంది. పెరిగిన జీతాలు రూ.1.80 కోట్లు, డీజిల్, ఇతర ఖర్చులు కలిపి నెలకు రూ. 6 కోట్ల ఖర్చు అవుతోంది. ఈ నష్టాలు భరిస్తూ డిపోని లాభాల బాటలోకి తీసుకు రావడానికి డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి చర్యలు చేపట్టారు. హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయవాడ రూట్లలో ఆదాయం పెంచడం ద్వారా ఆక్యుపెన్సీ 68 శాతం పెరిగింది. ఏసీ బస్సులను నడుపుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోంది. ఆదాయం వచ్చే రూట్లలో అదనపు బస్సులు తిప్పడం ద్వారా లాభాలార్జించారు. 142 బస్సులున్న డిపోలో 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సమష్టి కృషి ఫలితం ఆదాయం వచ్చే రూట్లలో అదనపు బస్సులను తిప్పుతూ డిపోని లాభాల్లోకి తీసుకుని వచ్చాం. నిర్వహణ ఖర్చు తగ్గించడం ద్వారా ఆదాయాన్ని పెంచాం. కార్మికుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. లాభాలు సాధిస్తున్న డిపో మేనేజర్లను సంస్థ విదేశాలకు పంపిస్తోంది. అమలాపురం నుంచి నాకు కూడా అవకాశం వస్తుంది. – సత్యనారాయణమూర్తి, డిపో మేనేజర్ -
మహిళా వ్యాపారవేత్తల్లో ఆ రాష్ట్రమే ఫస్ట్
న్యూఢిల్లీ: దేశంలోని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర.. ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది మహిళా వ్యాపారవేత్తలు ఉన్నారు. అక్షరాస్యతకు, వ్యాపారానికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ ఈ ఐదు రాష్ట్రాల్లో అక్షరాస్యత కూడా ఎక్కువగా ఉంది. 73.4 శాతం అక్షరాస్యత కలిగిన తమిళనాడులోనే దేశంలోకెల్లా ఎక్కువ మంది మహిళా వ్యాపారవేత్తలు ఉన్నారు. ఆ రాష్ట్రంలో పది లక్షల వ్యాపార సంస్థలను అంటే 13.5 శాతం వ్యాపార సంస్థలను మహిళలే నిర్వహిస్తున్నారు. 92 శాతం అక్షరాస్యత కలిగిన కేరళలో 11.3 శాతం వ్యాపార సంస్థలను మహిళలే నిర్వహిస్తున్నారు. 59.1 శాతం అక్షరాస్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10.5 శాతం వ్యాపార సంస్థలను, 70.5 అక్షరాస్యత కలిగిన పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలో 10.3 శాతం వ్యాపార సంస్థలను, 75.9 శాతం అక్షరాస్యత కలిగిన మహారాష్ట్రలో 8.2 శాతం వ్యాపార సంస్థలను మహిళలు నిర్వహిస్తున్నారు. దేశంలో మహిళా వ్యాపారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మహిళల కార్మిక శక్తి మాత్రం తగ్గుతోందని ‘ఇండియా స్పెండ్’ అనే సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా సరాసరి అక్షరాస్యత 65.5 శాతం ఉండగా, మహిళల కార్మిక శక్తి మాత్రం సరాసరి 25.5 శాతం మాత్రమే ఉంది. ఈ శక్తి 1999లో 34 శాతం ఉండగా, 2014 నాటికి అది 27 శాతానికి పడిపోయి ఇప్పుడు 25.5 శాతానికి చేరుకుంది. మహిళల కార్మిక శక్తి నేపాల్‌లో 79.9 శాతం ఉండగా, బంగ్లాదేశ్‌లో 57.4 శాతం, శ్రీలంకలో 35.1 శాతం ఉంది. పదవ తరగతికి పైగా చదువుకున్న మహిళల సంఖ్య కూడా ఈ ఐదు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో 77.4 శాతం మంది మహిళలు పదవ తరగతికన్నా పైగా చదువుకున్నారు. -
చెస్ పోటీల్లో బంగారు పతకం
తిరుపతి ఎడ్యుకేషన్ : భువనేశ్వర్‌లో ఈ నెల 23నుంచి 27వ తేదీ వరకు జరిగిన 47వ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ జాతీయ చెస్ క్రీడా పోటీల్లో తిరుపతి విద్యార్థి ప్రథమస్థానం కైవసం చేసుకుని బంగారు పతకం సాధించాడు. తిరుపతి చెన్నారెడ్డికాలనీలోని కేంద్రీయ విద్యాలయ పాఠశాల 6వ తరగతి విద్యార్థి కె.శ్యాంప్రసాద్‌రెడ్డి అండర్–14విభాగంలో పాల్గొన్నాడు. మొదటి నుంచి అపార క్రీడా ప్రతిభ చాటి ప్రథమ స్థానం కైవసం చేసుకుని బంగారు పతకాన్ని సాధించాడు. అక్టోబర్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్ సీహెచ్.ప్రసాదరావు, పీఈటీ జీ.శేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందనందించారు. -
సానియా ‘టాప్’ ర్యాంక్ పదిలం
న్యూఢిల్లీ: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్‌సలో భారత స్టార్ సానియా మీర్జా అగ్రస్థానంలో కొనసాగుతోంది. బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి గతవారం పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సానియా... సోమవారం విడుదల చేసిన డబుల్స్ ర్యాంకింగ్‌సలో 9730 పారుుంట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉంది. గత ఏడాది ఏప్రిల్ రెండో వారంలో తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న ఈ హైదరాబాదీ ఇప్పటివరకు అదే స్థానంలో కొనసాగుతుండటం విశేషం. ఇక పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్‌సలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 138వ స్థానానికి చేరుకున్నాడు. రామ్‌కుమార్ రామనాథన్ 229వ స్థానంలో, యూకీ బాంబ్రీ 282వ స్థానంలో ఉన్నారు. డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న 18వ, లియాండర్ పేస్ 60వ ర్యాంక్‌లో ఉన్నారు. -
చదరంగంలో ‘నన్నయ’ ఫస్ట్
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన చదరంగం పోటీల పురుషుల విభాగంలో నన్నయ యూనివర్సిటీ ప్రథమ, పీఆర్ ప్రభుత్వ కళాశాల (కాకినాడ) ద్వితీయ, డాక్టర్ బీవీఆర్ కళాశాల (భీమవరం) తృతీయ, బీఎస్ఎం కళాశాల (రామచంద్రపురం) చతుర్థ స్థానాలను కైవసం చేసుకున్నాయి. అలాగే మహిళల విభాగంలో ఒకటి నుంచి నాలు స్థానాలను ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల, సెయింట్ మేరీస్ కళాశాల, సీఆర్ఆర్ మహిళా కళాశాల, వీఎస్ఎం కళాశాలలు దక్కించుకున్నాయి. విజేతలకు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు బహుమతులు అందజేశారు. 2016–17 యూనివర్సిటీ చదరంగం జట్టుకు ఎంపికైన బాలురులో వి.బాలరాజు (ఎస్‌కేవీఎస్, గోకవరం), కె.మహేష్ (నన్నయ యూనివర్సిటీ, రాజమహేంద్రవరం), వై.వినయ్‌చంద్ (సీఎస్టీఎస్, జంగారెడ్డిగూడెం), టి.నగేష్ (పీఆర్ ప్రభుత్వ కళాశాల, కాకినాడ), బి.హరీష్ (వీఎస్ఎం కళాశాల, రామచంద్రపురం), జేజేఎస్ మణికుమార్ (జీబీఆర్ కళాశాల, అనపర్తి) ఉన్నారు. బాలికల విభాగంలో బి.సంకల్ప (సీఆర్ఆర్, ఏలూరు), ఎన్.పద్మకళ (ఎస్ఎంబిటీ – ఏవీఎస్‌ఎన్, వీరవాసరం), పీజీఎస్ సామరంజని (పీఆర్జీ, కాకినాడ), బి.మోహినికుమారి, ఎ.మౌనిక (ఎస్టీ థెరీసా, ఏలూరు), పి.కీర్తి (ఎస్‌కేఎస్‌డీ, తణుకు), ఎంపికయ్యారు. విజేతలను, టీమ్ సభ్యులను ఉపకులపతితోపాటు రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.సురేష్‌వర్మ, డాక్టర్ కేఎస్ రమేష్, పలువురు అధ్యాపకులు అభినందించారు. -
హరితహారంలో వరంగల్‌కు ప్రథమ స్థానం
జిల్లా టార్గెట్ 4.50 కోట్లు ఇప్పటి వరకు నాటిన మొక్కలు 4.37 కోట్లు : కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. హన్మకొండలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ కరుణ మాట్లాడుతూ జిల్లాకు 4.50 కోట్ల టార్గెట్ ఉండగా.. ఇప్పటివరకు 4.37 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి 4.50 కోట్ల లక్ష్యానికి చేరుకోవాలని అధికారులకు సూచించారు. నాటిన మొక్కలను జియో ట్యాగింగ్ చేయడంలో కూడా వంద శాతం లక్ష్యం సాధించాలన్నారు. తరచుగా తనిఖీలు నిర్వహించి మొక్కలు ఎన్ని బతికి ఉన్నాయి.. ఎన్ని చనిపోయాయనే విషయంలో నివేదికలు తయారు చేయాలని సూచించారు. పాఠశాలలను తనిఖీ చేయాలి.. జిల్లా, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు ఒకేరోజు పాఠశాలలను తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో రాత్రి బస చేసి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలన్నారు. తనిఖీలు, రాత్రి బసలపై ప్రత్యేక తేదీని నిర్ణయిస్తామని చెప్పారు. మారుమూల పాఠశాలల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అటవీ అధికారి శ్రీనివాస్, జిల్లా ప్రజాపరిషత్ సీఈఓ ఎస్.విజయ్‌గోపాల్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, సీపీఓ రాంచందర్‌రావు పాల్గొన్నారు. -
యోగా పోటీల్లో కోవూరు వాసుల ప్రతిభ
కోవూరు : ఇటీవల విశాఖపట్నంలో జరిగిన యోగా పోటీల్లో 35 ఏళ్లు పైబడిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో కోవూరుకు చెందిన ఈ.రమణయ్య ప్రథమ స్థానం, ఏ శ్రీనివాసులు 35 ఏళ్ల లోపు విభాగంలో ప్రథమ స్థానం సాధించారని యోగా గురువు గోళ్ల రమణయ్య తెలిపారు. కోవూరులో ఆయన మంగళవారం మాట్లాడారు. యోగా అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ శ్యాప్ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నెల్లూరుకు చెందిన పలువురు పాల్గొన్నారన్నారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒక్క యోగా వల్లనే సాధ్యమవుతుందన్నారు. ఈ విషయాన్ని 192 దేశాలు గుర్తించి యోగాను ఆచరిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని యోగాను సాధన చేయాలని ఆయన కోరారు. కోవూరు టీఎన్సీ కళాశాలలో చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కేంద్రంలో యోగా సాధన చేస్తున్న ఎంతో మంది రాష్ట్ర స్థాయిలో వివిధ పతకాలు సాధించిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. విజేతలను యోగా జాతీయ కార్యదర్శి మనోహర్, స్వామిజీ యోగానంద్ భారతి, రాష్ట్ర కార్యదర్శి రామారావు ప్రతిభ పురస్కారాలు అందుకుని ప్రత్యేక సన్మాన కార్యక్రమాలు చేపట్టారు. -
‘మీ ఇంటికి మీ భూమి’లో మెుదటిస్థానం
15 నాటికి సాధికార సర్వే మెుదటిదశ పూర్తి జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ గొల్లప్రోలు: ‘మీ ఇంటికి మీభూమి’ కార్యక్రమం నిర్వహణలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానం పొందిందని, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో రెండో స్థానంలో ఉందని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయ నిర్మాణానికి ఆయన బుధవారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సిబ్బంది చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. ఆన్లైన్ ద్వారా 1,80,600 దరఖాస్తులు రాగా 73 వేల దరఖాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కృతమయ్యాయన్నారు. వివిధ కారణాలతో 30,800 దరఖాస్తులను తిరస్కరించినట్టు తెలిపారు. ఆన్లైన్ నమోదు, కుటుంబతగాదాలు, ప్రత్యేక కారణాలతో పలు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆన్లైన్ పనుల్లో సిబ్బంది ప్రలోభాలకు గురవడం వంటి ఆరోపణలు సత్యదూరమన్నారు. ప్రతి నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి రెవెన్యూపరమైన సమస్యలను పరిష్కరించడానికి అధికారుల బృందం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పిఠాపురం నియోజకరవర్గానికి సంబంధించి గొల్లప్రోలు మండలంలో చెందుర్తి గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు. 7, 8, 9 తేదీలలో ఆయా గ్రామాలకు సంబంధించి డెస్క్‌వర్క్ నిర్వహించడం, 10, 11 తేదీలలో సమస్యలను గుర్తించడం, 13న డిప్యూటీ కలెక్టరు ఆధ్వర్యంలో తహసీల్దార్, మండలసర్వేయర్, వీఆర్ఓలు, మీసేవా ఆపరేటర్లు బృందంగా ఏర్పడి తక్షణం సమస్యలు పరిష్కరించడం జరుగుతాయన్నారు. మొదటి దశ ప్రజాసాధికారసర్వే ఈనెల 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఇప్పటి వరకూ 12 మండలాల్లో వందశాతం పూర్తయిందన్నారు. ఇంతవరకూ 28,76,093 కుటుంబాలను సర్వే చేసినట్టు చెప్పారు. 11 ఏజెన్సీ మండలాలు, నెట్‌వర్క్‌లేని మండలాల్లో సర్వే చేపట్టాల్సి ఉందన్నారు. రెండవ విడతగా కొత్తపల్లి, తాళ్లరేవు, రౌతులపూడితో పాటు కోనసీమలోని 6 మండలాల్లో సర్వే ప్రారంభమైందన్నారు. ఆయన వెంట తహసీల్దార్ వై.జయ, డిప్యూటీ తహసీల్దార్ రామరాజు తదితరులు ఉన్నారు. -
రెజ్లింగ్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమం
పిఠాపురం టౌన్ : స్థానిక హనుమంతరాయ జూనియర్ కళాశాల విద్యార్థి మేడిశెట్టి కళ్యాణరావు రెజ్లింగ్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. గత నెల 28, 29 తేదీల్లో కాకినాడలో జరిగిన ఏపీ మూడో సబ్ జూనియర్స్ అంతర్ జిల్లాల రెజ్లింగ్ పోటీలు 58 కేజీల విభాగంలో అతడు రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం సాధించి, స్వర్ణ పతకం అందుకున్నాడు. తద్వారా వచ్చే ఏడాది జనవరిలో జరిగే జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు అర్హత సాధిచాడు. కళ్యాణరావును కళాశాల ప్రిన్సిపాల్ డి.గంగామహేష్, వైస్ ప్రిన్సిపాల్ ఎ.ఆనంద్, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. -
కుబేర మంత్రుల్లో నారాయణ టాప్
-
కుబేర మంత్రుల్లో నారాయణ టాప్
♦ ఆస్తుల సగటులోనూ ఏపీ మంత్రులదే మొదటి స్థానం ♦ మంత్రులపై క్రిమినల్ కేసుల్లో మూడోస్థానంలో తెలంగాణ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మంత్రులపై కేసులు, వారి ఆస్తులపై ఓ సంస్థ చేసిన విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ మంత్రి నారాయణ కోటీశ్వరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలపై విశ్లేషణ జరిపిన అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఈ వివరాలు తెలిపింది. మొత్తం 620 మంత్రుల్లో 609 మంది డేటాను ఏడీఆర్ విశ్లేషించింది. దీని ప్రకారం రాష్ట్రాల మంత్రుల్లో కోటీశ్వరుల్లో టీడీపీకి చెందిన మంత్రి పొంగూరు నారాయణ రూ. 496 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, కర్ణాటక మంత్రి శివకుమార్(రూ. 251 కోట్లు) రెండో స్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా మంత్రుల ఆస్తుల సగటు రూ.8.59 కోట్లు కాగా, ఏపీ మంత్రుల ఆస్తి సగటు రూ. 45.49 కోట్లు. తర్వాతి స్థానంలో కర్ణాటక, అరుణాచల్ ఉన్నాయి. ఆస్తుల అత్యల్ప సగటున్న రాష్ట్రంగా త్రిపుర(రూ. 31.67 లక్షలు)గా నిలిచింది. 34 శాతం రాష్ట్రాల మంత్రులు (210 మంది)లపై క్రిమినల్ కేసులున్నాయి. 113 మందిపై హత్య, కిడ్నాప్ వంటి తీవ్ర కేసులున్నాయి. ఈ జాబితాలో 18మంది మంత్రులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, బిహార్(11), తెలంగాణ(9), జార్ఖండ్ (9) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 609 మందిలో 51 మంది మహిళా మంత్రులుండగా.. వీరిలో అత్యధికం మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచే ఉన్నారు. అటు కేంద్ర మంత్రుల్లో 14 మందిపై క్రిమినల్ కేసులుండగా.. సగటు ఆస్తి రూ. 12.94 కోట్లుగా వెల్లడైంది. -
స్వచ్ఛభారత్‌లో నెల్లూరు రైల్వే స్టేషన్ ఫస్ట్
నెల్లూరు(సెంట్రల్) ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రైల్వే స్టేషన్లలో నెల్లూరు రైల్వేస్టేషన్‌కు స్వఛ్చ భారత్‌లో ప్రథమ స్థానం లభించింది. విజయవాడ నుంచి తడ వరకు ఉన్న మొత్తం రైల్వే స్టేషన్లను కొన్ని నెలల క్రితం కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహించింది. అందులో నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌కు ప్రథమ స్థానం ఇచ్చారు. ఈ సందర్భంగా స్టేషన్ మేనేజర్ ఆథోని జయరాజ్ మాట్లాడుతూ దేశంలో 407 ప్రధాన రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారన్నారు. బృందం పరిశీలించిన అనంతరం నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ 28వ స్టేషన్‌గా నిలించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. స్టేషన్లలో సౌకర్యాల కల్పనలోతో పాటు ప్రయాణికులకు ఇచ్చే అన్ని సౌకర్యాలపై పరిశీలించి నివేదిక తయారు చేశారని తెలిపారు. అందులో కేంద్రం పరిశీలించి నెల్లూరును ఏపీలో నంబర్–1 స్టేషన్‌గా పేర్కొనిందన్నారు. -
రాష్ట్రంలో మనమే ఫస్ట్!
♦ హరితహారంలో జిల్లాకు మొదటి స్థానం ♦ 55 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసిన జిల్లా ♦ సీఎం కార్యాలయం నుంచి ప్రశంసలు ♦ అధికారుల కృషి వల్లేనన్న కలెక్టర్ యోగితా రాణా ♦ బాధ్యతా రహితంగా ప్రవర్తించే ఏపీవోలపై చర్యలకు ఆదేశం ఇందూరు : అన్ని కార్యక్రమాల్లో ముందుకు దూసుకెళ్తున్న నిజామాబాద్ జిల్లా మరోసారి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలో నిజామాబాద్ జిల్లాకు 3 కోట్ల 35లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను, ఇప్పటి వరకు 2 కోట్ల 10 లక్షల 28 వేల మొక్కలను నాటి, 55 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసిన మొదటి జిల్లాగా నమోదైంది. గురువారం ఒక్క రోజే 19.56 లక్షల మొక్కలు నాటారు. ఇందుకు సీఎం కార్యాలయం నుంచి జిల్లా యంత్రాంగానికి ప్రశంసలు అందాయి. కలెక్టర్ యోగితా రాణా, ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని ఖితాబునిచ్చారు. అయితే కలెక్టర్ డాక్టర్ యోగితారాణా గురువారం జిల్లాలోని 36 మండలాల తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, చేంజ్ ఏజెంట్లు, ఏపీవోలతో హరితహారం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారితో మాట్లాడారు. జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని చేరేందుకు అన్ని విభాగాల అధికారులు, ప్రజాప్రతి నిధుల శ్రమ వల్ల సీఎం కార్యాలయం నుంచి అభినందిస్తున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. అయితే ఈ కార్యక్రమాన్ని మరింత వేగం చేసేందుకు అధికారులు ఇదే ఉత్సాహంతో పని చేయాలని, బాధ్యతారహితంగా ప్రవర్తించే అధికారులపై, ఏపీవోలపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో వివిధ మొక్కలను నాటాలని, ఇళ్ల వద్ద వారికి కావాల్సిన మొక్కలను అందజేయాలని తెలిపినా, ఇంత వరకు లక్ష్యాన్ని పూర్తి చేయకుండా కాలయాపన చేయడం తగదన్నారు. జిల్లాలో గల 718 గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీల వారీగా 4వేల ప్రకారం అందించే టేకు స్టంపులను నాటించాలన్నారు. టార్గెట్ పూర్తికాని గ్రామ పంచాయతీలకు స్టంపులను ఇచ్చి వారి టార్గెట్‌ను పూర్తి చేయించాలని సంబంధిత మండలాధికారులకు సూచించారు. 30 వేల లక్ష్యం దాటిన గ్రామ పంచాయతీలకు 2 వేల 500 పండ్ల మొక్కలను అందజేయాలని తెలిపారు. జిల్లాలో ఆర్మూర్, పిట్లం, బీర్కూర్, నిజామాబాద్ మండలాలు హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష్యాన్ని చేరుతున్నందుకు అధికారులను అభినందించారు. మిగిలిన గ్రామ పంచాయతీల్లో రెండు రోజుల్లో పనులను పూర్తి చేయించాలని తెలిపారు. జిల్లాలో ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 40 వేల లక్ష్యాన్ని పూర్తి చేసి మొదటి మండలంగా నమోదు అయినందుకు ఆ టీం సభ్యులను అభినందించారు. కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్ రవీందర్‌రెడ్డి, అదనపు సంయుక్త కలెక్టర్ రాజారాం, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, పీడీ డీఆర్డీఏ చంద్రమోహన్, జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్, సోషల్ ఫారెస్టు అధికారిణి సుజాత తదితరులు పాల్గొన్నారు. -
పాపులర్ బ్రాండ్స్‌గా ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్
-
పాపులర్ బ్రాండ్స్‌గా ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సంస్థల్లో ఎయిర్ ఇండియా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రైవేటు రంగంలో చూస్తే స్పైస్‌జెట్ ముందున్నట్టు మీడియా విశ్లేషణ సంస్థ ‘బ్లూబైట్స్’ పేర్కొంది. స్పైస్‌జెట్ తర్వాత జెట్‌ఎయిర్‌వేస్, ఇండిగో ఎయిర్‌లైన్స్ తదుపరి స్థానాల్లో ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ‘భారతదేశపు అత్యంత ప్రాచుర్యం పొందిన విమానయాన బ్రాండ్స్ 2016’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రైవేటు ఎయిర్‌లైన్స్ విభాగంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రథమ స్థానంలో నిలవగా... ఎతిహాద్, ఎమిరేట్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. -
రైతుకు రాయితీ.. పశువుకు గ్రాసం!
♦ కరువులో ఆలమందల పోషణకు ప్రత్యేక పథకం ♦ వందశాతం రాయితీతో సాగవుతున్న పశుగ్రాసం ♦ ఒక్కో రైతుకు రెండెకరాల విస్తీర్ణం వరకు ఉచితం ♦ సద్వినియోగంలో రాష్ట్రంలో జిల్లా మొదటిస్థానం కరువు దాటికి రైతన్నలు మూగజీవాలను సాకలేక బలవంతంగా వదిలించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా సాగునీటి వనరులు పూర్తిగా అడుగంటడం.. వరుసగా ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో కష్టజీవి ఆర్థికంగా చితికిపోయి పశువులకు గ్రాసం కూడా అందించలేని దుస్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పశుసంవర్ధక శాఖ వందశాతం రాయితీతో పశుగ్రాసం విత్తనాలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. కొద్ది మొత్తంలో నీటి సౌకర్యం ఉన్న రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ పశుగ్రాసం సమస్యను అధిగమిస్తున్నారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో పశుసంపద 5.82 లక్షలు. సాగునీటి వనరులు లేకపోవడంతో జిల్లాలో కరువు ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులు.. పశువులను సాకలేక అమ్ముకుంటున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథ కానికి అనుసంధానం చేస్తూ ‘రైసింగ్ ఆఫ్ ఫాడర్ ప్లాట్స్ ఫర్ డ్రౌట్ మిటిగేషన్’ పేరిట కొత్త పథకానికి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా పశుగ్రాసం సాగుకు ఉచితంగా విత్తనాలు అందించడంతోపాటు సాగుకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ఆర్థిక చేయూత ఇస్తోంది. ఎకరా పశుగ్రాసం సాగుకు ప్రభుత్వం రూ.11,434 ఖర్చు చేస్తోంది. ఈ అంశంపై అవగాహన కల్పించడంతో రైతులు జిల్లాలో ఇప్పటివరకు 1,082 ఎకరాల్లో పశుగ్రాసాన్ని సాగుచేశారు. ఇందుకుగాను ప్రభుత్వం రూ.1.237 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో పశుగ్రాసాన్ని సాగు చేసి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లా నుంచే మొదలు. జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు వి.వరప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పశుగ్రాసం సాగుపై ఓ ప్రణాళిక తయారుచేసి ప్రభుత్వానికి నివేదించారు. తక్కువ నీటిని వినియోగించి జొన్నరకం గడ్డిని సాగుచేసే విధానాన్ని ఇందులో పొందుపరిచారు. దీన్ని పరిశీలించిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉచిత పశుగ్రాసం సాగుకు పచ్చజెండా ఊపింది. దీంతో జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా గ్రాసం సాగును ప్రోత్సహించాలని సూచించింది. కొద్దిపాటి నీటి సౌకర్యంతోపాటు జాబ్‌కార్డు ఉన్న పాడిరైతుకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,702 ఎకరాల్లో పశుగ్రాసాన్ని సాగు చేస్తున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం రూ.2 కోట్లు ఖర్చు చేసింది. పేద పాడిరైతులు ముందుకొస్తే సంఖ్యతో సంబంధంలేకుండా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుస్తామని, రైతులనుంచి డిమాండ్ కూడా పెరుగుతోందని రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ వరప్రసాద్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. గడ్డి దొరకడం కష్టంగా ఉంది కరువు కాలంలో పాడిపశువులకు గడ్డి దొరకడం కష్టంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన గడ్డి విత్తనాలు తీసుకున్నా. ఉ పాధిహామీ కింద పశుగ్రాసాన్ని పెంచుతున్నా. నాకు పది గేదెలున్నాయి. పచ్చిగడ్డి వేయడంతో రోజుకు పొద్దు, మాపు 60 లీటర్ల పాలు ఇస్తున్నాయి. గడ్డి విత్తనాలు నాణ్యమైనవి కావడంతో దిగుబడి బాగుంది. - రమావత్ కృష్ణ, పాడి రైతు, కేవీ తండా, ఇబ్రహీంపట్నం వృథా నీటితో గడ్డి పెంచుతున్నా పశుసంవర్ధక శాఖ అధికారుల సలహా మేరకు వృథా నీటితో గడ్డి పెంచుతున్నా. ఎకరా పొలంలో గడ్డి వేసిన. ఆరు పాడి పశువులకు ఈ గడ్డి సరిపోతుంది. రోజుకు 30 లీటర్ల పాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం నేను సాగు చేస్తున్న గడ్డి రకం పేరు కేటు. - భిక్షపతి, పాడి రైతు, ఇబ్రహీంపట్నం -
ఆదాయ వృద్ధిలో బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ టాప్
విశాఖపట్నం : ఆదాయ వృద్ధిలో దేశంలోనే బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్(రెండు తెలుగు రాష్ట్రాలు) నంబర్ వన్ స్థానంలో ఉందని ఆ సంస్థ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ పీవీ మురళీధర్ తెలిపారు. విశాఖలోని బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో 8 శాతం వృద్ధి రేటు సాధించగలిగామని చెప్పారు. దేశంలోనే ఏపీ టెలికాం నంబర్ వన్ స్థాయికి ఎదిగిందన్నారు. సెల్యూలర్ విభాగంలో 10 శాతం, బ్రాడ్‌బ్యాండ్‌లో 5 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. రూ.160 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. 17 లక్షల కనెక్షన్లతో మంచి రెవెన్యూ సాధించగలిగామని చెప్పారు. డేటా విషయానికొస్తే ఐదు శాతం పెరిగిందన్నారు. ఈ ఏడాది చివరికి 4జీ సేవల్లో అడుగుపెట్టనున్నట్టు తెలిపారు. ఫైబర్ నెట్వర్క్ విస్తరించనున్నట్టు చెప్పారు. -
'తెలంగాణను అగ్రగామిగా నిలబెడతాం'
రంగారెడ్డి (ఘట్కేసర్): మిగులు బడ్జెట్‌తో దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణను అగ్రగామిగా నిలబెడతామని రవాణ శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని కేఎల్ఆర్ ఫంక్షన్ హాలులో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దర్గ దయాకర్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక ఎంపీపీ బండారి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పట్నం పై విధంగా పేర్కొన్నారు. అంతకు ముందు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ సమావేశం హాలు వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌కు టీఆర్ఎస్ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంపన్నంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సీమాంధ్ర పాలకులు 60 ఏళ్లుగా దోచుకుతిన్నారన్నారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లను నిర్మించుకున్నవారికి ప్లాట్లను అందజేశామన్నారు. మిగిలిన కొద్దిమంది పేదలకు కూడా క్రమబద్ధీరిస్తామన్నారు. జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ.2000 కోట్లు కేటాయించామని, మిషన్ కాకతీయలో భాగంగా జిల్లాలోని 558 చెరువుల్లో పూడికతీత పనులను చేపట్టామని మంత్రి తెలిపారు. -
పది, పదకొండు, పన్నెండు..ఏదైనా సరే
పది, పదకొండు, పన్నెండు, ఎంసెట్.. అకాడమిక్ పరీక్ష అయినా, ప్రవేశ పరీక్ష అయినా.. సరే అమ్మాయిలే టాప్‌లో దూసుకెళ్తున్నారు. ఆ పరీక్ష అయినా సరే... టాప్ గేర్‌లో దూసుకెళుతున్నారు. అన్నీ పరీక్షల్లోనూ బాలికలే ముందంజలో నిలుస్తున్నారు. బాలురును వెనక్కి నెట్టి పరీక్షల ఉత్తీర్ణతలో భళా అనిపించుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాలుర కన్నా బాలికలే విజయ పతాకాన్ని ఎగురవేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకెండియర్, ఎంసెట్... ఈ పరీక్షలన్నింటిలో ఎక్కడా కూడా అబ్బాయిలు... అమ్మాయిలతో పోటీపడ పోయారు. గతంలో బాలికల ఉత్తీర్ణత చాలా తక్కువగా ఉండేది. అయితే కొన్ని సంవత్సరాలుగా బాలికలే ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా పరీక్షల్లో అమ్మాయిలు అబ్బాయిలను వెనకకు నెట్టేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రోత్సాహమే. కొడుకుతో పాటు కూతుర్ని కూడా చదివించాలనే ఆలోచనే ఇందుకు కారణం కూడా. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా మహిళలకు ప్రాధాన్యం ఉండటంతోపాటు, చక్కటి భద్రతతో కూడిన సమాన వేతనాలు ఇవ్వడం, ఎలాంటి వివక్ష లేకుండా పురుషులతో సమానంగా మహిళలకు ప్రాముఖ్యం ఇవ్వడంతో తల్లిదండ్రులు తమ ఆడ బిడ్డలను కూడా గొప్ప స్థానాల్లో చూడాలన్న కోరికతో అమ్మాయిలను చదివించే విషయంలో చొరవ తీసుకుంటున్నారు. ఆడపిల్లలకు సామాజిక భద్రత ఉండాలని, వారి సొంతకాళ్లపై నిలబడేలా చేయాలని తల్లిదండ్రులు ఆలోచన చేయటంతో బాలికలు చదువుల్లో రాణిస్తున్నారు. దీనికి తోడు బాలికలనుద్దేశించి ప్రభుత్వాలు పెడుతున్న పథకాలు కూడా వారి ప్రతిభకు మరింత ఊతం ఇచ్చిట్లవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అమ్మాయిలే విజయఢంకా మోగిస్తున్నారు. తెలంగాణలో బాలికలు బాలురు పదో తరగతి 79.04% 76.11% ఇంటర్ ప్రథమ 61.68% 49.60% ఇంటర్ ద్వితీయ 66.86 శాతం 55.91 శాతం ఎంసెట్ (ఫలితాలు ఇంకా విడుదల కాలేదు) ఆంధ్రప్రదేశ్‌లో.. బాలికలు బాలురు పదో తరగతి 91.71 91.15 శాతం ఇంటర్ ప్రథమ 67శాతం 59 శాతం ఇంటర్ ద్వితీయ 74.80శాతం 69.43 శాతం ఎంసెట్ 82.32 శాతం 74.44 శాతం -
మొదటి స్థానం నిలబెడతా..
బాలాజీచెరువు (కాకినాడ) :నవ్యాంధ్రప్రదేశ్లోనూ పదవ తరగతి ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లాను మొదటిస్థానంలో నిలబెడతానని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహారావు అన్నారు. గత సంవత్సరం పదవ తర గతి ఫలితాల్లో జిల్లా ఉమ్మడిరాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. నరసింహారావు డీఈఓగా బాధ్యతలు స్వీకరించి ఐదు నెలలైన సందర్భంగా ‘సాక్షి’ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ప్రశ్న : జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు ఎంతమంది హాజరౌతున్నారు? జవాబు : జిల్లావ్యాప్తంగా మార్చి 26న జరిగే పరీక్షలకు 69,510 మంది విద్యార్థులు హాజరౌతున్నారు. రెగ్యులర్‌గా 65,648 మంది, ప్రైవేట్‌గా 3,858 మంది హాజరౌతున్నారు. బాలురు 34,908 మంది, బాలికలు 34,592 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రశ్న : పరీక్షలకు ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు? జవాబు : కొత్తగా కలిసిన మండలాలతో కలిపి జిల్లాలో 317 సెంటర్లు ఏర్పాటు చేశాం. ప్రశ్న : గతంలో ప్రతి పాఠశాలనూ ఒక అధికారికి దత్తతనిచ్చారు. ఈ సంవత్సరం? జవాబు : క్రితం సంవత్సరం లాగే ఈ సంవత్సరమూ కలెక్టర్ ఆదేశాల మేరకు అలాగే ప్రతి పాఠశాలకూ ఓ దత్తత అధికారిని నియమించాం. ప్రశ్న : ఈ సంవత్సరం ఫలితాలకు మీ యాక్షన్ ప్లాన్? జవాబు : ఉత్తీర్ణత శాతం పెంచడంతో పాటు ప్రథమ స్ధానంలో నిలపడమే నా లక్ష్యం. ఇప్పటికే మండలస్థాయిలో కమిటీలు నియమించాం. ప్రీ పబ్లిక్ 1, 2 పరీక్ష ఫలితాల ఆధారంగా ఉత్తీర్ణత శాతం గుర్తించి, ఉత్తీర్ణతలో బాగా వెనుకబడిన పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. ప్రశ్న : పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యూయా? జవాబు : ఇప్పటికే ప్రశ్నాపత్రాలు వచ్చారుు. అన్ని పరీక్ష కేంద్రాల్లో బెంచీలతో పాటు తాగునీటి సదుపాయం కల్పించడంతో వెలుతురు బాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మాస్ కాపీయింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. 15 ఫ్లైయింగ్ స్వ్కాడ్లు నియమిస్తున్నాం. గత సంవత్సరం మాస్ కాపీయింగ జరిగిన కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. ప్రశ్న : పదవ తరగతి విద్యార్థులకు మీరిచ్చే సందేశం? జవాబు : పదవ తరగతి విద్యాభ్యాసంలో ఎంతో కీలకమైనది. ఈ తరగతిలో వచ్చిన ఫలితాల్ని బట్టే విద్యార్థి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఎటువంటి ఒత్తిడికి గురవకుండా మెదడును ప్రశాంతంగా ఉంచుకొని పరీక్షలు రాయాలి. కాపీయింగ్‌కు పాల్పడి భవిష్యత్ నాశనం చేసుకోరాదు. పదవ తరగతి పరీక్షలు రాసే ప్రతి విద్యార్థీ ఉత్తీర్ణత సాధించాలన్నదే నా ఆకాంక్ష. -
సత్తెనపల్లి ఆదర్శంగా స్వచ్ఛ గుంటూరు
సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు సిటీ : మహిళల ఆత్మగౌరవ నినాదంతో సత్తెనపల్లిని ఆదర్శంగా తీసుకుని 2015 మార్చి నెలాఖరు నాటికి జిల్లా అంతటా మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛ గుంటూరుగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. బుధవారం ముఖ్యమంత్రి సత్తెనపల్లి, గుంటూరు నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ‘స్వచ్ఛ సత్తెనపల్లి’ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి గుంటూరు చేరుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలతోపాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత సత్తెనపల్లిలోని శరభయ్య హైస్కూల్లో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ రాష్ర్టంలో గుంటూరు జిల్లా టీడీపీకి కంచుకోట అయితే జిల్లాలో సత్తెనపల్లి పార్టీకి కంచుకోటని పేర్కొన్నారు. అందుకే రాష్ర్టంలోనే ఒక చక్కని కార్యక్రమానికి వేదికగా నిలి చిందని ప్రశంసల జల్లు కురిపించారు. శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రతిష్టాత్మకంగా తన నియోజకవర్గాన్ని స్వచ్ఛ సత్తెనపల్లిగా తీర్చిదిద్దుకునే దిశలో అందరికన్నా ముందడుగు వేశారని సీఎం అభినందించారు. 20వేల మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఇటు అధికారులు, అటు ప్రజల్లో కదలిక తెచ్చారని కొనియాడారు. ఇదే స్ఫూర్తిని జిల్లాలోని మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా ఒక సవాల్‌గా స్వీకరించాలన్నారు. అనంతరం అందరితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించా రు. సభకు అధ్యక్షత వహించిన కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ, జిల్లాలోని మొత్తం 57 మండలాల్లో 7.26 లక్షల ఇళ్లకు 4.50 లక్షల ఇళ్లల్లో ఇప్పటికే మరుగుదొడ్లు ఉన్నాయని తెలిపారు. సీఎం ఆదే శం మేరకు మార్చి నెలాఖరులోపు జిల్లాలో శతశాతం మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛగుంటూరుగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. తొలుత హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి చేరుకున్న చంద్రబాబు ఆ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించి పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఇరుకుపాలెం వెళ్లి అక్కడా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటనలో శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, దూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, శ్రావణ్‌కుమార్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్‌బాబు, కొమ్మాలపాటి శ్రీధర్, ఎంపీ రాయపాటి సాంబశివరావు, ప్రభుత్వ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి, జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, పార్టీ నేతలు జేఆర్ పుష్పరాజ్, మన్నవ సుబ్బారావు, నిమ్మకాయల రాజనారాయణ, రాయుడు విశ్వేశ్వరరావు, డీఆర్ఓ కొసన సుబ్బారావు, డీఆర్డీఎ పీడీ ప్రశాంతి, డ్వామా పీడీ ఢిల్లీరావు పాల్గొన్నారు. గ్రామస్తులతో సీఎం మాటా-మంతి సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి, ఇరుకుపాలెంలో గ్రామస్తులతో సీఎం తనదైన శైలిలో మాట్లాడారు. ‘ఏమ్మా మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా? ఏం పెద్దయ్యా మీ ఇంట్లో మరుగు దొడ్డి కట్టించావా? మరుగుదొడ్డి నిర్మించక ముందు బాగుందా? ఇప్పుడు బాగు ందా?’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నలు గుప్పించారు. ‘మనం నాగరిక ప్రపంచంలో ఉన్నాం. ఇంకా బహిరంగ మల విసర్జన ఘోరం. ఇది తెలుగు ఆడబిడ్డల ఆత్మగౌరవ సమస్య. మరుగుదొడ్డి నిర్మాణాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలి’అని పిలుపునిచ్చారు. -
వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో ఏపీదే అగ్రస్థానం
-
ఆ.... ఒక్క క్షణం ఆలోచిస్తే భవిష్యత్ అంతా...
ఆ.... ఒక్క క్షణం ఆలోచిస్తే భవిష్యత్ అంతా బంగారు మయమే... కానీ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారి బతుకులను బుగ్గిపాలు చేస్తున్నాయి. జీవితంపై సరైన అవగాహన లేకపోవడం, చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యల వైపు వెళుతుండడంతో దేశంతో బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇక ఆత్మహత్యల్లో భారత్ అగ్రస్థానంలో ఉండటం ఆందోళన కలిగించే విషయం. ప్రపంచంలో ప్రతీ నలభై సెకన్లకు ఒక ఆత్మహత్య జరుగుతోందని, మూడు ఆత్మహత్యల్లో ఒకటి భారత్ దేశంలో నమోదవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజా నివేదిక వెల్లడించింది. భారతదేశంలో ప్రతీ రెండు నిముషాలకొక ఆత్మహత్య జరుగుతోంది. కేవలం 2012 సంవత్సరంలోనే 2.5 లక్షలమంది ఆత్మహత్యకు పాల్పడినట్టు లెక్కలు తేలాయి. ఆత్మహత్యలు చేసుకునేవారిలో ఎక్కువగా 15 నుంచి 29 ఏళ్ల లోపువారే కావటం విశేషం. ఇక ఆత్మహత్యల విషయానికి వస్తే స్త్రీల కంటే మగవారే ముందు ఉన్నారు. ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందులే ఎక్కువగా ఆత్మహత్యలకు ఎక్కువ కారణాలు అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క క్షణం ఆలోచించి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను వెతుక్కుంటే భవిష్యత్ అంతా బంగారు భవితగానే ఉంటుందన్న విషయం తెలుసుకోవాలి. చట్టప్రకారం ఆత్మహత్యకు పాల్పడటం, ఆత్మహత్యకు యత్నించడం, అందుకు ప్రోత్సహించడం నేరం. భారతీయ శిక్షా స్మృతి విభాగంలో 309 ద్వారా ఆత్మహత్యకు ప్రయత్నించినవారికి ఏడాది సాధారణ శిక్షతో పాటు జరిమానా విధింపబడుతుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే ఏ న్యాయవాది కూడా వాదించబోరు. అంతేగాక బెయిల్ కూడా మంజూరు కాదు. రాజీకూడా కుదుర్చుకోవడానికి అవకాశం లేనిది. *నేడు అంతర్జాతీయ ఆత్మహత్యా నివారణ దినోత్సవం