రక్తదానం చేస్తున్న కొత్త జంట
లక్నో : ప్రాణాపాయంలో ఉన్న ఓ యువతికి రక్త దానం చేసి ప్రాణం నిలిపింది కొత్తగా పెళ్లైన ఓ జంట. పెళ్లి బట్టల్లో రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచింది. వివరాలు.. కొద్దిరోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ యువతికి ఆపరేషన్ చేయటానికి రక్తం అత్యవసరమైంది. దీంతో పోలీస్ మిత్ర ద్వారా రక్తదానం చేసే వారి కోసం అన్వేషించారు. అయితే ఎవ్వరూ రక్తం ఇవ్వటానికి ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో యువతికి రక్తం అవసరమన్న సంగతి తెలుసుకున్న ఓ వధూవరుల జంట రక్తం ఇవ్వటానికి ముందుకు వచ్చింది. ( భార్యకు వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా ఓ ప్రాణం)
పెళ్లి బట్టలతో ఆసుపత్రికి వెళ్లి రక్త దానం చేసి యువతి ప్రాణాలు కాపాడింది. ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారి ఆశిష్ మిశ్రా తన ట్విటర్ ఖాతా వేదికగా వెల్లడించారు. వధూవరుల జంటపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు కూడా వారిద్దరిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ( వైరల్: టైటానిక్ మరో క్లైమాక్స్ సీన్ వీడియో )
Comments
Please login to add a commentAdd a comment