
పది, పదకొండు, పన్నెండు..ఏదైనా సరే
పది, పదకొండు, పన్నెండు, ఎంసెట్.. అకాడమిక్ పరీక్ష అయినా, ప్రవేశ పరీక్ష అయినా.. సరే అమ్మాయిలే టాప్లో దూసుకెళ్తున్నారు. ఆ పరీక్ష అయినా సరే... టాప్ గేర్లో దూసుకెళుతున్నారు. అన్నీ పరీక్షల్లోనూ బాలికలే ముందంజలో నిలుస్తున్నారు. బాలురును వెనక్కి నెట్టి పరీక్షల ఉత్తీర్ణతలో భళా అనిపించుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాలుర కన్నా బాలికలే విజయ పతాకాన్ని ఎగురవేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకెండియర్, ఎంసెట్... ఈ పరీక్షలన్నింటిలో ఎక్కడా కూడా అబ్బాయిలు... అమ్మాయిలతో పోటీపడ పోయారు.
గతంలో బాలికల ఉత్తీర్ణత చాలా తక్కువగా ఉండేది. అయితే కొన్ని సంవత్సరాలుగా బాలికలే ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా పరీక్షల్లో అమ్మాయిలు అబ్బాయిలను వెనకకు నెట్టేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రోత్సాహమే. కొడుకుతో పాటు కూతుర్ని కూడా చదివించాలనే ఆలోచనే ఇందుకు కారణం కూడా.
గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా మహిళలకు ప్రాధాన్యం ఉండటంతోపాటు, చక్కటి భద్రతతో కూడిన సమాన వేతనాలు ఇవ్వడం, ఎలాంటి వివక్ష లేకుండా పురుషులతో సమానంగా మహిళలకు ప్రాముఖ్యం ఇవ్వడంతో తల్లిదండ్రులు తమ ఆడ బిడ్డలను కూడా గొప్ప స్థానాల్లో చూడాలన్న కోరికతో అమ్మాయిలను చదివించే విషయంలో చొరవ తీసుకుంటున్నారు.
ఆడపిల్లలకు సామాజిక భద్రత ఉండాలని, వారి సొంతకాళ్లపై నిలబడేలా చేయాలని తల్లిదండ్రులు ఆలోచన చేయటంతో బాలికలు చదువుల్లో రాణిస్తున్నారు. దీనికి తోడు బాలికలనుద్దేశించి ప్రభుత్వాలు పెడుతున్న పథకాలు కూడా వారి ప్రతిభకు మరింత ఊతం ఇచ్చిట్లవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అమ్మాయిలే విజయఢంకా మోగిస్తున్నారు.
తెలంగాణలో బాలికలు బాలురు
పదో తరగతి 79.04% 76.11%
ఇంటర్ ప్రథమ 61.68% 49.60%
ఇంటర్ ద్వితీయ 66.86 శాతం 55.91 శాతం
ఎంసెట్ (ఫలితాలు ఇంకా విడుదల కాలేదు)
ఆంధ్రప్రదేశ్లో.. బాలికలు బాలురు
పదో తరగతి 91.71 91.15 శాతం
ఇంటర్ ప్రథమ 67శాతం 59 శాతం
ఇంటర్ ద్వితీయ 74.80శాతం 69.43 శాతం
ఎంసెట్ 82.32 శాతం 74.44 శాతం