short curcuit
-
ఘోరం: 14 మంది కోవిడ్ బాధితులు సజీవ దహనం
సాక్షి, అహ్మదాబాద్: ఒకవైపు దేశంలో అడ్డు అదుపూ లేకుండా కరోనా విజృంభిస్తోంది. మరోవైపు దేశంలో కోవిడ్ ఆసుపత్రులలో ప్రమాదాలు తీరని విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారుచ్‌లోని పటేల్ వెల్ఫేర్ కొవిడ్ హాస్పిటల్లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. వీరిలో 14 మంది కరోనా బాధితులు ఇద్దరు స్టాఫ్ నర్సులు ఉన్నారు. మరో 50 మంది రోగులను స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐసీయులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. భారీగా వ్యాపించిన పొగ కారణంగా కోవిడ్ వార్డులో చికిత్స తీసుకుంటున్న వారు ప్రాణాలు కోల్పోయారని భారుచ్ ఎస్పీ రాజేంద్ర సింహ్ తెలిపారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భరూచ్ ఆసుపత్రి అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్రంలోని ఇద్దరు సీనియర్ ఐఎఎస్ అధికారులను వెంటనే భరూచ్ చేరుకుని సంఘటనపై దర్యాప్తు చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన రోగులు, వైద్యులు ఆసుపత్రి సిబ్బందికి ఆయన సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 4 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటిసంచారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి వచ్చాయని, సుమారు 50 మంది రోగులను, స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారని పేర్కొన్నారు. క్షత గాత్రులందర్నీ సమీపంలో ఉన్న హాస్పిటల్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ అధికారి శైలేష్ సంసియా తెలిపారు. భారుచ్-జంబుసర్ రహదారిపై ఉన్న నాలుగు అంతస్థుల భవనంలోని ఈ ఆసుపత్రిని ఒక ట్రస్ట్ నిర్వహిస్తోంది. బాధితులు చాలామంది సజీవ దహనమైపోయారని, కొంతమంది రోగుల అవశేషాలు, స్ట్రెచర్లు పడకలపై పడి ఉన్నాయని ఆసుపత్రి ధర్మకర్త జుబెర్ పటేల్ కంటతడిపెట్టారు. Gujarat: Fire broke out at a #COVID19 care centre in Bharuch last night. 16 people, including 14 patients, died in the incident. pic.twitter.com/gbbLZzML6I — ANI (@ANI) May 1, 2021 -
మానవ తప్పిదమే?
సాక్షి, అమరావతి: కరోనా బాధితులున్న ప్రైవేట్ హోటల్లో అగ్ని ప్రమాదం ఘటనపై విద్యుత్ భద్రత అ«ధికారులు పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. భద్రత లోపాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి విజయలక్ష్మి తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం విద్యుత్ ఉన్నతాధికారులు ’సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. స్పార్కింగ్ ఇలా... ♦ సెప్షన్ వద్దే మొదట స్పార్కింగ్ వచ్చినట్టు గుర్తించారు. కోవిడ్ ఆసుపత్రి కావడం, ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండే శానిటైజర్లు వాడటమే మంటల వ్యాప్తికి కారణమన్న ఏకాభిప్రాయం అధికారుల్లో వ్యక్తమైంది. ♦ కంప్యూటర్లను వినియోగించేందుకోసం వాడే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులోకి శానిటైజర్ వెళ్లినట్లు తెలుస్తోంది. ధన, రుణ (ఫేజ్, న్యూట్రల్) మధ్య విద్యుత్ ప్రసరణ జరగడంతో సర్క్యూట్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. తప్పిదం ఇలా.. ♦ కోవిడ్ రోగులున్న ఆ ప్రాంతంలో విద్యుత్ నియంత్రణ, భధ్రత తెలిసిన నిపుణులు లేరని సీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్థన్‌రెడ్డి విశ్లేషించారు. మంటలు వ్యాపించగానే అక్కడ ఏమాత్రం నైపుణ్యం లేని సిబ్బంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. ♦ విద్యుత్ నియంత్రణ చట్టం ప్రకారం ఉండాల్సిన డ్రై కెమికల్ పౌడర్, కార్బన్ డై ఆక్సైడ్ (సీవో2) ఉన్నాయా? వాటిని వాడాలనే పరిజ్ఞానం సిబ్బందికి లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈఎల్సీబీ లేదా? ♦ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్స్ (ఈఎల్సీబీ) లేకపోవడం వల్లే భారీ అగ్ని ప్రమాదం జరిగిందా? అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ♦ లాక్డౌన్ కారణంగా కొన్ని నెలలుగా మూతపడి ఉన్న హోటల్లో ఎలుకలు ఎక్కువగా ఉండవచ్చు. న్యూట్రల్ వైర్‌ను ఎలుక కొరికితే పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ ఒక్కోసారి ఫేజ్ వైర్‌ను కొరకడం... ఆ ఎలుక భూమి మీదే ఉండటం... దీంతో ఎర్త్ కావడం జరుగుతుంది. ఫలితంగా షార్ట్ సర్క్యూట్‌కు ఆస్కారం ఉంది. హోటల్స్‌లో సాధారణంగా 30 మిల్లీ యాంప్స్‌తో ఈఎల్‌సీబీని అమర్చుకోవాలని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. ♦ ఎలుక వైర్‌ను కొరికి ప్రమాదానికి కారణమైందనే కోణమే నిజమైతే అక్కడ ఈఎల్సీబీ లేదని స్పష్టమవుతోందని పద్మా జనార్దన్‌రెడ్డి విశ్లేషించారు. ఇది నేరంగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. దుప్పటి కప్పితే! ♦ షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో దుప్పటి వేసి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదని సీపీడీసీఎల్ విద్యుత్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ♦ హోటల్‌కు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ నిశితంగా పరిశీలించామని, హై వోల్టేజీదాఖలాలులేవని, హోటల్ సిబ్బంది తప్పిదాలే ప్రమాదానికికారణంగా తెలుస్తోందని సీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. -
షార్ట్ సర్క్యూట్: నలుగురి సజీవ దహనం
జాన్పూర్: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఇంటికి నిప్పంటుకోవటంతో అందులో నిద్రిస్తున్న తల్లి, ముగ్గురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. యూపీలోని జాన్పూర్ జిల్లా బర్సాత్ ప్రాంతం దౌడ్పూర్ గ్రామంలో ఈ పెను విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుసుమ్(28) తన కుమార్తెలు అంజలి(7), అన్షిక(5), అయుషి(2)తో కలిసి శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. వారు మెలకువ వచ్చి చూసేసరికే చుట్టూ మంటలు వ్యాపించడంతో ఆ నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
పాలకోడేరు: శ్రీకాకుళం జిల్లాలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. జిల్లాలోని పాలకోడేరు మండలంలోఈ ఘటన జరిగింది. మండలంలోని కోమటిపేటలోని నగేష్‌కుమార్ అనే వ్యాపారికి చెందిన గోదాములో శుక్రవారం ఉదయం షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. గోదాములోని సరుకు అంతా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.