
మెట్రోకు తొలగిన ఆర్‌ఓబీ చిక్కులు
- ట్రాఫిక్ బ్లాక్ చార్జీల రుసుముపై మెట్టు దిగిన రైల్వే
- ఒక్కో బ్రిడ్జీ నిర్మాణానికి రూ.కోటి చెల్లిస్తే సరిపోతుందని స్పష్టీకరణ
- 66 కిలోమీటర్ల మార్గంలో ఊపందుకున్న పనులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకు మరిన్ని చిక్కులు తొలిగాయి. నగరంలో ఆరు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జీ(ఆర్‌ఓబీ)ల నిర్మాణానికిగానూ ట్రాఫిక్ బ్లాక్ చార్జీల పేరిట భారీగా రుసుములు చెల్లించాలని తొలుత పేచీపెట్టిన దక్షిణ మధ రైల్వే ఇప్పుడు మెట్టు దిగింది. ఒక్కో బ్రిడ్జీ నిర్మాణానికి సుమారు రూ.కోటి చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేయడంతో మెట్రో పనులకు లైన్‌క్లియర్ అరుు్యంది. మరోవైపు నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో మెట్రో పనులకు సేకరించాల్సిన 13 ఆస్తులకు సంబంధించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించడంతో ఆ మేరకు పరిహారం ఇచ్చేందుకు హైదరాబాద్ మెట్రో రైలు(హెచ్‌ఎంఆర్) సంస్థ సూత్రప్రాయంగా అంగీకరించడంతో ఈ ప్రాంతంలో మెట్రోకు మార్గం సుగమమైంది. కాగా వచ్చే ఏడాది ఉగాది(మార్చి 28న)నాగోల్-మెట్టుగూడా, మియాపూర్-పంజాగుట్ట మార్గాల్లో తొలి దశ మెట్రో రైళ్లు రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు సమాచారం.
రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం ఇక్కడే..
ఎల్బీనగర్-మియాపూర్ (కారిడార్-1)మార్గంలో భరత్‌నగర్, లక్డీకాపూల్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ఆర్‌ఓబీలను నిర్మించనున్నారు. ఇందులో భరత్‌నగర్ ఆర్‌ఓబీ నిర్మాణం ఇప్పటికే పూర్తరుు్యంది. మరో రెండింటిని నిర్మించాల్సి ఉంది. జేబీఎస్-ఫలక్‌నుమా(కారిడార్-2)లో బోరుుగూడలో ఆర్‌ఓబీ నిర్మాణం పూర్తరుు్యంది. నాగోల్-శిల్పారామం(కారిడార్-3) పరిధిలో బేగంపేట్, ఒలిఫెంటా బ్రిడ్జి, చిలకలగూడ, ఆలుగడ్డ బావి ప్రాంతాల్లో 4 ఆర్‌ఓబీలను నిర్మించనున్నారు. మిగిలిన 6 ఆర్‌ఓబీలకు సంబంధించి రూ.6 కోట్ల మేర ట్రాఫిక్ బ్లాక్ చార్జీలు రైల్వే శాఖకు చెల్లిస్తే సరిపోతుందని హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపారుు. వీటి నిర్మాణం విషయానికి వస్తే ఆలుగడ్డ బావి, చిలకలగూడ ప్రాంతాల్లో ప్రీస్ట్రెస్డ్ కాంక్రీట్ విధానంలో ఆర్‌ఓబీల నిర్మాణం చేపట్టనున్నట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు తెలిపారుు. లక్డికాపూల్, మలక్‌పేట్, బేగంపేట్‌లో సాధారణ బ్రిడ్జీల రీతిలో వీటిని నిర్మిస్తామన్నారు. ఒలిఫెంటాబ్రిడ్జి వద్ద ఇనుముతో బ్రిడ్జీ నిర్మాణం చేపట్టనున్నారు.
ప్రస్తుతం పనుల పురోగతి ఇలా..
ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా, నాగోల్-రహేజా ఐటీపార్క్ మూడు కారిడార్ల పరిధిలో మొత్తం 72 కిలోమీటర్లకుగాను.. ప్రస్తుతం 66 కిలోమీటర్ల మార్గంలో పనులు ఊపందుకున్నారుు. ఆయా ప్రాంతాల్లో పిల్లర్ల నిర్మాణం పూర్తరుు్యంది. వీటిపై పట్టాలు పరిచేందుకు వీలుగా వయాడక్ట్ సెగ్మెంట్ల నిర్మాణం 50 కిలోమీటర్ల మార్గంలో ఏర్పాటైంది. మొత్తం 65 మెట్రో స్టేషన్లలో ఇప్పటికే 35 స్టేషన్ల నిర్మాణం పూర్తరుు్యంది. మిగతావి పురోగతిలో ఉన్నారుు. ఎంజీబీఎస్- ఫలక్‌నుమా(6కి.మీ.) మెట్రో మార్గం ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఇక్కడ పనులు మొదలుకాలేదు. మొత్తంగా రూ.14,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మెట్రో ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.11 వేల కోట్లు వ్యయం చేసినట్లు ఎల్‌అండ్‌టీ పేర్కొంది.