షార్ట్‌ సర్క్యూట్‌: నలుగురి సజీవ దహనం | Four members of a family burnt alive | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌: నలుగురి సజీవ దహనం

Published Sat, Aug 12 2017 4:14 PM | Last Updated on Mon, Sep 11 2017 11:55 PM

Four members of a family burnt alive

జాన్‌పూర్: విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇంటికి నిప్పంటుకోవటంతో అందులో నిద్రిస్తున్న తల్లి, ముగ్గురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. యూపీలోని జాన్‌పూర్‌ జిల్లా బర్సాత్‌ ప్రాంతం దౌడ్‌పూర్‌ గ్రామంలో ఈ పెను విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుసుమ్‌(28) తన కుమార్తెలు అంజలి(7), అన్షిక(5), అయుషి(2)తో కలిసి శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. వారు మెలకువ వచ్చి చూసేసరికే చుట్టూ మంటలు వ్యాపించడంతో ఆ నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement