railway over bridge
-
హైదరాబాద్: ఫలించిన యాభై ఏళ్ల కల!
సాక్షి, సికింద్రాబాద్: ‘తుకరాంగేట్ రైల్వే క్రాసింగ్ వద్ద నిర్మించిన ఆర్యూబీ అమలులోకి వచ్చింది. యాభై సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితం అయిన వంతెన కొద్ది రోజుల క్రితం అందుబాటులోకి వచ్చింది. 2018 జూలై నుంచి అందుబాటులోకి వచ్చిన ట్రాఫిక్ ఆంక్షలు తొలగిపోయాయి. ► కరోనా తదితర సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం జరిగి ఐదేళ్ల కాలంలో నిర్మాణం పనులు పూర్తయ్యాయి. కొద్ది రోజుల క్రితమే నిర్మాణం పూర్తయిన వంతెనను రాష్ట్ర మంత్రి కేటీ రామారావు, డిప్యూటీ స్పీకర్ టీ.పద్మారావుగౌడ్ వాహనాల రాకపోకలకు పచ్చజెండా ఊపారు. ► ఐదు దశాబ్దాలుగా ఎన్నికల నినాదంగా మారిన వంతెన నిర్మాణం పనులు పూర్తయి అందుబాటులోకి రావడంతో తుకారాంగేట్ పరిసర ప్రాంతాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. రైల్వే వంతెన అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు సమూలంగా పరిష్కారం లభించినట్టయింది. చదవండి: ఇటుక అండగా.. ఇల్లు చల్లన! కూల్ బ్రిక్స్ తయారీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 26 సార్లు గేట్ పడేది... ► సికింద్రాబాద్ నుంచి లాలాపేట్, మల్కాజిగిరి ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు తుకారాంగేట్ రహదారి ఒక్కటే పెద్దదిక్కుగా ఉంది. నిత్యం లక్ష వాహనాల రాకపోకలు ఈ దారిగుండా ఉంటున్నట్టు ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ► తుకారాంగేట్ రైల్వే క్రాసింగ్ మీదుగా నిత్యం వంద వరకు రైళ్ల రాకపోకలు ఉంటున్నాయి. ప్రతీ 40 నిమిషాలకు ఒకమారు లెవల్ క్రాసింగ్ వద్ద గేటు వేసేవారు. మొత్తంగా రోజుకు 20 నుంచి 26 సార్లు గేటు పడుతుండడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయేవి. ► రూ.20.10 కోట్ల వ్యయంతో తుకారాంగేట్ ఆర్యూబీ నిర్మాణం పనులు పూర్తి చేశారు. జీహెచ్ఎంసీ, దక్షిణ మధ్యరైల్వేలు సంయుక్తంగా వంతెనను నిర్మించారు. జీహెచ్ఎంసీ రూ.15.14కోట్లు, రైల్వేశాఖ రూ. 13.95 కోట్లు విడుదల చేయడం ద్వారా నిర్మాణం పనులు పూర్తి చేశారు. చదవండి: వినూత్న ‘పెండ్లిపత్రిక’.. పారేయకండి.. మట్టిలో పాతిపెడితే.. ట్రాఫిక్ మళ్లింపులకు తెర ► వంతెన నిర్మాణం పనులు ప్రారంభం అయిన కొద్ది రోజుల ముందు నుంచి తుకారాంగేట్ రహదారి మీదుగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. సికింద్రాబాద్ నుంచి తుకారాంగేట్ రైల్వేగేట్ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనాలను ఇతర మార్గాల మీదుగా మళ్లించారు. ► నాలుగు సంత్సరాల అనంతరం తుకారాంగేట్ రైల్వే వంతెన మీదుగా వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. మల్కాజిగిరి, మౌలాలి, నేరెడ్మెట్ తదితర ప్రాంతాల వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తప్పాయి. -
రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ దిగ్బంధం
సాక్షి, మంచిర్యాలరూరల్(హాజీపూర్) : న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సాక్షర భారత్ ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌ను బుధవారం ది గ్బంధించారు. మండల, గ్రామ కో ఆర్డినేటర్లు కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవా రం 16వ రోజుకు చేరాయి. దీక్షలో భాగంగా జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉన్న రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ దిగ్భంధించారు. జిల్లాలోని 18 మండలా లకు చెందిన మండల, గ్రామ కో ఆర్డినేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బోనాలు నెత్తిన పెట్టుకుని బతుకమ్మలతో తరలివచ్చారు. ఓవర్‌బ్రిడ్జ్ వద్ద మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడుతూ నిరసన చేపట్టారు. పురుష ఉద్యోగులు అసైదులా ఆటలు ఆడుతూ రోడ్లపై శీర్షాసనాలు వేశారు. దిగ్భంధం దాదాపు గంటకు పైగా సాగింది. దీంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని సూచించారు. ఉద్యోగులు ససేమిరా అనడంతో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎంసీఓల సంఘం రాష్ట్ర సభ్యుడు మహేందర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రకాశ్, జిల్లా వీసీఓల అధ్యక్షుడు బోరె శ్రీనివాస్, ఎంసీఓలు, వీసీఓలు లత, సంధ్య, రాజేశం, శ్రీనివాస్, రామకృష్ణ పాల్గొన్నారు. -
ఫుట్ పాత్‌ను ఢీకొన్న బైక్: కానిస్టేబుల్ మృతి
నల్లగొండ: పట్టణంలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జి(ఆర్ఓబీ)పై జరిగిన ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. సోమ సురేష్(30) నకిరేకల్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 2005 బ్యాచ్‌కు చెందిన ఇతని స్వగ్రామం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం మొగలాయికుంట. తండ్రి పద్మారావు కూడా పోలీసు డిపార్టుమెంట్లోనే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్. ఇతనికి భార్య, ఒక కుమార్తె ఉంది. ప్రస్తుతం ఆమె రెండో కాన్పు కోసం విజయవాడలోని పుట్టింటి వద్ద ఉంటోంది. అతి వేగంతో నల్గొండ ఆర్‌ఓబీపై బైక్‌పై వెళ్తూ ఫుట్‌పాత్‌ను ఢీకొట్టాడు. ఫుట్‌పాత్ అంచుపై పడిపోవడంతో తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. బైక్ వెనుక కూర్చున్న కాంట్రాక్టర్ చిన్నపురెడ్డి మణిపాల్‌రెడ్డికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టూ టౌన్ ఎస్ఐ రామలింగ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మెట్రోకు తొలగిన ఆర్ఓబీ చిక్కులు
-
మెట్రోకు తొలగిన ఆర్ఓబీ చిక్కులు
- ట్రాఫిక్ బ్లాక్ చార్జీల రుసుముపై మెట్టు దిగిన రైల్వే - ఒక్కో బ్రిడ్జీ నిర్మాణానికి రూ.కోటి చెల్లిస్తే సరిపోతుందని స్పష్టీకరణ - 66 కిలోమీటర్ల మార్గంలో ఊపందుకున్న పనులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకు మరిన్ని చిక్కులు తొలిగాయి. నగరంలో ఆరు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జీ(ఆర్ఓబీ)ల నిర్మాణానికిగానూ ట్రాఫిక్ బ్లాక్ చార్జీల పేరిట భారీగా రుసుములు చెల్లించాలని తొలుత పేచీపెట్టిన దక్షిణ మధ రైల్వే ఇప్పుడు మెట్టు దిగింది. ఒక్కో బ్రిడ్జీ నిర్మాణానికి సుమారు రూ.కోటి చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేయడంతో మెట్రో పనులకు లైన్‌క్లియర్ అరుు్యంది. మరోవైపు నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో మెట్రో పనులకు సేకరించాల్సిన 13 ఆస్తులకు సంబంధించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించడంతో ఆ మేరకు పరిహారం ఇచ్చేందుకు హైదరాబాద్ మెట్రో రైలు(హెచ్ఎంఆర్) సంస్థ సూత్రప్రాయంగా అంగీకరించడంతో ఈ ప్రాంతంలో మెట్రోకు మార్గం సుగమమైంది. కాగా వచ్చే ఏడాది ఉగాది(మార్చి 28న)నాగోల్-మెట్టుగూడా, మియాపూర్-పంజాగుట్ట మార్గాల్లో తొలి దశ మెట్రో రైళ్లు రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు సమాచారం. రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం ఇక్కడే.. ఎల్బీనగర్-మియాపూర్ (కారిడార్-1)మార్గంలో భరత్‌నగర్, లక్డీకాపూల్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ఆర్ఓబీలను నిర్మించనున్నారు. ఇందులో భరత్‌నగర్ ఆర్ఓబీ నిర్మాణం ఇప్పటికే పూర్తరుు్యంది. మరో రెండింటిని నిర్మించాల్సి ఉంది. జేబీఎస్-ఫలక్‌నుమా(కారిడార్-2)లో బోరుుగూడలో ఆర్ఓబీ నిర్మాణం పూర్తరుు్యంది. నాగోల్-శిల్పారామం(కారిడార్-3) పరిధిలో బేగంపేట్, ఒలిఫెంటా బ్రిడ్జి, చిలకలగూడ, ఆలుగడ్డ బావి ప్రాంతాల్లో 4 ఆర్ఓబీలను నిర్మించనున్నారు. మిగిలిన 6 ఆర్ఓబీలకు సంబంధించి రూ.6 కోట్ల మేర ట్రాఫిక్ బ్లాక్ చార్జీలు రైల్వే శాఖకు చెల్లిస్తే సరిపోతుందని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపారుు. వీటి నిర్మాణం విషయానికి వస్తే ఆలుగడ్డ బావి, చిలకలగూడ ప్రాంతాల్లో ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్ విధానంలో ఆర్ఓబీల నిర్మాణం చేపట్టనున్నట్లు ఎల్అండ్టీ వర్గాలు తెలిపారుు. లక్డికాపూల్, మలక్‌పేట్, బేగంపేట్‌లో సాధారణ బ్రిడ్జీల రీతిలో వీటిని నిర్మిస్తామన్నారు. ఒలిఫెంటాబ్రిడ్జి వద్ద ఇనుముతో బ్రిడ్జీ నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం పనుల పురోగతి ఇలా.. ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా, నాగోల్-రహేజా ఐటీపార్క్ మూడు కారిడార్ల పరిధిలో మొత్తం 72 కిలోమీటర్లకుగాను.. ప్రస్తుతం 66 కిలోమీటర్ల మార్గంలో పనులు ఊపందుకున్నారుు. ఆయా ప్రాంతాల్లో పిల్లర్ల నిర్మాణం పూర్తరుు్యంది. వీటిపై పట్టాలు పరిచేందుకు వీలుగా వయాడక్ట్ సెగ్మెంట్ల నిర్మాణం 50 కిలోమీటర్ల మార్గంలో ఏర్పాటైంది. మొత్తం 65 మెట్రో స్టేషన్లలో ఇప్పటికే 35 స్టేషన్ల నిర్మాణం పూర్తరుు్యంది. మిగతావి పురోగతిలో ఉన్నారుు. ఎంజీబీఎస్- ఫలక్‌నుమా(6కి.మీ.) మెట్రో మార్గం ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఇక్కడ పనులు మొదలుకాలేదు. మొత్తంగా రూ.14,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మెట్రో ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.11 వేల కోట్లు వ్యయం చేసినట్లు ఎల్అండ్టీ పేర్కొంది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కంచిలి : కంచిలి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో పుణ్యస్త్రీ గెడ్డ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, ఇద్దరు గాయాల పాలయ్యారు. పోలీసులు చెప్పిన వివరాలు... పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న లారీని అదే మార్గంలో వెనుక నుంచి ఓవర్టేక్ చేస్తున్న మహింద్ర మ్యాక్స్ పిక్అప్ వాహనం బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ వాహనాలు వెనుక వేగంగా వస్తున్న మహీంద్ర బొలేరో వాహనం డ్రైవర్ ప్రమాద దృశ్యాన్ని చూసి హఠాత్తుగా బ్రేకు వేశాడు. దీంతో ఆ వాహనం కూడా డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మ్యాక్స్ పిక్ అప్ వాహనం వెనుక భాగం తొట్టెలో ప్రయాణిస్తున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రం నొయిటా గ్రామానికి చెందిన సుబోధ్ వాహనంలో నుంచి ఎగిరిపడి రోడ్డు మీద పడి దుర్మరణం పాలయ్యాడు. అతనితో ఉన్న సహచరుడు ఆర్.మండల్ తీవ్ర గాయాలపాలయ్యాడు. వాహనం వెనుక వస్తూ బోల్తా పడిన మహీంద్రా బొలేరో వాహనంలో ఉన్న కంచిలి మండలం పోలేరు గ్రామానికి చెందిన లింగం సత్యారావుకు కూడా కుడి చెయ్యి విరిగింది. ప్రమాద సమాచారం తెలుసుకొన్న కంచిలి, సోంపేట పోలీసులు, ఎన్‌హెచ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సేవలు అందించారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పశ్చిమబెంగాల్ నుంచి ఏలూరుకు చేపల లోడ్‌ను తీసుకెళ్లి అన్లోడ్ చేసి, తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం, గాయపడిన వారికి చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సోంపేట సీఐ సూరినాయుడు, సోంపేట ఎస్ఐ శ్రీనివాసరావు, కంచిలి ఎఎస్ఐ రామక్రిష్ణ సంఘటనా వివరాలు తెలుసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచిలి ఏఎస్ఐ వీబీ రామక్రిష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్దపల్లిలో మహిళ సజీవ దహనం
-
పెద్దపల్లిలో మహిళ సజీవ దహనం
పెద్దపల్లి(కరీంనగర్): కరీంనగర్ జిల్లా పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద బుధవారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని మహిళ సజీవ దహనమైంది. మధ్యాహ్నం సమయంలో మంటల్లో కాలుతున్న మహిళ ఆర్తనాదాలు చుట్టుపక్కల వారికి వినిపించాయి. పొలాల్లో ఉన్న రైతులు సంఘటన స్థలం వైపు పరుగెత్తగా అక్కడున్న ఓ వ్యక్తి బైక్‌పై పారిపోయాడు. మహిళ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచనలం సృష్టించింది. అక్కడున్న రైతులు అందించిన సమాచారం మేరకు పెద్దపల్లి డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, సీఐ ప్రశాంత్‌రెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మహిళ పూర్తిగా కాలిపోరుుంది. పోలీసులు మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, డీఎన్ఏ పరీక్షలకు శాంపిళ్లు పంపించారు. ఎవరీ మృతురాలు..? పెద్దపల్లి రైల్వేస్టేషన్ నుంచి ద్విచక్ర వాహనంపై ఓ జంట వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. పథకం ప్రకారమే మహిళను ఓ వ్యక్తి ఇక్కడికి రప్పించి సజీవ దహనం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పెట్రోల్ చల్లి నిప్పు అంటించడంతో పాటు మంటల్లో కాలుతూ మహిళ కిందపడిపోగానే చుట్టుపక్కల ఉన్న కర్రలను ఆమె దేహంపై వేసి మంటకు తోడుచేశాడు. కాళ్ల భాగం మాత్రమే మిగిలి ఉండడంతో గుర్తుపట్టడం ఇబ్బందిగా మారింది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనా... లేక దూరమవుతున్న ప్రియురాలును ఉన్మాదిగా మారిన ప్రేమికుడు దారుణంగా సజీవ దహనం చేశాడా అని పలువురు అనుమానిస్తున్నారు. మహిళ వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఒంటిపై పంజాబీ డ్రెస్, కాళ్లకు పట్టీలు, ఎడమకాలికి ఎర్రటి దారం ఉన్నాయి. -
చంద్రన్నా.. సమస్యలు చూడన్నా..
నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం.. హాస్పిటల్ స్థాయిని 50 పడకలకు పెంచుతాం.. ఆర్టీసీ డిపోను వెంటనే పునరుద్ధరిస్తాం.. తాడేపల్లిగూడెం గేటు వద్ద ఆర్వోబీ నిర్మిస్తాం.. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం.. ఇవి ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు గుప్పించిన హామీలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక గణేష్ చౌక్ సెంటర్లో జరిగిన సభలో చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. తెలుగుదేశం ప్రభుత్వం గద్దెనెక్కి ఏడు నెలలు గడుస్తున్నా ఈ హామీలలో ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. నియోజకవర్గంలో సమస్యలు తాండవిస్తున్నా.. అధికార పార్టీ నాయకులు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఆదివారం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా సమస్యలపై ఫోకస్. - నిడదవోలు గేటు పడిందా గోవిందా నిడదవోలు నెహ్రూబొమ్మ సెంటర్లో రైల్వే గేటు వద్ద ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం ఎండమావిగానే మిగిలిపోయింది. గతంలో ఆర్వోబీ మంజూరైందని ఎంపీ మాగంటి మురళీమోహన్ ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఉభయగోదావరి జిల్లాలకు రాకపోకలకు నిడదవోలు దగ్గరదారి కావడంతో రోజూ వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు వైపు వెళ్లేందుకు కచ్చితంగా గేటు దాటాల్సిన పరిస్థితి. రోజుకి సుమారు 200 ైరెళ్లు నిడదవోలు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో 200 సార్లు గేటు పడుతుంది. ఆ సమయంలో ట్రాఫిక్ రద్దీగా మారుతోంది. ఒక్కోసారి రైల్వేగేటును వాహనాలు ఢీకొనడంతో రైల్వే సిగ్నల్ వ్యవస్థ దెబ్బతింటోంది. ఇటువంటి సందర్భాలలో గంటల తరబడి గేటు మూతపడటంతో ట్రాఫిక్ నిలిచిపోతుంది. పేరుకే పెద్దాసుపత్రి నిడదవోలులో ప్రభుత్వాసుపత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా కొనసాగుతోంది. పట్టణంలోని 45 వేల జనాభాతో పాటు చుట్టుపక్కల 45 గ్రామాలకు సేవలందించాల్సిన ఆసుపత్రిలో 8 పడకలు మాత్రమే ఉన్నాయి. ఆసుపత్రి స్థాయిని 50 పడకలకు పెంచాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నా ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. కనీసం 30 పడకల స్థాయికి పెంచేందుకు కూడా నాయకులు ప్రయత్నించకపోవడం గమనార్హం. ఆసుపత్రిలో అరకొర సేవలతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర కేసులను వైద్యులు తణుకు, రాజమండ్రి ఏరియా ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఎక్స్‌రే యంత్రం, ఆక్సిజన్ సిలిండర్, మత్తు మందు అందించే యంత్రాలు లేవు. రోగులకు రెండు గదులు మాత్రమే కేటాయించడంతో అవస్థలు తప్పడం లేదు. రోజూ కనీసం 160 మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నా మందులు పూర్తిస్థాయిలో లేవు. ప్రభుత్వాసుపత్రితో పాటు నియోజకవర్గంలోని మూడు పీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. గర్భిణులకు సదుపాయాలు లేకపోవడంతో ప్రసవాల సంఖ్య నెలనెలకూ తగ్గుతోంది. డిపో పునరుద్ధరణ ఊసేలేదు నిడదవోలు ఆర్టీసీ డిపోను ఆదాయం తక్కువుగా ఉందనే సాకుతో 2006 ఆగస్టులో మూసివేశారు. ఇక్కడి బస్సులను తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, జంగారెడ్డిగూడెం తదితర డిపోలకు పంపారు. అప్పటినుంచి నియోజకవర్గంలో ప్రజలకు ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి. బస్సులన్నీ వేరే డిపోల నుంచి రావడం వల్ల గంటల తరబడి ఆలస్యమవుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. కొన్నేళ్లుగా డిపో పునరుద్ధరించాలని ప్రజా సంఘాలు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆగని సూపర్ ఫాస్ట్‌లు నిడదవోలు రైల్వే జంక్షన్ అయినా సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. జన్మభూమి, లోకమాన్య తిలక్, కాకినాడ ఏసీ స్పెషల్ తదితర రైళ్లకు హాల్ట్‌లు కల్పించాలని డిమాండ్ ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో మరిన్ని సమస్యలు నిడదవోలు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలకు మెరక పనులు చేపట్టకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉండ్రాజవరం మండలంలో డెల్టా ఆధునికీకరణ పనులు నెమ్మదించాయి. మోర్తాలో మురుగు కాలువ పూడిపోవడంతో 5 గ్రామాల్లో 3 వేల ఎకరాలకు సాగునీరందడం లేదు. పెరవలి మండలం కానూరులో బీసీ హాస్టల్ భవన నిర్మాణం పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. కలగా.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పట్టణంలో తాగునీటి ఎద్దడి నివారణకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు చేసినా పనులకు మోక్షం కలగడం లేదు. విజ్జేశ్వరం హెడ్‌స్లూయిజ్ వెనుక నుంచి పైపులైన్ ద్వారా గోదావరి జలాలను పట్టణానికి తరలించాలని 2013లో సుమారు రూ.52 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే కార్యరూపం దాల్చకపోవడంతో వేసవిలో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఎర్రకాలువ ముంపు కష్టాలు ఏటా వర్షాకాలంలో ఎర్రకాలువ వరద ముంపుతో మండలంలోని సింగవరం, కంసాలిపాలెం, ఉనకరమిల్లి, తాడిమళ్ల, శంకరాపురం, కాటకోటేశ్వరం, తాళ్లపాలెం, తిమ్మరాజుపాలెం, అట్లపాడు గ్రామాల్లో వేలాది ఎకరాలు ముంపునకు గురువుతున్నాయి. నివారణ కోసం శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నా ఫలితం ఉండటం లే దు. ముంపునకు కారణమవుతున్న నందమూరు పాత అక్విడెక్ట్‌ను తొలగించాలని రైతులు కోరుతున్నారు. -
పాలకొల్లు ఆర్వోబీపై ట్రయల్ రన్
పాలకొల్లు :పాలకొల్లు పట్టణ శివారు నరసాపురం రోడ్డులోని అయ్యప్పస్వామి గుడి సమీపంలో 18 ఏళ్లుగా సాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. నరసాపురం కాలువపై వంతెన, రైల్వే ట్రాక్‌పై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తికాగా, అప్రోచ్‌రోడ్డు పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. దీంతో ఈ ఆర్వోబీపై ట్రయల్న్‌గ్రా వాహనాల ప్రయాణానికి అనుమతిచ్చారు. నరసాపురం, ఆచంట, తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాల నుంచి వచ్చే భారీ వాహనాలు పాలకొల్లు పట్టణంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆర్వోబీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అప్రోచ్ రోడ్డుకు మట్టి, గ్రావెల్ పనులు పూర్తికాగా తారురోడ్డు నిర్మాణం చేపట్టాల్సి వుంది. అయితే రోడ్డు కొంతమేరకు దిగబడే అవకాశం వున్నందున ముందుగా ట్రయల్ రన్‌గా వాహనాల రాకపోకలకు అనుమతిచ్చారు. మార్చి నెలాఖరునాటికి రోడ్డు నిర్మాణం పూర్తిచేసి పూర్తి స్థాయిలో భారీ వాహనాల రాకపోకలకు అనుమతిస్తామని ఆర్అండ్బీ డీఈ అడబాల శ్రీనివాస్ తెలిపారు. మూడు నెలల్లో పూర్తి: ఎంపీ గంగరాజు పాలకొల్లు : పాలకొల్లు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) ప్రారంభోత్సవం మరో మూడు నెలల్లో జరుగుతుందని ఎంపీ గోకరాజు గంగరాజు చెప్పారు. బుధవారం స్థానిక ఆర్వోబీ అప్రోచ్‌రోడ్డు పనులు పరిశీలించిన సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడుతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైల్వే, ఆర్అండ్బీ అధికారులతో సంప్రదించి పనులు పూర్తి చేసేందుకు కృషి చేశానన్నారు. ఇంకా అప్రోచ్ రోడ్డు పూర్తిస్థాయిలో నిర్మించాల్సి వుందన్నారు. ఇప్పటికే మట్టి, గ్రావెల్ పనులు పూర్తయ్యాయని, దీంతో బుధవారం నుంచి వాహనాల ప్రయాణానికి అనుమతి ఇచ్చినట్టు గంగరాజు తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి బీటీ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వడలివానిపాలెం నుంచి ఆచంట బైపాస్‌రోడ్డు మీదుగా ఆర్వోబీకి రింగ్‌రోడ్డు ఏర్పాటు చేయాలని దీనికి ఎంపీ గంగరాజు కృషి చేయాలని కోరారు. సమావేశంలో మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్ చైర్పర్సన్ కర్నేన రోజారమణి, ఆర్అండ్బీ డీఈ అడబాల శ్రీనివాస్, ఏఈ మూర్తి, టీడీపీ నాయకులు అడబాల వెంకటరమణ, గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు, కర్నేన గౌరునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
కాగితం వంతెనలు
ఏలూరు : జిల్లాలోని 15 ప్రధాన ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ల నిర్మాణానికి దశాబ్దాల తరబడి ప్రతిపాదనలు చేస్తున్నా బుట్టదాఖలవుతున్నాయి. కాగితాలకే పరిమి తం అవుతున్న వీటిని ఈ ప్రాంత ప్రజలు ముద్దుగా కాగితం వంతెనలు అని పిలిచుకుంటున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు జిల్లా నుంచి భారీగా ఆదాయం సమకూరుతున్నా ఈ ప్రాం తంపై ఆ శాఖ అధికారులు శీతకన్ను వేస్తున్నారు. ప్రధాన రహదారులపై ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ఆర్వోబీలను నిర్మించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 15చోట్ల వీటి నిర్మాణాలకు ఐదు దశాబ్దాలుగా ఆర్ అండ్ బీ శాఖ నుంచి తరచూ ప్రతిపాదనలు వెళుతున్నా ఒక్కదానికి కూడా నేటికీ గ్రీన్‌సిగ్నల్ రాలేదు. కనీసం ఏడాదికి ఒక్క ఆర్వోబీ నిర్మాణానికి నిధులిచ్చినా ఏనాడో వీటి నిర్మాణాలు పూర్తయ్యేవి. ఇవీ ప్రతిపాదనలు ఏలూరు మార్కెట్ యార్డు, భీమడోలు లెవెల్ క్రాసింగ్-368, చేబ్రోలు లెవెల్ క్రాసింగ్-365, బాదంపూడి-ఉంగుటూరు, ప్రత్తిపాడు-ఆరుగొలను, నవాబ్‌పాలెం, ఆకివీడు-ఉండి, ఉండి-భీమవరం, భీమవరం-మంచిలి, శృంగవృక్షం-పాలకొల్లు, నరసాపురం లెవెల్ క్రాసింగ్, భీమవరం (బైపాస్ రోడ్డు), ఏలూరు పవర్‌పేట, నిడదవోలు, కైకరం రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీల నిర్మాణానికి ఎన్నోసార్లు ప్రతిపాదనలు వెళాలయి. వీటిలో కేవలం నిడదవోలు, ఏలూరు పవర్‌పేట లెవెల్ క్రాసింగ్‌ల వద్ద లైన్ అలైన్‌మెంట్‌ను పరి శీలించారు. కాగా అంచనా వ్యయం తడిసిమోపెడు కావడంతో నిర్మాణాలకు వెనుకంజ వేస్తున్నారు. ఒక్కొక్క వంతెన నిర్మాణానికి సగటున రూ.40 కోట్ల అవుతుందని గతంలో అంచనా వేస్తే ఆ మొత్తం రూ.600 కోట్లకు దాటిపోయింది. మూడేళ్ల క్రితం వట్లూరులో ఆర్వోబీ మంజూరు కాగా, అధికారులు ఇటీవల పనులను ప్రారంభింపచేశారు. నిత్యం ప్రమాదాలే రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జఠిలం అవుతోంది. ఆర్వోబీల నిర్మాణానికి ప్రతిపాదించిన 15 రైల్వే క్రాసింగ్‌లు ప్రధాన రహదారులపైనే ఉన్నాయి. అక్కడ ఐదేసి నిమిషాలకు ఒకసారి రైల్వే గేట్లు వేయడం వల్ల కిలోమీటర్ల కొద్దీ ట్రా ఫిక్ నిలచిపోతోంది. వివిధ పనులపై వెళ్లేవారు, విధులకు హాజరయ్యే ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే చిన్నారులు సమయాభావం వల్ల గేటు వేసినా కిందనుంచి రాకపోకలు సాగిస్తూ మృత్యువాత పడుతున్నారు. తరచూ ఏదో ఒకచోట రైలు దాటుతూ విగతజీవులు అవుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను నిర్మూలించి ప్రయాణాలు సాఫీగా సాగాలంటే ఆర్వోబీల నిర్మాణమే శరణ్యమ ని అధికారులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. అరుునా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులూ.. పట్టించుకోరే ఆర్వోబీల నిర్మాణానికి రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం (ఆర్ అండ్ బీ) నిర్ధేశించిన మేరకు సకాలంలో వాటా నిధులను విడుదల చేస్తేనే వాటికి మోక్షం కలుగుతుంది. రైల్వేశాఖ కేవలం రైల్వేగేటు వరకు మాత్రమే నిర్మాణాలకు నిధులిస్తోంది. వంతెన పూర్తిచేయడంతోపాటు అటూఇటూ అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అధిక శాతం నిధులను ఆర్ అండ్ బీ శాఖ వెచ్చించాల్సి ఉంటుంది. వీటిని మంజూరు చేయించే విషయంలో పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు శ్రద్ధ చూపడం లేదు. -
టంగుటూరులో టెన్షన్.. టెన్షన్
‘టంగుటూరులోని నాగేశ్వర స్వామి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను ఈ నెల 24వ తేదీలోగా తొలగించండి’ ్చ ఓ మహిళ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై దేవాదాయశాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం టంగుటూరులోని పోతుల వెస్ట్ కాలనీలో 1,250 మంది ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పొందారు. వీరిలో 600 మంది అనర్హులని అధికారులు ఆలస్యంగానైనా గుర్తించారు. 600 మందికి నోటీసులిచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. టంగుటూరులో మెయిన్ రోడ్‌పై రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఆర్ఓబీ నిర్మాణం వల్ల పంచాయతీ కాంప్లెక్స్‌లతో పాటు పలువురి ఇళ్లు, ప్రైవేట్ వ్యాపార సముదాయాలు తొలగించనున్నారు. టంగుటూరులో తమకు చెందిన 10 ఎకరాల ఈనాం భూములను ఆక్రమించుకున్నారని కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన కొందరు హైకోర్టులో పోరాడుతున్నారు. ప్రైవేట్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద భవనాలు, పొగాకు కంపెనీలు, సినిమా హాల్ ఈ భూమిలోనే ఉన్నాయి. దీనిపై ఎలాంటి తీర్పు వెలువడుతుందోనని జనం ఎదురుచూస్తున్నారు. ఈ నాలుగు అంశాలు టంగుటూరులో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఏ ఇద్దరు వ్యక్తులు ఎదురుపడినా వీటి గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఏ రోజు ఏం జరుగుతుందోనని జనం ఆందోళన చెందుతుందడగా.. సంఘటనలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న కుటుంబాలు భయంతో వణికిపోతున్నాయి. - న్యూస్‌లైన్, టంగుటూరు రాజీవ్‌నగర్ వాసుల్లో కలవరం టంగుటూరులో 1977లో ఓ ప్రదేశంలో పేదల గుడిసెలు వెలిశాయి. కాలక్రమంలో గుడిసెల స్థానంలో పక్కా భవనాలు నిర్మించారు. కొందరు వ్యక్తులు అక్కడ స్థలాలను విక్రయించి వెళ్లిపోయారు. కొనుగోలు చేసిన వారు భవనాలు నిర్మించుకున్నారు. కాలనీకి రాజీవ్‌నగర్ అని పేరుపెట్టారు. ఇక్కడ 100 పక్కా గృహాలున్నాయి. అధికారులు ప్రభుత్వ నిధులతో మౌలిక వసతులు కల్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఓ మహిళ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)తో అసలు విషయం బయటపడింది. ఆ భూములు నాగేశ్వరస్వామి దేవస్థానానికి చెందినవని, మొత్తం 6 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని నిరూపితమైంది. పిల్‌పై తీవ్రంగా స్పందించిన హైకోర్టు.. ‘దేవుడి మాన్యంలో అనుమతి లేకుండా నిర్మించుకున్న గృహాలను ఈ నెల 24వ తేదీలోగా తొలగించండి’ అని దేవాదాయశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలవరపడ్డ కాలనీ వాసులు స్టే కోసం సుప్రీం కోర్టు మెట్లెక్కారు. స్టే కోసం టెన్షన్‌తో ఎదురుచూస్తున్నారు. దేవాదాయ శాఖ మాత్రం రాజీవ్‌నగర్‌ను తొలగించేందుకు సన్నద్ధమవుతోంది. పోతుల వెస్ట్ కాలనీలో అనర్హులకు నోటీసులు సిద్ధం టంగుటూరులో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు అధికారులు 50 ఎకరాల దేవాదాయ భూమిని సేకరించారు. 2009లో పోతులవెస్ట్ కాలనీ పేరుతో సుమారు 1,250 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఈ స్థలాల్లో ఇప్పటికే చాలా మంది పక్కా గృహాలు నిర్మించుకున్నారు. ప్రస్తుతం పలు ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ స్థలాల్లో అనర్హులకు పట్టాలు కట్టబెట్టారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం గత ఏడాది మార్చిలో విచారణకు ఆదేశించించింది. విచారణ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. స్థలాలు పొందిన వారిలో 600 మందిని అధికారులు అనర్హులుగా గుర్తించారు. వారికి నోటీసులు జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారు. నోటీసులిస్తే ఏం సమాధానం చెప్పాలో అంతుబట్టక పలువురు లబ్ధిదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్న ఆర్ఓబీ రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ).. ఈ మాట టంగుటూరు గ్రామస్తుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. టంగుటూరు మెయిన్‌రోడ్డులో ఆర్ఓబీ నిర్మిస్తుండటమే ఇందుకు కారణం. పంచాయతీ కార్యాలయం నుంచి రైల్వే గేటు మీదుగా కొండపి రోడ్డులో కామనివారికుంట వరకు ఉన్న మెయిన్‌రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే తీవ్రంగా నష్టపోవడం ఖాయమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూడు పంచాయతీ మార్కెట్ కాంప్లెక్స్‌లు, ప్రైవేట్ మార్కెట్ కాంప్లెక్స్‌లు, వ్యాపార సంస్థలు, ఇళ్లు.. ఇలా ఆదాయాన్ని సమకూర్చే వనరులన్నీ మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా ఉన్నాయి. ఆర్ఓబీ నిర్మాణంతో ఇవన్నీ కూలే అవకాశముంది. నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాలని రైల్వే ఉన్నతాధికారులను కలిసి టంగుటూరు వాసులు విన్నవించారు. సమస్యను ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. జనం మాటలు వారు వినకపోగా.. ఆర్ఓబీ నిర్మాణానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ మార్గంలో మట్టి శాంపిల్స్ కూడా సేకరించడంతో గ్రామస్తుల్లో ఆందోళన ఎక్కువైంది. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ‘కుమ్మరి ఈనాం భూములు మావే’ టంగుటూరులో సుమారు పది ఎకరాల కుమ్మరి ఈనాం భూములకు అసలైన వారసులం తామేనంటూ కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఐదేళ్ల క్రితం హైకోర్టులో కేసు వేశారు. తమ పూర్వీకుల పేరున ఉన్న కుమ్మరి ఈనాం భూములను తమకు స్వాధీనం చేయాలని వారు పోరాడుతున్నారు. అత్యంత ఖరీదైన ఈ 10 ఎకరాల భూములు గ్రామంలో ఆర్థికంగా బలవంతులైన వారి చేతిలో ఉన్నాయి. ప్రైవేట్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద భవనాలు, పొగాకు కంపెనీలు, సినిమా హాల్‌ను ఈ భూముల్లో నిర్మించారు. ఈ విషయంపైనా గ్రామంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. -
త్వరలో రైల్వే ఓవర్ బ్రిడ్జి
నాగపూర్: అజ్ని స్టేషన్లో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ) త్వరలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ)ని నిర్మించనుంది. దీని అంచనా వ్యయం రూ. 300 కోట్లు. దీని నిర్మాణం కోసం జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరాభివృద్ధి పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) పథకం కింద నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుంది. ఈ ప్రతిపాదనపై ఈ నెల 21వ తేదీన జరగనున్న స్థాయీసమితి సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనుంది. కాగా అజ్ని స్టేషన్లో ఆర్ఓబీని నిర్మించాలంటూ గత రెండు సంవత్సరాలుగా ఎంపీ విలాస్ ముత్తెంవార్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అజ్ని స్టేషన్లో ఉన్న ఆర్ఓబీ 125 సంవత్సరాల క్రితం నాటిది. దీంతో మరో ఆర్ఓబీని అత్యవసరంగా నిర్మించాల్సిన పరిస్థితి నెలకొంది. తుక్డోజీ పుట్లా స్వ్వేర్, వంజరి నగర్ లే అవుట్ రోడ్డు మీదుగా దీనిని చునాబట్టి ప్రాంతంవరకూ నిర్మించాలని సంబంధిత అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించి ఎన్ఎంసీ కన్సల్టెంట్ ఎస్.ఎన్.భోబే తదితరులు ఓ ప్రాథమిక నివేదికను రూపొందించారు. సమగ్ర ప్రాజెక్టు (డీపీఆర్) కోసం ఎన్ఎంసీ ప్రజాపనుల శాఖ త్వరలో ఓ కన్సల్టెంట్‌ను నియమించనుంది.