పెద్దపల్లిలో మహిళ సజీవ దహనం | Woman to burn alive in peddapalli | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 10 2015 9:08 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

కరీంనగర్ జిల్లా పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద బుధవారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని మహిళ సజీవ దహనమైంది. మధ్యాహ్నం సమయంలో మంటల్లో కాలుతున్న మహిళ ఆర్తనాదాలు చుట్టుపక్కల వారికి వినిపించాయి. పొలాల్లో ఉన్న రైతులు సంఘటన స్థలం వైపు పరుగెత్తగా అక్కడున్న ఓ వ్యక్తి బైక్‌పై పారిపోయాడు. మహిళ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచనలం సృష్టించింది. అక్కడున్న రైతులు అందించిన సమాచారం మేరకు పెద్దపల్లి డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, సీఐ ప్రశాంత్‌రెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మహిళ పూర్తిగా కాలిపోరుుంది. పోలీసులు మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, డీఎన్‌ఏ పరీక్షలకు శాంపిళ్లు పంపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement