నిజామాబాద్‌: ఒకే ఇంట్లో ఆరుగురు హత్య.. స్నేహితుడే కారణం! | Six Same Family Members Murdered At Nizamabad District - Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌: ఒకే ఇంట్లో ఆరుగురు హత్య.. స్నేహితుడే కారణం!

Published Mon, Dec 18 2023 4:35 PM | Last Updated on Mon, Dec 18 2023 5:03 PM

Same Family Six Family Members Mudered At Nizamabad - Sakshi

నిందితుడు ప్రశాంత్‌ ఫైల్‌ ఫొటో

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చారు. అయితే, వీరి హత్యకు ఆస్తి తగదాలే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకారం.. డిచ్‌పల్లి మండలంలోని మాక్లుర్‌కు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్ళిపోయి స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్‌కు మాక్లుర్‌లో ఓ ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపైన కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్‌పై ప్రసాద్ ఒత్తిడి తెచ్చాడు.

ఈ క్రమంలో ఎలాగైనా ఆ ఇంటిని ప్రశాంత్‌ తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. దీంతో, ప్లాన్‌ ప్రకారం ప్రసాద్‌ను బయటకు తీసుకెళ్ళి నిజామాబాద్–కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్ళి మీ భర్తను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి ఆమెను బయటకు తీసుకెళ్ళాడు. ఆమెను కూడా హతమార్చి బాసర నదిలో వదిలేశాడు. ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హత్య చేశాడు. అనంతరం.. ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో, ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేసినట్లు సమాచారం.

అయితే, మాక్లుర్‌కు చెందిన నిందితుడు ప్రశాంత్ వయసు 20 ఏళ్లు. మొదటి మూడు హత్యలు ఒక్కడే చేశాడని.. మిగిలిన మూడు హత్యల్లో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య కాబడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఎక్కడా కూడా మిస్సింగ్‌ కేసు నమోదు కాలేదు. కాగా, నమ్మిన స్నేహితుడే ఇలా వారిని హత్య చేయడంతో స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనలో నిందితులకు తగిన శిక్ష విధించాలని కోరుతున్నారు. మరోవైపు.. వీరి హత్యలకు సంబంధించి పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నట్లు సమాచారం. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement