కుటుంబ సభ్యులనే హతమార్చిన డాక్టర్‌ | Doctor Killed Wife And 2 Children Says Difficult To Handle The Family In Gurugram | Sakshi
Sakshi News home page

కుటుంబ నిర్వహణ ​‍కష్టమవడంతో..

Published Mon, Jul 1 2019 6:51 PM | Last Updated on Mon, Jul 1 2019 7:46 PM

Doctor Killed Wife And 2 Children Says Difficult To Handle The Family In Gurugram - Sakshi

గుర్గావ్: కుటుంబ భారాన్ని మోయడం కష్టమౌతోందని ఓ డాక్టర్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి, తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకొంది. స్థానికులు సోమవారం ఉదయం నుంచి కుటుంబ సభ్యులను బయట గుర్తించకపోవడంతో పోలీసులకు సమాచారమివ్వగా,  ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని వారు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారణాసికు చెందిన ప్రకాష్ సింగ్ (55) తన భార్య సోను సింగ్ (50), కుమార్తె అదితి (22), కుమారుడు ఆదిత్య (13) నిద్రిస్తున్నప్పుడు పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చాడు. ఆ తర్వాత తాను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రకాష్ మినహా మిగతా కుటుంబ సభ్యులందరి గొంతును కత్తితో కోసిన గాయాలున్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకొన్న సూసైడ్ నోట్‌లో కుటుంబ నిర్వహణ కష్టమైన కారణంగానే ప్రకాష్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఉంది.

మృతదేహాలను పోస్టుమార్టానికి పంపిన అనంతరం, సూసైడ్‌ నోట్‌ను ‘అతనే రాశాడా? లేక మరెవరైన రాశారా?’ అని కోణంలో విచారణ చేపడుతున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా, హైదరాబాద్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసిన ప్రకాష్‌ గత ఎనిమిదేళ్లుగా గుర్గావ్‌లోనివాసం ఉంటున్నాడు. అతని భార్య గుర్గావ్‌లో సొంత స్కూల్‌ను నడుపుతోంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement