మెయిన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నూతన దంపతులతోపాటు మరో ఇద్దరు కుటుంబసభ్యులను, ఓ స్నేహితుడిని ఓ వ్యక్తి గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోను యాదవ్(22), సోని(20)లకు శుక్రవారమే వివాహమైంది. రాత్రి బారాత్ వేడుక జరిగింది.
అనంతరం అందరూ నిద్రిస్తుండగా సోను సోదరుడు శివ్ వీర్ యాదవ్(28) గొడ్డలితో నూతన దంపతులతోపాటు మరో సోదరుడు, బావ మరిది సౌరభ్, స్నేహితుడిని చంపేశాడు. తన భార్య, అత్తపైకి తుపాకీతో కాల్పులు జరపగా వారు గాయపడ్డారు. అనంతరం నిందితుడు శివ్ వీర్‌యాదవ్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘాతుకానికి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌పీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment