తండ్రి సహా 12 మందిని చంపేశాడు! | A man in Iran guns down 12 relatives in a shooting rampage | Sakshi
Sakshi News home page

తండ్రి సహా 12 మందిని చంపేశాడు!

Published Sun, Feb 18 2024 5:53 AM | Last Updated on Sun, Feb 18 2024 5:53 AM

A man in Iran guns down 12 relatives in a shooting rampage - Sakshi

టెహ్రాన్‌: ఇరాన్‌లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి, సోదరుడు సహా మొత్తం 12 మంది కుటుంబసభ్యులను పొట్టనబెట్టుకున్నాడు. కెమ్రాన్‌ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఇరాన్‌ మీడియా శనివారం తెలిపింది.

30 ఏళ్ల వ్యక్తి తన తండ్రి, సోదరుడితోపాటు మొత్తం 12 మందిని ఏకే రైఫిల్‌తో కాల్చి చంపాడని, అనంతరం పోలీసులు అతడిని కాల్చి చంపారని తెలిపింది. మారుమూల గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణానికి కుటుంబకలహాలే కారణమని పేర్కొంది. మృతుల్లో చిన్నారులు ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. అయితే, మృతుల వివరాలు, ఘటనకు కారణాలను మాత్రం మీడియా వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement