రంగారెడ్డి (ఘట్‌కేసర్): మిగులు బడ్జెట్‌తో దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణను అగ్రగామిగా నిలబెడతామని రవాణ శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని కేఎల్ఆర్ ఫంక్షన్ హాలులో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దర్గ దయాకర్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక ఎంపీపీ బండారి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పట్నం పై విధంగా పేర్కొన్నారు. అంతకు ముందు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ సమావేశం హాలు వరకు ర్యాలీగా వెళ్లారు.
ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌కు టీఆర్‌ఎస్ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంపన్నంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సీమాంధ్ర పాలకులు 60 ఏళ్లుగా దోచుకుతిన్నారన్నారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లను నిర్మించుకున్నవారికి ప్లాట్లను అందజేశామన్నారు. మిగిలిన కొద్దిమంది పేదలకు కూడా క్రమబద్ధీరిస్తామన్నారు. జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ.2000 కోట్లు కేటాయించామని, మిషన్ కాకతీయలో భాగంగా జిల్లాలోని 558 చెరువుల్లో పూడికతీత పనులను చేపట్టామని మంత్రి తెలిపారు.
'తెలంగాణను అగ్రగామిగా నిలబెడతాం'
Published Sun, Jun 14 2015 9:43 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement