Burn alive
-
ఆధారాలు లేకుండా చేయడానికే ఇంటికి నిప్పు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఆధారాలు దొరకకుండా హత్య చేసేందుకే మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్(గుడిపల్లి) ఇంటికి నిప్పు పెట్టి ఆరుగురిని బలిగొన్నారని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు పేర్కొన్నారు. ఆరుగురు సజీవ దహనం కేసు వివరాలను మంగళవారం డీసీపీ అఖిల్ మహాజన్.. ఏసీ ఎడ్ల మహేశ్, సీఐ ప్రమోద్‌తో కలసి వెల్లడించారు. ఈ ఘటనలో ఐదు గురిపై హత్య, కుట్ర, ఒకరిపై అదనంగా అట్రాసిటీ కేసు పెట్టామన్నారు. బాధితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంకింద పరిహారం అందేలా చూస్తా మని తెలిపారు. మూడురోజులు 16 బృందాలు ద ర్యాప్తు చేసి క్షుణ్ణంగా పరిశీలించాయన్నారు. ఏ1గా మేడి లక్ష్మణ్, ఏ2 శనిగరపు సృజన, ఏ3 శ్రీరాముల రమేశ్, ఏ4గా వేల్పుల సమ్మయ్య, ఏ5గా ఆర్నకొండ అంజయ్య ఉన్నారని తెలిపారు. ఏళ్లుగా దంపతుల మధ్య గొడవలు.. మందమర్రి మండలం వెంకటాపూర్ పరిధి గుడిపల్లికి చెందిన మాసు శివయ్య(48) రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ(42) దంపతులు. శ్రీరాంపూర్‌కు చెందిన సింగరేణి మైనింగ్ సర్దార్ శనిగరపు శాంతయ్య(57) భార్య సృజనతో గొడవల కారణంగా శివయ్య–రాజ్యలక్ష్మితో ఉంటున్నాడు. ఇరువురు పంచాయతీలు, కేసులు పెట్టుకున్నారు. మెయింటెనెన్సు, జీతభత్యం వేరెవరికీ ఇవ్వకుండా కేసులు ఉన్నాయి. అయినా జీతం డబ్బులు, ఆస్తులు రాజ్యలక్ష్మికే ఇస్తున్నాడని భావించిన శాంతయ్య భార్య సృజన.. భర్తను హత్య చేయాలనుకుంది. తండ్రితో కలసి తనకు సన్నిహితుడైన లక్షెట్టిపేటవాసి మేడి లక్ష్మణ్(42)సాయం కోరింది. దీనికోసం 3 గుంటల భూమి రాసిస్తానని చెప్పింది. అలాగే, రెండు దఫాల్లో రూ.4 లక్షలు ఇచ్చింది. రంగంలోకి దిగిన లక్ష్మణ్.. శాంతయ్యను చంపేందుకు రూ.4లక్షలు ఇస్తానంటూ లక్షెట్టిపేటవాసి శ్రీరాముల రమేశ్ (36) సాయం కోరాడు. రోడ్డు ప్రమాదం చేసేందుకు రూ.1.40 లక్షలతో పాత బొలెరోను కొన్నా రు. నెల క్రితం మంచిర్యాల నుంచి శాంతయ్య, రాజ్యలక్ష్మి వెళ్తున్న ఆటోను బొలెరోతో ఢీకొట్టి చంపుదామనుకుని విఫలమయ్యారు. ఇలా రెండుసార్లు విఫలం కావడంతో ఈనెల 16న ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న లక్ష్మణ్, రమేశ్ మంచిర్యాలకు బస్సులో వెళ్లారు. శివయ్య, రాజ్యలక్ష్మి, శాంతయ్య ముగ్గురే ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు రమేశ్, సమ్మయ్య ఇంటిపై పెట్రోల్ చల్లి నిప్పుపెట్టారు. నిద్రిస్తున్న వారిలో రాజ్యలక్ష్మి అక్క కూతురు మౌనిక(24), కూతుళ్లు ప్రశాంతి(3), హిమబిందు (13నెలలు) ఉన్నట్లు వాళ్లు గుర్తించలేకపోయారు. దీంతో ఒకరి కోసం ప్లాన్ వేస్తే ఆరుగురు అగ్నికి ఆహుతయ్యారు. నిందితులను మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడంతో వివరాలు బయటపడ్డాయి. నిందితుల్ని బుధవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. -
కక్ష భార్యది.. పథకం అతడిది
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తన భర్త వేరొకరితో సహజీవనం చేస్తూ తమను పట్టించుకోవడం లేదని కక్షగట్టిన భార్య.. తన భర్తతో పాటు మరో ఐదుగురు మంటల్లో బూడిద అయ్యేలా చేసింది. ఈ నెల 17న మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ ఎమ్మెల్యే కాలనీలో ఓ ఇంటికి నిప్పు పెట్టడంతో ఆరుగురు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలు, కాల్‌డేటాలు సేకరిస్తున్నారు. రెండు క్యాన్లలో పెట్రోల్ కొని.. నిందితులు పెట్రోల్ కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 16న రాత్రి 9.53 గంటలకు నస్పూర్‌లోని షీర్కేకు వెళ్లే దారిలో ఉన్న ఓ బంకు నుంచి పెట్రోల్ తీసుకెళ్లారు. ఆటోలో రెండు క్యాన్లలో పెట్రోల్, తర్వాత ఆటోలోనూ డిజిల్ పోయించుకుని వెళ్లారు. ఆ సమయంలో డ్రైవర్‌తో పాటు లోపల మరొకరు కూర్చున్నారు. అతనే బంకు సిబ్బందికి రూ.5 వేల వరకు ఇచ్చాడు. రెండు క్యాన్లలో 40 లీటర్ల వరకు కొనుగోలు చేశారు. పక్కా పథకం ప్రకారమే పెట్రోల్ తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. లక్షల మొత్తం ఆశ చూపి..: మృతుడు శాంతయ్య భార్య సృజనకు దగ్గరి వ్యక్తిగా ఉన్న లక్సెట్టిపేట వాసి, కాంగ్రెస్ కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓటమిపాలైన రియల్ వ్యాపారి అన్నీ తానై వ్యవహరించాడు. ఇతనికి పట్టణంలోనే డ్రైవర్‌గా పని చేసే ఓ యువకుడు, గతేడాది జూన్ 2న లక్సెట్టిపేటలో ఓ మహిళ తన భర్తను చంపించిన కేసులో నిందితుడొకరు, వెంకటాపూర్ పరిధిలోని గుడిపెల్లి వ్యక్తి వీరికి సహకరించారు. సృజన సోదరుడైన గోదావరిఖనికి చెందిన కానిస్టేబుల్ పాత్రపైనా విచారణ జరుగుతోంది. ఈ దారుణం చేసేందుకు నిందితులకు లక్షల్లో డబ్బు ఆశ చూపారు. ఆ ఖర్చు సృజన భరించింది. ఆరోజు ఏం జరిగింది.. ఘటన జరిగిన రోజు 9గంటల ప్రాంతంలో సీసీసీలో ఉండే ఆటోడ్రైవర్‌కు ఫోన్ చేసి కిరాయి ఉంది రావాలని, రూ.వెయ్యి ఇస్తామని అడిగారు. అందుకు తాను అన్నం తిని వస్తానని చెప్పాడు. ఆలస్యమవుతోందనడంతో తన ఇంటి పక్కనే ఉన్న మరో ఆటో డ్రైవర్‌ను పంపాడు. బంకుకు వెళ్లి పెట్రోల్ తీసుకుని ఇద్దరు చెప్పినట్లుగా వెంకటాపూర్ వైపు తీసుకెళ్లాడు. ఘటన స్థలానికి కొద్ది దూరంలోనే ఆటో నిలిపి..‘మాకు గొడవలు జరుగుతున్నాయి. ఇంకొకరు రావాల్సి ఉంది. నీవు వెళ్లు..’ అని అతడిని పంపించారు. తర్వాత అక్కడ గుడిపెల్లికి చెందిన మరొకరి సాయంతో శివయ్య ఇంటివైపు వెళ్లారు. స్థానికుడి సాయంతో పెట్రోల్‌ను ఇంటిపైన, చుట్టూ చల్లి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. మరిన్ని ఆధారాల కోసం.. ఆదివారం రాత్రి వరకు ఏడుగురిని కాసిపేట పోలీసుస్టేషన్లో ఉంచారు. శాంతయ్య భార్య, కూతురు, ఆటోడ్రైవర్, రియల్ వ్యాపారి, మరో ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నా రు. నిందితులు చెబుతున్న ప్రకారం పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసేందుకు సిద్ఢమవుతున్నారు. వివరాలు బయటకు వెల్లడించడం లేదు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. మొదట అనుమానాస్పద మృతి కేసు న మోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ, ఫోన్ కాల్‌డేటా, నిందితుల చెప్పిన వివరాలు, ఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలతో హత్యానేరంగా సెక్షన్లు చేర్చి ముందుకు సాగుతున్నారు. కేసు విచారణ వేగంగా కొనసాగుతోందని, అన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. భార్యాభర్తల మధ్య డబ్బు గొడవలు! లక్సెట్టిపేట మండలం ఊత్కూరులో శాంతయ్య తండ్రికి వారసత్వంగా వచ్చిన 1.15ఎకరాల భూమి వివాదం ఉంది. ఈ భూమిని కొందరు వెంచరు వేయగా ఇరువర్గాల్లో భూ హక్కులపై తగాదా ఉంది. ఇటీవల ఈ కేసులో రాజీ కుదరడంతో రూ.90 లక్షలు వచ్చాయి. ఇందులో ఐదు వాటాలు వేస్తే శాంతయ్య వాటాగా రూ.12 లక్షలు వచ్చాయి. అప్పటినుంచి శాంతయ్య, సృజన మధ్య గొడవలు తారస్థాయికి చేరాయని, ఈ కక్షలే చంపేవరకు తీసుకెళ్లాయని తెలుస్తోంది. శాంతయ్యకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. ఆర్కే5లో మైనింగ్ సర్దార్‌గా పని చేస్తున్న ఆయనకు మరో ఏడేళ్ల సర్వీసు ఉంది. ఈలోపే దారుణం జరిగింది. -
హృదయ విదారకం; నాన్నను చూడాలంటూనే.. మృత్యువొడికి
వడమాలపేట: భార్యపై కోపంలో కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటనలో చికిత్స పొందుతూ కోలుకోలేక బాలుడు మృత్యువొడి చేరాడు. వివరాలివీ.. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం బట్టీకండ్రిగ ఆది ఆంధ్ర వాడకు చెందిన రమేష్‌కు భార్య ఐశ్వర్యతో గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తరచూ గొడవ పడటం, విషయం పోలీసుస్టేషన్‌కు వెళ్లడం జరుగుతోంది. అయితే గత సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకోగా ఐశ్వర్య అదే గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులోని రమేష్.. ఆ కోపాన్ని కుమారుడు మహేష్(7)పై చూపుతూ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రెండు రోజులుగా తిరుపతి రుయాలోని చిన్న పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి బుధవారం రాత్రి కన్నుమూశాడు. కన్న తండ్రే ఇంతటి ఘాతుకానికి పాల్పడినా.. ఆసుపత్రిలో చివరి శ్వాస వరకు నాన్నను చూడాలని కోరడం, ఆ కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచిన తీరు హృదయ విదారకం. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. అనుమానం పెనుభూతమై ఆ కుటుంబంలో రగిల్చిన చిచ్చు ఆ ప్రేమకు ప్రతిరూపమైన చిన్నారినే బలితీసుకోవడం శోచనీయం. -
నిద్రలో ఉండగానే కమ్ముకున్న మంటలు.. ఏడుగురు సజీవదహనం
చండీగఢ్: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. లుథియానాలోని తాజ్పూర్ రోడ్డు సమీపంలోని ఓ గుడిసెలో చెలరేగిన మంటల్లో చిక్కుకొని ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులంతా గుడిసెలో నిద్ర పోతున్న సమయంలో ఇంటికి మంటలు అంటుకుంటున్నాయి. మంటల్లో దంపతులతోపాటు అయిదుగురు చిన్నారులు (నలుగురు అమ్మాయిలు, రెండేళ్ల బాలుడు) సజీవ దహనమైయ్యారు. అదే కుటుంబానికి చెందిన రాజేష్(17) అనే యువకుడు వేరే చోట నిద్రిస్తుండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులను సురేష్ షని(55) రానా దేవి(50), రాఖీ కుమారి(15), మనీషా కుమారి(10), చందా కుమారి(8), గీతా కుమారి(6), సన్నీ(2)గా గుర్తించారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంతా ఉపాధి కోసం లుథియానాకు వలస వచ్చిన కార్మికులని లుధియానా ఏసీపీ సురీందర్ సింగ్ తెలిపారు. టిబ్బా రోడ్‌లోని మునిసిపల్ చెత్త డంప్ యార్డ్‌కు సమీపంలో ఉన్న తమ గుడిసెలో నిద్రిస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: కొట్టి.. పాదాలు నాకించి.. దళిత విద్యార్థికి తీవ్ర అవమానం -
ఘోరం ప్రమాదం: చూస్తుండగానే 50 మంది సజీవ దహనం
పోర్ట్–ఔ–ప్రిన్స్: తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్న హైతీలో పెను విషాదం చోటుచేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 53 మంది సజీవ దహనమయ్యారు. 100 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాప్–హైతియన్ నగరంలో సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగిందని నగర డిప్యూటీ మేయర్ పాట్రిక్ అల్మోనార్ చెప్పారని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. సంఘటనస్థలం నుంచి మంటలు చుట్టుపక్కలున్న మరో 20 గృహాలకు వ్యాపించడంతో అందులోని వారూ సజీవ దహనమయ్యారు. ట్యాంకర్ నుంచి లీకవుతున్న పెట్రోల్‌ను పట్టుకునేందుకు జనం బకెట్లతో ఎగబడినపుడు మంటలు అంటుకుని ట్యాంకర్ పేలిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!! -
బీమా డబ్బుల కోసం భర్తనే...
చెన్నై: బీమా డబ్బుల కోసం భర్తనే సజీవ దహణం చేసింది ఓ భార్య. ఈ దారుణం తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. తుడుపతి నివాసి కె. రంగరాజు ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడడంతో వైద్యం కోసం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. చికిత్స అనంతరం రంగరాజ్ తన భార్య, బంధువు రాజాతో కలిసి తుడుపతికి తిరుగు ప్రయాణమయ్యాడు. రాజా, జోతిమణిలు మార్గం మధ్యలో నిర్మానుషమైన ప్రదేశంలో కారుని ఆపారు. వాహనం నుంచి దిగి, రంగరాజన్‌ను కారులో నుంచి బయట రాకుండా లాక్ చేశారు. అనంతరం కారుపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున, నిందితుడు రంగరాజన్ మరణం గురించి తిరుపూర్ పోలీసులకు ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగనట్లు సమాచారం ఇచ్చాడు. అయితే, అతని మాటల్లో పోలీసులకు అనుమానం రావడంతో దర్యాప్తును రాజా వైపు నుంచి మొదలుపెట్టారు. దీంతో అసలు బండారం మొత్తం బయట పడిందని పోలీసులు తెలిపారు. రంగరాజ్ వివిధ కారణాల కింద సుమారు 1.5 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. తరచూ అప్పు ఇచ్చిన వాళ్లు జోతిమణిని ఇబ్బంది పెట్టావారు. అయితే రంగరాజ్ పేరు మీద రూ.3.5 కోట్ల విలువైన మూడు బీమా పాలసీలు ఉన్నాయి. అందులో జోతిమణిని నామినీగా ఉంది. ఈ క్రమంలో తన భర్త చనిపోతే తనకి అప్పుల బాధ ఉండదని అలాగే బీమా డబ్బులు కూడా వస్తాయని ఆలోచనతో తన సమీప బంధువు రాజాతో జోతిమణి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో నిజాలను బయట పడ్డాయి. ( చదవండి: పెళ్లయిన 43వ రోజు భార్య గొంతు కోసి దారుణ హత్య ) -
ఇద్దరు చిన్నారులు సజీవ దహనం
-
మొక్కజొన్న మంటల్లో 6గురు చిన్నారుల సజీవ దహనం
పాట్నా: సరదాగా మొక్కజొన్నలు కాల్చుకుంటుండగా ఆ నిప్పు కాస్త పూరి గుడిసెపై పడి ఏకంగా ఆరుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకుపోయారు. చివరకు ఆ మంటల్లోనే సజీవ దహనమయ్యారు. ఈ ఘోర సంఘటన బిహార్‌లో జరిగింది. అరారియా జిల్లా కబయా గ్రామంలో మంగళవారం చిన్నారులు మొక్కజొన్న కంకులు నిప్పులపై కాల్చుకుంటున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఆ మంటలు వెళ్లి పూరి గుడిసెపై పడ్డాయి. గడ్డితో చేసిన గుడిసెలు కావడంతో వెంటనే మంటలు దావనంలా వ్యాపించాయి. మంటల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. దీంతో ఆ చిన్నారులు మంటల్లో చిక్కుకున్నారు. వారి హాహాకారాలు విన్న కుటుంబసభ్యులు, స్థానికులు మంటలు ఆర్పేందుకు విఫల ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆ చిన్నారులు మంటల్లో సజీవ దహనమయ్యారు. సరదాగా మొక్కజొన్నలు తినాల్సిన చిన్నారులు బొగ్గుల్లా మారిపోయారు. ఆ చిన్నారుల వయసు 3 నుంచి 6 ఏళ్లలోపే. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేస్తోంది. అయితే అంతకుముందు రోజే బిహార్‌లో కాముడి దహనం చేస్తుండగా ఆ మంటల్లో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల వివరాలు గుల్నాజ్ (3) బర్కాస్ (4) అశ్రఫ్ (5) అలీ హసన్ (5) ఖుశ్ నిహార్ (5) దిల్వార్ (6) చదవండి: ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య చదవండి: ముగ్గురి గ్యాంగ్ రూ.3 కోట్ల మోసం -
భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు
సాక్షి, దామెర వరంగల్ : మద్యానికి బానిసై తరచూ వేధింపుపులకు గురి చేస్తున్న భర్తను ఎలాగైనా వదిలించుకోవాలనే భావనతో పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన నేరంపై మహిళకు జీవిత కారాగారశిక్ష విధించారు. ఈ మేరకు శుక్రవారం వరంగల్ మూడో అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.శైలజ సంచలన తీర్పు వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముగంటి బాలకిషన్ కథనం ప్రకారం కేసు, తీర్పు వివరాలిలా ఉన్నాయి బెల్ట్‌షాపు నడుపుతూ మద్యానికి బానిసై... వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ల్యాదెల్ల గ్రామానికి చెందిన ఎరుబాటి మల్హల్రావు, లలితకు 2002లో వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితంతో ఆకాష్, నక్షత్ర జన్మించారు. ఓ పక్క వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూనే బెల్టు షాపు నిర్వహిస్తూ జీవనం కొనసాగించే మల్హల్ రావు మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో మల్హల్రావు మద్యానికి బానిపై భార్యను తరచూ వేధించేవాడు. ఈక్రమంలో పలుమార్లు పంచాయతీ నిర్వహించినా మార్పు రాలేదు. 2015 జూలై 6న రాత్రి భార్యాభర్తలు గొడవపడుతుండగా.. ఎప్పుడూ జరిగేదనే భావనతో మల్హల్రావు తండ్రి మోతయ్య రైస్‌మిల్లులో పనికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి వెనుక వూపు వెళ్లి చూడగా ఆయన కుమారుడు కాలిపోయి పడి ఉన్నాడు. అయితే, తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ఇది ముమ్మాటికీ హత్యేనని చెబుతూ మోతయ్య ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నేరం అంగీకారం.. ఆత్మకూరు పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో మల్హల్రావు భార్య లలిత పోలీసులకు లొంగిపోయింది. తరచూ తాగిన మైకంలో తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తుండడంతో భర్తను చంపాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. 2015 జూలై 6న రాత్రి 7 గంటలకు గొడవ పడి బయటకు వెళ్లిన హల్‌హల్‌రావు తిరిగి ఇంటికి రాలేదు. అయితే, అర్ధరాత్రి 12 గంటలకు లలిత బయటకు రాగా.. తాగిన మైకంలో ఇంటి వెనుక పడి ఉన్న భర్త కనిపించాడు. ఈ మేరకు ఇంట్లోని పెట్రోల్ తీసుకొచ్చి ఆయనపై పోసి నిప్పంటించి సజీవంగా కాల్చి చంపింది. అయితే, తాగిన మైకంలో స్పృహ లేకుండా ఉండడంతో మల్హల్రావు ఎలాంటి కేకలు, అరుపులు చేయకుండా మంటల్లో కాలిపోయాడు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. లలితపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు శిక్ష విధిస్తూ జడ్జి శైలజ తీర్పు వెల్లడించారు. కేసును సీఎం ఎంరవికుమార్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ రమేషబాబు పర్యవేక్షించారు. 31 మంది సాక్షులను కానిస్టేబుల్ డి.వెంకటనారాయణ కోర్టులో ప్రవేశపెట్టారు. -
మూడు రోజులు విధుల బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్ పిలుపునిచ్చారు. మహిళా అధికారిని హత్య చేయడం అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని ఓ ప్రకటనలో ఖండించారు. విజయారెడ్డి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు రెవెన్యూ ఉద్యోగులంతా హైదరాబాద్ తరలిరావాలని కోరారు. నిందితుల వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, మహిళా ఉద్యోగులకోసం రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలి: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తహసీల్దార్ విజయారెడ్డి దారుణహత్యకు గురికావడం దురదృష్టకరమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు కారం రవీందర్‌రెడ్డి, వి.మమత అన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారుల పెన్షనర్లు, కారి్మకుల ఐక్యత కార్యాచరణ సమితి ప్రగాఢ సానుభూతి తెలిపింది. -
రెవెన్యూలో భయం.. భయం!
