Family Members Killed
-
తండ్రి సహా 12 మందిని చంపేశాడు!
టెహ్రాన్: ఇరాన్లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి, సోదరుడు సహా మొత్తం 12 మంది కుటుంబసభ్యులను పొట్టనబెట్టుకున్నాడు. కెమ్రాన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఇరాన్ మీడియా శనివారం తెలిపింది. 30 ఏళ్ల వ్యక్తి తన తండ్రి, సోదరుడితోపాటు మొత్తం 12 మందిని ఏకే రైఫిల్‌తో కాల్చి చంపాడని, అనంతరం పోలీసులు అతడిని కాల్చి చంపారని తెలిపింది. మారుమూల గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణానికి కుటుంబకలహాలే కారణమని పేర్కొంది. మృతుల్లో చిన్నారులు ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. అయితే, మృతుల వివరాలు, ఘటనకు కారణాలను మాత్రం మీడియా వెల్లడించలేదు. -
నిజామాబాద్: ఒకే ఇంట్లో ఆరుగురు హత్య.. స్నేహితుడే కారణం!
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చారు. అయితే, వీరి హత్యకు ఆస్తి తగదాలే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకారం.. డిచ్పల్లి మండలంలోని మాక్లుర్‌కు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్ళిపోయి స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్‌కు మాక్లుర్‌లో ఓ ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపైన కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్‌పై ప్రసాద్ ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ఎలాగైనా ఆ ఇంటిని ప్రశాంత్ తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. దీంతో, ప్లాన్ ప్రకారం ప్రసాద్‌ను బయటకు తీసుకెళ్ళి నిజామాబాద్–కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్ళి మీ భర్తను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి ఆమెను బయటకు తీసుకెళ్ళాడు. ఆమెను కూడా హతమార్చి బాసర నదిలో వదిలేశాడు. ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హత్య చేశాడు. అనంతరం.. ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో, ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేసినట్లు సమాచారం. అయితే, మాక్లుర్‌కు చెందిన నిందితుడు ప్రశాంత్ వయసు 20 ఏళ్లు. మొదటి మూడు హత్యలు ఒక్కడే చేశాడని.. మిగిలిన మూడు హత్యల్లో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య కాబడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఎక్కడా కూడా మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. కాగా, నమ్మిన స్నేహితుడే ఇలా వారిని హత్య చేయడంతో స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనలో నిందితులకు తగిన శిక్ష విధించాలని కోరుతున్నారు. మరోవైపు.. వీరి హత్యలకు సంబంధించి పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నట్లు సమాచారం. -
నూతన దంపతులు సహా అయిదుగురిని చంపి..
మెయిన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నూతన దంపతులతోపాటు మరో ఇద్దరు కుటుంబసభ్యులను, ఓ స్నేహితుడిని ఓ వ్యక్తి గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోను యాదవ్(22), సోని(20)లకు శుక్రవారమే వివాహమైంది. రాత్రి బారాత్ వేడుక జరిగింది. అనంతరం అందరూ నిద్రిస్తుండగా సోను సోదరుడు శివ్ వీర్ యాదవ్(28) గొడ్డలితో నూతన దంపతులతోపాటు మరో సోదరుడు, బావ మరిది సౌరభ్, స్నేహితుడిని చంపేశాడు. తన భార్య, అత్తపైకి తుపాకీతో కాల్పులు జరపగా వారు గాయపడ్డారు. అనంతరం నిందితుడు శివ్ వీర్యాదవ్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘాతుకానికి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. -
విధిరాత అంటే ఇదేనేమో.. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
ముందువెళ్తున్న బస్సుడ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం.. వెనుక వస్తున్న కారు బస్సును ఢీకొనడం.. ఆ వెంటనే వాటిపైకి లారీ దూసుకురావడం.. క్షణాల్లో ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం.. అచ్చం సినిమాను తలపిస్తున్న ఈ ఘటన మంగళవారం తిరుచ్చి– చెన్నై హైవేపై చోటు చేసుకుంది. ఈఘటన విధిరాతను విధాత అయినా తప్పించలేడనే సామెతను అక్షరాల నిజం చేసిందని కొందరు ఆవేదన వ్యక్తం చేయగా.. దయలేని దేవుడు నా అనే వారే లేకుండా ఓ కుటుంబాన్ని చిదిమేశాడంటూ మరికొందరు వాపోయారు. ఇరుగుపొరుగు వారే అంతిమ సంస్కారాలు చేయాలేమో అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సాక్షి, చెన్నై: దైవ దర్శనానికి వెళ్లొస్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ హృదయ విదారక ఘటనలో ఒకే కుటుంబంలోని మొత్తం అయిదుగురూ మరణించడం చూపరులను కంటతడి పెట్టించింది. వివరాలు..చెన్నై శివారులోని కాంచీపురం జిల్లా నంగనల్లూరుకు చెందిన విజయ వీర రాఘవన్(41) ఐటీ ఉద్యోగి. ఆయనకు భార్య వత్సల (37), కుమారులు విష్ణు(12), అదిర్థ్(8) ఉన్నారు. భార్య పిల్లలు, తల్లి వసంతలక్షి్మ (58)తో కలిసి కారులో నూతన సంవత్సరం సందర్భంగా కేరళలోని ఆలయాల సందర్శనకు రెండు రోజుల క్రితం వెళ్లారు. కారును విజయ వీర రాఘవన్ నడిపాడు. దైవ దర్శనాన్ని ముగించుకుని సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. వరుసగా వాహనాల ఢీ.. తిరుచ్చి – చెన్నై హైవేలోని కడలూరు జిల్లా వేపూరు అయ్యనార్ పాళయం వద్దకు మంగళవారం వేకువ జామున 2.45 గంటలకు ఘోరం జరిగింది. ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలను సరీ్వసు రోడ్డుకు అధికారులు మరల్చా రు. అక్కడ ముందు వెళ్తున్న ప్రైవేటు ఆమ్నీ బస్సు డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారును విజయ వీరరాఘవన్ ఒక్కసారిగా ఆపే ప్రయ త్నం చేశాడు. అప్పటికే వెనుక వస్తున్న లారీలు ఒక దానికి మరొకటి కారును వేగంగా ఢీకొట్టాయి. దీంతో లారీ – బస్సు మధ్య చిక్కుకున్న కారు నామరూపాల్లేకుండా పోయింది. అందులో ఉన్న వారందరూ ఘటనా స్థలంలోనే శరీరాలు ఛిద్రమై విగత జీవులయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు అతికష్టం మీద కారులో నుంచి మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. కుటుంబం అంతా ఈ ప్రమాదంలో మరణించడంతో నంగనల్లూరులోని ఇరుగు పొరుగువారు విల్లుపురం ముండియంబాక్కం ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. కాగా విచారణలో వీర రాఘవన్ సోదరి వసుధారాణి మదురైలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు సమాచారం అందించారు. ఆమె వచ్చాక అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు. -
కుటుంబలోని ఐదుగురిని హత్య చేసి తానూ..
సాక్షి, చెన్నై: తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. కుటుంబంలోని ఐదుగురిని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఓరంతాడి గ్రామంలోని పళని అనే రైతు కొద్ది రోజులుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కొద్ది రోజుల క్రితం తన భార్య వల్లి అనారోగ్యంతో చనిపోవడంతో మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన బిడ్డలను దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. మృతుల్లో త్రిష(15), మోనిషా (14), శివశక్తి (6), ధనుష్(4), భూమిక(9 నెలలు)గా గుర్తించారు. స్థానికులు గమనించి వారిని హుటాహుటిన తిరువణ్ణామలై జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం నిందితుడు పళని తన పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: అమ్మానాన్నకు ఏమైంది అన్నయ్య? -
ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి దుర్మరణం
లక్నో: అర్ధరాత్రి చెలరేగిన భారీ అగ్నిప్రమాదంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ మోరాదాబాద్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. మూడంతస్తుల బిల్డింగ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు నివసిస్తున్నారు. అందులో ఒకరికి ఫంక్షన్ హాల్ ఉంది. ఆ సామాన్లను బిల్డింగ్ కింది ఫ్లోర్లో ఉంచాడతను. అయితే గురువారం అర్ధరాత్రి దాటాక షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి.. ఆ సామాన్లు తగలబడ్డాయి. క్రమంగా మూడంతస్తుల బిల్డింగ్‌లో మంటలు చెలరేగి.. ఎగిసిపడ్డాయి. స్థానికులు అతికష్టం మీద ఏడుగురిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఐదు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటల్లోంచి మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. వీళ్లలో ఐదుగురు గాయాలతో కన్నుమూశారు. మిగతా ఏడుగురిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా కలెక్టర్ శైలేందర్ కుమార్ సింగ్ వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు ఆయన తెలిపారు. #UPDATE | UP: Five people lost their lives while seven were injured after fire broke out in a 3-storey building in Moradabad. People of the same family were residing in the building. Fire dept conducting further probe to ascertain the reason: Shailendra Kumar Singh, DM, Moradabad https://t.co/dHNUTt8IyD pic.twitter.com/K32BLObSm9 — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 25, 2022 -
ఒకే ఇంట్లో ఆరుగురు మృతి.. ఏం జరిగింది?
ఒకే ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యులు మృతిచెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జమ్మూలోని సిధ్రా ప్రాంతంలో బుధవారం ఉదయం ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరు మంది మృతిచెందడాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం, వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతులను సకీనా బేగమ్, ఆమె ఇద్దరు కూతుళ్లు రుబీనా బనో, నసీమా అక్తర్, కుమారుడు జాఫర్ సలీం, మరో ఇద్దరు బంధువులు నూర్ ఉల్ హబీబ్, సాజిద్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. అయితే, వీరు ఎలా చనిపోయారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని అన్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ఉగ్రవాదులు సోఫియాన్ జిల్లాలో కశ్మీర్ పండిట్లపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో ఓ కశ్మీర్ పండిట్ చనిపోగా, అతని సోదరుడు గాయపడ్డాడు. మృతున్ని సునీల్ కుమార్ భట్‌గా గుర్తించారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 6 members of family found dead at home in Jammu https://t.co/QIgJKdeD3A — Hindustan Times (@HindustanTimes) August 17, 2022 ఇది కూడా చదవండి: రోడ్డు లేక డోలీలో ఆస్పత్రికి బాలింత.. కవలలు కన్నుమూత! -
నిద్రలో ఉండగానే కమ్ముకున్న మంటలు.. ఏడుగురు సజీవదహనం
చండీగఢ్: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. లుథియానాలోని తాజ్పూర్ రోడ్డు సమీపంలోని ఓ గుడిసెలో చెలరేగిన మంటల్లో చిక్కుకొని ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులంతా గుడిసెలో నిద్ర పోతున్న సమయంలో ఇంటికి మంటలు అంటుకుంటున్నాయి. మంటల్లో దంపతులతోపాటు అయిదుగురు చిన్నారులు (నలుగురు అమ్మాయిలు, రెండేళ్ల బాలుడు) సజీవ దహనమైయ్యారు. అదే కుటుంబానికి చెందిన రాజేష్(17) అనే యువకుడు వేరే చోట నిద్రిస్తుండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులను సురేష్ షని(55) రానా దేవి(50), రాఖీ కుమారి(15), మనీషా కుమారి(10), చందా కుమారి(8), గీతా కుమారి(6), సన్నీ(2)గా గుర్తించారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంతా ఉపాధి కోసం లుథియానాకు వలస వచ్చిన కార్మికులని లుధియానా ఏసీపీ సురీందర్ సింగ్ తెలిపారు. టిబ్బా రోడ్‌లోని మునిసిపల్ చెత్త డంప్ యార్డ్‌కు సమీపంలో ఉన్న తమ గుడిసెలో నిద్రిస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: కొట్టి.. పాదాలు నాకించి.. దళిత విద్యార్థికి తీవ్ర అవమానం -
కిల్లర్ కోడలు
-
కుటుంబ సభ్యులనే హతమార్చిన డాక్టర్
గుర్గావ్: కుటుంబ భారాన్ని మోయడం కష్టమౌతోందని ఓ డాక్టర్ తన భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి, తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకొంది. స్థానికులు సోమవారం ఉదయం నుంచి కుటుంబ సభ్యులను బయట గుర్తించకపోవడంతో పోలీసులకు సమాచారమివ్వగా, ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని వారు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారణాసికు చెందిన ప్రకాష్ సింగ్ (55) తన భార్య సోను సింగ్ (50), కుమార్తె అదితి (22), కుమారుడు ఆదిత్య (13) నిద్రిస్తున్నప్పుడు పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చాడు. ఆ తర్వాత తాను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రకాష్ మినహా మిగతా కుటుంబ సభ్యులందరి గొంతును కత్తితో కోసిన గాయాలున్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకొన్న సూసైడ్ నోట్లో కుటుంబ నిర్వహణ కష్టమైన కారణంగానే ప్రకాష్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఉంది. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపిన అనంతరం, సూసైడ్ నోట్‌ను ‘అతనే రాశాడా? లేక మరెవరైన రాశారా?’ అని కోణంలో విచారణ చేపడుతున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా, హైదరాబాద్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసిన ప్రకాష్ గత ఎనిమిదేళ్లుగా గుర్గావ్‌లోనివాసం ఉంటున్నాడు. అతని భార్య గుర్గావ్లో సొంత స్కూల్‌ను నడుపుతోంది. -
కుటుంబ సభ్యులే హంతకులు
సాక్షి, ధర్మసాగర్: జూన్ 23న ధర్మసాగర్ మండల కేంద్రంలో వ్యవసాయబావిలో వెలుగు చూసిన మృతుడి హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితులను ఆదివారం రిమాండ్‌కు తరలించారు. ధర్మసాగర్ మండల కేంద్రానికి ఉపాధి కోసం వచ్చిన సాంబయ్యను కుటుంబసభ్యులు మరో వ్యక్తి సాయంతో హత్య చేసి బావిలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. ధర్మసాగర్ సీఐ శ్రీలక్ష్మి కథనం ప్రకారం... ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన కొట్టె విజయ్ భాస్కర్ అతడి వ్యవసాయ బావిలో మృతదేహం ఉందనే సమాచారం మేరకు సదరు మృతదేహాన్ని వెలికి తీసి మృతుడు ధర్మసాగర్ మండల కేంద్రానికి బతుకుదెరువు కోసం వలసవచ్చిన అంబాల శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన సాంబయ్యగా గుర్తించారు. అనంతరం హత్య కేసులో అనుమానితులు గా మృతుడి భార్య సారమ్మ, బావమరుదులు రమేష్, రాజు, కొడుకు భరత్ పక్కింటి వ్యక్తి మహేష్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో మృతుడు తాగి వచ్చి నిత్యం వేధించటం, తరుచు దొంగతనాలకు పాల్పడుతుండటం, కుటుంసభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయటంతో అతడి చేష్టలను భరించలేక తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. జూన్ 17న సాంబయ్య కు తమ ఇంట్లోనే మద్యం తాగించిన అనంతరం మహేష్ తలపై గొడ్డలితో బలంగా నరకటం, భార్య సారమ్మ రోకలిబండతో బాదటంతోపాటు, భరత్, రమేష్, రాజులు అతడిని ఛాతిపై విచక్షణ రహితంగా పొడటంతో అక్కడిక్కడే మృతి చెందా డని తెలిపారు. అనంతరం వీరంతా కలిసి మృతదేహాన్ని టార్పాలిన్ కవర్లో చుట్టి వైర్లతో ప్యాక్ చేసి మహేష్‌కు చెందిన ట్రాలీ ఆటోలో తీసుకెళ్లి గ్రామసమీంలో ఉన్న వ్యవసాయబావిలో పొడవాటి బండరాళ్లతో కట్టి పడేసారు. కాగా నిందితులు నేరాన్ని అంగీకరించటంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కార్యక్రమంలో ధర్మసాగర్ ఎస్సై విజయ్‌రాంకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
జీవితంపై విరక్తి చెంది..దారుణం
-
భార్య, కొడుకులు, కుమార్తెలు కలసి చంపేశారు