న్యూఢిల్లీ: ఎక్కువ మంది పౌరులు తుపాకీ లైసెన్సులు పొందిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. యూపీలో 12.77లక్షల మందికి గన్ లైసెన్సు ఉంది. ఇక వేర్పాటువాదంతో సమస్యాత్మకంగా మారిన జమ్మూ కశ్మీర్‌లో 3.69లక్షల మంది గన్ లైసెన్సు పొందారు. గత ఏడాది డిసెంబర్ 31నాటి గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 33,69,444 మంది గన్ లైసెన్సులు సంపాదించారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
తమ వ్యక్తిగత భద్రతను కారణంగా చూపి యూపీలో ఎక్కువ మంది లైసెన్సులు పొందారు. పంజాబ్‌లో 3,59,349 మంది, మధ్యప్రదేశ్‌లో 2,47,130 మంది, హరియాణాలో 1,41,926 మంది, రాజస్తాన్‌లో 1,33,968 మంది, కర్ణాటకలో 1,13,631 మంది, మహారాష్ట్రలో 84,050 మంది, బిహార్‌లో 82,585 మంది, హిమాచల్‌ప్రదేశ్‌లో 77,069 మంది, ఉత్తరాఖండ్‌లో 64,770 మంది, గుజరాత్‌లో 60,784 మంది, పశ్చిమబెంగాల్‌లో 60,525 మంది, ఢిల్లీలో 38,754 మంది తమిళనాడులో 22,532 మంది, కేరళలో 9,459 మంది గన్ లైసెన్సులు పొందారు. అత్యంత తక్కువగా దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ కేంద్రపాలిత ప్రాంతాల్లో చెరో 125 మంది గన్ లైసెన్సులు సంపాదించారు.