సాక్షి, హైదరాబాద్: పట్టపగలే ఓ మహిళాధికారి దారుణహత్యకు గురికావడం రాష్ట్ర ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది. తహసీల్దార్ విజయారెడ్డిని ఆమె పనిచేస్తున్న చోటే సజీవదహనం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు కారణమేదైనా రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఆందోళనకు గురైంది. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రెవెన్యూ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు, నిందలతో సతమతమవుతున్న రెవెన్యూ యంత్రాంగం తాజా ఘటనతో మరింత ఆందోళనకు లోనైంది. విషయం తెలుసుకున్న వెంటనే రెవెన్యూ సంఘాల నేతలు ఘటనను తీవ్రంగా ఖండించడంతోపాటు విధులను కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చినా.. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వారిని వెంటాడుతోంది. రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తీవ్ర ఒత్తిడితో పాటు బదిలీపై వెళ్లి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోందన్న మనస్తాపంతో నెల కింద నిజామాబాద్ తహసీల్దార్ జ్వాలాగిరిరావు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉద్యోగవర్గాలను కలవరపరిచింది. ఈ ఘటన మరువక ముందే ఇప్పు డు మహిళా తహసీల్దార్‌ను ఏకంగా హత్య చేయడం రెవెన్యూ వర్గాలను కలవరపరుస్తోంది. ఎవరికీ తెలియలేదు.. మండలాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ కార్యాలయంలో విధి నిర్వహణలో తలమునకలైన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయి అధికారిపై సులువుగా దాడి జరగడానికి భద్రతా లోపాలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తహసీల్దార్ గదికి రానుపోను ఒకే ద్వారం ఉండడం, మిగతా సిబ్బంది గదులకు దూరంగా, వేరుగా ఉండటంతో తహసీల్దార్ రూమ్‌లో ఎవరున్నారనేది కూడా గమనించలేని పరిస్థితి ఉంది. సోమవారం తహసీల్దార్ ఉండే గది లోపలికి నిందితుడు వెళ్లి గడియ వేసుకున్నా.. ఆమెతో వాగి్వవాదానికి దిగినా.. ఆఖరికిపై ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టినా వెలుపల హాల్లో పనిచేసేవారికి తెలియలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి విజయారెడ్డికి నిప్పంటించే క్రమంలో కాలిన గాయాలతో భరించలేక నిందితుడు గడియ తీసుకొని బయటకు పరుగులు తీస్తే కానీ, లోపలేం జరిగిందో తెలియని అయోమయం నెలకొంది. ప్రైవేటు సెక్యూరిటీని కూడా నియమించుకోకపోవడం.. తహసీల్దార్‌ను కలిసిన సమయంలో అక్కడే ఉండాల్సిన సిబ్బంది లేకపోవడం కూడా ఘటనకు ఊతమిచ్చింది. రికార్డుల నవీకరణతో సతమతం.. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు రెవెన్యూ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రికార్డుల నవీకరణ అనంతరం రెవెన్యూ ఉద్యోగులపై పనిభారమే కాకుండా ఒత్తిడీ పెరిగిపోయింది. ముఖ్యంగా చాలాచోట్ల క్షేత్రస్థాయి పరిస్థితులకు, రికార్డులకు పొంతన కుదరకపోవడంతో వివాదాలు పెరిగిపోయాయి. సాంకేతిక సమస్యలు, కౌలుదారులు, పట్టాదారులు, సోదరులు, కుటుంబ తగాదాలు, కోర్టు కేసులు, ప్రభుత్వ భూములుగా తేలిన వంటి వాటికి పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పక్కనపెట్టడంతో రెవెన్యూ ఉద్యోగులే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే అపవాదు ఎదుర్కొంటున్నారు. కబ్జా కాలమ్‌ను ప్రభుత్వం తొలగించడం రెవెన్యూ యంత్రాంగానికి పెద్ద తలనొప్పిగా మారింది. న్యాయపరమైన వివాదాలపై అర్జీదారులను సముదాయించినా.. సమాధానం చెప్పినా.. శాంతించకపోవడంతో రెవెన్యూ వర్గాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ధరణి సాఫ్ట్వేర్ లోపాలూ వీరిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజాయారెడ్డి హత్యపై ప్రభుత్వం విచారణకుఆదేశించింది. -
తహశీల్దార్ సజీవ దహనం: డాడీ.. మమ్మీకి ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: డాడీ.. మమ్మీకి ఏమైంది? ఇంటికి ఎప్పుడొస్తుంది? ఇప్పుడు వీళ్లంతా (బంధువులు) మన ఇంటికి ఎందుకొచ్చారు? అంటూ ఏడుస్తూ అమాయకంగా ఆ పసి హృదయాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తండ్రి సుభాశ్‌రెడ్డి సహా బంధువులంతా పిల్లలను గుండెలకు హత్తుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి విజయారెడ్డికి ఏం జరిగిందో తెలియక ఆ చిన్నారులు గుక్కపెట్టి ఏడుస్తుండటం అక్కడి వారిని తీవ్రంగా కలచి వేసింది. విజయారెడ్డి దంపతులకు కుమార్తె చైత్ర (10), కుమారుడు భువనసాయి (5) ఉన్నారు. ఎప్పటిలాగానే సోమవారం ఉదయం కూడా తల్లి విజయారెడ్డి పిల్లలను స్కూలుకు రెడీ చేసి స్కూలుకు పంపింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు సజీవ దహనం అయిన తల్లికి ఏం జరిగిందో కూడా అర్థంగాక అమాయకంగా చూశారు. పిల్లల పరిస్థితి చూసి బంధువులు విలపించారు. టీచర్ నుంచి తహసీల్దార్ దాకా... మునుగోడు/నకిరేకల్/గరిడేపల్లి: నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన విజయారెడ్డి పెళ్లికి ముందు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 2006లో డీఎస్సీలో ఎస్జీటీ ఉద్యోగం రాగా ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల ప్రాథమిక పాఠశాలలో ఆమె పనిచేశారు. 2007లో వివాహం అనంతరం ఉన్నత ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో గ్రూప్–2 పరీక్షలకు సిద్ధమయ్యారు. 2009లో వెలువడిన గ్రూప్–2 ఫలితాల్లో ఆమె డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సాధించారు. మొదట మెదక్ జిల్లా సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించారు. ఆ తరువాత అదే జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేసి నూతనంగా ఏర్పాటైన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి తహసీల్దార్‌గా పదోన్నతిపై వచ్చారు. ఆమె భర్త సుభాష్‌రెడ్డి 2014లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా ఉద్యోగం సంపాదించి ప్రస్తుతం హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నారు. నకిరేకల్‌లో విషాద ఛాయలు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి మరణంతో ఆమె స్వగ్రామం నకిరేకల్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. వాస్తవానికి విజయారెడ్డి తల్లిదండ్రుల సొంత గ్రామం శాలిగౌరారం మండలం పెర్క కొండారంకాగా 30 ఏళ్ల క్రితమే నకిరేకల్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఆమె తండ్రి చామకురి లింగారెడ్డి, తల్లి వినోద. వారికి ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు. కూమారుడు 10వ తరగతిలో ఉండగా మృతి చెందాడు. తండ్రి లింగారెడ్డి పెర్కకొండారం జెడ్పీ హైస్కూల్లో తెలుగు పండిట్‌గా పని చేసి మూడేళ్ల కిందట పదవీ విరమణ పొందారు. లింగారెడ్డి తన ఇద్దరు కూమార్తెలను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమార్తె సంధ్యారాణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా హైదారాబాద్‌లోనే పనిచేస్తున్నారు. నేడు అంత్యక్రియలు అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి మరణవార్త తెలియగానే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహానికి నివాళులు అరి్పంచారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఆమె అంత్యక్రియలను మంగళవారం అత్తగారి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లిలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. -
చింతపల్లిలో రోడ్డు ప్రమాదం ఐదుగురు సజీవదహనం
-
చింతపల్లిలో ఐదుగురు సజీవదహనం
చింతపల్లి: విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీలో దారుణం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వస్తోన్న ఓ ఆటో చెరువూరు గ్రామంలో ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కనున్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రయాణికులు చింతపల్లి సంతకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు గిన్నెల కోట, చెరువూరు గ్రామాలకు చెందిన చిట్టిబాబు, గంగరాజు, బొంజి బాబు, కృష్ణారావు, ప్రసాద్‌లుగా గుర్తించారు. ఈ ఘటనలో జానుబాబు, దావీదు, వివేక్ అనే చిన్నారులతో పాటు చిన్నబ్బాయి, రామ్మూర్తి, వరలక్ష్మీలు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చింతపల్లి, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నానికి తరలించారు. విద్యుత్ వైర్లు తెగిపడి మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : చింతపల్లిలో రోడ్డు ప్రమాదం ఐదుగురు సజీవదహనం -
ప్రేమ వ్యవహారం : దళితవాడలో ఇద్దరి సజీవదహనం
సాక్షి, కాకినాడ : శంకరవరంలోని దళితవాడలో దారుణం చోటుచేసుకుంది. దుండగులు అన్నదమ్ములు దాక్కున్న ఇంటికి నిప్పటించి సజీవదహనం చేశారు. తీవ్ర గాయాలతో బాధితులు మృత్యువాత పడ్డారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులు బత్తిన నూకరాజు, ప్రసాద్‌గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గతంలో జరిగిన ప్రేమ వివాహం ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. మృతుడు నూకరాజు ప్రేమ వివాహం చేసుకోగా.. ఈ విషయమై సుధాకర్ అనే వ్యక్తికి నూకరాజుకు ఇటీవల పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో తమ్ముడు ప్రసాద్‌తో కలిసి నూకరాజు సుధాకర్‌పై కత్తితో దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. అన్నదమ్ములపై కక్ష పెంచుకున్న సుధాకర్ గురువారం వారి ఇంటిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఘటనలో ప్రసాద్, నూకరాజులు ఇంటితో పాటు కాలిబూడిదయ్యారని పోలీసులు పేర్కొన్నారు. దాదాపు ఆరుగురు వ్యక్తులకు ఘటనలో ప్రమేయముందని తెలిసింది. నిందితుల కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. -
కాకినాడలో పాతకక్షలతో ఇద్దరి సజీవదహనం
-
వటోలి నిందితులపై కేసు కొట్టివేత
సాక్షి, ఆదిలాబాద్: వటోలి కేసులో ఆదిలాబాద్ కోర్టు నిందితులపై కేసును కొట్టివేసింది. నిందితులపై నేరారోపణలు నిరూపించడానికి సీబీసీఐడీ తగిన సాక్ష్యాలు చూపించడంలో విఫలమైందని సోమవారం ఆదిలాబాద్ మొదటి అదనపు జిల్లా సెషన్స్‌కోర్టు ఇన్చార్జి జడ్జి అరుణసారిక కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. 2008లో భైంసా మండలం వటోలిలో ఒకే వర్గానికి చెందిన ఆరుగురు నిద్రిస్తున్న గుడి సెకు రాత్రి నిప్పుపెట్టి చంపిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కేసు పుర్వాపరాలు.. 2008 అక్టోబర్ 11, 12 మధ్యరాత్రి వటోలి లోని ఓ గుడిసెలో మహబూబ్‌ఖాన్(55), ఫసియా ఖానమ్(50), రిజ్వాన బేగం(22), మీనమ్ఖాన్(3), అస్లమ్‌ఖాన్ (6), శబామాహిన్ (2) గుడిసెలో నిద్రిస్తున్న సమయం లో గ్రామానికి చెందిన కొంతమంది సజీవ దహనం చేశారని భైంసా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన హిందూవాహిని కార్యకర్తలుగా భావిస్తున్న కుంచల్‌వార్ చంద్రభాన్, జాదవ్ వినోద్, అడబాగి చంద్రకాంత్, జాదవ్ అవధూత్, జాదవ్ భగవంత్‌రావు, సూర్యవంశి రామానంద్, జాదవ్ వినాయక్, కుంచల్‌వార్ నాగనాథ్, భైంసాకు చెందిన శిండే డిగంబర్లపై హత్యారోపణల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ఈ కేసును హైదరాబాద్ సీబీసీఐడీకి అప్పగించింది. 2009లో సీబీసీఐడీ పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగింది. 60 మంది సాక్షులను విచారించింది. నిందితులపై సాంకే తికంగా నేర నిరూపణకు సీబీసీఐడీ సాక్ష్యాలను చూపలేకపోయింది. -
చెన్నైలో దారుణం.. వైరల్ వీడియో
-
చెన్నైలో భయానకం.. వైరల్ వీడియో
-
చెన్నైలో భయానకం.. వైరల్ వీడియో
సాక్షి, చెన్నై : తమిళనాడులోని చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. సామాన్యుడికి రక్షణగా ఉండాల్సిన పోలీసులు దాదాపు ప్రాణాలు తీసినంత పనిచేశారు. ఖాకీ డ్రెస్సును అడ్డం పెట్టుకొని తాము కూడా మనుషులం అనే సంగతి మరిచి ప్రవర్తించారు. మణికంఠన్ అనే డ్రైవర్‌పట్ల అమానుషంగా వ్యవహరించడంతో అవమాన భారంతో వారి ముందే పెట్రోల్ పోసుకొని అతడు నిప్పంటించుకున్నాడు. సగానికిపైగా కాలిన గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మణికంఠన్ అనే డ్రైవర్ కాల టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడిని సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు కూలదూషణ చేయడంతోపాటు దారుణంగా కొట్టారు. దీంతో అతడు అక్కడే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇదంతా చూస్తున్న స్థానికులు పోలీసులు తీరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో ఘర్షణకు దిగి నిలదీశారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా అని దుమ్ముదులిపేశారు. వీడియో కాస్త ఇప్పుడు బయటకు రావడంతో సంచలనంగా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలను చూసి పోలీసుల తీరుపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఈ విషయం కాస్త అధికారులకు తెలియడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. -
షార్ట్ సర్క్యూట్: నలుగురి సజీవ దహనం
జాన్పూర్: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఇంటికి నిప్పంటుకోవటంతో అందులో నిద్రిస్తున్న తల్లి, ముగ్గురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. యూపీలోని జాన్పూర్ జిల్లా బర్సాత్ ప్రాంతం దౌడ్పూర్ గ్రామంలో ఈ పెను విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుసుమ్(28) తన కుమార్తెలు అంజలి(7), అన్షిక(5), అయుషి(2)తో కలిసి శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. వారు మెలకువ వచ్చి చూసేసరికే చుట్టూ మంటలు వ్యాపించడంతో ఆ నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
పెద్దపల్లిలో మహిళ సజీవ దహనం
-
పెద్దపల్లిలో మహిళ సజీవ దహనం
పెద్దపల్లి(కరీంనగర్): కరీంనగర్ జిల్లా పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద బుధవారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని మహిళ సజీవ దహనమైంది. మధ్యాహ్నం సమయంలో మంటల్లో కాలుతున్న మహిళ ఆర్తనాదాలు చుట్టుపక్కల వారికి వినిపించాయి. పొలాల్లో ఉన్న రైతులు సంఘటన స్థలం వైపు పరుగెత్తగా అక్కడున్న ఓ వ్యక్తి బైక్‌పై పారిపోయాడు. మహిళ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచనలం సృష్టించింది. అక్కడున్న రైతులు అందించిన సమాచారం మేరకు పెద్దపల్లి డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, సీఐ ప్రశాంత్‌రెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మహిళ పూర్తిగా కాలిపోరుుంది. పోలీసులు మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, డీఎన్ఏ పరీక్షలకు శాంపిళ్లు పంపించారు. ఎవరీ మృతురాలు..? పెద్దపల్లి రైల్వేస్టేషన్ నుంచి ద్విచక్ర వాహనంపై ఓ జంట వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. పథకం ప్రకారమే మహిళను ఓ వ్యక్తి ఇక్కడికి రప్పించి సజీవ దహనం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పెట్రోల్ చల్లి నిప్పు అంటించడంతో పాటు మంటల్లో కాలుతూ మహిళ కిందపడిపోగానే చుట్టుపక్కల ఉన్న కర్రలను ఆమె దేహంపై వేసి మంటకు తోడుచేశాడు. కాళ్ల భాగం మాత్రమే మిగిలి ఉండడంతో గుర్తుపట్టడం ఇబ్బందిగా మారింది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనా... లేక దూరమవుతున్న ప్రియురాలును ఉన్మాదిగా మారిన ప్రేమికుడు దారుణంగా సజీవ దహనం చేశాడా అని పలువురు అనుమానిస్తున్నారు. మహిళ వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఒంటిపై పంజాబీ డ్రెస్, కాళ్లకు పట్టీలు, ఎడమకాలికి ఎర్రటి దారం ఉన్నాయి. -
బాణసంచా పేలి ఇద్దరి సజీవ దహనం
భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరిలోని ఆర్బీనగర్లో ఓ వ్యాపారి అమ్మకానికి తీసుకువచ్చి దుకాణంలోని టపాసులు పేలి ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరొకరు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. భువనగిరి ఆర్బీ నగర్లో వ్యాపారి పెద్ది శ్రీనివాస్ కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా విక్రయించేందుకు టపాసులు తీసుకువచ్చి దుకాణంలో ఉంచాడు. తన దుకాణంలో కరెంట్ సమస్య ఉందని శ్రీనివాస్ ఎలక్ట్రీషియన్ నాగేశ్వరరావు(50)కి ఫోన్ చే యడంతో అతడు వచ్చాడు. అదే సమయంలో టపాసులు కొనేందుకు కల్యాణ్(22), పోశెట్టి వచ్చారు. అంతలోనే సెల్‌ఫోన్ ఓవర్‌హీట్ కారణంగా టపాకాయలకు అంటుకుని పెద్దఎత్తున మంటలు లేశాయి. గదిలో ఉన్న ముగ్గురికీ మంటలు అంటుకున్నాయి. వారిలో నాగేశ్వర్రావు , కల్యాణ్ అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. పోశెట్టి తీవ్రంగా గాయపడ్డాడు. పెద్దఎత్తు టపాసులు పేలిన శబ్దాలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. -
గ్యాస్ ఫైప్‌లైన్ పేలి 11 మంది సజీవదహనం
-
గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడు,18మంది సజీవదహనం
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో జీసీఎస్ వద్ద శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎన్ఎఫ్సీల్, జీఎఫ్సీల్, తాటిపాకకు గ్యాస్ సరఫరా చేసే గ్యాస్ ట్రంక్ పైప్‌లైన్ పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో సంభవించిన బ్లో అవుట్ స్థాయిలో కాకపోయినా.. ఈ ఘటనలో 18మంది సజీవ దహనమైనట్టు సమాచారం. 20 మందికి పైగా తీవ్ర గాయాలయినట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ పంపులైన్ పేలడంతో బ్లోఔట్ మాదిరిగా పెద్ద ఎత్తున శబ్దాలతో భారీగా మంటలు ఎగసిపడుతూ చుట్టుపక్కలకు విస్తరిస్తున్నాయి. అయితే మంటల తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో పరిసార ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవరించింది. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలికి సమీపాన నివసిస్తున్న స్థానికులు భయందోళనతో పరుగులు పెడుతున్నారు. సమాచారం అందుకున్న గెయిల్ సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఒడిశాలో బాలికపై రేప్.. సజీవ దహనం
బరంపురం (ఒడిశా), న్యూస్‌లైన్: ఒడిశాలోని గంజాం జిల్లాలో రంబా గ్రామానికి చెందిన ఓ బాలిక పై గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి, అనంతరం కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..రంబా పోలీస్ స్టేషన్ పరిధిలోని డియాడైయి గ్రామంలో గురువారం రాత్రి ఓ వివాహం జరిగింది. దీనికి తపస్వినీ దాస్(17) అనే బాలిక హాజరైంది. రాత్రంతా బంధువులు, స్నేహితులతో కలసి పెళ్లిలో ఆనందంగా గడిపిన ఆమె వేకువజామున 4 గంటల ప్రాంతంలో బహిర్భూమికని బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు వెదికేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తపస్విని పూర్తిగా కాలిన స్థితిలో విగతజీవిగా పడి ఉంది. ఆమె మృతదేహం పడివున్న స్థితిని, అక్కడ ఉన్న ఆనవాళ్లను బట్టి దుండగులు ఆమెపై లైంగికదాడికి పాల్పడి, అనంతరం కిరోసిన్ పోసి సజీవ దహనం చేసినట్టు అనుమానించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఆగ్రహించిన స్థానికులు రహదారిపైకి చేరి నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. రహాదారిని దిగ్బంధించి రాస్తారోకోకు దిగారు. ఇదిలావుండగా రేషన్ డీలర్‌గా పని చేస్తున్న తపస్వినీ దాస్ సోదరి ప్రణతి దాస్ సుమారు రెండు నెలల కిందట ఇదే రీతిలో హత్యకు గురయ్యారు. ఈ రెండు హత్యలూ పథకం ప్రకారమే జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. -
‘వోల్వో’ మృతుల్లో నలుగురి గుర్తింపు
డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల అప్పగింత సాక్షి ప్రతినిధి, బెంగళూరు: కర్ణాటకలోని హావేరి వద్ద జరిగిన వోల్వో బస్సు దుర్ఘటనలో సజీవదహనమైన ఏడుగురు ప్రయాణికుల్లో నలుగురిని శుక్రవారం గుర్తించారు. హావేరి వద్ద వరదా నదిపై బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొట్టిన బస్సు దగ్ధమై ఏడుగురు సజీవదహనం కాగా 44 మంది గాయపడిన సంగతి తెలిసిందే. మృతుల్లో సలీం భాను, అమీనా ఖాన్, నామన్ ఖాన్, కైఫ్ ఖాన్‌లను వారి బంధువులు గుర్తుపట్టారు. బస్సు ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు పిల్లలు, ఓ మహిళ ఉండగా.. వారిలో ఒకే కుటుంబానికి చెందినవారే ఐదుగురు. డ్రైవర్ నవాజ్ పాషా మృతదేహాన్ని అతడి చేతి గడియారం ఆధారంగా గుర్తించినట్లు తెలిసింది. అయితే పూర్తిగా ధ్రువీకరించలేదు. బంధువులు తమ వారి మృతదేహాలను గుర్తించగలిగినా, డీఎన్ఏ పరీక్షల అనంతరమే అప్పగిస్తామని అధికారులు తెలిపారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఐదుగురు క్షతగాత్రుల్లో నలుగురు బెంగళూరులోని వివిధ ఆస్పత్రుల్లో చేరారని, వారందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు.