minister mahinder reddy
-
మాది పేదల సర్కారు
♦ జిల్లాకు భారీగా పరిశ్రమలు రానున్నాయి ♦ బంగారు తెలంగాణ సాధనే కేసీఆర్ లక్ష్యం ♦ మంత్రి మహేందర్‌రెడ్డి ♦ నవాబుపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నవాబుపేట : మాది పేదల ప్రభుత్వం. ప్రతి పేదవాడికీ న్యాయం జరుగుతుంది అని రాష్ర్ట రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవా రం మండలంలోని గుబ్బడిపత్తేపూర్, గంగ్యాడ, ముబారక్పూర్, తిమ్మరెడ్డిపల్లి, పూలపల్లిలో అంతర్గత మురుగు కాల్వల నిర్మాణాలకు ఆయన శంకుస్థాన చేశారు. హరితహారంలో భాగం గా మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. అందుకు బృహత్తరమైన ప్రణాళికలతో ముందుకుపోతున్నారని స్పష్టంచేశారు. ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయలలోపు రైతు రుణాలను విడతల వారీగా మాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాకు పెద్ద కంపెనీలు రాబోతున్నాయన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనుందని ఆయన తెలిపారు. బంగారు తెలంగాణ కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. జిల్లాలోనే న వాబుపేట మండలం వెనకబడిన మం డలమని.. అధిక నిధులు వెచ్చించి ఈ మండలాభివృద్ధికి కృషి చేస్తానని మం త్రి హామీ ఇచ్చారు. నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండుకు నిధులు మం జూరు చేసి ఉపయోగంలోకి తీసుకవస్తామన్నారు. బీటీ రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి బస్సులు వేస్తామన్నారు. చేవెళ్లకు ఒక ప్రత్యేక ఉందని.. ఈ ని యోజకవర్గానికి చెం దిన వారు మం త్రి, ఎంపీ, జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్సీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండటం సుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధికి అధిక నిధులు ఇవ్వండి వెన కబడిన నవాబుపేట మండలానికి అధిక నిధులు అందించి అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రిని కోరనున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. నవాబుపేటకు ఇప్పటివరకూ మార్కెట్ యార్డు లేదన్నారు. దీంతో రైతులు ధాన్యాన్ని విక్రయించడానికి వికారాబాద్‌కు వెళుతున్నారని తెలిపారు. గ్రామాలకు లింక్ రోడ్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పాండురంగారెడ్డి, వైస్ ఎంపీపీ సుజాత దర్శన్, పీఏసీఎస్ చైర్మన్ మానిక్‌రెడ్డి, తహసీల్దార్ యాదయ్య, ఎంపీడీఓ తరుణ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్‌లు తిరుపత్తిరెడ్డి, విర్జినమ్మ, గోవిందమ్మ మల్లేశం, గోపాల్‌గౌడ్, పద్మమ్మ మల్లేశం, నర్సింలు, సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పరమేష్, సంజీవరావు, నాయకులు మా ణిక్రెడ్డి, వెంకటయ్య, ప్రభాకర్‌రెడ్డి, రావ్గారి వెంకట్‌రెడ్డి, నాగిరెడ్డి, సిం దం మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
'తెలంగాణను అగ్రగామిగా నిలబెడతాం'
రంగారెడ్డి (ఘట్కేసర్): మిగులు బడ్జెట్‌తో దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణను అగ్రగామిగా నిలబెడతామని రవాణ శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని కేఎల్ఆర్ ఫంక్షన్ హాలులో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దర్గ దయాకర్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక ఎంపీపీ బండారి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పట్నం పై విధంగా పేర్కొన్నారు. అంతకు ముందు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ సమావేశం హాలు వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌కు టీఆర్ఎస్ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంపన్నంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సీమాంధ్ర పాలకులు 60 ఏళ్లుగా దోచుకుతిన్నారన్నారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లను నిర్మించుకున్నవారికి ప్లాట్లను అందజేశామన్నారు. మిగిలిన కొద్దిమంది పేదలకు కూడా క్రమబద్ధీరిస్తామన్నారు. జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ.2000 కోట్లు కేటాయించామని, మిషన్ కాకతీయలో భాగంగా జిల్లాలోని 558 చెరువుల్లో పూడికతీత పనులను చేపట్టామని మంత్రి తెలిపారు. -
'కార్మికులంటే గౌరవమే.. కక్షసాధింపు కాదు'
నిజామాబాద్: 'ఆర్టీసీ నష్టాల్లో ఉందని, గట్టెక్కేదాక ఆగితే అడిగినంత ఇస్తామని చెప్పాం. అయినా కార్మికులు సమ్మెకు దిగారు' అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆయన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణానికి సమీపంలోని నర్సన్నపల్లి వద్ద రవాణా శాఖ కార్యాలయాన్నిగురువారం ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశారని, వారంటే తమకెంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కార్మికులపై కక్షసాధింపు చర్యలు లేవని, ఇప్పటికీ వారిని సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. కేబినెట్ సబ్‌కమిటీని సీఎం కేసీఆర్ నియమించారని, నివేదిక అందిన తరువాత కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నష్టాల్లో ఉన్నందునే కార్మికులను సమ్మెకు పోవద్దని కోరామని మంత్రి పట్నం చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు వాహనాల దారులు ఎక్కువ డబ్బులు తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. (కామారెడ్డి)