మాది పేదల సర్కారు
♦ జిల్లాకు భారీగా పరిశ్రమలు రానున్నాయి
♦ బంగారు తెలంగాణ సాధనే కేసీఆర్ లక్ష్యం
♦ మంత్రి మహేందర్‌రెడ్డి
♦ నవాబుపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నవాబుపేట : మాది పేదల ప్రభుత్వం. ప్రతి పేదవాడికీ న్యాయం జరుగుతుంది అని రాష్ర్ట రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవా రం మండలంలోని గుబ్బడిపత్తేపూర్, గంగ్యాడ, ముబారక్‌పూర్, తిమ్మరెడ్డిపల్లి, పూలపల్లిలో అంతర్గత మురుగు కాల్వల నిర్మాణాలకు ఆయన శంకుస్థాన చేశారు. హరితహారంలో భాగం గా మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. అందుకు బృహత్తరమైన ప్రణాళికలతో ముందుకుపోతున్నారని స్పష్టంచేశారు.
ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయలలోపు రైతు రుణాలను విడతల వారీగా మాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాకు పెద్ద కంపెనీలు రాబోతున్నాయన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనుందని ఆయన తెలిపారు. బంగారు తెలంగాణ కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. జిల్లాలోనే న వాబుపేట మండలం వెనకబడిన మం డలమని.. అధిక నిధులు వెచ్చించి ఈ మండలాభివృద్ధికి కృషి చేస్తానని మం త్రి హామీ ఇచ్చారు. నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండుకు నిధులు మం జూరు చేసి ఉపయోగంలోకి తీసుకవస్తామన్నారు. బీటీ రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి బస్సులు వేస్తామన్నారు. చేవెళ్లకు ఒక ప్రత్యేక ఉందని.. ఈ ని యోజకవర్గానికి చెం దిన వారు మం త్రి, ఎంపీ, జెడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్సీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండటం సుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.
అభివృద్ధికి అధిక నిధులు ఇవ్వండి
వెన కబడిన నవాబుపేట మండలానికి అధిక నిధులు అందించి అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రిని కోరనున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. నవాబుపేటకు ఇప్పటివరకూ మార్కెట్ యార్డు లేదన్నారు. దీంతో రైతులు ధాన్యాన్ని విక్రయించడానికి వికారాబాద్‌కు వెళుతున్నారని తెలిపారు. గ్రామాలకు లింక్ రోడ్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ పాండురంగారెడ్డి, వైస్ ఎంపీపీ సుజాత దర్శన్, పీఏసీఎస్ చైర్మన్ మానిక్‌రెడ్డి, తహసీల్దార్ యాదయ్య, ఎంపీడీఓ తరుణ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్‌లు తిరుపత్తిరెడ్డి, విర్జినమ్మ, గోవిందమ్మ మల్లేశం, గోపాల్‌గౌడ్, పద్మమ్మ మల్లేశం, నర్సింలు, సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పరమేష్, సంజీవరావు, నాయకులు మా ణిక్‌రెడ్డి, వెంకటయ్య, ప్రభాకర్‌రెడ్డి, రావ్‌గారి వెంకట్‌రెడ్డి, నాగిరెడ్డి, సిం దం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.