చండీగఢ్: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. లుథియానాలోని తాజ్‌పూర్ రోడ్డు సమీపంలోని ఓ గుడిసెలో చెలరేగిన మంటల్లో చిక్కుకొని ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులంతా గుడిసెలో నిద్ర పోతున్న సమయంలో ఇంటికి మంటలు అంటుకుంటున్నాయి.
మంటల్లో దంపతులతోపాటు అయిదుగురు చిన్నారులు (నలుగురు అమ్మాయిలు, రెండేళ్ల బాలుడు) సజీవ దహనమైయ్యారు. అదే కుటుంబానికి చెందిన రాజేష్(17) అనే యువకుడు వేరే చోట నిద్రిస్తుండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులను సురేష్ షని(55) రానా దేవి(50), రాఖీ కుమారి(15), మనీషా కుమారి(10), చందా కుమారి(8), గీతా కుమారి(6), సన్నీ(2)గా గుర్తించారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాధితులంతా ఉపాధి కోసం లుథియానాకు వలస వచ్చిన కార్మికులని లుధియానా ఏసీపీ సురీందర్ సింగ్ తెలిపారు. టిబ్బా రోడ్‌లోని మునిసిపల్ చెత్త డంప్ యార్డ్‌కు సమీపంలో ఉన్న తమ గుడిసెలో నిద్రిస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: కొట్టి.. పాదాలు నాకించి.. దళిత విద్యార్థికి తీవ్ర అవమానం
Comments
Please login to add a commentAdd a comment