Loan waiver scheme
-
రైతులపై జులుం... కార్పొరేట్లకు సలాం
బ్యాంకులు ప్రదర్శిస్తున్న ఈ అసమానత వింత గొలుపుతుంది. ఒక ఆర్టీఐ అభ్యర్థనకు ప్రతిస్పందిస్తూ, 2014 ఏప్రిల్ 1 నుండి కార్పొరేట్ ఇండియాకు సంబంధించి రూ. 16.61 లక్షల కోట్ల మొండి రుణాలనుబ్యాంకులు మాఫీ చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. మరుసటి రోజు రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాల్ పార్లమెంటులో మాట్లాడుతూ, దేశంలో బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు ఇప్పుడు రూ. 32 లక్షల కోట్లు దాటాయని అన్నారు. 18.74 కోట్లకు పైగా రైతులు తమ రుణాలతో సతమతమవుతున్నారు. మొత్తం బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు వార్షిక వ్యవసాయ బడ్జెట్ వ్యయం కంటే 20 రెట్లు ఎక్కువ అని బేనీ వాల్ అన్నారు. రైతులకు వ్యవసాయ రుణ మాఫీ పథకం గురించి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు.కార్పొరేట్లకు రుణమాఫీదీనికి విరుద్ధంగా, గత 11 ఏళ్లలో ఇండియా కార్పొరేట్లు చేసిన మొత్తం రూ.16.61 లక్షల కోట్ల నిరర్థక రుణాలను (కేవలం 16 శాతం రికవరీతో) రద్దు చేశారు. గత ఐదేళ్లలో కార్పొరేట్లు చెల్లించని రుణా లలో రూ. 10.6 లక్షల కోట్లను రద్దు చేయడానికి భారతీయబ్యాంకులు ఏమాత్రం సందేహించలేదు. ఈ మొండి బకాయిలలో 50 శాతం పెద్ద కంపెనీలకు చెందినవని నివేదికలు చెబుతున్నాయి. అదే కర్ణాటక, శివమొగ్గలోని ఒక రైతు కేవలం తన రూ. 3.46 పైసల బకాయి చెల్లించేందుకు సాధారణ బస్సు సర్వీస్ లేకపోతే, 15 కిలో మీటర్లు నడిచివెళ్లాల్సినంతటి ఆత్రుతను బ్యాంక్ ప్రదర్శించింది.2023–24 ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకులు రూ. 1.7 లక్షల కోట్లు మాఫీ చేశాయి. ఒక సంవత్సరం క్రితం, 2022–23లో రూ. 2.08 లక్షల కోట్లు మాఫీ చేశాయి. కానీ వ్యవసాయ రుణాలను మాఫీ చేసే విషయానికి వస్తే, కేంద్రం రెండుసార్లు మాత్రమే ఆ పని చేసింది: 1990, 2008లో. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా వ్యవ సాయ రుణాల మాఫీ చేశాయి. కానీ మాఫీ చేసిన మొత్తాన్ని బ్యాంకు లకు రాష్ట్రాలు చెల్లిస్తున్నందున అది బ్యాంకులపై భారం కాదు. కార్పొ రేట్లు చెల్లించని బ్యాంకు రుణాలను అవి దేశ నిర్మాణానికి తోడ్ప డ్డాయనేంత జాగ్రత్తగా మాఫీ చేశారు. చిన్న రుణాలు మాఫీ చేయలేమా?పేద రైతులు, గ్రామీణ శ్రామికవర్గం చేసిన చిన్న చిన్న రుణా లను మాఫీ చేయడం అనేది జాతీయ బ్యాలెన్స్ షీట్‌ను కలవర పెట్టడానికి కారణంగా కనిపిస్తుంది. అదే ధనవంతులైన రుణమాఫీ దారులు సులభంగా తప్పించుకుంటారు. వీరిలో రూ.3.45 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను చెల్లించని 16,000 మందికి పైగా ఉద్దేశ పూర్వక రుణమాఫీదారులు ఉన్నారు. పైగా వారివద్ద డబ్బు ఉందని ఆర్బీఐ అంగీకరించినప్పటికీ వారు తిరిగి చెల్లించడానికి ఇష్టపడలేదు. కచ్చితంగా, వీరు సంపద సృష్టికర్తలు. దేశం వారిని అభినందించాలన్నమాట!ఇప్పుడు రాజస్థాన్‌లోని పీలీబంగాకు చెందిన ఒక రైతును చూడండి: ఆయన ఒక ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 2.70 లక్షల రుణం తీసుకొని రూ. 2.57 లక్షలను తిరిగి చెల్లించాడు (మహమ్మారి సమయంలో రాష్ట్రం నుండి అందుకున్న రూ. 57,000 మద్దతుతో సహా). మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. ఆయన ఒక రోజు ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. తరువాత, ఆగ్రహించిన గ్రామస్థులు ఆ తాళం పగలగొట్టారు.ఈ దురదృష్టకర సంఘటనను మరొకదానితో పోల్చి చూద్దాం. ప్రముఖ మిశ్రమ లోహ, ఉక్కు తయారీదారు అయిన ‘ఆధునిక్ మెటాలిక్స్’... 2018 జూలైలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కోల్‌కతా శాఖ తన పరిష్కార ప్రణాళికను ఆమోదించిన తర్వాత, తమ బకాయిలు రూ. 5,370 కోట్లకుగానూ కేవలం రూ. 410 కోట్లు చెల్లించడానికి ఒప్పుకుంది. అంటే 92 శాతం రుణమాఫీ! స్పష్టంగా, ఇంత పెద్ద ‘రుణమాఫీ’ తర్వాత, కంపెనీ ప్రమోటర్లు అన్ని కార్యకలాపాలను పూర్తి చేయడానికీ, ప్రధానసంస్థను పునరుద్ధరించి తిరిగి పని చేయడం ప్రారంభించడానికీ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకప్పుడు పరివర్తనాత్మక పరిష్కార యంత్రాంగంగా ప్రశంసలందుకున్న దివాళా కోడ్ ఇప్పుడు ఒక వైఫల్యంగా మారిపోయింది.అయితే, పెద్ద ప్రశ్న మిగిలే ఉంది. పెండింగ్‌లో ఉన్న రూ. 20,000 మొత్తాన్ని తిరిగి పొందలేకపోయినందుకు రాజస్థాన్ రైతు ఇంటికి తాళం వేయగలిగినప్పుడు, పెండింగ్‌లో ఉన్న బకాయిలలో 92 శాతం మాఫీ చేసి రాజమార్గాన పంపడానికి బదులుగా, ఆధునిక్ మెటాలిక్స్ వంటి సంస్థల ప్రాంగణాన్ని ఎన్సీఎల్టీ ఎందుకు తాళం వేయలేకపోయింది? రైతుల వంటి వారే అయిన ఆ యజమానులను ఎందుకు కటకటాల వెనుక ఉంచలేకపోయింది?చట్టాల్లో ఎందుకు తేడా?ఒక పెద్ద కంపెనీకి ఇంత పెద్ద ‘రుణమాఫీ’ అవసరమైనప్పుడు, రైతులు ఇలాంటి విధానంతో ప్రయోజనాన్ని, అది కూడా సాపేక్షంగా తక్కువ అయినాసరే ఎందుకు పొందకూడదు? వివిధ వర్గాల బ్యాంకు వినియోగదారులకు బ్యాంకింగ్ చట్టాలు ఎందుకు భిన్నంగాఉండాలి? గృహనిర్మాణం, కారు, ట్రాక్టర్ లేదా మోటార్ సైకిల్ రుణాలు తీసుకునే వారిని బ్యాంకులు ఎప్పుడైనా అదే రకమైన సున్ని తత్వంతో చూస్తాయా? ఆర్థిక వృద్ధి పేరుతో కంపెనీల మొండి బకాయిలను మాఫీ రూపంలో తమ సొంతం చేసుకోవాల్సిన అగత్యాన్ని బ్యాంకులు ఎంతకాలం సమర్థించుకోగలవు?పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో నిటారుగా నిలబడి ఉన్న తమ కాలీఫ్లవర్, క్యాబేజీ పంటలను తిరిగి దున్నడానికి ట్రాక్టర్లను నడుపుతున్న రైతుల బాధాకరమైన వీడియోలను; ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్లలో టమోటా ధరలు పతనమై రైతులు కుప్పగూలిపోవడాన్ని నేను సోషల్ మీడియాలో చూసినప్పుడు తీవ్రంగా బాధపడ్డాను. టమోటా, ఉల్లిపాయ, బంగాళాదుంపల ధరలను స్థిరీకరించడానికి రూ. 500 కోట్ల వ్యయంతో 2018–19 బడ్జెట్లో ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్స్ పథకం నాకు ఇలాంటి సందర్భాల్లో గుర్తుకువస్తుంది. కోల్డ్ చైన్స్ నెట్‌వర్క్‌తో సహా వ్యవసాయ మౌలిక సదుపా యాలలో తగినంత పెట్టుబడి పెట్టడం అనేది నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ వాస్తవికత ఏమిటంటే, కూరగాయల ధరలను స్థిరీకరించడంలో ఆపరేషన్ గ్రీన్స్ పథకం ఘోరంగా విఫలమైంది. తగిన నిధుల మద్దతు లేకపోవడం ఒక కారణం కావచ్చు.రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఆర్సీఐఎల్) దివాళా తీసిన తీర్మానాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) 2023 డిసెంబర్లో ఆమోదించింది. ఈ సంస్థ క్లెయిమ్ చేసిన రుణంలో 99 శాతాన్ని మాఫీ చేయడం జరిగింది. చూడండి విచిత్రం: 2018–19లో ఆపరేషన్ గ్రీన్స్ కోసం కేటాయించిన రూ. 500 కోట్లతో పోలిస్తే, ఆర్సీఐఎల్ రూ. 47,251.34 కోట్ల క్లెయిమ్‌కు బదులుగా కేవలం రూ. 455.92 కోట్లు చెల్లించి బయటపడింది. మాఫీ చేసిన ఆ మొత్తాన్ని తిరిగి పొంది ఆపరేషన్ గ్రీన్స్ లో పెట్టుబడి పెడితే, పండ్లు, కూరగాయల ధరలను స్థిరీకరించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఆర్థిక వనరుల కొరత ఏమాత్రం ఉండేది కాదు.- దేశంలో 18.74 కోట్లకు పైగా రైతులు తమ రుణాలతో సతమతమవుతున్నారు. మొత్తం బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు వార్షిక వ్యవసాయ బడ్జెట్ వ్యయం కంటే 20 రెట్లు ఎక్కువ.- గత 11 ఏళ్లలో ఇండియా కార్పొరేట్ల రూ.16.61 లక్షల కోట్ల నిరర్థక రుణాలను (కేవలం 16 శాతం రికవరీతో) బ్యాంకులు రద్దు చేశాయి. ఈ మొండి బకాయిలలో 50 శాతం పెద్ద కంపెనీలవి.- ఒక పెద్ద కంపెనీకి పెద్ద ‘రుణమాఫీ’ అవసరమైనప్పుడు, ఒక చిన్న రైతు అలాంటి ప్రయోజనం ఎందుకు పొంద కూడదు?- వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు , ఈ–మెయిల్: hunger55@gmail.com- దేవీందర్ శర్మ -
రైతుకు దన్ను.. మోదీ ముందు 3 మార్గాలు
న్యూఢిల్లీ: పంటలకు గిట్టుబాటు ధర లభించక నష్టపోయిన రైతులకు ఊరట కలిగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. సొంత భూమి ఉన్న రైతు బ్యాంకు ఖాతాలో నేరుగా కొంత డబ్బు జమ చేయడం, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకే పంటలను విక్రయించి నష్టపోయిన రైతుకు పరిహారం అందజేయడం, రుణ మాఫీ పథకం అమలు చేయడం ఇందులో ఉన్నాయి. ‘స్థూలంగా ప్రభుత్వం మూడు మార్గాలను పరిశీలిస్తోంది..అవి రుణమాఫీ, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు, నేరుగా రైతులకే డబ్బు బదిలీ ఇందులో ఉన్నాయి’ అని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయాలనే దానిపై తుది నిర్ణయానికి రాలేదని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి గ్రామీణ ప్రాంత ఓటర్లే కారణం. కానీ, పంటల ధరల నిర్ణయంలో మార్కెట్లదే పైచేయి కావడం, ప్రభుత్వ జోక్యం తగ్గడంతో రైతులు ప్రస్తుతం మోదీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. రెండేళ్లుగా దేశవ్యాప్తంగా పంటల దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం, ధరలు పడిపోవడం, ఎగుమతులు తగ్గడంతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. దీంతో 26 కోట్లకు పైగా ఉన్న రైతులు సుమారు రూ.3 లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇటీవల మూడు కీలక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని, 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న కేంద్రం రైతులకు, వారి కుటుంబాలకు ఊరట కలిగించాలని తీవ్రంగా యోచిస్తోంది. ఎన్నికల లోపే రైతులందరికీ నేరుగా, సులువుగా డబ్బును అందించే ఈ మూడు మార్గాల్లో దేనిని అమలు చేసినా ఖజానాపై భారీగానే భారం పడనుంది. ఆ మూడూ ఇవే.. మొదటిది..సత్వరం అమలు చేయటానికి వీలైనదీ, ప్రభుత్వ వర్గాలు కూడా సానుకూలంగా ఉన్న ప్రత్యామ్నాయం తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ‘రైతు బంధు’ మాదిరి పథకం. దీని కింద సొంత భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఎకరానికి రూ.1,700 నుంచి రూ.2,000 చొప్పున ప్రభుత్వం జమ చేయడం. ఈ పథకం అమలుకు సుమారు రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కంటే తక్కువకే తమ పంటలను విక్రయించుకుని నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడం రెండో ప్రత్యామ్నాయం. దీనిని అమలు చేస్తే రూ.50వేల కోట్లతోనే సరిపోతుంది. ఇక మూడోది.. అత్యంత ఖరీదైంది..ప్రభుత్వ వర్గాల్లో అంతగా సానుకూలత లేని రైతు రుణమాఫీ. దేశ వ్యాప్తంగా రూ.లక్షలోపు ఉన్న రైతురుణాలకు మాఫీ వర్తింప జేస్తే దేశ ఖజానాపై కనీసం రూ.3 లక్షల కోట్ల భారం పడుతుందని అధికార వర్గాల అంచనా. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన ఎజెండాగా ప్రకటించుకుంది. సకాలంలో చెల్లిస్తే వడ్డీ మాఫీ! న్యూఢిల్లీ: సకాలంలో చెల్లించే రైతుల పంట రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని కేంద్రం యోచిస్తోంది. వ్యవసాయ రంగ సంక్షోభాన్ని, రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూ.15వేల కోట్ల మేర ఉన్న వడ్డీ భారాన్ని భరించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతోపాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతు చెల్లించే ప్రీమియం మొత్తాన్ని ఆహార ధాన్యాల పంటలకు పూర్తిగాను, ఉద్యాన పంటలకు కొంత మేర రద్దు చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రైతులకు రూ.3 లక్షల వరకు 7 శాతం వడ్డీపై బ్యాంకులు స్వల్ప కాలిక రుణాలిస్తున్నాయి. కానీ, సకాలంలో తిరిగి చెల్లించే రైతుల నుంచి మాత్రం 4శాతం వడ్డీనే తీసుకుంటున్నాయి. సాధారణంగా 9 శాతం వడ్డీని రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తుంటాయి. సకాలంలో రుణాలు చెల్లించే రైతులందరికీ ఈ మాఫీ వర్తింప జేస్తే కేంద్రం రూ.30వేల కోట్ల వరకు భరించాల్సి ఉంటుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఇచ్చే రుణ వితరణ లక్ష్యాన్ని రూ.11 లక్షల కోట్ల నుంచి రూ.11.69 లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దిశగా త్వరలోనే మరిన్ని నిర్ణయాలు ప్రకటించనుంది’ అని తెలిపారు. రైతు సమస్యలే ప్రధాన అజెండాగా మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్∙అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. -
రాష్ట్రాభివృద్ధికి 20 ఏళ్ల ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి 20 ఏళ్ల సమగ్ర ప్రణాళికను రూపొందించి దానినే బీజేపీ మేనిఫెస్టోగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా మేనిఫెస్టోను రూపొందించడంతో పాటుగా నియోజకవర్గ స్థాయి సమస్యలపైనా ప్రత్యేక మేనిఫెస్టోను తయారు చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో విద్యా, వైద్యం, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వనుంది. తెలంగాణ చరిత్ర, రాష్ట్ర ప్రజల అవసరాలు–బీజేపీ ఆవశ్యకత, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అవినీతి, కుటుంబ పాలన, మజ్లిస్‌తో ఆ పార్టీల దోస్తీ తదితర అంశాలను కూడా ప్రస్తావించనుంది. దీనిని రూపొందించే పనిలో భాగంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించనుంది. రైతులకు ఉచిత బోరు, రూ.2 లక్షల వరకు రుణమాఫీ, కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు, రైతు రుణాల వడ్డీని ప్రభుత్వమే భరించేలా చర్యలు, పంటలపై ఎంఎస్పీకి అదనంగా బోనస్ ఇవ్వడం, నిరుద్యోగభృతి, ఉద్యోగ అవకాశాల పెంపు, ఏటా ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను ఇందులో పొందుపరిచేలా చర్యలు తీసుకుంటోంది. వీలైనంత త్వరగా దీనిని రూపొందించి ప్రజల్లోకి తేవాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, తాజామాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ మల్లారెడ్డి, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ వైకుంఠం, ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమిత్‌షా సభ తరువాత ప్రకంపనలే: లక్ష్మణ్ అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ఉండేలా మేనిఫె స్టోను రూపొందిస్తున్నామని ఇది విజనరీ డాక్యుమెంట్లా ఉంటుందని లక్ష్మణ్ వెల్లడించారు. ఈ నెల 15న మహబూబ్‌నగర్‌లో అమిత్‌షా సమావేశం అనంతరం ఇతర పార్టీల్లో ప్రకంపనలు పుట్టించేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి భారీగా నాయకులు తమపార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. -
లక్ష్యం.. దూరం
కడప అగ్రికల్చర్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గంలోని కొందరు అధికార పార్టీ డైరెక్టర్లు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సొసైటీలకు ఇష్టానుసారంగా రుణాలను మంజూరు చేయించుకున్నారు. రుణాలు తీసుకోవడం, తిరిగి చెల్లించడంలో తాహతు లేకపోయినా బ్యాంకు అధికారులపై ఒత్తిడి చేయించి మంజూరు చేయించుకున్నారు. ఇప్పుడు ఆ రుణాలు ఆయా ప్రాథమిక సహకార సంఘాల్లో తడిసి మోపెడై మొండి బకాయిలై కూర్చున్నాయి. దీనిపై రాష్ట్ర ఆప్కాబ్, నాబార్డు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించగా సొసైటీలకు అస్తులకంటే అప్పులు ఎక్కువ ఉన్నాయని, వాటిని రాబట్టడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఆ మేరకు డీసీసీ బ్యాంకు సీఈఓ వెంకటరత్నం చొరవ తీసుకుని బ్యాంకు ఉద్యోగులను గ్రూపులు ఏర్పాటు చేసి మొండి బకాయిలను రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బకాయిలు రాబడుతున్న సమయంలో ఆయా డైరెక్టర్లు కొందరు మోకాలొడ్డుతున్నారని బ్యాంకు ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. రుణాలు ఇప్పించుకున్నప్పుడు ఉండే శ్రద్ధ తిరిగి చెల్లించాల్సినప్పుడు ఉండదా? అని ఓ ఉద్యోగి బాహాటంగానే ఆరోపించారు. జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలు లక్ష్యానికి దూరమవుతున్నాయి. జిల్లాలోని 69 ప్రాథమిక సొసైటీల్లో 41 మినహా మిగిలిన 28 ప్రాథమిక సొసైటీలకు 2500 మంది రైతులు రూ.6.50 కోట్లు బకాయిపడ్డారు. దీంతో ఇవి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు జిల్లాలో సహకార వ్యవస్థ నిర్వీర్యం కావడానికి అధికార పార్టీ అధ్యక్షులు, డైరెక్టర్ల తీరే కారణమని అధికారులు అంటున్నారు. ఇష్టారాజ్యంగా తాహతుకు మించి రుణాలను ఎగురేసుకు పోయారు. రికవరీలకు వచ్చే సరికి బకాయిలు రాబట్టలేక అధ్యక్షులు, డైరెక్టర్లు చేతులెత్తేశారు. ఇది ఒక కారణం కాగా సంఘాల్లో నిపుణులైన సిబ్బంది లేకపోవడం కూడా మరో కారణమని చెబుతున్నారు. కొందరు సీఈఓలను రాజకీయ నాయకులు తమ వాడం టూ సంఘాలకు నియమించుకుంటుండడంతో వ్యవస్థ నాశనం అవుతోందని అధికారులు పెదవి విరుస్తున్నారు. సభ్యత్వాలను పెంచుకుని రైతులను ప్రాథమిక పరపతి సంఘ కార్యాలయాల మెట్లు ఎక్కేలా చేయటంలో వైఫల్యం, సంఘాల ద్వారా రుణ మంజూరు, వసూళ్లకే పరిమితౖమైనందున ఆదాయ వనరులు కొరవడి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం, పరపతేతర వ్యాపారాలతో అదనపు రాబడికి, సంఘాల అభ్యున్నతికి ప్రయత్నించకపోవడం వంటి కారణా లెన్నో సహకార సంఘాల మనుగడను కష్ట తరం చేస్తున్నాయి. రూ.113 కోట్ల రుణంలో అర్హత కోల్పోయిన 28 సొసైటీలు జిల్లాలో జిల్లాలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుతోపాటు బ్రాంచీలు 24 ఉన్నా యి. వీటికి అనుబంధంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు 69 ఉన్నా యి. వీటిలో 41 సొసైటీలు 50 శాతం రుణ రికవరీ చేయగా, మిగిలిన 28 సొసైటీలు చతికిలపడ్డాయి. ఈ సొసైటీలు రూ.113 కోట్ల రుణ కేటాయింపుల్లో రుణం తీసుకోవడానికి అవకాశం లేకుం డా పోయిందని డీసీసీ బ్యాంకు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. జిల్లాలోని అన్ని సొసైటీలకు పంట రుణాలను బ్యాంకు బ్రాంచీలు సమకూర్చుతున్నాయి. జిల్లాలో స్వల్పకాలిక పంట రుణాలు 72 వేల మంది కాగా, దీర్ఘకాలిక రుణాలు 12 వేల మంది తీసుకుంటున్నారు. ప్రతి ఏటా ఆయా పంట రుణాలకుగాను రూ.350 కోట్లు అందజేస్తున్నారు. ఇందులో దీర్ఘకాలిక రుణ బకాయి రూ.54 కోట్లు కాగా, రెండేళ్ల కాలంగా వసూలైంది రూ.34 కోట్లు మాత్రమే. రూ.20 కోట్లు రావాల్సి ఉందని డీసీసీ బ్యాంకు అధికా రులు తెలిపారు. ఉద్యోగులు శత విధాల ప్రయత్నం చేస్తున్నా అందుకు తగ్గట్లు పాలకవర్గం నుంచి ప్రోత్సాహం లేకపోగా మోకాలడ్డేందుకు చూస్తోందని ఓ ఉద్యోగి సాక్షి ఎదుట వాపోయారు. అధికార పార్టీ సొసైటీలకు రుణాలు జిల్లాలో అధికార పార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాథమిక సహకార సంఘాలకు కొందరు డైరెక్టర్లు అధికంగా రుణాలు మంజూరు చేయించుకున్నారు. కొన్నింటికైతే తాహతుకు మించి మంజూరు చేయించుకుని తిరిగి చెల్లించడలో చేతులెత్తేస్తున్నారని డైరెక్టర్లపై కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులను తమ చెప్పుచేతుల్లో ఉంచుకుని ఇష్టానుసారంగా కొందరు డైరెక్టర్లు రుణాలు పొందారు. తమ అనుచరులకు ఇప్పించారు. ఇప్పుడు ఆయా బకాయిలు చెల్లించాలని అడుగుతుంటే మొహం చాటేస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఉదాహరణకు.. అట్లూరు పీఏసీసీ పరిధిలో పండుమిరప పంటను సాగు చేయరు. అయితే ఆ పంటకు ఇబ్బడి ముబ్బడిగా ఆ సొసైటీలో రుణాలు ఇచ్చారు. ఈ పంటకు అధికంగా పెట్టుబడి అవుతుంది కాబట్టి స్కేల్ ఆఫ్ పైనాన్స్ కూడా ఎక్కువగా ఉంటోంది. ఈ విధంగా రుణాలు ఇచ్చారంటే ఆ సొసైటీకి ఒక విధంగాను మిగతా సొసైటీలకు మరో విధంగాను రుణాలు ఇచ్చారంటే పాలకవర్గం ప్రమేయంతోనే ఇలా కేటాయించుకుంటారని రిటైర్డ్ అధికారి ఒకరు సాక్షికి తెలిపారు. ఇదే విధంగా బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజవర్గాల్లో ఉన్న అధికారపార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహించే సోసైటీల్లోనే ఈ బకాయిలు ఎక్కువగా ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. రాష్ట్రంలో చివరి స్థానానికి చేరిన బ్యాంకు గ్రేడింగ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డీసీసీ బ్యాంకులకు గ్రేడింగ్ విధానంలో మన డీసీసీ బ్యాంకు ఆఖరు స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా రుణాలు ఇచ్చిన, వసూళ్లలో వెనుకబడిన బ్యాంకుల జాబితాను ఆప్కాబ్ తయారు చేస్తుంది. ఆ విధంగా కడప డీసీసీ బ్యాంకు గ్రేడింగ్ చూస్తే చివరి నుంచి 5 స్థానంలో ఉన్నట్లు అధికారులు చెబుతుండడం గమనార్హం. నేను రాకముందు జరిగిన వ్యవహారానికి నాకు సంబంధంలేదు బ్యాంకు బ్రాంచీల నుంచి పీఏసీసీలకు రుణాలు ఇచ్చిన సమయంలో నేను లేను. ఆ సమయంలో ఉన్న వారు ఇచ్చిన అప్పుల వసూళ్లు రాబట్టాలంటే తలప్రాణం తోకకొస్తోంది. గ్రూపులుగా ఉద్యోగులను నియమించి మొండిబకాయిలను రాబట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నేను రాకముందు జరిగిన వ్యవహారానికి నేనెలా బాధ్యత వహిస్తాను. –వెంకటర త్నం,సీఈఓ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, కడప -
రుణాలే రైతుకు వెన్నెముక
సాక్షి, హైదరాబాద్: రైతుకు రుణాలే ఆధారంగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 79.5 శాతం కుటుంబాలు అప్పులు తీసుకుంటున్నాయని నాబార్డు నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సగటున వ్యవసాయ కుటుంబాలు తీసుకుంటున్న రుణం రూ.1.04లక్షలు కాగా, వ్యవసాయేతర కుటుంబాలు తీసుకునేది రూ.76,731గా ఉంది. ఈ లెక్కన వ్యవసాయ కుటుంబాల్లో 52.5శాతం మంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుంటున్నారు. వ్యవసాయ కుటుంబాలు సాగు ద్వారా కంటే కూలీ పనులకు వెళ్లి అధికంగా ఆదాయాన్ని పొందుతున్నాయని సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2015 జూలై 1నుంచి 2016 జూన్ 30వరకు జాతీయ గ్రామీణ ఆర్థిక సర్వే (ఆలిండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) సర్వే నిర్వహించింది. మొత్తం 29 రాష్ట్రాలలోని 245 జిల్లాలో 2,016 గ్రామాలలోని 40,327 కుటుంబాలను సర్వే చేశారు. వ్యవసాయ కుటుంబంలో సాగు ద్వారా నెలకు రూ.3,140 ఆదాయం వస్తే, వేతన కూలీకి రూ.3,025, ఉపాధి కూలీ రూ.1,444 వస్తోంది. అంటే మొత్తం రూ.4,469గా ఉంది. ఖర్చుల్లో అధికంగా ఆహార అవసరాలకు 51 శాతం, ఇతర అవసరాలకు 49 శాతం వినియోగిస్తున్నారు. అలాగే వ్యవసాయ కుటుంబాలు పెద్ద యంత్రాలను అధికంగా కలిగిలేరని పేర్కొంది. కేవలం 5 శాతం మంది రైతులు మాత్రమే దేశవ్యాప్తంగా ట్రాక్టర్లు కలిగి ఉన్నారని, పవర్ టిల్లర్స్‌ను అధికంగా వినియోగిస్తున్నారని తెలిపింది. రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం 1.1 హెక్టార్లు కాగా, కౌలు తీసుకున్న రైతులు 10 శాతం ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. కరువు కాటకాల్లో పాడి పశువుల పోషణ వ్యవసాయ కుటుంబాలను ఆదుకుంటోందని సర్వేలో వెల్లడైంది. 79.5శాతం రైతు కుటుంబాలకు రుణాలే ఆధారం నాబార్డ్ అధ్యయనంలో వెల్లడి -
బాబు నాలుగేళ్ల పాలనపై వైఎస్సార్ సీపీ ఛార్జ్‌షీట్
-
చంద్రబాబు పాలనపై వైఎస్సార్ సీపీ ఛార్జ్‌షీట్
సాక్షి, హైదరాబాద్ : నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. టీడీపీ సర్కార్‌లో అభివృద్ధి శూన్యమని, అందువల్లే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ విడుదల చేస్తున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందే తప్ప, అంగుళం కూడా అభివృద్ధి లేదు. ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ దగ్గర నుంచీ, కీలక పాత్ర నిర్వహిస్తున్న వెంకయ్య నాయుడు దగ్గర నుంచీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, సీఎం కావాలని ఉవ్విళ్లు ఊరుతున్న చంద్రబాబు వరకూ ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు, పదేళ్లు ...కాదు పదిహేనేళ్లు కావాలని డిమాండ్ చేశారు. హోదా స్థానంలో ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందని చంద్రబాబు మాట్లాడారు. నాలుగేళ్లు అయిన తర్వాత మాట మార్చి ఇప్పుడు కేంద్రాన్ని దుయ్యబడుతున్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ సీపీ ఛార్జ్‌షీట్, టీడీపీ మ్యానిఫెస్టో దగ్గర పెట్టుకుని సరి చూసుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారు. బీజేపీ, జనసేన మద్దతు తీసుకుని గెలిచిన టీడీపీ... ఇప్పుడు బాబు హామీలు నెరవేర్చకపోవడంతో బీజేపీ, జనసేన పార్టీలు విడిపోయాయి. చంద్రబాబు ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాను పెంచి పోషించారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. రైతుల రుణమాఫీనే తొలిసంతకం అని ఊదరగొట్టిన చంద్రబాబు... ఇప్పుడు రైతాంగాన్ని చూసి సిగ్గుపడాలి’ అని మండిపడ్డారు. పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘రాహుల్.. రామలింగంలా మాట్లాడుతున్నారు’
భోపాల్ : తమ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోగా రైతు రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ విమర్శలు సంధించారు. ‘మంద్‌సౌర్‌లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు త్రీ ఇడియట్స్ సినిమాలోని రామలింగం కామెడీలా ఉందంటూ’ ఆయన ఎద్దేవా చేశారు. ‘త్రీ ఇడియట్స్ సినిమాలో ఎవరో రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని రామలింగం అనే విద్యార్థి చదివి నవ్వులపాలవుతాడు. అలాగే రాహుల్ గాంధీ కూడా తనకు రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని బట్టీ పట్టి ఇక్కడ(మంద్‌సౌర్‌లో) చదివారు. ఆయన మాటలు పూర్తిగా నాటకీయం, అపరిపక్వమైనవి. అదొక స్క్రిప్ట్ అని స్పష్టంగా తెలిసిపోతోంది. అందులో నిజాలు, గణాంకాలు ఏమీ లేవు. మంద్‌సౌర్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొస్తామని రాహుల్ చెప్పారు. ఆ విషయం గురించి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వారం క్రితమే ప్రస్తావించారంటూ సారంగ్’ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘రాహుల్ గాంధీ మాట్లాడుతున్నది ఫుడ్ చెయిన్ గురించి కాదు.. ఫ్రాడ్ చెయిన్ గురించి అందులో ముఖ్యపాత్రధారి రాబర్ట్ వాద్రా అంటూ సారంగ్ ఆరోపించారు. ఆర్థిక భరోసా ఇస్తున్నాం... రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లుగా పది రోజుల్లోగా రైతు రుణమాఫీ చేయడం అంత తేలికగ్గా సాధ్యమయ్యే విషయం కాదని సారంగ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మా ప్రభుత్వం రైతులకు వడ్డీలేని రుణాలు అందిస్తూ.. ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. మేడ్ ఇన్ మంద్సౌర్... మేడ్ ఇన్ మంద్సౌర్ పేరిట సెల్ ఫోన్ల తయారీ యూనిట్ నెలకొల్పుతామంటూ రాహుల్ చెప్పడం విడ్డూరంగా ఉందని సారంగ్ వ్యాఖ్యానించారు. రాహుల్ ముందు మేడిన్ అమేథీపై దృష్టిసారించాలంటూ హితవు పలికారు. కాగా మంద్సౌర్ జిల్లా పిప్లియా మండీలో పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మృతి చెందిన ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. -
10 రోజుల్లోనే రైతు రుణ మాఫీ
మంద్సౌర్/న్యూఢిల్లీ: తమ పార్టీ అధికారంలోకి వస్తే 10 రోజుల్లోనే రైతు రుణ మాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కష్టాలను పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం మంద్సౌర్ జిల్లా పిప్లియా మండీలో పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మృతి చెందిన ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రైతు రుణ మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నా. పదకొండో రోజు దాకా కూడా ఆగబోం’ అని ప్రకటించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా రైతు రుణమాఫీ అమలు చేశామన్నారు. -
రోడ్డెక్కిన రైతన్న
భోపాల్ / మందసౌర్ / చండీగఢ్ / లక్నో: రైతులకు రుణమాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుతో పాటు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ రైతు సంఘాలు శుక్రవారం దేశవ్యాప్తంగా 10 రోజుల ఆందోళనకు పిలుపునిచ్చాయి. ‘గావ్ బంద్’(గ్రామ బంద్) పేరిట చేపట్టిన ఈ ఆందోళనలో భాగంగా పట్టణాలు, నగరాలకు పాలు, కూరగాయాలు, పండ్లు, ఇతర నిత్యావసరాలను సరఫరా చేయరాదని నిర్ణయించాయి. పంజాబ్, హరియాణా, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కశ్మీర్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకల్లోని రైతు సంఘాలు హోల్‌సేల్, కూరగాయల మార్కెట్లను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. దీంతో పలు రాష్ట్రాల్లో రైతులు కూరగాయలు, పండ్లను రోడ్లపై పడేసి నిరసన తెలియజేశారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో ‘గావ్ బంద్’ పేరిట శాంతియుత ఆందోళన చేపట్టినట్లు రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ మహాసంఘ్(ఆర్‌కేఎంఎం) కన్వీనర్ శివకుమార్ శర్మ తెలిపారు. -
మాఫీ చేయకుంటే రాజీనామా
న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: రైతు రుణమాఫీకి తాను కట్టుబడి ఉన్నానని, అలా చేయని పక్షంలో సీఎం పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక సీఎం కుమారస్వామి చెప్పారు. ఢిల్లీలో ప్రధానితో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రైతుల రుణాల్ని మాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పాను. అధికారంలోకి వచ్చిన 24గంటల్లో రుణమాఫీపై సంతకం చేస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాను. అయితే కొన్ని పరిమితులున్నందున సమయం అవసరం’ అని పేర్కొన్నారు. రుణ మాఫీకి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించామని.. బుధవారం బెంగళూరులో వాటిని వెల్లడిస్తామని ఆయన తెలిపారు. బీజేపీ తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని, ప్రజలు వాటిని నమ్మొద్దని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ప్రజలను అవమానించలేదు కాంగ్రెస్ దయతోనే ముఖ్యమంత్రిని అయ్యానని.. ప్రజల దయతో కాదంటూ తను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుండటంపై కుమారస్వామి వివరణ ఇచ్చారు. ప్రజలను అవమానించాలని తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని.. భాగస్వామ్య కూటమి కారణంగానే సీఎం అయ్యానని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. ‘నేను సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాను. కాంగ్రెస్ మద్దతున్నన్ని రోజులు సీఎంగా ఉంటాను. ఏ కార్యక్రమం చేయాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే. ఆ విషయాన్నే చెప్పా. నా వ్యాఖ్యలను మీరెందుకు (మీడియా) వక్రీకరించారో అర్థం కావడం లేదు’ కుమారస్వామి పేర్కొన్నారు. కాంగ్రెస్సే సీఎం పదవి ఇచ్చింది: దేవెగౌడ రైతు రుణమాఫీపై తామిచ్చిన హామీని నిలబెట్టుకోవడం కష్టమని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ చెప్పారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ.. ‘మాకు 37 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వేరే పార్టీ మద్దతుతో మేం ప్రభుత్వాన్ని నడపాలి. వారి పథకాలను అమలు చేయాలి. వారి మద్దతు లేకుండా రుణమాఫీ హామీ అమలు సాధ్యం కాదు’ అని అన్నారు. కుమారస్వామికి కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి ఇచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీని తాను కోరానని.. అయితే కుమారస్వామి సీఎం అవ్వాలనేది తమ హైకమాండ్ నిర్ణయమని ఆ పార్టీ నేతలు ఆజాద్, అశోక్ గెహ్లాట్‌లు చెప్పారన్నారు. శాఖలపై తేలని చర్చలు ఐదురోజులుగా మంత్రిత్వ శాఖల పంపకాల విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య జరుగుతున్న చర్చలు ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు. ఇరు పార్టీలు కీలక మంత్రిత్వ శాఖలపై పట్టుబడుతుండటంతోనే ఎటూ తేలడం లేదు. రాహుల్, సోనియాలు విదేశాలకు వెళ్లడంతో సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, గెహ్లాట్, కేసీ వేణుగోపాల్, సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లతో కుమారస్వామి, జేడీఎస్ నేత డానిష్ అలీ చర్చలు జరిపారు. ఢిల్లీలో తమ పార్టీ పెద్దలతో కుమారస్వామి చర్చలు జరిపారని.. త్వరలోనే ఈ విషయం పరిష్కారం అవుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పారు. కర్ణాటకలో రైతులకు రుణమాఫీ చేయాలని సోమవారం ప్రతిపక్ష బీజేపీ నిర్వహించిన రాష్ట్ర బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ ప్రజల్నుంచి పెద్దగా స్పందన లభించలేదు. రాష్ట్రంలో బొగ్గు కొరత తీర్చాలని ప్రధానిని కోరా కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి కుమార స్వామి. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కొరతపై మోదీతో చర్చించారు. ‘రాయ్‌చూర్, యరమర, బళ్లారి ప్లాంట్లకు డిమాండ్ మేరకు బొగ్గును సరఫరా చేయాలని ప్రధానిని కోరాను. ఇతర సమస్యలపై కూడా చర్చించాం. ఈ సందర్భంగా సీఎంగా, పీఎంగా తన పాలనా అనుభవాల్ని ప్రధాని నాతో పంచుకున్నారు’ అని కుమార స్వామి చెప్పారు. -
నేనేం ప్రజల దయతో సీఎంను కాలేదు
-
నేనేం ప్రజల దయతో సీఎంను కాలేదు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల దయతో తాను సీఎంను కాలేదని, కాంగ్రెస్ మూలానే తనకు ఆ పదవి దక్కిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం(మే 27న) మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా విధానసౌధలో ఆయన చిత్రపటానికి కుమారస్వామి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ విషయంలో వెనుకడుగు వేయబోం. సంకీర్ణ ప్రభుత్వమైనందున భాగస్వామ్య కాంగ్రెస్‌తో చర్చించాక నిర్ణయం తీసుకుంటాం, ఇందుకు వారం రోజులు సమయం కావాలి. రుణ మాఫీ చేయలేని పక్షంలో సీఎం పదవికి రాజీనామా చేసేందుకూ సిద్ధం’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మంత్రివర్గ ఏర్పాటు గురించి చర్చలు జరుగుతున్నాయని, అవి ఓ కొలిక్కి వచ్చాక రుణమాఫీ విషయంపై చర్చిస్తామని ఆయన తెలిపారు. ‘ఆరున్నర కోట్ల మంది మమల్ని(జేడీఎస్)ను తిరస్కరించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ దయతో నేను సీఎం అయ్యాను. కాంగ్రెస్‌కు నేను కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. అలాగని రాష్ట్రంలోని రైతులు ఎవరూ రుణమాఫీ విషయంలో ఆందోళన చెందవద్దు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది’ అని సీఎం కుమారస్వామి చెప్పారు. కాగా, ఎన్నికల మేనిఫెస్టోలో జేడీఎస్ రైతుల రుణమాఫీను చేర్చగా, కాంగ్రెస్ మాత్రం ఆ ఊసెత్తకుండానే బరిలో దిగింది. మంత్రి పదవులపై విభేదాల్లేవు... కాంగ్రెస్ నేతలు హస్తిన నుంచి తిరిగి వచ్చాక మంత్రిమండలిని ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. మంత్రివర్గం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య విభేదాలు లేవు. అలాంటి వార్తలన్నీ అవాస్తవమని కుమార చెప్పారు. కేబినెట్ కూర్పు సమయంలో పదవుల కోసం డిమాండ్లు వినిపించడం సహజమే, అసంతృప్తులు ఉంటారు, వారికి సర్ది చెపుతామని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షం అదేపనిగా పెట్టుకుని తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందని సీఎం మండిపడ్డారు. యెడ్డీతో మాట్లాడడమా?... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యెడ్యూరప్ప సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోయిందని కుమార ఆరోపించారు. కానీ, యెడ్యూరప్ప ప్రస్తుతం రుణమాఫీ విషయంపై పోరాడుతున్నట్లు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. రుణమాఫీపై మూడురోజుల్లో నిర్ణయం చెప్పకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామనడం సిగ్గు చేటన్నారు. యెడ్డూరప్ప వ్యాఖ్యలకు ఎవరూ భయపడరని చెప్పారు. కాగా, రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష బీజేపీ నేడు(సోమవారం) రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు సీజేతో భేటీ... ముఖ్యమంత్రి కుమారస్వామి ఆదివారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరిని ఆయన నివాసంలో కలిశారు. కుమార సీఎంగా బాధ్యతలు చేపట్టాక జస్టిస్ మహేశ్వరిని మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. నేడు ప్రధాని మోదీతో భేటీ... ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. అయితే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ విదేశీ పర్యటనలో ఉండటంతో వారిని కలిసే అవకాశం లేదు. ప్రధాని అపాయింట్ కోరుతూ కుమారస్వామి లేఖ రాయగా, అనుమతి లభించడంతో హస్తిన పయనమవుతున్నారు. సోమవారం సాయంత్రం ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కూడా సమావేశమై, రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్టులు, సాయాలపై చర్చిస్తారు. -
24 గంటల్లోగా రైతు రుణాల మాఫీ
శివాజీనగర : రాష్ట్రంలో బీజేపీ ఈసారి 150 స్థానాల్లో గెలుపొందటంలో ఎలాంటి సందేహం లేదని, 17న తాను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయటం తథ్యమని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీఎస్.యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. అధికారం స్వీకరించిన 24 గంటల్లోగా జాతీయ, సహకార బ్యాంకుల నుంచి పొందిన రూ. లక్ష వరకు రుణ మాఫీ చేస్తానని, లేనిపక్షంలో ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగనని శపథం చేశారు. ఆదివారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో విలేకరులతో మాట్లాడుతూ... జాతీయ బ్యాంకుల రుణమాఫీ చేయాలని సిద్దరామయ్య బోదిబోమంటూ కొట్టుకొంటున్నారని, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానాతో పాటు అనేక రాష్ట్రాల్లో రుణ మాఫీ చేసినా కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయాలని ఎవ్వరు చెప్పటం లేదన్నారు. అయితే సిద్దరామయ్య మాత్రం ఇటువంటి వితండమైన ప్రశ్నను ముందుంచుతున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీతో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తున్నందున జేడీఎస్‌తో పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బళ్లారి రెడ్డి సహోదరులకు సర్వే ఆధారంగా టికెట్ ఇవ్వడమైనదని, జనార్ధనరెడ్డి టికెట్ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోలేదని తెలిపారు. రెడ్డి సహోదరుల, వారి అనుచరులపై ఎలాంటి ఆరోపణలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆనంద్‌సింగ్, నాగేంద్రలను పక్కలో కూర్చోపెట్టుకుని మరొకరి గురించి మాట్లాడే నైతిక హక్కు సిద్దరామయ్యకు ఉందా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత క్యాబినెట్లో ముస్లీంలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్తమ పథకాలను కొనసాగించటంతో పాటు ఇందిరా క్యాంటిన్‌ను అన్నపూర్ణ పథకంగా పేరుమార్చి ముందుకు కొనసాగిస్తామని బీఎస్‌వై తెలిపారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ.పరమేశ్వర్, లోక్‌సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేలు ఒకే వేదికపై కూర్చొని పార్టీ తరపున ప్రచారం జరపాలని ఆయన సవాల్ చేశారు. కాంగ్రెస్ విడిపోయిన ఇల్లుగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదనే విషయం అటు ఉంచిన చాముండేశ్వరి, బాదామిలో ముందు సీఎం గెలిచి రావాలని ఎదురుదాడి చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో సిద్దరామయ్యకు ఓటమి తప్పదని, బాదామిలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములు విజయం సాధిస్తారని, ఏ కారణానికి సిద్దరామయ్య గెలుపొందడని ఆయన ఓటమి సద్దిమూట అని జోస్యం చెప్పారు. అవినీతితో లూటీ చేసిన సిద్దరామయ్య తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, 70 లక్షల హుబ్లెట్ వాచ్ ఎవరు ఇచ్చారని రాష్ట్ర ప్రజల ముందు బహిరంగపరచాలని యడ్యూరప్ప తెలిపారు. కుల,మతాల మధ్య విష బీజం విత్తి రాజకీయ తీగను విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తున్న సిద్దరామయ్యకు ఇదే తిరుగు బాణం అవుతుందన్నారు. ప్రత్యేక లింగాయత్ మతం చేయాలని వీరిని ఎవరు అడిగారని, తాను ముఖ్యమంత్రి కాకూడదని ఒకే కారణానికి దానిని విడగొట్టే నీచమైన సంస్కృతికి దిగజారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ప్రతిఫలం కూడా నేడు సిద్దరామయ్య అనుభవిస్తారని తెలిపారు. -
ప్రభుత్వం వారిని మోసం చేస్తోంది...
సాక్షి, హైదరాబాద్: రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు.ఆయన బుధవారం విలేకరులు సమావేశంలో మట్లాడుతూ... ‘తమ బాకీ తీర్చకుంటే దుబ్బాకలో రైతులపై చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులు హెచ్చరిస్తున్నారు. సీఎం మాట నమ్మి రుణమాఫీ అవుతుందని రైతులు సంబరపడ్డారు. కానీ వారిని ప్రభుత్వం మోసం చేసింది.’ అని ఆరోపించారు. కేసీఆర్ సొంతూరుకు కూతవేటు దూరంలో ఉన్న రైతులే అరిగోస పడుతున్నారని.. ఇక రాష్ట్రంలో మిగతా రైతుల పరిస్థితేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు మేలు కోరని ప్రభుత్వం.. రైతులకు మేలు చేసే ఉద్దేశముంటే ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి... రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి రైతుల రుణ సమస్యలు తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, నల్గొండ, మెదక్ రైతులతో కలిసి బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 23న ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. రైతుబీమాపై లేని ధీమా.. ‘రైతుబీమా’ పథకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. 40లక్షల రైతుల బీమాకు రూ.1200 కోట్లు అవసరం. కానీ రూ.500 కోట్లతో ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో ఎక్కడా నిరశనలు, దర్నాలు చేయకుండా అడ్డకుంటున్నకేసీఆర్.. ఆయన మాత్రం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దర్నా చేస్తాడట’ అని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికలపై తెలంగాణలో బీజేపీ స్టాండ్ ఏమిటన్నది రేపు వెల్లడిస్తామన్నారు. -
రుణమాఫీ లిస్ట్‌లో ఓ ఎమ్మెల్యే పేరు!
సాక్షి, ముంబై : రైతుల రుణమాఫీ వ్యవహారం మహారాష్ట్రంలో రాజకీయంగా పెను కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. రైతుల డిమాండ్ల కోసం సొంత నేత యశ్వంత్ సిన్హా దీక్ష చేపట్టడం, బీజేపీ ప్రభుత్వ తీరు నచ్చక మరో నేత ఎంపీ అయిన నానా పటోలే ఏకంగా పార్టీకి గుడ్‌బై చెప్పిన పరిస్థితులు బీజేపీ ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారాయి. తాజాగా ఈ అంశంపై అధికారులు ఎంత చిత్తశుద్ధితో తెలియజేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రుణమాఫీ రైతుల పేర్ల జాబితాలో శివ సేన ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ పేరు కనిపించటం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొల్హాపూర్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ తరపున ఆయన రుణం కోసం దరఖాస్తు చేసినట్లు.. ఆయనకు 25 వేల రూపాయలు మంజూరు అయినట్లు ఉంది. కరువు ప్రాంత రైతులకు అందించిన రుణమాఫీ కింద ఆయనకు రుణం కూడా రద్దు అయ్యింది. దీనిపై స్పందించిన కొల్హాపూర్ ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ తాను ఎలాంటి రుణానికి దరఖాస్తు చేసుకోలేదని చెప్పటం విశేషం.‘‘ఆ వార్త మీడియాలోనే చూసి నేను తెలుసుకున్నా. షాక్‌కు గురయ్యాను. నేను ఎక్కడా నా పేరును నమోదు చేసుకోలేదు. ఆ రుణమాఫీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను కోరాను’’ అని ఆయన చెప్పారు. కాగా, సుమారు 34 వేల కోట్ల రుణమాఫీ విషయంలో తప్పులు దొర్లిన మాట వాస్తవమేనని.. త్వరలో వాటిని సరిదిద్దుకుంటామని స్వయానా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. రుణమాఫీ వ్యవహారం అంతా ముఖ్యమంత్రి కార్యాలయం పరిధిలో ఉండటంతో ప్రతిపక్షాలు ఫడ్నవిస్‌పై మండిపడుతున్నాయి. శివ సేన ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ -
వడ్డీ మాఫీ చేసేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి
నేరేడుచర్ల: రైతు రుణాలకు సంబంధించిన వడ్డీలను మాఫీ చేసే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపహాడ్ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా అసలు మాత్రమే మాఫీ చేసి వడ్డీ వసూలు చేస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. అలాగే వరికి రూ. 2వేలు, పత్తికి రూ. 5వేలు, మిర్చికి రూ. 10వేల మద్దతు ధర అందిస్తామన్నారు. నిరుద్యోగులకు రూ. 3వేల భృతి ఇస్తామని వివరించారు. -
రుణమాఫీపై బాబుది పబ్లిసిటీ స్టంట్
-
రుణమాఫీపై బాబుది పబ్లిసిటీ స్టంట్
సాక్షి, గుంటూరు : రుణమాఫీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రైతులకు వేల కోట్లలో నష్టం కలిగించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతుల రుణమాఫీపై చంద్రబాబు వ్యాఖ్యలు పబ్లిసిటీ స్టంటేనని తేల్చేశారు. మూడో విడదల నిధుల విడుదల గురించి చంద్రబాబు ఏదో ఘన కార్యం చేశారని చెబుతున్నారు. సక్రమంగా చేసి ఉంటే రుణాలు తగ్గాలి. కానీ, ఎందుకు పెరిగాయి? అని అంబటి ప్రశ్నించారు. 87 వేల కోట్లున్న రుణాలు.. ప్రస్తుతం లక్ష కోట్లకు చేరాయని ఆయన చెప్పారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం 2014-15 సంవత్సరానికిగానూ ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చిన 2,365 కోట్లను ఇప్పటి వరకు రైతులకు ఎందుకు ఇవ్వలేదంటూ చంద్రబాబును నిలదీశారు. సున్నావడ్డీ, పావలా వడ్డీ రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడం ద్వారా చంద్రబాబు 66, 365 కోట్లు నష్టం కలిగించారని అంబటి పేర్కొన్నారు. -
బ్యాంకర్ల మీటింగ్ పెట్టని ఏకైక సీఎం కేసీఆర్
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రైతు రుణాలు, సహాయం చేయడానికి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించని ముఖ్యమంత్రి.. కేసీఆర్ ఒక్కరేనని మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదని, అది కేంద్రం బాధ్యత అంటూ చేతులెత్తేసిందని ఆరోపించారు. ఎకరానికి రూ.4 వేలను ఈ ఖరీఫ్ నుంచే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను దృష్టి మళ్లించడానికే సమగ్ర భూ సర్వే అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. మండలానికి ఒక్క సర్వేయర్ కూడా దిక్కు లేరని, ఇక సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలేదని, కనీసం రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సమావేశం కూడా నిర్వహించడం లేదని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా కేవలం మాటలతోనే కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. -
రుణమాఫీపై అధ్యయనానికి పంజాబ్ బృందం
అవకతవకలు లేకుండా అమలు చేయడంపై అభినందన సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ పథకంపై అధ్యయనం చేయడానికి పంజాబ్ ప్రభుత్వ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. పంజాబ్ వ్యవసాయ సహకార విభాగం అద నపు ముఖ్య కార్యదర్శి డి.పి.రెడ్డి, ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ బల్వీందర్‌సింగ్ సింధు, సహకార బ్యాంకు ఎండీ ఎస్.కె.బటీష్, పంజాబ్ వ్యవసాయ వర్సిటీ ఆర్థికవేత్త డాక్టర్ సుఖ్‌పాల్‌సింగ్ ఈ బృందంలో ఉన్నారు. వారితో రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి నేతృత్వంలో అధికారులు, వివిధ బ్యాంకర్లు శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. పార్థసారథి రుణమాఫీ గురించి వివరించారు. సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీ కోసం ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఆ కమిటీ రెండు నెలలపాటు శ్రమించి అవసరమైన మార్గద ర్శకాలను రూపొందించిందని చెప్పారు. అవకతవకలకు అవకాశం లేకుండా జరిగిన రైతు రుణమాఫీ పథకాన్ని పంజాబ్ బృందం అభినందించింది. -
ప్రభుత్వం పారిపోతుందా..?
వడ్డీ డబ్బులు వసూలు చేస్తున్నారని బ్యాంకర్లపై పోచారం ఆగ్రహం సాక్షి, నిజామాబాద్: ‘‘ప్రభుత్వం ఏమైనా పారిపోతుందా..? రైతుల రుణ మాఫీ సొమ్ము రూ.16,500 కోట్లు పువ్వుల్లో పెట్టి బ్యాంకులకు జమ చేశాం. తల తాకట్టు పెట్టయినా సరే బకాయిల డబ్బులు కూడా బ్యాంకులకు జమ చేశాం.. అయినా బ్యాంకర్లు రైతుల వద్ద వడ్డీ మాఫీ డబ్బులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. రూ.16 వేల కోట్లు చెల్లించిన ప్రభుత్వం రూ.200 కోట్లు వడ్డీ మాఫీ డబ్బులు చెల్లించదా?’’అని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బ్యాంకర్లపై మండిపడ్డారు. నిజామాబాద్ కలెక్టరేట్లో గురువారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. త్వరలో రాష్ట్రంలో క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తామని, స్థానిక వినియోగానికి తగ్గట్టుగా ఉత్పత్తి జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం సీఎఫ్టీఆర్ఐ (సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) సహకారం తీసుకుంటున్నామని వివరించారు. -
వడ్డీ రాయితీ కొనసాగింపు
రూ.3 లక్షల వరకూ స్వల్ప కాలిక పంట రుణాలకు 7 శాతం వడ్డీ ∙ కేంద్ర కేబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ: స్వల్పకాలిక రుణాలు తీసుకునే రైతులకు వడ్డీ రాయితీ పథకాన్ని కొనసా గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.3 లక్షల వరకూ రైతులు తీసుకునే స్వల్పకాలిక రుణానికి 7 శాతం వడ్డీ.. ఈ రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులు 4 శాతం(3 శాతం సబ్సిడీ) వడ్డీ చెల్లించే పథకాన్ని పొడిగించాలని నిర్ణయించింది. ఈ పథకం కోసం రూ.20,339 కోట్లను కేటా యించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి నష్టపోయిన రైతులు సకాలంలో రుణాన్ని చెల్లించలేకపోతే.. వారికి మొదటి ఏడాది వడ్డీపై 2 శాతం సబ్సిడీ అందించనున్నారు. అలాగే పంటను నిల్వ ఉంచుకునేందుకు ఆరు నెలల కాలానికి తీసుకునే రుణాలను 7 శాతానికే అందజేయనున్నారు. 2006–07 నుంచి వడ్డీ రాయితీ వడ్డీ రాయితీ పథకాన్ని 2006–07 నుంచి అమలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సంలో కూడా దీనిని కొనసాగించాలని నిర్ణయించారు. పథకాన్ని నాబార్డు, రిజర్వ్ బ్యాంకు అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద రూ.3 లక్షల వరకూ స్వల్ప కాలిక రుణాలకు 2 శాతం వడ్డీ సబ్సిడీని ఇస్తూ 7 శాతం వడ్డీకే రుణాలను అందజేస్తోంది. దీనికి అదనంగా సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే రైతులకు 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తోంది. దీంతో సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే రైతులు 4 శాతం వడ్డీకే రుణాలు పొందుతున్నారు. ఈ రుణాలను అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు అందజేస్తున్నాయి. -
రైతుల రుణాల మాఫీ నేరం కాదా?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రంలోని రైతులు తీసుకున్న రూ. 36,359 కోట్ల పంట రుణాలను ఒక్క కలం పోటుతో మాఫీ చేయడాన్ని కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ సహా వివిధ వర్గాల ప్రజలు ప్రశంసించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీనే ఆయన ఇప్పుడు నిలబెట్టుకున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో దాదాపు 86 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. కరవు కాటకాలతో అల్లాడి పోతున్న రైతులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు. కానీ దేశం దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయన్న విషయాన్ని ఎంత మంది ఆలోచిస్తున్నారు. రైతుల రుణాల మాఫీకి, ఇతర జనాకర్షణక పథకాలకు ఖజానాలు ఖాళీ అవుతుంటే నీటి పారుదల సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉన్న యూపీలో వాటికి నిధులు ఎక్కడ నుంచి వస్తాయి? దేశంలో నీటి పారుదల సౌకర్యాలకు బడ్జెట్లో ఒక్క శాతం నిధులను కేటాయిస్తే దేశంలో జాతీయ స్థూల ఉత్పత్తి రెండు శాతం పెరుగుతుందని ఎంతో మంది నిపుణులు ఇప్పటికే అంచనాలు వేశారు. నివేదికలు సమర్పించారు. అభివృద్ధి పట్ల దూరదృష్టి, చిత్తశుద్ధి లేకుండా కేవలం ఎన్నికల్లో విజయం సాధించి పబ్బం గడుపుకోవాలని చూసే నేటి రాజకీయ పార్టీలు రైతుల రుణ మాఫీ అనే హామీని ఎన్నికలు వచ్చినప్పుడల్లా ముందుకు తీసుకొస్తున్నాయి. ప్రధానంగా రుణాల మాఫీ హామీ కారణంగానే యూపీలో బీజేపీ విజయం సాధించిందని చెప్పవచ్చు. 2008లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రుణాల మాఫీ చేసిన కారణంగానే 2009లో జరిగిన ఎన్నికల్లో ఆ ప్రభుత్వం మళ్లీ విజయం సాధించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కేంద్రం మాఫీ చేసిన మొత్తంలో సగానికికన్నా ఎక్కువ మొత్తాన్ని యోగీ ఆధిత్యనాథ్ మాఫీ చేశారని ప్రశంసిస్తున్నవారూ ఉన్నారు. నిజమే ఇప్పుడు ఇదే బాటలో పంజాబ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు నడిచే ఆలోచనలో ఉన్నాయి. ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రుణాల మాఫీకి సహకరించాల్సిందిగా కోరారు. మహారాష్ట్రలో కూడా రుణాలను మాఫీ చేయాల్సిందిగా అక్కడి ఫడ్నవీస్ ప్రభుత్వంపై శివసేన తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. రుణాల మాఫీని చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే పరిమితం చేయడం సబబుకాదని, రైతులందరికి వర్తింపచేయాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు రాష్ట్రాన్ని తాజాగా ఆదేశించిన విషయం తెల్సిందే. పంటల పేరు మీద తీసుకున్న రుణాలు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలే కాదు వాటిని రైతులు ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్న ఉదంతాలు మనకు తెల్సినవే. ఎన్నికలు వచ్చేటప్పటికే పన్ను ఎగవేస్తున్న రైతుల జాబితాలు చాంతాడంతా పెరుగుతున్న విషయం తెల్సిందే. నిజాయితీగా పంట రుణాలను చెల్లిస్తున్న రైతులు నష్టపోతున్న విషయమూ తెల్సిందే. ఎన్నికల సమయంలో రుణాలను మాఫీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చతికిల బడిన విషయమూ తెల్సిందే. ఆకలి దప్పులతో అలమటించే చిన్న, సన్నకారు రైతులకు రుణాలను మాఫీ చేయడంలో అర్థం ఉందిగానీ ధనిక రైతులకు కూడా రుణాలు మాఫీ చేయమనడంలో ఏమర్థం ఉందో కోర్టుకే తెలియాలి. వర్షాధార పంటలపై ఆధారపడి రైతులు బతికే పరిస్థితులున్న చోట నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపర్చాల్సిన బాధ్యత, కర్తవ్యం ఇటు రాష్ట్రాలది, అటు కేంద్రానిది. దీన్ని విస్మరించిన రాజకీయ పార్టీలు రుణాల మాఫీల హామీలతో ఎన్నికల లబ్ధినే చూసుకుంటున్నాయి. కోట్లది రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇవ్వడమంటే రైతులకు లంచం ఆశ చూపినట్లుకాదా? నేరం కాదా? ఎన్నికల కమిషన్ ఈ అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదో అర్థం కాదు. -
యోగి రుణమాఫీ కూడా.. కంటి తుడుపేనా?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన రైతు రుణమాఫీ కంటితుడుపు మాత్రమేనని, దాంతో తమకు ఏమంత గొప్ప ప్రయోజనం ఉండబోదని రైతులు మండిపడుతున్నారు. దాదాపు లక్ష మంది సన్నకారు, చిన్నకారు రైతులకు ప్రయోజనం కల్పించేలా మొత్తం రూ. 36,359 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అది ప్రభుత్వానికి పండగ కావచ్చు గానీ, రైతులకు మాత్రం కాదని.. ఆకలితో ఏడుస్తున్న పిల్లాడికి లాలీపాప్ ఇచ్చినట్లే ఉందని మథుర జిల్లాలోని బోర్పా గ్రామానికి చెందిన కేదార్ సింగ్ అన్నారు. మొత్తం రైతులకు ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తారని తాము భావించినట్లు మథుర తాలూకా దామోదర్పురా గ్రామ సర్పంచ్, రైతు దేవీ సింగ్ చెప్పారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన సమావేశాల్లో తమను ఘోరంగా మోసం చేశారని రాజన్ సింగ్ మండిపడ్డారు. రుణమాఫీ గురించి ప్రధానమంత్రి ఎన్నికల సభలలో చెప్పేటప్పుడు ఎవరెవరికి ఇది వర్తిస్తుందన్న విషయాన్ని అప్పట్లో చెప్పలేదని, ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి చేతులు దులిపేసుకొంటోందని, ఇదంతా కంటితుడుపు చర్యగా ఉంటోందని విమర్శించారు. కేవలం 2016-17 సంవత్సరంలో తీసుకున్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని చెప్పడం కూడా అన్యాయమన్నారు. గత మూడేళ్లుగా ప్రకృతి ప్రకోపం వల్ల రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని, ఇలాంటి సమయంలో కేవలం లక్ష రూపాయల లోపు రుణాలే మాఫీ చేస్తామంటే ఇది సముద్రంలో నీటిబొట్టు వేయడం లాంటిదని దీన్ దయాళ్ గౌతమ్ అనే రైతు తెలిపారు. కొద్ది మంది రైతులు మాత్రం రుణమాఫీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సాధారణంగా చిన్న రైతులకు బ్యాంకులు లక్ష రూపాయలకు మించి రుణాలు ఇవ్వవని కుశాల్ సింగ్ అనే రైతు అన్నారు. కేవలం గత సంవత్సరంలోనే పంట రుణాలు తీసుకున్న రైతులకు ఇది మంచి వరం లాంటిదని లోకేంద్ర అనే ఇంకో రైతు చెప్పారు. ఇంతకుముందు తీసుకున్న రుణాలు కూడా కట్టలేని రైతులు ఉన్నారని, వాళ్లకు కూడా ఇది వర్తింపజేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. -
రుణమాఫీపై సీఎం సంచలన నిర్ణయం?
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకోడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు కోటిన్నర మంది చిన్నకారు, సన్నకారు రైతులకు రుణమాఫీ చేసే విషయమై ఈ వారంలో నిర్ణయం తీసుకోనున్నారు. తొలి కేబినెట్ సమావేశంలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే కోటిన్నర మంది రైతులతో కూడిన జాబితాను సిద్ధం చేసి ముఖ్యమంత్రికి పంపినట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సూర్య ప్రతాప్ సాహి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రైతు రుణమాఫీ. ప్రభుత్వం ఏర్పాటు కాగానే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే పనిలోనే పడ్డామని సాహి వివరించారు. రైతుల నుంచి దాదాపు 80 లక్షల టన్నుల గోధుమలను కొనుగోలు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా గోధుమ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు తమ పొలాల నుంచి ఏడు కిలోమీటర్లకు మించి ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఉండే విధంగా ఈ కేంద్రాలు ఉంటాయన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం కేవలం 40 లక్షల టన్నుల గోధుమలే పండించాలని రైతులకు చెప్పిందని, కానీ తమ ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసిందని మంత్రి అన్నారు. గోధుమలకు కనీస మద్దతుధర క్వింటాలుకు రూ. 1625 చొప్పున నిర్ణయించామన్నారు. మూసేసిన, వాడకుండా వదిలేసిన కోల్డ్ స్టోరేజిలను గోధుమల నిల్వకు ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు మంత్రి సాహి తెలిపారు. ప్రస్తుతమున్న గోడౌన్ల సామర్థ్యం 40 లక్షల టన్నులే ఉందని, అది సరిపోదు కాబట్టి మరింత నిల్వ సామర్థ్యం కోసం ఇలా ఆలోచిస్తున్నామని అన్నారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామన్న ప్రధాని నరేంద్రమోదీ హామీ ఈ రకంగా నెరవేరుతుందని చెప్పారు. -
ఇది వేల కోట్ల స్కాం.. సీబీఐ విచారణ అవసరం
-
ఇది వేల కోట్ల స్కాం.. సీబీఐ విచారణ అవసరం
అగ్రిగోల్డ్ పేరుతో జరిగినది వేల కోట్లతో కూడిన అతిపెద్ద స్కాం అని, ఇందులో 20 లక్షల కుటుంబాలకు నెత్తిన టోపీ పెట్టారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దీనిపై హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో సంస్థ భూములు, ఇతర ఆస్తులను వేలం వేసి మొత్తం బాధితులందరికీ వాళ్ల సొమ్ము ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ అంశం గురించి అసెంబ్లీలో మాట్లాడేందుకు, తనకు బాధితులు ఇచ్చిన ఆధారాలను చూపించేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. దానిపై ఆయన ఏమన్నారంటే... ఈరోజు అసెంబ్లీ జరిగిన తీరును అంతా చూసే ఉంటారు ఇంత దారుణమైన కౌరవ సభ దేశంలో ఎక్కడా ఉండి ఉండదు సాక్ష్యాధారాలు చూపిస్తూ, 20 నిమిషాల టైం ఇవ్వండి, ఆధారాలతో నిరూపిస్తానన్నాను అగ్రిగోల్డ్ సమస్య నాకు.. పుల్లారావుకు మధ్య వ్యక్తిగత సమస్య కాదని చెప్పాను ఆ టైం ఆయన ఇచ్చి ఉంటే ఈ ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు నేను చూపుతున్న ఈ ఆధారాలతో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నాను బాధితులే ఈ ఆధారాలను తీసుకొచ్చి నాకు ఇచ్చారు.. ఇవేవో నేను తెచ్చినవి కావు ఈ ఆస్తులన్నీ బయటకు వెళ్లిపోతే తమకు డబ్బులు రావని.. పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని చెప్పారు అందుకే ఈ ఆధారాలను మాకు తీసుకొచ్చి ఇచ్చారు మాకు ఇవ్వాల్సిన సొమ్ము రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు కానీ గురువారం అగ్రిగోల్డ్ టాపిక్ జరుగుతుంటే మధ్యలో స్పీకర్ మైక్ కట్ చేశారు ఆడవాళ్ల గురించి తాను చేసిన వ్యాఖ్యల గురించిన ప్రెస్‌మీట్ వీడియోను ప్రదర్శించి చూపించారు అంత దారుణంగా విషయాన్ని డైవర్ట్ చేశారు ఈరోజు కూడా అలాగే జరిగింది.. ఆధారాలు ఉన్నాయి, చూపిస్తానంటే అవకాశం ఇవ్వలేదు వాళ్ల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే గద్దల మాదిరిగా తన్నుకుపోతోంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నాకు చాలెంజ్ చేస్తారు 20 లక్షల కుటుంబాలకు టోపీ పెట్టి, వేలకోట్లు మింగేసిన అతిపెద్ద స్కాం ఈ స్కాంలో పుల్లారావు అనే వ్యక్తి చిన్న చీమలాంటి వారు ఈయన లాంటివాళ్లు చాలామంది పెద్దమనుషులున్నారు.. వాళ్ల పేర్లు బయటకు రావాలి ఆ పెద్దమనుషుల చేతుల్లోంచి అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలి వాటిని మళ్లీ అటాచ్మెంట్లోకి తీసుకొచ్చి, డిపాజిట్ దారులకు మేలు జరిగేలా చూడాలి ఆస్తులను అమ్మి వాళ్లకు డబ్బులు ఇప్పించాలి మాట్లాడలేని ఆ గొంతుకలను నేను అసెంబ్లీలో వినిపించే ప్రయత్నం చేశాను దానికి నాకు, పుల్లారావుకు మధ్య ఏదో గొడవ ఉన్నట్లు చూపించారు సభలో ఆయనైనా ఉండాలట.. లేకపోతే నేనైనా ఉండాలట. అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానం వల్ల అగ్రిగోల్డ్ బాధితులకు మంచి ఏమైనా జరుగుతుందా? ఆరోపణలు వినాలన్న ఉద్దేశం లేదు గానీ టాపిక్‌ను డైవర్ట్ చేస్తున్నారు దేశంలో బోఫోర్స్, స్పెక్ట్రం, కోల్ స్కాంల మీద విచారణ ఎలా మొదలైంది.. ప్రతిపక్షాలు తమవద్ద ఉన్న ఆధారాలను పార్లమెంటులో ప్రస్తావిస్తే చర్చ జరిగి ఆ తర్వాత విచారణ జరిగింది, అప్పుడే స్కాంలు బయటకు వచ్చాయి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే.. బాధితులు ఇచ్చిన ఆధారాలను చూపించడానికి అసెంబ్లీలో 20 నిమిషాల సమయం అడిగినా ఇవ్వకుండా చాలెంజ్ అనే కొత్తపేరు తీసుకొచ్చారు ఇదే చంద్రబాబును అడుగుతున్నా.. చాలెంజ్ మీద నమ్మకం ఉంటే ఇదే సభలో ఎన్నిసార్లు మేం చాలెంజ్ చేశాం.. ఆయనేమైనా స్పందించారా? 21 మంది మా శాసన సభ్యులను కండువాలు కప్పి మీవైపు కూర్చోబెట్టుకున్నావు ఆ 21 మంది నీ పార్టీ గుర్తుతో గెలవలేదు.. వాళ్ల మీద అనర్హత వేటు పడకుండా సీఎం, స్పీకర్ కలిసి నాటకం ఆడుతున్నారు వాళ్లంతా అధికారపక్షం బెంచీలలో కూర్చున్నారు. వాళ్లను ఎందుకు అనర్హులుగా ప్రకటించడం లేదు ప్రజల మీద నమ్మకం ఉంటే, వాళ్లపై అనర్హత వేటు వేసి, నీ పార్టీ గుర్తుమీద వాళ్లను పోటీ చేయించు ప్రజలిచ్చే మాండేట్ను రిఫరెండంగా తీసుకుందాం.. మాకు మెజారిటీ వస్తే దాన్ని ప్రజాతీర్పుగా తీసుకొమ్మని సవాలు చేశాం తెలంగాణలో కోట్ల రూపాయల లంచం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయారు సుప్రీంకోర్టు ఆ కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. ఆ గొంతు చంద్రబాబుది కాదని నిరూపించగలరా అని చాలెంజ్ చేశాం.. వినలేదు ఆయన చాలెంజ్ తీసుకోరు గానీ, అవతలి వాళ్లు మాత్రం రెచ్చిపోయి, చాలెంజ్ తీసుకోవాలట. లేకపోతే ఏదో తప్పు చేసినట్లు అవుతుందట అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వాలి.. ఆరోపణలు వచ్చినప్పుడు సాక్ష్యాలలో పస ఉంటే విచారణ పిలిపించాలి 16 ఎకరాల హాయ్‌ల్యాండ్ భూములను ఎందుకు వేలం వేశారో ఎవరికీ తెలియదు విలువైన ఆస్తులు ఎందుకు బయటకు రావడం లేదో ఎవరికీ అర్థం కావట్లేదు ఎంపీలకు హస్తం ఉందని, చంద్రబాబు కొడుక్కి కూడా హస్తం ఉందని ఆరోపణలున్నాయి ఇప్పటివరకు అగ్రిగోల్డ్ బాధితులకు వచ్చింది కేవలం 16 కోట్లు మాత్రమే కేవలం 1152 కోట్లు ఇస్తే మొత్తం 14 లక్షల మందికి పైగా ఉన్న బాధితులందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు కానీ చంద్రబాబుకు మాత్రం ఈ విషయాలేవీ పట్టవు అగ్రిగోల్డ్ గురించి మాట్లాడకుండా ఎలా కట్టడి చేయాలని మాత్రమే ఇలాంటి తీర్మానాలు చేస్తారు ఈ కేసులో ఇప్పటికి ఇద్దరిని మాత్రమే అరెస్టు చేశారు. చైర్మన్, ఆయన తమ్ముడు మాత్రమే ఈ కేసులో ఇంకా చాలామంది ఉన్నారు.. అంతా కంపెనీలలో ఉంటూ ప్రజల డబ్బులను దుర్వినియోగం చేసి, వాటితో బయట ఆస్తులు కొన్నారని అసెంబ్లీ దృష్టికి తెచ్చాను ఒక్క ప్రత్తిపాటి పుల్లారావు మాత్రమే కాదు, తిరుపతిలో 14.5 కోట్లకు ఒకటిన్నర ఎకరాల భూమిని అమ్మేశారు బ్రహ్మంగారి మఠంలో వాళ్లకున్న భూములను అమ్ముకున్నారని, 2016లో కూడా జరిగిందని చెప్పాం ఇన్ని జరుగుతుంటే, వీటిని వినాలన్న ఉద్దేశం లేదు ప్రత్తిపాటి పుల్లారావు భార్యకు భూములు అమ్మిన వ్యక్తి ఉదయ దినకరన్ ఆయన అగ్రిగోల్డ్ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్నాడు, హాయ్‌ల్యాండ్ ప్రాపర్టీకి కూడా డైరెక్టర్‌గా ఉన్నాడు ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ లిమిటెడ్‌లో 2010 మార్చి 8 నుంచి ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు ఈ పెద్దమనిషి ఆ ఒక్క కంపెనీయే కాదు.. రామవ్వాస్ అనే మరో కంపెనీలో కూడా డైరెక్టర్‌గా ఉన్నారు ఒకవైపు అగ్రిగోల్డ్ ప్రజలకు టోపీ పెడుతోందని ఆరోపణలు వస్తున్నా, 2014లో ఈయన భూములు కొనుగోలు చేశారు వెంకట కృష్ణ ఆంజనేయ ప్రసాద్ నుంచి దినకరన్ 2014 జూలైలో కొన్నారు ఆ తర్వాత.. అగ్రిగోల్డ్ మీద కేసులు పడ్డాయి. 2015 జనవరి4న పశ్చిమగోదావరి జిల్లా పెదపాడులో కేసులు నమోదయ్యాయి ఇదే హాయ్‌ల్యాండ్‌లో ఉన్న డైరెక్టర్ ఉదయ్ దినకరన్ 19వ తేదీన ప్రత్తిపాటి పుల్లారావుకు భూములు అమ్మారు ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ.. ఉదయ్ దినకరన్ నుంచి భూములు కొన్న సేల్ డీడ్ కాపీ కూడా ఉంది స్పెక్ట్రం కేసులోను, కోల్ స్కాంలోను, బోఫోర్స్ స్కాంలోను ప్రతిపక్షాలు ఏం మాట్లాడాయో నాకు తెలియదు గానీ, వాటి మీద సీబీఐ విచారణ జరిగింది ఇప్పుడు నేను ఆధారాలతో సహా చూపిస్తున్నాను.. సీఐడీ విచారణ వద్దు, అది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరగాలి అది జరిగినా కూడా అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు నష్టం మాత్రం జరగకూడదు. ఒక్క పుల్లారావే కాదు.. గద్దలు అందరిమీద విచారణ చేసి, ఆస్తులన్నింటినీ వెనక్కి తీసుకొచ్చి వాటిని రీ ఎటాచ్ చేసి, వాటిని వేలం వేయగా వచ్చిన డబ్బును డిపాజిట్‌దారులకు అందజేయాలి ఈ విషయాలు చెప్పడానికి 20 నిమిషాల సమయం అడిగితే ఇవ్వలేదు నేనేమైనా సీబీఐ అధికారినా, పోలీసునా.. నేను పిలిస్తే చంద్రబాబు, ఆయన కొడుకు ఏమైనా వస్తారా.. ఇది 20 లక్షల కుటుంబాలకు సంబంధించిన సమస్యే తప్ప జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత సమస్య కాదని చెప్పాను అందరి సంక్షేమం కోసం 20 నిమిషాల సమయం ఇవ్వమని అడిగితే వెంటనే మైక్ కట్ చేసేస్తున్నారు ప్రజాస్వామ్యంలో స్పీకర్ ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలియాలి స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేముందు 14 రోజుల సమయం ఉండాలని నిబంధనలు ఉన్నాయి కానీ ఇంతకుముందు స్పీకర్ దాన్ని తోసిపారేసి.. వెంటనే అవిశ్వాసం చేపట్టారు ఎందుకంటే, 21 మంది సభ్యులకు విప్ జారీ చేసే అవకాశం మాకు ఇవ్వకూడదని ఇప్పుడు కూడా దాదాపు అలాగే చేస్తారు.. తీర్మానం వీగిపోయేలా చేస్తారు అయినా అవిశ్వాస తీర్మానం పెడతాం.. ఎందుకంటే, ఈ సభలో ఉన్నది మనుషులు కారు, రాక్షసులని ప్రజలకు తెలియాలి చివరకు ప్రజలు మొట్టికాయలు వేస్తారు, పైనుంచి దేవుడు కూడా మొట్టికాయలు వేయాల్సిందే రుణమాఫీపై అసెంబ్లీలోనూ అబద్ధాలే ఆ తర్వాత రైతు రుణమాఫీపై వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో చెప్పిన విషయాలు, వాటిలోని అబద్ధాలను సాక్ష్యాధారాలతో సహా జగన్ నిరూపించారు. విశాఖపట్నానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కరణం ధర్మశ్రీ కుటుంబానికి చెందిన మూడు రుణాలు పూర్తిగా మాఫీ అయిపోయినట్లు మంత్రి చెప్పారని, కానీ అదంతా పచ్చి అబద్ధమని చెప్పారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా చూపించారు. ఈ సందర్భంలో జగన్ ఏమన్నారంటే.. చంద్రబాబు సీఎం అయ్యేనాటికి రైతులకు 87,612 కోట్ల రుణాలు ఉన్నాయి ఆయన కట్టొద్దన్నందుకు రైతులు ఆ రుణాలు కట్టలేదు, దాంతో వారికి బ్యాంకులు అపరాధ వడ్డీ వేస్తున్నాయి వీళ్లు ఏడాదికి 3500 కోట్లు ఇస్తూ మొత్తం రుణమాఫీ చేసేశామంటున్నారు దాదాపు 40 లక్షల రైతుల అకౌంట్లు ఎన్పీఏలుగా బ్యాంకులు ప్రకటించాయి మరోవైపు రైతుల రుణభారం విపరీతంగా పెరుగుతోంది.. ఇప్పుడు దాదాపు 1.05 లక్షల కోట్లకు చేరుకుంది కరణం ధర్మశ్రీకి 1.36 లక్షల రుణాలు మాఫీ అయ్యాయని చెప్పారు విషయం ఏమిటంటే.. ప్రత్తిపాటి పుల్లారావు మూడు సందర్భాలు ప్రస్తావించారు ధర్మశ్రీ భార్య విజయలక్ష్మి 49 సెంట్ల భూమి పెట్టి 2007లో 35 వేలు తీసుకున్నారని, కానీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అంత రాదని చెప్పారు వడ్డీతో కలిపి ఇది 70వేలు అయ్యిందని చెప్పారు, దీనికి 13794 రుణమాఫీ చేశామని చెప్పారు విజయలక్ష్మికి మొత్తం 4 ఎకరాల భూమి ఉంది రెండు విడతలుగా ఆమెకు మొత్తం 5793 రూపాయలు మాత్రమే ఇప్పటికి మాఫీ అయింది రెండో కేసు.. ధర్మశ్రీ పేరుతో ఉన్నది 2013లో 50 వేల రుణం దీనికి మొత్తం రుణమంతా మాఫీ అయిపోయిందని పుల్లారావు చెప్పారు మొదటి దఫా 10 వేలు ఇచ్చారు. అందులో అసలు 3200, ఇంకా వడ్డీ ఉన్నాయి రెండోదఫాలో 11వేలు ఇచ్చారు.. ఈవాల్టికి 46వేలు, దానిపై వడ్డీ కలిపి 51వేల రుణం అలాగే ఉంది -
జానారెడ్డీ.. గట్లనేనా మాట్లాడేది?
జానాపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫైర్ - రుణమాఫీ ఏమన్నా బ్రహ్మపదార్థమా.. ఇంకేం లేదా? - పాడిందే పాడరా.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు - ఇంకా కాంగ్రెస్ పాలనపై ఎందుకు విమర్శలు: జానారెడ్డి - ఇప్పుడు మీరేం చేస్తున్నారో చెప్పండి - కేంద్రం నిధులను మళ్లించడం పద్ధతేనా? - అసెంబ్లీలో ఇరువురు మధ్య వాడివేడి చర్చ సాక్షి, హైదరాబాద్: ‘‘ఏనుగు దూరి తోకచిక్కినట్టు.. రైతు రుణమాఫీలో 75 శాతాన్ని చెల్లించి మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు ఏర్పాటు చేస్తుంటే పాడిందే పాడరా... అన్నట్టు కాంగ్రెస్ సభ్యులు వ్యవహరిస్తున్నారు. ఇదేదో బ్రహ్మపదార్థం అయినట్టు ఇంతకు మించింది లేనేలేనట్టు సభలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఎన్నో పర్యాయాలు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి గట్లనే మాట్లాడ్తరా..’’ – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ‘‘ఎంతసేపూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అట్లా.. ఇట్లా.. అంటూ చెప్పిందే చెప్పి.. అన్నదే అని.. ఏంటిది? మా ప్రభుత్వం పోయి మీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మళ్లిస్తున్నారు. ఇదేనా పద్ధతి?’’ – సీఎల్పీ నేత జానారెడ్డి వ్యవసాయంపై అసెంబ్లీలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, సీఎల్పీ నేత జానారెడ్డి మధ్య కాసేపు వాడివేడి సంభాషణ చోటు చేసుకుంది. చర్చ అనంతరం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధాన మిస్తూ.. తాను టీడీపీలో ఉండి అప్పటి ముఖ్యమంత్రి పనితీరు, టీఆర్ఎస్లో ఉంటూ ప్రస్తుత సీఎం పనితీరును దగ్గర్నుంచి చూశానని, ఇచ్చిన ఎన్నికల హామీలను 98% వరకు అమలు చేసి చూపు తున్న ఏకైక సీఎం కేసీఆర్ అంటూ కితాబిచ్చారు. కాంగ్రెస్ హయాంలో రూ.480 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయి పడితే తాము అధికారంలోకి వచ్చాక చెల్లించినట్టు గుర్తు చేశారు. దీనికి కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. మంత్రి అన్నీ తప్పుడు లెక్కలు సభ ముందుం చుతున్నారని, సరైన వివరాలు చెప్పేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యు లు జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్, రామ్మో హన్‌రెడ్డి తదితరులు పట్టు బట్టారు. ఈ సమ యంలో జానారెడ్డి లేచి... దాదాపు రూ. 2,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లించిన తర్వా త మిగిలిన రూ.480 కోట్లు చెల్లించే తరుణం లో రాష్ట్రపతి పాలన రావటంతో బకాయి పడిందని గుర్తు చేశారు. ‘కాంగ్రెస్ హయాం లో తెలంగాణకు వివక్ష..’ అంటూ చెప్పిన విషయాలనే చెబుతున్నారన్నారు. సోలార్ పంప్‌సెట్లపై కేంద్రం సబ్సిడీ ఇస్తే ఈ ప్రభు త్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఇంతలో సభలోకి వచ్చిన సీఎం జానా తీరును తీవ్రం గా తప్పుబట్టారు. ‘‘కారణాలేవైనా కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిపడ్డ రూ.480 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని తెలంగాణ వచ్చాక మేం విడుదల చేసినమాట నిజమా కాదా..? రైతు రుణమాఫీలో 75 శాతం చెల్లించి మిగతా 25 శాతం ఇప్పుడు చెల్లించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పాడిందే పాడరా... అన్నట్టు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఎన్నో ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత జానారెడ్డి ఇలా మాట్లాడ్డం సరికాదు..’’ అని పేర్కొన్నారు. ఈ విషయం జానాకు తెలియదా? మన పక్క రాష్ట్రంలో రూ.11 వేల కోట్ల రుణమాఫీ చెల్లిస్తే.. తెలంగాణలో రూ.12 వేల కోట్లు చెల్లించామని, దేశంలో మరేదైనా రాష్ట్రంలో ఇంతమొత్తం చెల్లించారా అని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్రాన్ని రూ.3 వేల కోట్లు అడిగితే రూ.1,100 కోట్లు వచ్చాయని, ఇందులో ఇన్పుట్ సబ్సిడీ రూ.703 కోట్లు ఉందన్నారు. ఆ సమయంలో తీవ్ర నీటి సమస్య ఉంటే ఆ నిధులను వాటికోసం సర్దుబాటు చేశామన్నారు. ఇలా సర్దుబాటు చేసే వెసులుబాటు ఉంటుందని జానారెడ్డికి తెలియక మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. అలా సర్దుబాటు చేసిన మొత్తాన్ని ఇప్పుడు చెల్లించామని, దీన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావటం లేదని సీఎం పేర్కొన్నారు. అనంతరం పోచారం ప్రసంగాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు పగటివేళ రెండు గంటలు కూడా కరెంటు లేకపోతే తాను, హరీశ్‌రావు నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలసి సమస్య విన్నవిస్తే.. ‘‘తెలంగాణ తెచ్చుకుంటామంటున్నారు కదా తెచ్చుకోండి.. అప్పుడు ఈ మాత్రం కూడా ఉండదు..’’ అని పేర్కొన్నారని గుర్తు చేశారు. -
రుణమాఫీ ఒకేసారి చేయలేం: సీఎం కేసీఆర్
అది మా విధానం కాదన్న ముఖ్యమంత్రి - కాంగ్రెస్ డిమాండ్ చేసిందనో.. మరెవరో చెప్పారనో మా విధానం మార్చుకోం - ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచితే ఒకేసారి మాఫీ చేస్తామన్నది నిజమే... అలా వచ్చిన రూ. 3 వేల కోట్లు మూడో విడత రుణమాఫీకే ఇచ్చాం - అనుకున్నట్టుగా వాణిజ్య పన్నుల ఆదాయం రాలేదు - కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడంతో భూముల అమ్మకాల ఆదాయం లేదు - మిగిలిన 25 శాతానికి వచ్చే బడ్జెట్లో నిధులిస్తాం సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణమాఫీ చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అయితే ఒకేసారి రుణమాఫీ చేయడం తమ ప్రభుత్వ విధానం కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ డిమాండ్ చేసిందనో, మరెవరో చెప్పారనో తమ విధానం మార్చుకోలేమని తేల్చిచెప్పారు. బుధవారం అసెంబ్లీలో వ్యవసాయంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. కేంద్రం రాష్ట్రానికి ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచితే ఒకేసారి రుణమాఫీ చేస్తామని సీఎం గతంలో చెప్పిన విషయాన్ని చర్చ సందర్భంగా విపక్ష నేత జానారెడ్డి గుర్తుచేశారు. దీనిపై సీఎం వివరణ ఇస్తూ... ‘‘ఎఫ్ఆర్బీఎం పరిమితి 0.5 శాతం పెరిగి, వాణిజ్య పన్నులు రూ.4.5 వేల కోట్లకు చేరి, బడ్జెట్లో పేర్కొన్న విధంగా భూముల అమ్మకాల ద్వారా ఆదాయం పెరిగితే.. ఒకేసారి రుణమాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని మేం చెప్పిన మాట వాస్తవమే. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు మేరకు వచ్చిన ఆదాయంలో రూ.3 వేల కోట్లు మూడో విడత రుణమాఫీకే అందజేశాం. అనుకున్నట్టుగా వాణిజ్య పన్నుల ఆదాయం పెరగకపోగా.. పెద్దనోట్ల రద్దు ప్రభావంతో భూముల అమ్మకాల ద్వారా ఆదాయం వచ్చే మార్గం కూడా లేకపోయింది’’ అని అన్నారు. రుణమాఫీ ఇప్పటికే 75 శాతం పూర్తయిందని, మిగిలిన 25 శాతానికి రానున్న బడ్జెట్ సమావేశాల్లోగా నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. రుణమాఫీ మొత్తం రూ.17,500 కోట్లలో 75 శాతం పోగా.. మిగిలిన మొత్తానికి రైతులకు సంబంధం లేకుండా తామే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు హామీ ఇచ్చిందని తెలిపారు. రైతులు తమ పాత రుణంతో సంబంధం లేకుండా బ్యాంకుల నుంచి కొత్త రుణం పొందవచ్చని తెలిపారు. మొత్తం 35 లక్షల మంది రైతుల్లో ఎక్కడైనా కొందరికి ఇబ్బందులు తలెత్తి ఉండొచ్చని, కొన్నిచోట్ల బ్యాంకులు సరిగా వ్యవహరించకపోయి ఉండొచ్చని పేర్కొన్నారు. విపక్ష సభ్యులుS పేర్కొన్న విధంగా ఎక్కడైనా రైతులకు అన్యాయం జరిగినా, వడ్డీ భారం పడినా, ప్రభుత్వం దృష్టికి తెస్తే ఆ భారాన్ని మోసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. త్వరలోనే బ్యాంకులతో సమీక్షించి రైతుల నుంచి వసూలు చేసిన వడ్డీ వివరాలను సేకరించాలని వ్యవసాయ, ఆర్థిక మంత్రులకు సూచించారు. నిజాం షుగర్స్ ముగిసిన అధ్యాయం తెలంగాణకు గర్వకారణమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని 2004లోనే తాను కేంద్రంతో కొట్లాడానని సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే.. పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోని కారణంగా అక్కడి రైతులంతా చెరకు వేయడం మాని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారని చెప్పారు. ఫ్యాక్టరీని పూర్తిస్థాయిలో నిర్వహించాలంటే ఆ ప్రాంతంలో రైతులు కనీసం 10 లక్షల టన్నుల చెరకు పండించాలన్నారు. అయితే ప్రస్తుతం లక్ష టన్నులకు మించి చెరకు పంట లేనందున ఫ్యాక్టరీ నిర్వహణ సాధ్యం కాదని చెప్పారు. అయినా మహారాష్ట్ర తరహాలో రైతులు సొసైటీగా ఏర్పడి ఫ్యాక్టరీని నడుపుకునేట్లయితే తెరిపిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఫ్యాక్టరీ నిర్వహణ విషయమై రైతులు విముఖత వ్యక్తం చేయడంతో ఆ అంశం ముగిసి పోయిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చెబుతున్న విధంగా రైతులు ఫ్యాక్టరీని నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటే.. సదరు సొసైటీకి ఆయన్నే చైర్మన్‌గా చేసేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. -
సర్కారుపై దరఖాస్తులతో సమరం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి అర్హులైన లబ్ధిదారులతోనే వ్యక్తిగతంగా దరఖాస్తులు చేయించాలని నిర్ణయించినట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. రైతుల రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని కోరుతూ వ్యక్తిగతంగా వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, ప్రభుత్వానికి అంది స్తామన్నారు. రైతులు, విద్యార్థుల నుంచి దరఖాస్తులను పార్టీ శ్రేణులు సేకరించి ప్రభుత్వానికి అందించడం ద్వారా ఒత్తిడి పెంచుతామన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక కమిటీ, సీనియర్ నాయకులతో గాంధీభవన్‌లో మంగళవారం సమావేశం జరిగింది. ఈ వివరాలను ఉత్తమ్ మీడియాకు వెల్లడించారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైన రుణమాఫీ, రీయింబర్స్‌మెంట్‌పై కార్యాచరణ చేపట్టనున్నట్టుగా వెల్లడించారు. రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో ఓట్లేయించుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు మోసం చేస్తోందన్నారు. మూడోవిడత రుణమాఫీ చేయకపోవడంతో 37 లక్షల మంది రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు, 3లక్షల మంది మహిళా రైతుల బంగారు ఆభరణాలు బ్యాంకుల్లోనే ఉన్నాయన్నారు. రూ.720 కోట్లు పక్కదారి.. కరువు బారిన పడిన రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం ఇచ్చిన రూ.720 కోట్లను పక్కదారి పట్టించారని ఉత్తమ్ ఆరోపించారు. రైతుల నోట్లో మట్టి కొట్టేలా నిధులను కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని విమర్శించారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, ఇటీవల వచ్చిన వరదల వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించి క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తామని చెప్పారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి, నష్టంపై నివేదికలను రూపొందిస్తామని చెప్పారు. 13 నుంచి 18 వరకూ రుణమాఫీ, రీయింబర్స్మెంట్ అంశాలకు సంబంధించిన దరఖాస్తులను కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేస్తుందన్నారు. ఈ దరఖాస్తులను ఈ నెల 21 నుంచి 31 మధ్య తిరిగి సేకరించి, వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు అందిస్తామని చెప్పారు. 20న పెద్దపల్లిలో బహిరంగసభ ఈ నెల 20న పెద్దపల్లి పట్టణంలో రైతుగర్జన పేరుతో భారీ బహిరంగసభను నిర్వహిస్తామని ఉత్తమ్ ప్రకటించారు. రైతుల సమస్యలను ఈ సభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. ఈ నెల 19న చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావనా యాత్రను నిర్వహిస్తామని, దీనికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఆహ్వానించినట్టుగా చెప్పారు. -
అగ్రహారం సొసైటీలో అడ్డంగా దోపిడీ
2015లో పంటలు సాగు లేదు. పైగా కరువు. దీంతో రైతుల చేతిలో చిల్లిగవ్వలేదు. ఖరీఫ్ సీజన్ ముగిసిపోతోంది. ఎలాగైనా పంట సాగు చేయాలి. ఏం చేయాలిరా దేవుడా అనుకుంటున్న సమయంలో అగ్రహారం సొసైటీలో వడ్డీలేని రుణాలు ఇస్తుండటంతో రైతులు రుణాల కోసం ఎగబడ్డారు. రైతు అవసరం సొసైటీ బ్యాంక్ అధికారులకు కాసుల వర్షం కురిపించింది. ఇదే అదనుగా భారీ ధరకు తైవాన్ స్ప్రేయర్లు అంటగట్టి సొసైటీవారు రైతులను నిలువు దోపిడీ చేశారు. ఖాజీపేట: అగ్రహారంలోని రైతు సహకార సొసైటీ కుంభకోణాలకు నిలయంగా మారింది. ఎంతమంది అధికారులు మారినా, ఎందరు అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినా పరిస్థితి మాత్రం మారడం లేదు. తాజాగా వడ్డీలేని రుణాల పేరుతో రైతులను నిలువుదోపిడీ చేస్తున్న ఉదంతం వెలుగు చూసింది. రైతులకు అవసరం లేకపోయినా తైవాన్ పంపుసెట్లు అంటగడుతున్నారు. అదనపు ఖర్చుల పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. ఇప్పటివరకు అగ్రహారం సొసైటీలో రైతులకు ఇచ్చిన రుణాల్లో రూ.1.3కోట్లకుపైగానే దోచుకున్నట్లు తెలుస్తోంది. పంప్‌ల పేరుతో దోపిడీ మాకు పంపులు ఉన్నాయి వద్దు అన్నా.. వినిపించుకోకుండా కచ్చితంగా తీసుకుంటేనే రుణం వస్తుంది.. లేకపోతే రాదని సొసైటీ అధ్యక్షుడు తెగేసి చెబుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు రుణాలు తీసుకుంటున్నారు. టూస్ట్రోక్ పంపుసెట్టు బయట రూ.5వేల నుంచి రూ.5,500లకు లభిస్తోంది. కానీ వీటిని రూ.6,470లకు కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. ఇందులో దళారులు రూ.14లక్షలకుపైగానే దోచుకున్నారు. దళారులతో కుదిరిన ఒప్పందం మేరకు గుంటూరు నుంచి నేరుగా ఖాజీపేట అగ్రహారం సొసైటీకి 1,300 పంపుసెట్లు వచ్చాయి. వచ్చిన పంపు సెట్లకు రూ.కోటి 30లక్షలు డీడీని తీసి కంపెనీ వారికి ఇచ్చారు. అంటే ఒక్కో పంపు సెట్టు రూ.10 వేలు పడినట్లు తెలిసింది. అధికారికంగా చెల్లించిన ధరలో ఒక్కో పంపుసెట్టుపై రూ.3,530 అధికంగా చెల్లించారు. ఇప్పటివరకు 1,020 మంది రైతులకు రుణాలు ఇచ్చారు. రైతుల వద్ద నుంచి ఒక్కో పంప్సెట్టుకు రూ.13వేలు వసూలు చేస్తున్నారు. అంటే అధికారికంగా సొసైటీవారు రూ.10వేలు చెల్లిస్తే రైతుల వద్దనుంచి అనధికారికంగా మరో రూ.3వేలు వసూలు చేస్తున్నారు. అంటే 1,020 రుణాలకు గాను రైతుల వద్దనుంచి రూ.30.60 లక్షలు స్వాహా చేశారు. అంతకుముందు ఎమ్మార్పీ తేడా రూ.36లక్షలు ఉంది. ఈ డబ్బు ఎక్కడికి వెళ్లింది.. ఎవరు తీసుకున్నారు.. దీనిలో ఎవరి వాటా ఎంత అన్నది తేలాల్సి ఉంది. ఒక్క తైవాన్ పంప్సెట్టులోనే దాదాపు రూ.70లక్షలు పైగానే రైతుల నుంచి సొసైటీ వారు దోచుకున్నట్లు స్పష్టమవుతోంది. నాసిరకం స్ప్రేయర్లు రైతులకు అందించే పంపుసెట్లు నాసిరకంగా ఉన్నాయి. ప్రస్తుతం రైతులు ఫోర్‌స్ట్రోక్ పంపుసెట్లు వాడుతున్నారు. దీనివల్ల పంటలకు త్వరగా మందు పిచికారీ చేయొచ్చు. కానీ సొసైటీవారు టూస్ట్రోక్ పంపుసెట్లు అందిస్తున్నారు. వీటికి పెట్రోలుతోపాటు ఆయిల్ వేసుకుని పిచికారీ చేయాలి. పిచికారీకి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా సొసైటీ వారు ఇచ్చిన పంపులు రైతులకు పనికిరాకపోవడంతో రైతులు ఇతర ప్రాంతాల వారికి రూ.4 వేల నుంచి రూ.5వేలకు అమ్ముతున్నారు. పంట సీజన్ కావడంతో... వడ్డీలేని రుణం కావడంతో రైతులు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం సాగు సమయం కావడంతో ఎక్కడో వడ్డీలకు తెచ్చే బదులు సొసైటీలో రుణం తీసుకుంటే మేలని ఎగబడ్డారు. అయితే రూ.లక్ష రుణం ఇస్తే అందులో రైతులకు అందేది కేవలం రూ.70 వేలు మాత్రమే. రైతు షేర్ క్యాపిటల్ పేరుతో రూ.10వేలు, పంపుసెట్టు పేరుతో రూ.13వేలు, బ్యాంకు ఖర్చుల పేరుతో రూ.3 వేల నుంచి రూ.6వేలు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి డిక్లరేషన్ బాండ్‌కు రిజిస్టర్ బాండ్ల ఖర్చు కేవలం రూ.250 నుంచి రూ.300 ఉంటుంది. ఈసీ తీయాలంటే అదనంగా మరో రూ.300 వస్తుంది. కానీ రైతు తీసుకున్న రుణానికి ఒక్క ఈసీ తియ్యలేదు. పైగా మనిషిని బట్టి వసూలు చేస్తున్నారు. ఇందులో ఒక రుణానికి రూ.3వేలు చొప్పన వేసినా 1,020 రుణాలకు దాదాపు రూ.30.60లక్షలు దోచుకుంటున్నారు. ఇక అధికారులకు మామూళ్లు సరేసరి. నిబంధనలు గాలికి.. బ్యాంకు నిబంధనల ప్రకారం ఒక రైతుకు రుణం కావాలంటే పట్టాదారు పాసుపుస్తకం 1బీ అడంగల్‌తోపాటు డిక్లరేషన్ఫాంలో సంతకాలు పెట్టాలి. కానీ ఇక్కడ నిబంధనలను సడలించారు. ఎందుకంటే చాలామంది రైతులు ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. దీంతో సొసైటీ వారు పక్కాప్రణాళికతో 1బీ ఉంటే చాలంటూ రుణాలు ఇచ్చారు. దీంతో చాలామంది ఒకే నంబరుపై రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆన్లైన్లో పేర్లు మార్చుకుని రుణాలు పొందినట్లు సమాచారం. మరికొంతమందికి ఎలాంటి అర్హత లేకున్నా అడ్డదారుల్లో బినామీ రుణాలు పొందినట్లు బహిరంగ విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం రుణం తీసుకుంటున్న రైతు మైదుకూరు డీసీసీ బ్యాంక్‌లోకి పోయి డబ్బులు తీసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ సొసైటీ అధ్యక్షుడు బ్యాంక్‌నుంచి డబ్బు డ్రా చేసి తెచ్చి వారి ఒప్పందం మేరకు డబ్బు పట్టుకుని ఇస్తున్నారు. పంప్సెట్టుకు, ఇతరఖర్చులకు, ఎలాంటి రసీదు ఇవ్వడం లేదు. ఇలా నిబంధనలను పాతరేసి ఇష్టారుసారంగా రుణాలు ఇచ్చి అందిన కాడికి దండుకుంటున్నట్లు సమాచారం పేరుకే మెంబర్లం.. మాకేమి తెలియదు సొసైటీలో పేరుకే మేం మెంబర్లం. మాకు సొసైటీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. సొసైటీ డెరైక్టర్లతో మీటింగ్ జరిపి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇప్పటికి ఏడాదైంది.. ఇంతవరకూ మీటింగ్ జరపలేదు. సొసైటీలో జరుగుతున్న అవినీతిపై ప్రతి రైతును విచారించాలి. దోచిన సొమ్మును కట్టించాలి. వెంటనే సొసైటీని రద్దుచేయాలి -జనార్దన్‌రెడ్డి, సొసైటీ డెరైక్టర్ పేరుకే ఉపాధ్యక్షుడిని నేను డెరైక్టర్ని. పైగా ఉపాధ్యక్షుడిని కూడా. కానీ సొసైటీలో ఏం జరుగుతుందో నాకేమీ తెలియదు. కనీస సమాచారం ఇవ్వడం లేదు. సొసైటీలో అక్రమాలు జరుగుతున్నట్లు రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయి -బత్తెన మల్లేశ్వర్‌రెడ్డి సింగిల్ విండో ఉపాద్యక్షుడు సొసైటీని అధ్యక్షుడిని తొలగించి విచారణ జరపాలి సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయి. రైతుల నుంచి అక్రమంగా వసూళ్లూ చేస్తున్నారు. వాస్తవ విషయాలు బయటికి రావాలంటే అధ్యక్షుడిని తొలగించి విచారించాలి. అక్రమంగా వసూలు చేసిన డబ్బును రికవరీ చేయాలి -దుగ్గిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు లక్షకు రూ.70వేలు ఇస్తున్నారు సొసైటీ బ్యాంక్‌లో రైతులకు కాలం చెల్లిన పంపుసెట్లను రైతులకు బలవంతంగా అంటగడుతున్నారు. రూ.లక్షకు 70వేలే రుణం ఇస్తున్నారు. మిగిలిన సొమ్ము ఎక్కడికి పోతోంది విచారణ చేపడితే కానీ వాస్తవాలు బయటికి వస్తాయి -దుగ్గిరెడ్డి గంగాధర్‌రెడ్డి, మాజీ ఉపసర్సంచ్ అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి సొసైటీలో చాలా అక్రమాలు జరుగుతున్నట్లు రైతులు నా దృష్టికి తీసుకువచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా తైవాన్ పంపులు ఇస్తున్నారు. అధికారులు రుణం తీసుకున్న ప్రతి రైతును విచారించి అక్రమాలకు పాల్పడ్డ వారి నుంచి రికవరీ చేయించాలి -మురళీ రామ్మెహన్‌రెడ్డి, జెడ్పిటీసీ భర్త -
రుణమాపీ ఒకేసారీ చేపట్టాలి
కేంద్రసహకార బ్యాంకు ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా రామాయంపేట: రైతు రుణమాఫీని ఒకేసారి చేపట్టి కొత్త రుణాలు మంజూరు చేయాలంటూ అఖిలపక్షం ఆధర్యంలో మంగళవారం కేంద్ర సహకార బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్, టీటీడీపీ, బీజేపీ కార్యకర్తలు బ్యాంకు వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. ఈసందర్భగా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సరాపు యాదగిరి, బీజేపీ జిల్లా నాయకుడు వెల్ముల సిద్దరాంలు మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రభుత్వ విధానం సరిగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులపాలవుతున్నారన్నారు. ఇప్పటివరకు మూడో విడత రుణమాఫీ నిధులు మంజూరు కాకపోడంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడంలేదన్నారు. అనంతరం బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు సుధాకర్‌రెడ్డి, రఘుపతిగౌడ్, శీలం క్రిష్ణారెడ్డి, చింతల క్రిష్ణ, చింతల శ్రీనివాస్, ఎనిశెట్టి అశోక్, నవాత్ నగేశ్, రమేశ్‌రెడ్డి, హస్నొద్దీన్, విప్లవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీ కోసం 28న బ్యాంకుల ఎదుట ధర్నా
వరంగల్ : రైతుల రుణాలు ఏకకాలంలో మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాం డ్ చేస్తూ ఈనెల 28న అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లోని బ్యాంకుల ఎదుట ధర్నా నిర్వహించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను విస్మరించిందని, రుణాలు మాఫీ చేయక పోవడంతో రైతులు అప్పులు దొరకక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ప్రమాణ స్వీకారం టీడీపీ అనుబంధ తెలుగురైతు జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 1 గంటకు ఉంటుందని సత్యనారాయణరావు తెలిపారు. -
కదులుతున్న తెలుగుదేశం పునాదులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య తీసుకునే అనాలోచిత నిర్ణయాలు ఆయననే వెంటాడుతున్నాయి. ఆయన రగిల్చిన రిజర్వేషన్ సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఏపీలో ఒక వైపు కాపులు ఉద్యమిస్తున్నారు. ఇంకోవెపు బీసీలు మండిపడుతున్నారు. దీనితో ఏపీలో టీడీపీ పునాదులు కదులుతున్నాయి. టీడీపీ స్థాపించిన ప్పటి నుంచి బీసీ కులాలు అండగా నిలిచాయి. కానీ ఇటీవలి కాలంలో టీడీపీ పార్టీ నేత బాబు తీసుకుం టున్న అసంబద్ధ నిర్ణయాల వలన ఈ కులాలు టీడీపీ పట్ల విశ్వాసం కోల్పోతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో ఏపీలో టీడీపీ గెలవడానికి ప్రధాన కారణం బీసీలు, కాపులు. ఎన్నికలకు ముందు అనేక సర్వేలు కూడా వైఎస్సార్ సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని తేల్చాయి. కానీ బీసీలు, కాపుల మద్దతుతో టీడీపీ అనూహ్యంగా గెలిచింది. ఏపీలో ఇటీవలి కాలంలో టీడీపీ ప్రతిష్ట బాగా దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకపోవడమే. 1.45 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులంతా ఆగ్ర హంగా ఉన్నారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అపహాస్యం పాలైంది. దీనితో రైతులు, మహి ళలలో భారీ వ్యతిరేకత వచ్చింది. అమరావతి రాజధాని భూ కుంభకోణంలో టీడీపీకి పడ్డ అవినీతి ముద్ర చెరిగిపోనిది. శాసనసభ్యులకు కోట్ల రూపాయల డబ్బు లిచ్చి, కాంట్రాక్టులిచ్చి కొనుగోలు చేయడంతో పార్టీ ప్రతిష్ట బాగా దిగజారింది. దీనికితోడు తమను చిన్న చూపు, నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన బీసీలలో రగులు తోంది. ఇవన్నీ టీడీపీని బలహీనపర్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని సర్వేలు తెలుపుతున్నాయి. అదే సమ యంలో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఆ పార్టీ 120 సీట్లు గెలుస్తుందని రాజకీయ పరిశీలకుల అంచనా. బీసీలు పార్టీ పెడితే టీడీపీ ఓటు బ్యాంకు పునాదులు కదలి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. వైఎస్సార్సీపీకి దళితులు, ముస్లింలు, క్రిష్టియన్లు, రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకుగా చెక్కు చెదరకుండా ఉంది. అలాగే ఇతర వర్గాల ఓటుబ్యాంకు ఏ మాత్రం కలిసొచ్చినా ఆ పార్టీకి తిరుగుండదు. పైగా పార్టీ అధి నేత జగన్మోహన్ రెడ్డికి తండ్రిలాగా మాట తప్పని వాడు అనే విశ్వసనీయత ఉంది. మరోవైపు టీడీపీ ఓటు బ్యాంకు పునాదులు కదలడంతో రెండు రాష్ట్రాలలో కోలుకోలేని దెబ్బతినబోతోంది. ఏదేమైనా బీసీలు, కాపుల సమస్యలు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి. - ప్రొ॥ఎం. బాగయ్య వ్యాసకర్త ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ మొబైల్ : 98665 30295 -
గందరగోళంగా మారిన రుణమాఫీ పథకం : ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీ పథకం గందరగోళంగా మారిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎఫ్ఆర్బీఎమ్ పరిమితిని పెంచి రైతు రుణాలను ఒకే దశలో చెల్లిస్తామన్న హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని ఉత్తమ్ సూచించారు. ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, కరువు నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని విమర్శించారు. -
'సంతలో పశువుల్లా ఎమ్మెల్యేల కొనుగోలు'
హైదరాబాద్: సంతలో పశువులను కొన్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కోట్ల రూపాయలను గుమ్మరిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఉన్నవాళ్లే చట్టసభలకు వెళ్తున్నారని దుయ్యబట్టారు. తుపాను బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. వెంటనే రైతులకు రుణాలు మంజూరు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ మృతులకు ఆపద్బంధు
కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కరువు, వడగాడ్పులు, ఎండలు, భూగర్భ జలాలు తగ్గిపోవటంతో ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఏ ప్రాంతంలోనైనా ప్రజలు తిండి లేక బాధ పడితే వెంటనే స్పందించాలని, ప్రభుత్వం అక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. పశుగ్రాసం ఎక్కడెంత అవసరముందో అంచనా వేసి అందజేయాలన్నారు. శుక్రవారమిక్కడ ఎంసీహెచ్ఆర్డీలో కలెక్టర్ల సదస్సు జరిగింది. అయిదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సీఎం వివిధ అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశా రు. వడ దెబ్బతో మరణించిన వారి కుటుం బాలకు ఆపద్బంధు పథకం ద్వారా ఆర్థిక సాయం (రూ.50 వేలు) అందించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 65 సంవత్సరాల లోపు వారికే ఈ పథకం వర్తింపజేయాలనే నిబంధన తొలగిం చాలని సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ పనులు.. ఉదయం పదిన్నర లోపు, సాయంత్రం నాలుగున్నర తర్వాతే చేయించాలన్నారు. ‘‘ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మరో నెలన్నర వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. అప్పటి దాకా పరిస్థితిని ఎదుర్కొనే కార్యాచరణ ఉండాలి. తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. మంచినీరు అందని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి. మిషన్ భగీరథ పూర్తయితే మంచినీటికి కొదవుండదు. మిషన్ కాకతీయ పూర్తయితే చెరువులు నిండి భూగర్భ జలమట్టం పెరుగుతుంది. సిద్దిపేటలో తాగునీటి పథకం అమలవుతున్నందున అక్కడ కరువు ప్రభావం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి రావాలి’’ అని సీఎం అన్నారు. చెరువుల పనుల్లో వేగం పెంచండి ‘‘ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే వ్యవసాయ భూముల్లోంచి పోయే పైపులైన్ల నిర్మా ణం పూర్తి చేయాలి. వర్షాలు వస్తే పనిచేయడం కుదరదు..’’ అని సీఎం కలెక్టర్లను అప్రమత్తం చేశారు. మిషన్‌భగీరథ పనులను సీఎం జిల్లాల వారీగా సమీక్షించారు. మిషన్ కాకతీయలో మొ దటి విడత చెరువుల పనులు తొందరగా ము గించి, రెండో విడతలో 9 వేల చెరువుల పనులు శరవేగంతో చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. ఒకేసారి పెద్ద మొత్తంలో నిర్మాణ పనులు జరుగుతున్నందున మిషనరీ, సిబ్బంది కొరత అధిగమించే ప్రణాళిక రూపొందించాలన్నారు. నిర్ణీతకాల వ్యవధికి సిబ్బందిని నియమించుకోవాలని, ఏ అధికారి ఎంత పని చేయగలడో శాస్త్రీయంగా అంచనా వేసి పని విభజన చేయాలని చెప్పారు. పనుల్లో నాణ్యత పాటించాలని స్పష్టంచేశారు. పత్తి వద్దు.. సోయాబీన్ ముద్దు భవిష్యత్తులో పత్తి ప్రమాదంలో పడుతుందని, ధర పడిపోతుందని ముఖ్యమంత్రి చెప్పారు. 42 లక్షల ఎకరాల్లో ప్రస్తుతం పత్తి పంట వేస్తున్నారని, ఆ సాగును 15-20 లక్షల ఎకరాలకు తగ్గించాలని అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయంగా సోయాబీన్, మొక్కజొన్న పంటలు సాగు చేసేలా రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. సోయాబీన్, మొక్కజొన్న విత్తనాలను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. విత్తనాలను అయిదు ఎకరాల లోపు రైతులకే వర్తింపజేయాలని, ఒకే పంట వేసే వారికిచ్చే సబ్సిడీలు రెండున్నర ఎకరాలకు ఇవ్వాలనే నిబంధన తీసేయాలని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని రైతులందరికీ ఎలాంటి తేడా లేకుండా సోయాబీన్‌పై సబ్సిడీ ఇవ్వాలని ఆదేశించారు. విత్తే పరికరాలను సబ్సిడీపై అందించాలని చెప్పారు. వచ్చే ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాలను ముందే తెచ్చుకుని నిల్వ చేసినట్లు అధికారులు సీఎంకు చెప్పారు. రైతులకు అవసరమయ్యే 4.5 లక్షల టన్నుల ఎరువులను బఫర్ స్టాక్‌గా పెట్టామని మార్కెటింగ్ ఎండీ శరత్ చెప్పారు. కొత్తగా నిర్మించే గోదాములు, ఇప్పటికే అందుబాటులో ఉన్న గోదాములను విత్తనాలు, ఎరువుల నిల్వకు ఉపయోగించాలని సీఎం అన్నారు. పత్తి సాగును నిరుత్సాహపరిచేలా తాము ప్రణాళిక రూపొందించినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి చెప్పా రు. తక్కువ విత్తనంతో ఎక్కువ దిగుబడి వచ్చే సేలం పసుపు సాగు చేసేలా ప్రోత్సహించాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. రైతుల ఖాతాలు పరిశీలించండి.. రైతుల రుణమాఫీ మూడో విడత నిధులు విడుదల చేయనున్నందున, రుణమాఫీ సాఫీగా జరిగేలా చూడాలని సీఎం కలెక్టర్లకు సూచిం చారు. రుణమాఫీ పొందే రైతుల బ్యాంకు ఖాతాలను మరోసారి క్షుణ్నంగా పరిశీలించాలని, ఆడిటర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. కొత్త రెసిడెన్షియల్ స్కూళ్లకు ఏర్పాట్లు 2016-17 విద్యాసంవత్సరం నుంచి మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలకు 250 రెసిడెన్షియల్ స్కూళ్లు నడిపేందుకు అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్లు పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ కోరారు. భవనాలు నిర్మించేందుకు సమయం పడుతుందని, ఈలోపు తరగతులు, హాస్టల్ నిర్వహణకు అద్దె భవనాలు సమకూర్చుకోవాలని చెప్పారు. మైనారిటీ రెసిడెన్షియళ్లకు ఇప్పటికే స్థల సేకరణ జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు స్థల సేకరణ జరగాలని వివరించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న, తలసాని, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్ అధికారులు ఎస్పీ సింగ్, ఎస్కే జోషి, బీఆర్ మీనా, సురేష్ చంద్ర, తివారీ, శరత్, రామకృష్ణారావు, నవీన్ మిట్టల్, వికాస్‌రాజ్, షపీ ఉల్లా, నర్సింగ్ రావు తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ఈ ఏడాది 106 శాతం వానలు ప్రస్తుతం వేసవితో పాటు వచ్చే వానాకాలం ఎలా ఉంటుందనే అంశంపై కూడా సదస్సులో చర్చ జరిగింది. ఈసారి ఖరీఫ్‌లో 106 శాతం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ డెరైక్టర్ వైకే రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులపై ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. మే 15న మరోసారి వాతావరణ శాఖ అధ్యయన నివేదిక వెలువడుతుందని, అప్పుడు మరింత స్పష్టత వస్తుందని సీఎం చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో హరితహారం గత ఏడాది వర్షాలు సరిగా లేనందున హరితహారంలో అనుకున్నట్లుగా మొక్కలు పెంచలేకపోయామని, వచ్చే వానాకాలంలో ఉద్యమ స్ఫూర్తితో మొక్క లు నాటాలని సీఎం పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలను ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. రాష్ట్రంలోని వివిధ నర్సరీలలో 46.30 కోట్ల మొక్కలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఇళ్లల్లో పెంచేందుకు పండ్ల మొక్కలు సరఫరా చేయాలని, మొక్కలు నాటడానికి గుంతలు తీసే పనిని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో యూకలిప్టస్ మొక్కలు పెంచాలని సూచించారు. మొక్కలు నాటడం, పెంచడంలో స్ఫూర్తిదాయక పాత్ర పోషించిన వారికి హరిత మిత్ర అవార్డులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ప్రతిపాదనలు పంపించాలని కోరారు. -
రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధేదీ ?
పెదకాకాని: రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వాలు, బ్యాంకర్ల తీరుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జరగనున్న జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన సోమవారం పెదకాకానిలో విలేకరులతో మాట్లాడారు. విజయ్‌మాల్యా లాంటి పారిశ్రామికవేత్తలకు వందల కోట్లు సునాయాసంగా రుణాలిచ్చే బ్యాంకర్లు పేదవాళ్ల విషయంలో సవాలక్ష నిబంధనలు పెడుతున్నారన్నారు. దీంతో సాగుకు అధిక వడ్డీల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. బ్యాంకర్ల వేలం ప్రకటనలతో రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వాలు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రైతు సంక్షేమాన్ని మరిచి రైతు దినోత్సవాల పేరుతో ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా శూన్యమేనని చెప్పారు. నేడు ఎన్నికల సమయంలో మినహా రైతుల గురించి నాయకులకు పట్టడం లేదన్నారు. -
'విజయ్‌మాల్యాతో పోలీస్తే వారి అప్పు ఎంత?'
జనగామ: పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా బ్యాంకు ద్వారా పొందిన అప్పుల చిట్టాలో తెలంగాణ రైతుల రుణాలు ఏమాత్రమని పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రశ్నించారు. జనగామలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. మాల్యాకు ఇచ్చిన అప్పులు ఎలా రాబట్టుకోవాలో తెలియక జుట్టు పీక్కుంటున్న బ్యాంకులకు.. కొత్త రుణాలు ఇచ్చి పాతవి రాబట్టుకోవాలంటూ కేంద్రం ఉచిత సలహా ఇచ్చిందని విమర్శించారు. అదే రైతులకు ఇస్తే మాత్రం దివాళా తీస్తారని చెప్పడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో వాటా పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి 60 శాతం హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదాయం వస్తుందన్నారు. కరువు, ఉపాధి, విద్యారంగాల్లో తెలంగాణ సంక్షోభంలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయూలని ఉపాద్యాయులకు సూచించారు. అదే సమయంలో జేఏసీగా ఏర్పడి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.కొండల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మనోహర్‌రాజు, మైస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మైండ్‌గేమ్ ఆడుతున్న టీఆర్ఎస్
రుణమాఫీ’ పేరుతో మోసం మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వేములవా రూరల్ : రైతులకు రుణమాఫీ పథకం వర్తింపజేసి కష్టాలు తీర్చుతామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అన్నదాతలను మోసం చేసిందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. సెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పట్టణానికి చేరుకున్న ఆయన బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన ఒక్కహామీని అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సీఎం కేసీఆర్ అమలుకు నోచని హామీలు లేవన్నారు. సెస్ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపిస్తే సెస్ సంస్థను మరింత ప్రగతిపథంలో తీసుకెళ్తామని ఆయన అన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గుగ్గిళ్ల జయశ్రీ, నాయకులు అంజలీకుమార్, జయరామారావు, ఏనుగుమనోహర్రెడ్డి, చిలుక రమేశ్, పాత్య సత్యలక్ష్మి, ఎల్జబెత్రాణి, అరుణ్‌తేజ చారి, సాగరం వెంకటస్వామి, ముడికె చంద్రశేఖర్, కూరగాయాల కొమురయ్య, నరాల శేఖర్, గుడిసె సదానందం, గడ్డం రవీందర్‌రెడ్డి, బాసెట్టి రవీందర్, నామాల పోశెట్టి పాల్గొన్నారు. -
మాఫీ కాకుండానే రుణమాఫీ పత్రాలు
ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో ఓ రైతుకు షాకిచ్చింది. రుణమాఫీ కాకుండానే.. పూర్తిగా వ్యవసాయ రుణం మాఫీ అయినట్లు ఇంటికి పత్రాలు వచ్చాయి. ఈ ఘటన చంద్రగిరి మండలం కల్ రోడ్డు పంచాయతీ లోని మిట్టూరు గ్రామానికి చెందిన కొమ్మినేని దామోదరం నాయుడు రుణమాఫీ పత్రాలు అందుకున్నాడు. కల్ రోడ్డు పంచాయతీ లో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ గిర్వానీ హాజరయ్యారు. దీంతో కార్యక్రమంలో పాల్గొన్న దామోదరం నాయుడు జడ్ పీ చైర్మన్ ను రుణమాఫీ పై నిలదీశారు. ఎలాంటి రుణమాఫీ జరగ కుండానే.. తనకు ఉన్న రూ.39 వేల రుణం మాఫీ అయినట్లు పత్రాలు వచ్చాయని తెలిపారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేవలం రుణమాఫీ చేశామని చెప్పుకోవడమే.. రైతులకు ఒక్క పైసా కూడా రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. రైతు రుణమాఫీ విషయంలో అధికార పార్టీకి చెందిన వారిని నిలదీయడంతో.. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాక.. నీళ్లు నమిలారు. -
ఇక విజృంభించి పనిచేస్తాం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా ప్రజలు చరిత్రలో కనీవినీ ఎరుగని అపురూపమైన తీర్పు ఇచ్చారని.. తెలంగాణలోని 17 స్థానాల్లో ఎప్పుడూ ఎవరికీ రాని మెజారిటీఇచ్చి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. వరంగల్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, టీఆర్ఎస్ పక్షాన, వ్యక్తిగతంగా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతున్నానని, ఈ విజయంతో ప్రభుత్వం బాధ్యత మరింత పెరిగినట్లు భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని నిరూపించిన ఎన్నిక ఇదని వ్యాఖ్యానించారు. మంగళవారం వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం తెలంగాణ భవన్లో పలువురు మంత్రులతో కలసి సీఎం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. వరంగల్ ప్రజలు ఉద్యమ సమయంలో, ఎన్నికల సమయంలో, ఇప్పుడు సంపూర్ణ మద్దతు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు చూపుతున్న అసహన వైఖరి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ‘‘రైతుల రుణమాఫీ విషయంలో అనని దాన్ని సృష్టిం చారు. పిచ్చి పత్రిక రాయగానే రెచ్చిపోయి, సీఎంగా బాధ్యత స్వీకరించిన ఐదో రోజే దిష్టిబొమ్మలు దహనం చేసిన సంస్కారం ప్రతిపక్షాలది. తొందరపాటుతో, ఓర్వలేనితనంతో, అడ్డూ అదుపూ లేకుండా వ్యక్తిగత ఆరోపణలు చేశారు. నీచాతి నీచమైన మాటలు మాట్లాడారు. ప్రజలు వారిని అసహ్యించుకునే ఈ తీర్పు ఇచ్చారు. బతిమిలాడితే, డబ్బులు ఇచ్చి కొంటే వచ్చిన ఓట్లు కావు. జనం ఇష్టపూర్వకంగా, తండోపతండాలు వచ్చి ఓట్లు వేశారు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతీ నిర్ణయంపై విమర్శలు: ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ నాయకులను, మంత్రులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఒక పత్రిక చెప్పిందే తడవుగా ప్రతిపక్షాలు ప్రేలాపనలు పేలేవి. రవీంద్ర భారతి స్థానంలో కళాభారతి కడతామంటే ధర్నాలు. ముసుగు వీరులను పంపి పిల్ దాఖలు చేయించడం. టీఆర్ఎస్కు మంచి పేరు రావద్దన్న ప్రయత్నం. సెక్రటేరియట్ మార్చి కొత్తది కడతామంటే వ్యతిరేకత. చెస్ట్ హాస్పిటల్, ఉస్మానియా ఆసుపత్రి తరలిస్తామంటే వివాదం చేశారు..’’ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మిషన్ కాకతీయను ఎందరెందరో పొగిడినా... ఇక్కడి విపక్షాలు మాత్రం కమీషన్ కాకతీయ అని విమర్శించాయని పేర్కొన్నారు. హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేసి, కంపును కడుగుతామంటే వివాదం చేశారన్నారు. వాటర్ గ్రిడ్‌కు రూ.30వేల కోట్లు ఎందుకు రూ. 10 వేల కోట్లు చాలన్నారని... అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువగా ఊహించుకుందని, గుడ్డి వ్యతిరేకతతో మాట్లాడారని చెప్పారు. రైతుల రుణమాఫీ పథకం ఏపీలో గోల్మాల్ జరిగినట్లు తెలంగాణలో జరగలేదని.. రైతుల సమస్యలను పరిష్కరిస్తూ, కరెంటు సమస్యను నివారించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పెన్షన్లు ఇతరత్రా కలిపి రూ. 33 వేల కోట్లు సంక్షేమానికి బడ్జెట్ ఇచ్చామని తెలిపారు. అసత్య ప్రచారాలు మానుకుని, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వరంగల్‌లో 22 శాతం ఓట్లు వస్తే, ఈసారి 15 శాతమే వచ్చి, డిపాజిట్ కూడా పోయిందన్నారు. ప్రభుత్వంపై కృత్రిమ వ్యతిరేకతను వాళ్ల బుర్రల్లో సృష్టించుకుని ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూశారని విమర్శించారు. అయినా ప్రజలు తమ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ఇక విజృంభించి పనిచేస్తామని చెప్పారు. 2021 నాటికి కోటి ఎకరాలకు నీరు.. ‘‘రాష్ట్ర అభివృద్ధి కోసం ప్లానింగ్‌తో సంవత్సరం నుంచి బిజీగా ఉన్నాను. పార్టీ నాయకులకు, శ్రేణులకూ దూరం అయ్యా. ఇపుడు 90శాతం ప్లానింగ్ పూర్తయింది. లైడార్ సర్వే పూర్తయ్యింది. కాళేశ్వరంలో 365 రోజులు 16 టీఎంసీల నీటి లభ్యత ఉంది. రాజీవ్-ఇందిరా సాగర్ ద్వారా ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తాం. కాళేశ్వరం, లోయర్ పెన్‌గంగా, రాజీవ్- ఇందిరా సాగర్ ప్రాజెక్టులకు త్వరలో శంకుస్థాపన చేస్తా. దగ్గరుండి ప్రాజెక్టులు పూర్తి చేయిస్తాం. 2021 వరకు తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తాం’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. తల పోయినా తప్పు చేయం.. తెలంగాణలో నీటి పారుదల రంగం విషయంలో దగా పడిందని... నిధులు, నీళ్లు, నియామకాల నినాదంతోనే ఉద్యమం జరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘పొరుగు రాష్ట్రాలతో గొడవలు ఉంటాయి. ఒక్క ఏపీ అనే కాదు మహారాష్ట్రతో కూడా గొడవలు ఉంటాయి. అన్నీ చూసుకోవాలి. తలకాయ పోయినా తప్పు చేయం. తెలంగాణకు శాశ్వతంగా కరువు పరిస్థితులు దూరం కావాలనే... ప్రాజెక్టుల రీడిజైన్ చేపట్టాం. ఆంధ్రా పాలకులు గతంలో మొదలు పెట్టినవి నీళ్లిచ్చే పథకాలు కాదు. దీనికి ఎస్ఎల్బీసీ మంచి ఉదాహరణ. ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర వివాదం ఉంటే జటిలం చేయడం, లేదంటే సృష్టించడమే వారి విధానం..’’ అని ఆరోపించారు. -
‘మాఫీ’ కోసం అప్పుతెద్దాం!
♦ రైతులకు ఒకేసారి పూర్తిగా రుణమాఫీపై వ్యవసాయ శాఖ ప్రతిపాదన ♦ ఎఫ్ఆర్బీఎం సడలింపుపై ఆశలు ♦ సీడ్ కార్పొరేషన్ ద్వారా రుణ సమీకరణ యోచన ♦ వడ్డీ తడిసి మోపెడు అవుతుందంటూ ఆర్థిక శాఖ అభ్యంతరం ♦ దాదాపు రూ.1,300 కోట్ల భారం పడుతుందని అంచనా ♦ అవకతవకలపై తేల్చాకే ముందుకెళ్లాలని సూచన సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీలో మిగతా నిధులను ఒకేసారి చెల్లించడంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. నిధులన్నీ ఒకేసారి చెల్లించడం కోసం అప్పులు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి పెంపుపై ఆశలు పెట్టుకుంది. సీడ్ కార్పొరేషన్ ద్వారా కూడా రుణాలు సమీకరించాలని భావిస్తోంది. కానీ ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వడ్డీ తడిసిమోపెడు అవుతుందని, రుణమాఫీలో పక్కదారి పట్టిన సొమ్ముకూడా గల్లంతు అవుతుందని హెచ్చరిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తిగా రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల ప్రకటించారు. రుణమాఫీ నిధులను ఒకేసారి చెల్లించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని సడలిస్తే రూ.4,000 కోట్లు అప్పు తెచ్చుకునే వీలు ఏర్పడుతుందని, దీనితో రుణమాఫీకి నిధులు సమకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఎఫ్ఆర్బీఎం సడలింపుపై కేంద్రం నుంచి ఇప్పటివరకు ఉలుకూ పలుకూ లేదు. సడలించినా అంత మేరకు నిధులను డిస్కంల విద్యుత్ బాండ్లపై తీసుకున్న అప్పుల బకాయిలు తీర్చాలనే షరతు విధించటం ఖాయమైంది. సీడ్ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇదే వ్యవధిలో రుణమాఫీ నిధుల సమీకరణకు వ్యవసాయ శాఖ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా సీడ్ కార్పొరేషన్ ద్వారా రుణ సమీకరణ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రైవేటు బ్యాంకుల నుంచి రూ.8,000 కోట్లు రుణంగా తీసుకోవాలని... దానితో రుణమాఫీ బకాయిలు ఒకేసారి చెల్లించడం సాధ్యమవుతుందనే అభిప్రాయం వెలిబుచ్చింది. ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ మంత్రి పోచారం సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. అయితే ఈ ప్రతిపాదనపై ఆర్థికశాఖ మొదట్లోనే అభ్యంతరం వ్యక్తం చేసింది. లెక్కలు తేలాలి రుణమాఫీ బకాయిలకు మరో రూ. 8,000 కోట్లు కావాలని ఆర్థిక శాఖ లెక్కలు వేస్తోంది. పక్కాగా ఆడిటింగ్ జరిగితే ఈ మొత్తం కొంతవరకు తగ్గిపోతుందని అంచనా వేస్తోంది. ఇటీవల ఆడిట్ విభాగం పది జిల్లాలో చేపట్టిన శాంపిల్ సర్వేలో బోగస్ రుణాలు, బోగస్ పట్టాలు, డబుల్ ఎంట్రీల ద్వారా రుణమాఫీలో పది శాతం దాకా అక్రమాలు, అవకతవకలు జరిగాయని తేల్చింది. బ్రాంచీల వారీగా సమగ్ర విచారణ జరిపితే కనీసం రూ.500 కోట్ల నుంచి రూ.800 కోట్లు ఆదా అవుతాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. అందుకే ఆడిటింగ్ పూర్తయ్యే వరకు వన్ టైం సెటిల్మెంట్ జోలికి వెళ్లడం సరికాదని పేర్కొంటోంది. తొందరపడి అప్పు తెచ్చి రుణమాఫీ నిధులు చెల్లిస్తే.. పక్కదారి పట్టిన రూ.500 కోట్లు గల్లంతవుతాయని, వడ్డీ భారం కూడా కలిపి దాదాపు రూ.1,300 కోట్లు అవుతుందని స్పష్టం చేస్తోంది. భారీగా వడ్డీ భారం.. రుణమాఫీ చేసేందుకు కొత్తగా రుణం తీసుకుంటే వడ్డీ భారం భారీగా పెరిగిపోతుందని ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం రైతుల పంట రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం, కేంద్రం 3 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. అదే కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకుంటే 9 నుంచి 10 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 5 నుంచి 6 శాతం వడ్డీ భరించాల్సి వస్తుంది. రూ. 8,000 కోట్లు అప్పు తీసుకుంటే ఏడాదికి రూ. 400 కోట్ల చొప్పున రెండేళ్లలో రూ.800 కోట్లు వడ్డీ చెల్లించాలి. దీంతో ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ‘‘బ్యాంకుల దగ్గర రుణం తీసుకొని.. బ్యాంకుల్లో ఉన్న రైతు రుణాల మాఫీకి చెల్లించే సంప్రదాయం ఆర్థిక వ్యవహారాల్లో సరైంది కాదు.. దీంతో ప్రభుత్వానికి, రైతులకు ఒరిగే ప్రయోజనం కంటే బ్యాంకులే ఎక్కువగా లాభపడుతాయి..’’ అని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
రుణమాఫీ వడ్డీకే సరి!
♦ నాలుగు విడతలుగా రుణమాఫీ వల్లే గందరగోళం ♦ రెండు విడతల సొమ్మును వడ్డీ కిందే జమచేసుకున్న బ్యాంకులు ♦ గడువులోగా చెల్లించలేదంటూ అధిక వడ్డీ ♦ ఆ వడ్డీని అసలు రుణంలో కలిపేస్తున్న వైనం ♦ మాఫీ సొమ్ము వడ్డీ కింద జమ.. రుణమంతా అలాగే ఉన్నట్లు లెక్కలు ♦ సర్కారుకు నివేదించిన ఇంటెలిజెన్స్ విభాగం ♦ వడ్డీ సహా అప్పు చెల్లిస్తున్నామన్న సర్కారు ♦ అడకత్తెరలో పోకచెక్కలా అన్నదాత ♦ అప్రమత్తమైన ఆర్థిక శాఖ.. నేడు ఎస్ఎల్బీసీ సమావేశం ♦ లబ్ధిదారుల రుణాల సమగ్ర వివరాల ప్రకటనకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీ కోసం విడుదల చేసిన తొలి రెండు విడతల సొమ్మును బ్యాంకులు వడ్డీ కిందే జమ చేసుకున్నాయని... రైతుల ఖాతాల్లో ఇంకా ఎక్కువ బాకీ ఉన్నట్లుగా చూపిస్తున్నాయని ఇంటెలిజెన్స్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. నాలుగు విడతలుగా రుణమాఫీయే ఈ పరిస్థితికి కారణమని స్పష్టం చేసింది. వడ్డీ చెల్లింపుల విషయంలో కొన్ని బ్యాంకులకు ఇప్పటికీ అవగాహన లేకపోవడమే రైతుల పాలిట శాపంగా మారిందని తేల్చి చెప్పింది. అందువల్లే రైతులకు కొత్త రుణాలు అందడం లేదని, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని పేర్కొంది. ‘‘మీరు తీసుకున్న రుణాలను గడువులోగా చెల్లించలేదు. అందుకే నిబంధనల ప్రకారం గడువు మీరిన పంట రుణాలకు వర్తించే 11 శాతం వడ్డీ చెల్లించాలి.’’ అంటూ కొన్ని బ్యాంకులు 11 శాతం వడ్డీని రైతుల ఖాతాల్లో అప్పు కింద జమ చేసుకుంటూ పోతున్నాయని తెలిపింది. కొన్నిచోట్ల పంట రుణాలకు సంబంధించి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ప్రోగ్రామ్‌కు అనుగుణంగా ఖాతాల్లో అప్పు రికవరీ, జమ అవుతుందని.. బ్రాంచి మేనేజర్లు మొండిగా వ్యవహరిస్తున్నారని ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నివేదికలు అందజేసింది. ఈ నివేదికలతో అప్రమత్తమైన ప్రభుత్వం రుణమాఫీ, వడ్డీ చెల్లింపుల విషయంలో మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని గుర్తించింది. వెంటనే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశం కావాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. మరోవైపు రైతులకు ఎంత రుణం మాఫీ అయింది, ఇంకా ఎంత ఉందనే వివరాలతో జాబితాను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకుల తిరకాసు వల్లే.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.లక్ష వరకు పంట రుణాలను వడ్డీతో సహా మాఫీ చేసింది. దీంతో 36.33 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. గత ఏడాది మార్చి 31 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలకు ఆగస్టు వరకు అయ్యే వడ్డీని సైతం లెక్కగట్టి ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించింది. మొత్తం రూ.17 వేల కోట్లు అవసరంకాగా.. నాలుగు విడతలుగా చెల్లించేలా బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే రెండు విడతలకు సంబంధించి రూ.8,450 కోట్లు బ్యాంకులకు చెల్లించింది. ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసుకుని, కొత్త రుణాలు ఇవ్వాలంటూ స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. కానీ కొన్ని చోట్ల బ్యాంకులు వడ్డీ చెల్లింపులకు సంబంధించి తిరకాసు పెట్టడంతో రుణమాఫీ పథకం ప్రయోజనం నెరవేరకుండా పోయిందని సర్కారు భావిస్తోంది. దీంతోపాటు రుణమాఫీ గందరగోళం, రైతుల ఆత్మహత్యలు ఇటీవల అసెంబ్లీ సమావేశాలను కుదిపేశాయి. వీటిపై విపక్షాల నిలదీతతో ఒక దశలో అధికార పార్టీ ఇరుకునపడింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి వాస్తవాలు తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్‌తో సర్వే చేయించింది. ఇప్పుడేం చేద్దాం.. రుణమాఫీతో లక్షలాది మంది రైతులకు మేలు జరిగిందని.. అయితే ఇప్పటికీ తమ రుణం ఎంత మాఫీ అయింది, ఎంత మిగులు ఉందనే విషయంలో స్పష్టత లేకుండా పోయిందని ఆర్థిక శాఖ గుర్తించింది. ఈ పథకంలో లబ్ధి పొందిన రైతుల సంఖ్యను పక్కాగా తెలుసుకునేందుకు గతంలో ప్రభుత్వం బ్యాంకులు, బ్రాంచీల వారీగా జాబితాలను ప్రకటించింది. అదేతీరులో లబ్ధిదారుల రుణ వివరాలను సైతం వెల్లడిస్తే... ఈ గందరగోళానికి తెరపడుతుందని అధికారులు యోచిస్తున్నారు. బ్రాంచీల వారీగా లబ్ధిదారులు తీసుకున్న రుణమెంత, ఎంత వడ్డీ చెల్లించాలి, అందులో ఎంత మొత్తం ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించింది, మిగులు రుణమెంత..? అనే వివరాలన్నీ పేర్కొనాలని నిర్ణయించారు. వడ్డీ చెల్లింపుల విషయంలో మరింత స్పష్టత ఇవ్వాలని, మొండికేస్తున్న కొన్ని బ్యాంకులతో అమీతుమీ తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పంట రుణాలకు వర్తించే వడ్డీమాఫీ పథకం అమల్లో ఉందని... కేంద్రం 3 శాతం, రాష్ట్రం 4 శాతం వడ్డీని ఏటా చెల్లిస్తున్నాయని బ్యాంకులకు స్పష్టత ఇవ్వటం ద్వారా రైతులపై ఒత్తిడిని తగ్గించాలని నిర్ణయించింది. -
10న రాష్ట్ర బంద్
- ప్రతిపక్షం మొత్తాన్నీ సస్పెండ్ చేస్తారా?: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ - అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు - అధికారపక్షం నిరంకుశంగా వ్యవహరిస్తోంది - నేటి నుంచి రైతు భరోసా యాత్రలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలన్నందుకు ప్రతిపక్షాలన్నింటినీ సస్పెండ్ చేసిన ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 10వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్టు టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మొత్తం విపక్షాల సభ్యులను సమావేశాలు మొత్తానికీ సస్పెండ్ చేసిన ఘటనలు చరిత్రలోనే లేవని, ఇది శాసనసభ చరిత్రలో చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు డి.శ్రీధర్‌బాబు, దాసోజు శ్రవణ్, వేణుగోపాల్, అద్దంకి దయాకర్లతో కలసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రూ.లక్షలోపు పంటరుణాలను మాఫీ చేస్తామన్న హామీని అమలుచేయాలని కోరడమే తప్పు అన్నట్టుగా అధికార టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఒకేసారి మొత్తం రుణమాఫీ చేయాలని కోరితే శాసనసభలో ఉన్న ప్రతిపక్షాల సభ్యులను సస్పెండ్ చేశారన్నారు. ఇలా మొత్తం ప్రతిపక్ష సభ్యులను, సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేసిన ఘట నలు చరిత్రలోనే లేవని.. సభ చరిత్రలో ఇది బ్లాక్‌డే(చీకటిరోజు) అని ఉత్తమ్ వ్యాఖ్యానిం చారు. సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, ఒకేసారి మొత్తం రుణమాఫీ చేయాలని కోరితే ప్రభుత్వం భయపడుతోందన్నారు. సభను వాయిదా వేసుకుని ఒకసారి, విపక్ష సభ్యులను సస్పెండ్ చేసి మరోసారి ప్రభుత్వం పారిపోతోందన్నారు. ఎన్నికల్లో చెప్పిన విషయాన్నే అమలుచేయాలని కోరితే.. అమలు సాధ్యం కాని కోరిక అని కేసీఆర్ ఎలా మాట్లాడతారని నిలదీశారు. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు మద్దతు ధర, బోనస్‌ను అడిగామని... వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రతిపక్షం గొంతును నొక్కుతోందన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 10న బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడుతూ, రైతుల్లో భరోసా కల్పించడానికి ఈ నెల 6 నుంచి జిల్లాల్లో రైతు భరోసా యాత్రను నిర్వహిస్తున్నట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. 6న మహబూబ్‌నగర్, 7న మెదక్, 8న ఖమ్మం, 9న వరంగల్, 11న నిజామాబాద్ జిల్లాల్లో యాత్ర నిర్వహిస్తామన్నారు. ప్రతిపక్షాలన్నీ కలసి ఈ నెల 10న బంద్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఉండవనుకుంటే... ప్రభుత్వ తీరుతో రైతులు తీవ్ర సమస్యల్లోకి కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. పాలకుల చేతకానితనం వల్లే ఇలాంటి పరిస్థితులు దాపురించాయని విమర్శించారు. -
మండలిలోనూ అదే తీరు
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీ అంశంపై శాసనమండలిలోనూ గందరగోళం చెలరేగింది. దీంతో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఒక బీజేపీ ఎమ్మెల్సీని ప్రస్తుత సమావేశాల కాలానికి సస్పెండ్ చేశారు. సోమవారం మండలి ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్, ఫారుఖ్‌హుస్సేన్, ఆకుల లలిత పోడియం వద్ద నిరసనలు చేపట్టారు. రైతులను ఆదుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. విపక్ష నేత షబ్బీర్ అలీ, బీజేపీ సభ్యుడు రామచంద్రరావు తమ స్థానాల నుంచే ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రశ్నోత్తరాల తర్వాత ఈ అంశంపై చర్చిద్దామని, సభలో ప్లకార్డులను ప్రదర్శించడం మంచి సంప్రదాయం కాదని చైర్మన్ స్వామిగౌడ్ కోరారు. రైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర ్యలు తీసుకుంటోందని, కానీ కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. దీంతో విపక్ష సభ్యులు మరింతగా నిరసన తెలిపారు. ఈ పరిస్థితుల్లో సభను చైర్మన్ పది నిమిషాల పాటు వాయిదా వేశారు. విరామం అనంతరం కొంతసేపు ప్రశ్నోత్తరాలు సజావుగానే సాగాయి. అంతకుముందు మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు వెళ్లిన విపక్ష సభ్యులు తిరిగి సభలోకి వచ్చి... నిరసనలు మొదలుపెట్టారు. కూర్చోవాలని చైర్మన్ సూచించినా... వారు వెనక్కి తగ్గలేదు. దీంతో ఆయా సభ్యుల సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టాలన్న చైర్మన్ సూచన మేరకు మంత్రి తుమ్మల... ఐదుగురు కాంగ్రెస్, ఒక బీజేపీ సభ్యుడి పేర్లతో తీర్మానం పెట్టారు. దానిని ఆమోదిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. -
సభ సాగింది10 నిమిషాలే!
- తొలుత ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన స్పీకర్ మధుసూదనాచారి - మాఫీ, జీహెచ్ఎంసీ కార్మికుల తొలగింపుపై చర్చించాలని విపక్షాల పట్టు - మంత్రి తుమ్మల సమాధానం చెబుతున్నా ఆగని విపక్షాల ఆందోళన - స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు.. గందరగోళం - సోమవారానికి సభను వాయిదా వేసిన స్పీకర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ గురువారం ప్రారంభమైన పది నిమిషాల్లోనే అర్ధంతరంగా వాయిదా పడింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, బీజేపీ, వామపక్షాలు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబడుతూ ప్రశ్నోత్తరాలకు అడ్డుపడడం, పోడియం వద్ద సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం ఏర్పడడంతో ఎలాంటి చర్చ లేకుండానే స్పీకర్ మధుసూదనాచారి సభను సోమవారానికి వాయిదా వేశారు. గురువారం ఉదయం పది గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. వెంటనే రైతుల రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని... జీహెచ్ఎంసీలో తొలగింపునకు గురైన 1,200 మంది పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు నినాదాలు ప్రారంభించారు. రైతుల రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని టి.జీవన్‌రెడ్డి సహా కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. రైతుల ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు. వీరికి టీడీపీ, బీజేపీ, వామపక్షాల సభ్యులు జతకలిశారు. ఈ సమయంలో విపక్షాల నిరసనను పట్టించుకోకుండా స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారు. టీఆర్ఎస్ సభ్యురాలు కొండా సురేఖ అంగన్వాడీ సమస్యలపై అడిగిన ప్రశ్నను తొలుత లేవనెత్తారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు లేచి దీనికి సమాధానమిస్తున్నా... కాంగ్రెస్ సభ్యులు నిరసన కొనసాగించారు. నినాదాలు చేస్తూనే పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‌తో వాదనకు దిగారు. రైతులకు వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా రుణమాఫీ చేయాలని, ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని వారితోపాటు టీడీపీ, బీజేపీ, వామపక్షాల సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో స్పీకర్ మధుసూదనాచారి అనూహ్యంగా సభను సోమవారం(5వ తేదీ) నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక జీహెచ్ఎంసీలో తొలగించిన 1,200 మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ బీజేపీ.. ఎర్రబెల్లి దయాకర్‌రావు అరెస్టు, టీఆర్ఎస్ ప్రొటోకాల్ పాటించడం లేదన్న అంశాలపై టీడీపీ.. వరంగల్ ఎన్‌కౌంటర్‌పై వామపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ అంతకుముందే తిరస్కరించారు. అంగన్వాడీ పోస్టులు భర్తీ: తుమ్మల అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలపై టీఆర్ఎస్ సభ్యురాలు కొండా సురేఖ అడిగిన ప్రశ్నకు స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సమాధానమిచ్చారు. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 30,700 అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని, అంగన్వాడీ కేంద్రాల కోసం వెయ్యి భవనాలు నిర్మించనున్నామని తెలిపారు. -
రైతు ఆత్మహత్యలు సర్కారీ హత్యలే
సాక్షి నెట్వర్క్: ‘‘అన్నదాతల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం దేశంలోనే ముందుంది. రైతాంగం ఆశలపై ఈ ప్రభుత్వం నీళ్లు చల్లింది. రుణాలు అందక, గిట్టుబాటు ధరల్లేక రైతన్నలు పిట్టల్లా రాలిపోతున్నా.. ఈ సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. 15 నెలల కేసీఆర్ పాలనలో ఇప్పటి వరకు 1,100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. కేవలం 120 కుటుంబాలకే ఎక్స్‌గ్రేషియా అందించడం దారుణమన్నారు. రైతు ఆత్మహత్యలు ఆపాలని, కరువు మండలాలు ప్రకటించాలని, రైతు రుణాలన్నీ ఏకమొత్తంగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో పొంగులేటి పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు బంగారుమయమవుతాయని కలలుగన్న రైతన్నల ఆశలు అడియాసలయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఎన్నికలకు ముందు, తర్వాత రైతు ఆత్మహత్యలను సర్కారీ హత్యలుగానే పరిగణిస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఇప్పడు 1,100 రైతుల మరణానికి బాధ్యత వహిస్తారా..? రాష్ట్రంలో జరుగుతున్న ఆ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. ఎన్నికల మేనిఫెస్టోలో లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని బీరాలు పలికారు. రుణమాఫీ దేవుడెరుగు.. కొత్తగా ఒక్క రైతుకు కూడా రుణం ఇవ్వడ ం లేదు. రైతు పక్షపాతిగా వ్యవహరించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1.50 లక్షల పరిహారాన్ని ప్రవేశపెడితే.. ఈ ప్రభుత్వం దాన్ని కూడా సకాలంలో అందించకపోవడం దారుణం’’ అని పొంగులేటి అన్నారు. పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. రూ.5 వేల కరువు పింఛన్ ఇవ్వాలి రైతుల వెన్నంటి నిలిచేది వైఎస్సార్సీపీ ఒక్కటేనని పొంగులేటి చెప్పారు. త్వరలోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలతో ‘రైతు దీక్ష’ చేపడతామని ప్రకటించారు. కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని అభ్యర్థించినా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదని చెప్పారు. రైతులకు నెలకు రూ.5 వేల చొప్పున కరువు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పార్టీ ప్రధాన కార్యదర్శులు శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, సయ్యద్ మతీన్, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.సురేశ్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆడెం విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులు ధనలక్ష్మి, ప్రభుకుమార్, అమృతాసాగర్, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు ముజ్తాబా అహ్మద్, సంయుక్త కార్యదర్శులు కుసుమ కుమార్‌రెడ్డి, వరలక్ష్మి, సేవాదళ్ అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, రాష్ట్ర డాక్టర్ సెల్ అధ్యక్షుడు ప్రపుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీకి వినతిపత్రం అందజేశారు. జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు రైతు సమస్యలపై వైఎస్సార్సీపీ అన్ని జిల్లాల్లో భారీగా ఆందోళనలు చేపట్టింది. ర్యాలీలు, ధర్నాల్లో పార్టీ నేతలు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్‌లో సంగారెడ్డి కలెక్టరేట్ ముందు పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్రా భిక్షపతి, రాష్ట్ర కార్యదర్శి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, వరంగల్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాడెం శాంతి కుమార్, నిజామాబాద్ జిల్లాలో పార్టీ సేవాదళ్ రాష్ట ప్రధాన కార్యదర్శి నీలం రమేశ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంగయ్య, కరీంనగర్లో పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ర్ట కార్యదర్శులు బోయిన్పల్లి శ్రీనివాస్‌రావు, అక్కెనపెల్లి కుమార్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, ఆదిలాబాద్ లో పార్టీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగన్న, ఖమ్మంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మట్టా దయానంద్, నల్లగొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్నేని వెంకట రత్నంబాబు తదితరులు పాల్గొన్నారు. -
నాబార్డు నిధులతో నాటకం
సాక్షి, హైదరాబాద్: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్మెంట్ (నాబార్డు) రుణాలు దుర్వినియోగమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ నిధులతో చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవటం అనుమానాలకు బలం చేకూర్చింది. ఈ నిధులు పక్కదారి పట్టాయని గుర్తించిన ప్రభుత్వం విచారణకు ఆదేశాలిచ్చింది. నాబార్డు రుణాలు సద్వినియోగమయ్యాయా.. లేదా.. జిల్లాల వారీగా వీటిని ఏయే పనులకు ఖర్చు చేశారు.. వాటి పురోగతి ఎలా ఉంది. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాలని నిర్ణయించింది. రైతుల రుణమాఫీలో అక్రమాలు జరిగాయని, రూ.వెయ్యి కోట్లు పక్కదారి పట్టినట్లు ఆడిట్ పరిశీలన, ఆర్థిక శాఖ విచారణలో వెలుగులోకి వచ్చింది. అదే తరహాలో నాబార్డు రుణాల పరిశీలనతో తేనెతుట్టె కదులుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డు నుంచి సాధారణ పనులకు రూ.వె య్యి కోట్లు, గిడ్డంగుల నిర్మాణానికి రూ. వె య్యి కోట్లు ప్రభుత్వం రుణంగా స్వీకరించింది. ఉమ్మడి రాష్ట్రంలో నాబార్డు నుంచి తీసుకున్న నిధులను సరిగా వినియోగించలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అందుకు ఈ నిధుల వినియోగంపై విచారణ చేపట్టాలని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో నాబార్డు, ఆర్థిక శాఖ అధికారులు విచారణకు రంగం సిద్ధం చేశారు. ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించి వాస్తవాలు వెలికి తీయాలని నిశ్చయించారు. మంగళవారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.రామకృష్ణారావు, నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ హరీష్ జావా బృందం ఇక్కడ పర్యటించనుంది. -
ఉసురు తీస్తున్న అప్పులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఐదెకరాల భూ మి కౌలుకు తీసుకుని వ్య వసాయం చేస్తున్న మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన యువరైతు గుండెపురి విజయకృష్ణ (32)కు రూ.2.25లక్షల అప్పు అయ్యింది. ఈ సంవత్సరం పెట్టుబడులకు డబ్బు ఇచ్చే వారు లేరు. పాత అప్పులు కట్టమని ఆయనపై ఒత్తిడి ఎక్కువయ్యింది. చేసేదేమీ లేక పురుగుల మందును ఆశ్రయించి కుటుంబ సభ్యులను వదిలేసి వెళ్లిపోయాడు.... తనకున్న ఏడెకరాలకు తోడు మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు అనుమలు శివ. అనుముల మండలం యాచారం గ్రామానికి చెందిన శివకు దిగుబడి రాక రూ.5లక్షల అప్పు అయ్యింది. ఈ అప్పు గురించి తండ్రి మందలించాడనే మనస్తాపంతో పురుగుల మందు తాగి చనిపోయాడు... రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన వీరమల్ల నర్సింహ(42) అనేరైతు ఆగస్టు 6న తన వ్యవసాయబావివద్ద తల్లితండ్రుల సమాధిపైన కూర్చొని పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న మూడు ఎకరాలభూమితోపాటు మరికొంత భూమిని కౌలుకుతీసుకొని పత్తిసాగుచేశాడు.వర్షాభావ పరిస్థితులవల్ల పత్తిచేను పూర్తిగా ఎండిపోయింది. పెట్టుబడికోసం చేసిన అప్పులు తీరవనే బెంగతో ఆత్మహత్యకు పాల్పడ్డా డు... ఈ ముగ్గురిదే కాదు.... జిల్లాలో ఇప్పుడు అన్నదాతల గుండెలు అప్పులతో బరువెక్కిపోతున్నాయి. గత ఏడాది ఆశించిన దిగుబడులు రాకపోవడంతో అప్పులు చేయాల్సి రావడం.. ఆ అప్పులు తీరకపోగా, ఈ ఏడాది సాగుకు కొత్త అప్పులు చేయాల్సి రావడం.. పాత అప్పుల వాళ్లు ఒత్తిడి చేయడం.. కొత్త అప్పులు, పాత అప్పులు తీర్చాల్సిన పంటలు ఎండిపోతుండడం... మళ్లీ అప్పుల బాధ ఎక్కువవుతుందేమోననే మనస్తాపం... వెరసి అన్నదాత ఆత్మహత్యల పాలవుతున్నాడు. అప్పుల కుప్పలు పేరుకుపోవడంతో ప్రాణాలను ఫణంగా పెడుతున్నాడు. అప్పుల కుప్పలు గత ఏడాది కరువు సంభవించడంతో పాటు ఈ ఏడాది కాలం కాకపోవడం జిల్లా రైతాంగం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని నిపుణులు, రైతు సంఘాల నేతలంటున్నారు. వాస్తవానికి గత ఏడాది జిల్లాలో రైతులు ఆశించిన దిగుబడి రాలేదు. మద్దతు ధర విషయం, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనలో కూడా రైతులకు తగిన సాయం అందకపోవడంతో గత ఏడాదే రైతులకు అప్పులయ్యాయి. ఈ అప్పుల కోసం ప్రైవేటు వ్యాపారులతో పాటు బ్యాంకర్లు కూడా ఒత్తిడి చేయడం, కొన్ని చోట్ల కొత్త అప్పులు పుట్టే పరిస్థితి లేకపోవడం, కొత్తగా అప్పులిచ్చినా.. అవి తీరుతాయన్న ఆశ లేకపోవడం.. ఈ ఖరీఫ్‌లో కూడా కాలం కాకపోవడంతో రైతులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. రైతు సంఘాలు జరిపిన పరిశీలనలో వెల్లడయిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... జిల్లాలోని రైతు కుటుంబాలకు చెందిన 70శాతం ఇళ్లలో ఉండాల్సిన బంగారం ఇప్పుడు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టారు. మరో విశేషమేమిటంటే.. జిల్లా కేంద్రమైన నల్లగొండలో ఓ ప్రైవేటు బ్యాంకు కేవలం బంగారు రుణాల కోసమే పనిచేస్తోంది. ఇంట్లో బంగారం పెట్టి తెచ్చినవి, బ యట నుంచి లాక్కొచ్చిన అప్పులు అన్నీ కలిపి కుప్పలు కావడంతోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనేది ని పుణులు, రైతు సంఘాల అభిప్రాయం. రుణాలివ్వని బ్యాంకులు ఇక, రుణమాఫీ పథకం ప్రకటన రైతుల్లో ఊరట కలిగించింది కానీ, అమల్లోకి వచ్చేసరికి రైతులకు భరోసా ఇవ్వలే కపోయింది. ఒకేసారి రుణమంతా మాఫీ అవుతుందని రైతాంగం భావిస్తే ప్రభుత్వం దానిని దఫాల వారీగా ఇవ్వాలని నిర్ణయించడం.. అది కూడా బ్యాంకుల వద్దకు వచ్చేసరికి సీన్ రివర్స్ కావడంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. జిల్లాలో ఈ ఏడాది రూ.1400 కోట్లను రైతులకు రుణాలివ్వాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు ఇచ్చింది రూ.600 కోట్లే. అయితే, ఆ 600 కోట్ల రూపాయలు కూడా రైతులకు చేరలేదు. ప్రభుత్వం ఓ వైపున పాత అప్పుల మాఫీకి దఫాలుగా నిధులిస్తుంటే.. బ్యాంకర్లు మొత్తం రైతులకు దఫాలుగా వచ్చిన మాఫీ నిధులతో పాటు కొత్తగా ఇవ్వాల్సిన రుణాన్ని పాత అప్పుల వడ్డీ కింద జమ చేసుకుంటున్నారు. రైతు సంఘాల అభిప్రాయం ప్రకారం ఇప్పటివరకు జిల్లాలో రూ.200 కోట్లు కూడా రుణాల కింద రైతుల చేతికి అందలేదు. దీంతో మూడు, నాలుగు రూపాయల వడ్డీకి కూడా రైతులు అప్పులు తీసుకుని ఖరీఫ్‌లో వ్యవసాయం చేయాల్సి వస్తోంది. ఈ అప్పులు తీరే పరిస్థితి కనిపించకపోవడంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రంగంలోనికి దిగాల్సిందే... జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అటు రాజకీయ పార్టీలు, ఇటు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చొరవ తీసుకుని రైతాంగానికి భరోసా కల్పిస్తేనే ఆత్మహత్యలు ఆగే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రైతులు తీసుకున్న అప్పుల (బ్యాంకులు, ప్రైవేటు వ్యాపారుల వద్ద)పై తక్షణం మారటోరియం ప్రకటించాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. కనీసం కొంతకాలం పాటు మారటోరియం విధించి, అప్పులు కోసం రైతులను వేధించే వ్యాపారులు, బ్యాంకులపై చర్యలు తీసుకుంటేనే రైతుకు కొంత భరోసా కల్పిస్తుందనేది రైతు సంఘాల నేతల అభిప్రాయం. దీంతో పాటు రుణమాఫీని పకడ్బందీగా అమలు చేయడం, కలెక్టరేట్లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయడం, రైతు సమస్యలపై రెవెన్యూ యంత్రాంగం స్థానికంగా చొరవ తీసుకుని కౌన్సెలింగ్ ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేయాలని వారంటున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా తమ బాధ్యతగా రైతు ఆత్మహత్యల నివారణకు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికార, ప్రతిపక్షాలు రైతుల్లో భరోసా చేపట్టే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఈ దిశలో అధికార, రాజకీయ పక్షాలు ముందుకెళితేనే జిల్లాలో అన్నదాత మరణమృదంగం ఆగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతు సంఘాలు, నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం చేయాల్సింది ఇదీ.. రైతులు తీసుకున్న రుణాలపై తక్షణం మారటోరియం ప్రకటించాలి. రెవెన్యూ యంత్రాంగం చొరవ తీసుకోవాలి. క లెక్టరేట్‌లో ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేయాలి. తమ సమస్యలపై ఆ సెల్‌కు వచ్చే రైతులను ఆర్డీఓ లేదా తహసీల్దార్ కార్యాలయాలకు పిలిపించి వారి సమస్యలపై కౌన్సెలింగ్ ఇవ్వాలి. అప్పుల బాధ ఎక్కువగా ఉంటే సదరు వ్యాపారులను పిలిపించి మాట్లాడాలి. వెంటనే కరువుపై ప్రభుత్వానికి నివేదిక పంపడంతో పాటు కరువు నివారణ చర్యలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలి. ఉత్పత్తి ధర తగ్గించే విధానాలను తీసుకురావడంతో పాటు దిగుబడి పెంపునకు పాటించాల్సిన పద్ధతులపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం, మద్దతు ధర కల్పించాలి. వ్యవసాయ యాంత్రీకరణ కింద సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించాలి. రుణమాఫీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. -
కరువు జిల్లాగా ప్రకటించాలి
డీసీసీ అధ్యక్షురాలు సునీత డిమాండ్ నర్సాపూర్ : ‘జిల్లాలో వర్షాలు సరిపడా లేవు. వేసిన పంటలు ఎండిపోయాయి. పూర్తి స్థాయిలో సాగు చేసే పరిస్థితులు లేవు. ఈ దుర్భర పరిస్థితుల్లో మెదక్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి. రైతులందరినీ ఆదుకోవాలి’ అని డీసీసీ అధ్యక్షురాలు వి.సునీతారెడ్డి డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు రావడం లేదు. వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు పొంది సాగు చేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఖరీఫ్ సీజన్లో పంటలు వేసిన రైతులకు ఆర్థిక సహాయం అందివ్వాలి. ప్రభుత్వం రుణమాఫీ పథకం సక్రమంగా అమలు చేయనందున బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదు. రుణమాఫీ పథకాన్ని ఎన్నేళ్లు అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాదిరిగా గ్రామం ఒక యూనిట్‌గా పంటల బీమా అమలు చేయాలి. ప్రీమియం చెల్లించిన రైతులకు బీమా సొమ్ము ఇవ్వకుండా... వారిచ్చిన చెక్కులు వాపసు చేయడం ఎంతవరకు సమంజసం? అధికారుల తప్పిదంతో రైతులకు బీమా వర్తించకుండా పోయింది. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన మన ఊరు.. మన ప్రణాళిక ఏమైంది! దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు గ్రామ జ్యోతి తెస్తున్నారంటే... వారి పథకాలపై వారికే నమ్మకం లేదా’ అని సునీత ప్రశ్నించారు. 4న ధర్నా... ‘శాశ్వత గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు బిల్లులు చెల్లించలేదు. లబ్ధిదారుల ప్రయోజనాల దృష్ట్యా ఆగస్టు 4న పీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా చేయాలని నిర్ణయించాం. దీన్ని విజయవంతం చేయాలి’ అని సునీత చెప్పారు. -
సూచన ఇవ్వండి.. బహుమతి పట్టండి
సాక్షి, ముంబై : ప్రభుత్వ ఖజానా ఆదాయాన్ని పెంచేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలను ఆర్థిక శాఖ కోరింది. అత్యుత్తమ సలహాలు, సూచనలు ఇచ్చిన వారిక మొదటి బహుమతిగా రూ. 10 లక్షలు, రెండో బహుమతిగా రూ.6.50 లక్షలు నగదు పారితోషకం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఒక్కో మంచి సలహాకు రూ.లక్ష చొప్పున 25 మందికి పారితోషికాలు అందజేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన రూపొందించిన ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పంపించింది. ఆయన నుంచి ఆమోదం లభించగానే దీనిపై అధికారకంగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కరవు తాండవించడం, మరికొన్ని చోట్ల భారీ వర్షాల వల్ల వరదలు రావడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం, రూ.3 లక్షల కోట్ల వరకు ఉన్న రైతుల రుణాలు, వాటి వడ్డీ మాఫీ వంటివి రూ. లక్షల కోట్లలో చెల్లించాలంటే ప్రభుత్వ ఖజానాపై భారీ స్థాయిలో అదనపు భారం పడుతోంది. వివిధ శాఖల నుంచి పన్ను రూపంలో సమకూరుతున్న ఆదాయం కూడా అంతంతమాత్రంగానే ఉంది. అది ఏ మూలకూ సరిపోవడం లేదు. అలాగే పెరుగుతున్న పరిపాలన విభాగం ఖర్చుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతింటోంది. దీంతో ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఉన్నతస్థాయి సమితిని నియమించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. అయతే అంతకు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల నుంచి సలహాలు, సూచనలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.3,85,000 కోట్లకు ైపైగా అప్పు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే ఆదాయం తగ్గిపోతుండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. ఫలితంగా చాలా వరకు అభివృద్ధి పనులకు కత్తెరేయాల్సిన దుస్థితి నెలకొంది. -
మాది పేదల సర్కారు
♦ జిల్లాకు భారీగా పరిశ్రమలు రానున్నాయి ♦ బంగారు తెలంగాణ సాధనే కేసీఆర్ లక్ష్యం ♦ మంత్రి మహేందర్‌రెడ్డి ♦ నవాబుపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నవాబుపేట : మాది పేదల ప్రభుత్వం. ప్రతి పేదవాడికీ న్యాయం జరుగుతుంది అని రాష్ర్ట రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవా రం మండలంలోని గుబ్బడిపత్తేపూర్, గంగ్యాడ, ముబారక్పూర్, తిమ్మరెడ్డిపల్లి, పూలపల్లిలో అంతర్గత మురుగు కాల్వల నిర్మాణాలకు ఆయన శంకుస్థాన చేశారు. హరితహారంలో భాగం గా మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. అందుకు బృహత్తరమైన ప్రణాళికలతో ముందుకుపోతున్నారని స్పష్టంచేశారు. ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయలలోపు రైతు రుణాలను విడతల వారీగా మాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాకు పెద్ద కంపెనీలు రాబోతున్నాయన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనుందని ఆయన తెలిపారు. బంగారు తెలంగాణ కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. జిల్లాలోనే న వాబుపేట మండలం వెనకబడిన మం డలమని.. అధిక నిధులు వెచ్చించి ఈ మండలాభివృద్ధికి కృషి చేస్తానని మం త్రి హామీ ఇచ్చారు. నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండుకు నిధులు మం జూరు చేసి ఉపయోగంలోకి తీసుకవస్తామన్నారు. బీటీ రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి బస్సులు వేస్తామన్నారు. చేవెళ్లకు ఒక ప్రత్యేక ఉందని.. ఈ ని యోజకవర్గానికి చెం దిన వారు మం త్రి, ఎంపీ, జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్సీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండటం సుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధికి అధిక నిధులు ఇవ్వండి వెన కబడిన నవాబుపేట మండలానికి అధిక నిధులు అందించి అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రిని కోరనున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. నవాబుపేటకు ఇప్పటివరకూ మార్కెట్ యార్డు లేదన్నారు. దీంతో రైతులు ధాన్యాన్ని విక్రయించడానికి వికారాబాద్‌కు వెళుతున్నారని తెలిపారు. గ్రామాలకు లింక్ రోడ్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పాండురంగారెడ్డి, వైస్ ఎంపీపీ సుజాత దర్శన్, పీఏసీఎస్ చైర్మన్ మానిక్‌రెడ్డి, తహసీల్దార్ యాదయ్య, ఎంపీడీఓ తరుణ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్‌లు తిరుపత్తిరెడ్డి, విర్జినమ్మ, గోవిందమ్మ మల్లేశం, గోపాల్‌గౌడ్, పద్మమ్మ మల్లేశం, నర్సింలు, సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పరమేష్, సంజీవరావు, నాయకులు మా ణిక్రెడ్డి, వెంకటయ్య, ప్రభాకర్‌రెడ్డి, రావ్గారి వెంకట్‌రెడ్డి, నాగిరెడ్డి, సిం దం మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
ఎడమొహం.. పెడమొహం
సాక్షి, ముంబై: 15 ఏళ్ల అనంతరం అధికారం దక్కించుకున్న బీజేపీ, శివసేన కూటమి ఎడమొహం పెడమొహంగానే ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కాషాయ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గత తొమ్మిది నెలలుగా గడిచినా ఇరుపార్టీల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు మాత్రం తొలగిపోలేదు. రైతుల రుణాలు మాఫీ చేసి తీరాల్సిందే అని శివసేన పట్టుబట్టుతోంది. అయితే బీజేపీ మాత్రం తొలుత మెతక వైఖరి అవలంబించినప్పటికీ తర్వాత రుణమాఫీ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఇక గోందియా, జిల్లా పరిషత్ ఎన్నికలైతే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం ృసష్టించాయి. అక్కడ కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య పొత్తు వికటించడంతో కొత్త రాజకీయ సమీకరణాలు చోటుచేసుకుంటున్నాయని వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి వారంలోనే స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన బీజేపీ, గోందియాలో అదే పార్టీతో జతకట్టింది. ఇది రాజకీయ వర్గాలను తీవ్ర విస్మయానికి గురిచేసింది. రగిలిపోయిన శివసేన.. గోందియాలో బీజేపీ, కాంగ్రెస్ జతకట్టడంపై రగిలిపోయిన శివసేన, ప్రతిపక్షాలకు వంతపాడింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, పుట్టుకతో శత్రువులైనా మిత్రులుగా మారిపోతారని నిప్పులు చెరిగింది. అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గులాబ్రావ్ పాటిల్, అర్జున్ ఖేత్కర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు శతవిధాల ప్రయత్నించారు. రైతుల రుణాల మాఫీ చేయడమే అసెంబ్లీలో ప్రధానం అంశం కావడంతో బీజేపీ ఏకాకిగా మారిపోయింది. అయిన్పప్పటికీ ప్రతిపక్షాల సవాళ్లకు దీటుగా సమాధానమిస్తూ సభ కార్యకలాపాలు ముందుకు సాగించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రెండు రోజులు ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు అసెంబ్లీ భవనం ఎదుట ఆందోళన చేపట్టారు. రైతు రుణాలు మాఫీ చేయాలని నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీలో ఇదే అంశంపై మొదటి వారమంతా చర్చ జరిగింది. రోజు అసెంబ్లీ బయట జరుగుతున్న వివాదం యావత్ రాష్ట్ర ప్రజల దృష్టి రుణ మాఫీపై పడింది. మరోపక్క అధికారంలో ఉంటూనే పరోక్షంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న శివసేన వైఖరి వల్ల బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. దూరం పెరిగింది అప్పుడే.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరుపార్టీల మధ్య మొదలైన ముసలం ఇప్పుడిప్పుడే సమసిపోయేలా కనిపించడం లేదు. సీట్ల సర్దుబాటు విషయంలో మొదలైన భేదాలు, చివరికి 20 ఏళ్ల స్నేహాన్ని దూరం చేశాయి. విడివిడిగా పోటీ చేసి మోదీ మేనియాతో 120 సీట్లకు పైగా సాధించిన బీజేపీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తొలుత ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ముందు బలనిరూపణ చేసుకున్నా.. తర్వాత పాత కాపు శివసేనను ప్రభుత్వంలోకి ఆహ్వానించింది. చాలా రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించింది. అయితే అధికారం లేని పదవులతో ఏం చేసుకోవాలంటూ కొద్ది రోజుల్లోనే కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇరు పార్టీల పెద్దల భేటీ అనంతరం గొడవలు కాస్త సద్దుమనిగాయి. కానీ వైరం మాత్రం రోజురోజుకీ ముదిరి పాకాన పడుతోంది. -
15 ఏళ్లలో ఏం చేశారు?
♦ ప్రతిపక్షాలకు ఉద్ధవ్ సూటి ప్రశ్న ♦ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేయలేదేం? ♦ రైతుల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం ముంబై : రైతు రుణాలు మాఫీ చేయలేదని అసెంబ్లీ సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు, గత 15 ఏళ్లలో ఏం చేశాయని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. శాసనమండలి సమావేశాలను విపక్షాలు అడ్డుకుంటుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్ధవ్, రైతు రుణమాఫీ చేయాలని డిమాండు చేస్తున్న ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నపుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ‘గత 15 ఏళ్లుగా మీరు అధికారంలో ఉన్నారు. మరి మీరెందుకు రుణమాఫీ చేయలేదు? ఎందుకీ నాటకాలు?’ అని నిలదీశారు. ‘ప్రతిపక్షాల పాఠాలు మాకు అవసరం లేదు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే రైతు రుణాల కోసం పోరాటాలు చేశాం. ప్రభుత్వాన్ని ఎలా నడపాలా మీ నుంచి నేర్చుకోవాల్సిన గత్యంతరం మాకు పట్టలేదు’ అని చెప్పారు. ప్రతిపక్షం ప్రతిపక్షంలా ప్రవర్తిస్తే మంచిదని సూచించారు. రైతుల పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందని నాసిక్‌లో ఉద్ధవ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
ఆర్థిక సంక్షోభంలో రాష్ర్టం
రాష్ర్టం ఆర్థిక సంక్షోభంలో పడింది... నెలసరి జీతాలకు సైతం అప్పులు చేసే గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆశించినంత ఆదాయం రాకపోవడం, అంచనాలకు మించిన వ్యయం నమోదు కావడంతో రెండో ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ప్రభుత్వం ఎంచుకున్న భారీ లక్ష్యాలు, తలపెట్టిన ప్రతిష్టాత్మక పథకాలు, ముఖ్యమంత్రి వరుస వరాల జల్లులతో నిధుల సర్దుబాటుకు మల్లగుల్లాలు పడుతోంది. బాండ్ల విక్రయం ద్వారా ఆర్బీఐ నుంచి అప్పులు తెచ్చుకోవడం తప్ప గత్యంతరం లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర నుంచి వచ్చిన ఉపాధి హామీ పథకం నిధులు రూ.500 కోట్లు ఖజానాకు మళ్లించింది. * రూ.2,500 కోట్లు దాటిన లోటు * అడ్డదారిలో కేంద్రం నిధుల వాడకం * ప్రశ్నార్థకంగా రైతుల రుణమాఫీ నిధులు * గోదావరి పుష్కరాలకు నిధుల కొరత * ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ * వచ్చే నెల ఉద్యోగుల జీతాలకు కటకట సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలో ఖజానా లోటు ఇప్పటికే రూ. 2,500 కోట్లు దాటిపోయింది. ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర ఖజానాకు వచ్చిన రెవెన్యూ ఆదాయం రూ.7,261 కోట్లు కాగా, అదే సమయానికి తెచ్చిన రూ.2 వేల కోట్లకు పైగా అప్పుతో ఆదాయం రూ.9,698 కోట్లకు చేరుకుంది. ఈ రెండు నెలల్లో రెవెన్యూ వ్యయం రూ.8, 501 కోట్లు దాటింది. ప్రణాళిక వ్యయంతో కలిపితే మొత్తం రూ.10,921 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రూ.1,223 కోట్ల లోటు నెలకొంది. ఈ రెండు నెలల లోటును పూడ్చుకునే లోగా జూన్ నెలలో చోటు చేసుకున్న పరిణామాలు సర్కార్‌ను మరింత కుంగదీశాయి. ఎక్సైజ్ అమ్మకాలపై చెల్లించాల్సిన బకాయిల కింద ఐటీ శాఖ ఆర్బీఐ నుంచి రూ.1,274 కోట్లు సీజ్ చేయడంతో ఆర్థిక నిధుల నిర్వహణ ఒక్కసారిగా తలకిందులైంది. రెండో ఏడాది రుణమాఫీ రెండో విడతగా జూలైలో విడుదల చేసే రూ. 2,207 కోట్లు సర్దుబాటు చేయడం ఆర్థిక శాఖకు ఇబ్బందిగా మారుతోంది. ఇదిలాఉండగా, ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన హామీ ప్రకారం కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్సమెంట్ బకాయిలు రూ.2,500 కోట్ల బకాయి బిల్లులు ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు గోదావరి పుష్కరాలకు రూ.600 కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బడ్జెట్లో కేటాయించిన రూ.100 కోట్లకు మించి పైసా ఇచ్చే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ప్రాధాన్యతా క్రమంలో తక్షణ అవసరాలు.. వచ్చే నెల ఉద్యోగుల జీతాలకు అవసరమయ్యే ఖర్చులకు అప్పులు చేయడం తప్ప గత్యంతరం లేదని సర్కారు అప్రమత్తమైంది. -
అన్నదాత మెడకు అప్పులు ఉచ్చు!
-
అన్నదాత మెడకు అప్పులు ఉచ్చు!
* సాగు 40 శాతం.. బ్యాంకుల రుణాలు 4 శాతం * గత్యంతరం లేక వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు * ఇప్పటికే 3 వేల కోట్ల రూపాయల మేర ప్రైవేటు అప్పులు * బ్యాంకులకు రుణమాఫీ రెండో విడత సొమ్ము చెల్లించని ప్రభుత్వం * గత మాఫీలో అవకతవకలు తేలాకే చెల్లింపులంటూ క్షేత్రస్థాయిలో విచారణ * సర్కారు నుంచి నిధులందకపోవడంతో రైతు రుణాలకు బ్యాంకుల విముఖత * రూ. 30,995 కోట్ల రుణ లక్ష్యంలో ఇప్పటిదాకా విదిల్చింది రూ. 1,200 కోట్లే! సాక్షి, హైదరాబాద్: రైతన్న ఎప్పట్లాగే మళ్లీ అప్పుల ఊబికి దగ్గరవుతున్నాడు! కాలం కలిసి వస్తున్నా చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులు చూస్తున్నాడు. బ్యాంకు రుణాలపై ఆశలు సన్నగిల్లడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాడు. తెలంగాణలో ఇప్పటివరకు పంటల సాగు 40 శాతానికి చేరుకున్నా.. బ్యాంకు రుణాలు 4 శాతాన్ని మించలేదు. సర్కారు వైపు నుంచి కూడా బ్యాంకులపై ఒత్తిడి లేకపోవడంతో రైతులకు ఆశించిన మేర రుణాలు అందడం లేదు. ఫలితంగా అన్నదాతలు ఇప్పటికే రూ.3 వేల కోట్ల వరకు ప్రైవేటు అప్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈసారి రుతుపవనాలు సకాలంలో వచ్చాయి. వాతావరణ శాఖ నివేదికలకు భిన్నంగా మొదటి దశలో అనేక చోట్ల సాధారణం కంటే అధిక వర్షపాతాలు నమోదయ్యాయి. జూన్ 25 నాటికి రాష్ట్రంలో 40 శాతం పంటల సాగు జరిగింది. ఇంతటి కీలక సమయంలో రైతులు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ రుణాలను బ్యాంకులు పట్టించుకోవడం లేదు. రుణమాఫీ కింద ప్రభుత్వం రెండో విడత బకాయిలు చెల్లించనందున రుణాలిచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. రెండో విడత సొమ్ము విడుదల చేయకుండా ప్రభుత్వం.. గత ఏడాది ఇచ్చిన రుణమాఫీలో అవకతవకలు జరిగాయంటూ క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తోంది. ఈ కారణంగా రుణాలు మంజూరు చేయడంలో జాప్యం తప్పడం లేదని బ్యాంకులు చెబుతున్నాయి. రూ.1,200 కోట్లు దాటని రుణాలు రాష్ట్రంలో ఈసారి 1.03 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. తెలంగాణలో సన్న, చిన్నకారు, మధ్య తరహా, ధనిక రైతులు 55.53 లక్షల మంది ఉన్నారు. అందులో సన్న, చిన్నకారు రైతులు 47.68 లక్షల మంది, మధ్య తరహా రైతులు 7.69 లక్షల మంది ఉన్నారు. వీరిలో అధికంగా బ్యాంకు రుణాలపైనే ఆధారపడతారు. గతేడాది లెక్కల ప్రకారం 35.82 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఈసారి వ్యవసాయ సీజన్ ఆశాజనకంగా ఉండటంతో రుణాలు తీసుకునే రైతుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఈ ఏడాది రూ.30,995 కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంతకంటే ఎక్కువ మొత్తంలో రైతుల నుంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. బ్యాంకులు మాత్రం ఇప్పటి వరకు రూ.1,200 కోట్లకు మించి రుణాలు ఇవ్వలేదు. అంటే మొత్తం లక్ష్యంలో కేవలం 3.87 శాతం మాత్రమే! సాగు విస్తీర్ణం మాత్రం 40 శాతం దాకా ఉంది. ఒక్క పత్తి సాగే 54 శాతం జరిగింది. ఇంత మొత్తంలో సాగు విస్తీర్ణం ఉన్నా.. బ్యాంకు రుణాలు మాత్రం అతి స్వల్పంగా ఉన్నాయి. సర్కారు, బ్యాంకులు కలిసి మొండిచేయి చూపడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో రైతులు రూ.3 వేల కోట్లకు పైగా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశారు. కేరళకు చెందిన ఓ బంగారు తాకట్టు సంస్థ తన వ్యాపారాన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. బ్యాంకులు ఆలస్యంగా అప్పులు ఇస్తాయని తెలుసుకున్న ఈ సంస్థ రైతులను ఆకర్షించేందుకు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఈ సంస్థ ఒక్కటే రైతుల దగ్గర్నుంచి ఆభరణాలు కుదువ పెట్టుకుని రూ.1,500 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. అక్రమాలు వెలికి తీశాకే రుణమాఫీ! రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదలకు ముందు సర్కారు అనేక మెలికలు పెడుతోంది. మొదటి విడత విడుదల చేసిన సొమ్ములో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. బోగస్ పాసు పుస్తకాలు, బినామీ పేర్లతో అక్రమాలు జరిగినట్లు స్పష్టమైన సమాచారం అందిందని ఆర్థికశాఖ ఇటీవల వెల్లడించింది. మొదటి విడతలో ఎంత మేరకు అక్రమాలు జరిగాయన్న అంశంపై జిల్లాల్లో నిఘా బృందాలు గాలిస్తున్నాయి. అనర్హులు ఎంతమంది రుణమాఫీ పొందారో పరిశీలన చేస్తున్నాయి. బోగస్ రైతులుంటే తొలగించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 30లోగా తమ పనిని పూర్తి చేయాలని నిఘా బృందాలకు సూచించింది. గత ఏడాది క్షుణ్ణంగా పరిశీలించి రుణమాఫీ అమలు చేశారు. ఎమ్మార్వో ధ్రువీకరణ ఇచ్చాకే సంబంధిత రైతులకు రుణమాఫీని వర్తింపచేశారు. మళ్లీ ఇప్పుడు అక్రమాలు.. తనిఖీలంటూ కొత్తగా చేయడం సరికాదని వ్యవసాయశాఖ అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. కీలకమైన సీజన్లో రైతులను ఆదుకోవాల్సింది పోయి నిఘా బృందాలతో బ్యాంకుల్లో పరిశీలన చేయించడం దారుణమని అంటున్నారు. వడ్డీలకు తెచ్చుకుంటున్నాం పంటల సాగు కోసం వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. రుణమాఫీకి సంబంధించి ఈ ఏడాది ఇప్పటి దాకా ఖాతాలో జమ చేయలేదు. బ్యాంకుకు వెళ్తే డబ్బులు జమ కాలేదంటున్నారు. చేసేది లేక పెట్టుబడుల కోసం వడ్డీవ్యాపారుల వద్దకు పరుగెడుతున్నాం. - రాముడు, గట్టు, మహబూబ్‌నగర్ బ్యాంకు రుణాలు ఇవ్వలేదు నాకు మూడెకరాల పొలం ఉంది. పత్తి, నారుమళ్లను సిద్ధం చేసుకున్నాం. బ్యాంకుకు వెళ్తే రుణాలు ఇవ్వడం లేదు. ఈ నెలాఖరు వరకు రెన్యూవల్ చేసుకోని రైతులకు అవకాశం ఉండదని చెబుతున్నారు. కొత్త రుణాలను ఎప్పుడిస్తారో చెప్పడం లేదు. వడ్డీకి అప్పులు తెచ్చుకొని పంటలు సాగుచేస్తున్నా. - సాయన్న, ధరూరు, మహబూబ్‌నగర్ -
రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ గడువు పెంపు
31వ తేదీ వరకు రైతులకు అవకాశం కలెక్టరేట్‌తోపాటు అన్ని ఆర్డీవో కార్యాలయాల్లోనూ దరఖాస్తుల స్వీకరణ మచిలీపట్నం : రుణమాఫీ పథకం లబ్ధిపొందని రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం ప్రకటించారు. వాస్తవానికి ఫిర్యాదుల స్వీకరణ గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో రుణమాఫీ దరఖాస్తులను స్వీకరించారు. సోమవారం కూడా ఈ కేంద్రం కొనసాగనుంది. రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ గడువును పెంచుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో కలెక్టరేట్‌తోపాటు, జిల్లాలోని నాలుగు ఆర్డీవో కార్యాలయాల్లోనూ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని వ్యవసాయశాఖ డీడీ బాలునాయక్ ‘సాక్షి’కి తెలిపారు. గడువు పొడిగింపు రెండోసారి ఏప్రిల్ 27వ తేదీన కలెక్టరేట్లో రైతు రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. మే 15వ తేదీ వరకు గడువు విధిం చారు. రైతుల నుంచి ఫిర్యాదులు అధికంగా వస్తుండటంతో ఈ నెల 25వ తేదీ వరకు ఈ గడువు పొడిగించారు. ఈ గడువు సోమవారంతో ముగియనుంది. ఈలోగానే వ్యవసాయశాఖ మంత్రి ఈ నెల 31వ తేదీ వరకు ఈ గడువును పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రానికి 14 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రోజుకు 900 చొప్పున దరఖాస్తులు స్వీకరించారు. రూ.50 వేలకు మించి రూ.1.50 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు వాయిదాల పద్ధతిలో మొదటి వాయిదాగా రూ.30 వేలు మాత్రమే జమ అయ్యింది. ఈ విషయాన్ని గమనించని రైతులు తాము తీసుకున్న రుణం మొత్తం మాఫీ కాలేదని ఫిర్యాదుల కేంద్రానికి వచ్చారు. కొంత మంది రైతులకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు కాలేదు. మీ-సేవ కేంద్రంలో తీసుకున్న పత్రంలో డేటా నాట్ ఫౌండ్ అనే రిమార్కుతో కొంత మంది రైతులకు రుణమాఫీ నిలిచిపోయింది. డేటా నాట్ ఫౌండ్ అనే రిమార్కుతో ఉన్న ఫిర్యాదులను అధికారులు స్వీకరించలేదు. ఈ తరహాలో 2,300లకు పైగా ఫిర్యాదులను అధికారులు తిరస్కరించారు. పూర్తి వివరాల నమోదు రైతు రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో తీసుకున్న దరఖాస్తులను ఎనిమిది బృందాల అధికారులు స్వీకరించారు. అధికారులు స్వీకరించిన రుణమాఫీ ఫిర్యాదుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన నమూనా ఆధారంగా నింపి వివరాలను హైదరాబాద్‌కు పంపారు. రైతు పేరు, బ్యాంకు ఖాతా నంబరు, ఎంత రుణం తీసుకున్నారు, ఎంత మేర రుణమాఫీ జరిగింది, రిమార్కులో ఏం రాసి ఉంది తదితర వివరాలను నమోదు చేశారు. ఇందుకోసం 15 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి ఈ ప్రక్రియను పూర్తి చేశారు. స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్ చేయకుండా రిజిస్టర్ పోస్టు ద్వారా హైదరాబాద్‌లోని ప్రణాళికా విభాగానికి పంపుతున్నారు. సోమవారం ఆఖరు రోజు కావడంతో అధికంగా దరఖాస్తుదారులు వచ్చే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మీ-కోసం కార్యక్రమాన్ని రద్దు చేసినప్పటికీ రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణను కొనసాగిస్తున్నారు. -
పంట రుణమాఫీ పథకంలో నకిలీలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పంట రుణాల మాఫీ పథకంలో అక్రమార్కులకు అధికారులు కళ్లెం వేశారు. రుణమాఫీ జాబితాలో అనర్హుల పేర్లు చొప్పించిన గుట్టును రట్టు చేసిన మండల కమిటీలు.. వారి అర్హతను రద్దు చేశాయి. ఫలితంగా వారికి ప్రభుత్వం విడుదల చేసిన పంటరుణ మాఫీ తొలివిడత నిధులను తిరిగి సర్కారు ఖాతాకు మళ్లించారు. జిల్లాలో 3,282 మంది బోగస్ లబ్ధిదారులకు సంబంధించి రూ. 6.44 కోట్లను యంత్రాంగం ఇటీవల వెనక్కు పంపింది. కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ అర్హులను గుర్తించాల్సిందిగా ఆదేశించింది. దీంతో చర్యలకు దిగిన జిల్లా యంత్రాంగం.. పలుమార్లు వడపోత అనంతరం జిల్లా వ్యాప్తంగా 2,10,257 మందిని అర్హులుగా గుర్తించింది. వీరికి రూ.1,032.41 కోట్లు మాఫీ చేయాల్సిందిగా పేర్కొంటూ జాబితాను ప్రభుత్వానికి సమర్పించింది. రుణ మాఫీని నాలుగు విడతల్లో చెల్లించనున్నట్లు ప్రకటించిన సర్కారు.. తొలివిడత కింద రూ.258.10 కోట్లు విడుదల చేసింది. యంత్రాంగం రూపొందించిన జాబితాలో అనర్హులున్నట్లు అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమచేసేముందు మరోసారి పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. ఈక్రమంలో జిల్లా వ్యాప్తంగా 3,282 మందిని జాబితా నుంచి తప్పిస్తూ.. మిగతా 2,06,975 మంది రైతులకు మాఫీ నిధులు బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. అనంతరం జాబితా నుంచి తప్పించిన రైతుల వివరాలను పూర్తిస్థాయి పరిశీలన చేపట్టారు. ఇందులో పరిమితికి మించిన రుణాలు, బంగారు ఆభరణాల లోన్లు, నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, ఖాతా నంబర్లలో డూప్లికేట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారి అర్హతను రద్దు చేశారు. మాఫీ రూ.1,006.84 కోట్లే.. రుణ మాఫీలో అనర్హుల పేర్లు తొలగించడంతో ప్రభుత్వానికి కొంత భారం తగ్గింది. తొలుత 2,10,257 మందిని అర్హులుగా గుర్తించి.. వారికి రూ.1,032.41 కోట్లు మాఫీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదికలిచ్చారు. తాజాగా అనర్హులను జాబితా నుంచి తప్పించారు. ఫలితంగా లబ్ధిదారుల సంఖ్య 2,06,975కు తగ్గింది. అదేవిధంగా మాఫీ మొత్తం కూడా రూ.1,006.84 కోట్లకు చేరింది. అంటే ప్రభుత్వానికి రూ. 25.76కోట్ల భారం తగ్గింది. ఇందులో ఇప్పటికే రూ.251.71 కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రూ. 251.71 కోట్లు ఇవ్వాల్సిందిగా జిల్లా వ్యవసాయశాఖ నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. -
'రైతుల ఆత్మహత్యలే బంగారు తెలంగాణా?'
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క హామీ అయినా అమలు చేసారా ? అని తెలంగాణ వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ శివకుమార్ సూటిగా ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్య చేసుకోవడమే బంగారు తెలంగాణా? అంటూ మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీపై కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మే 2న తెలంగాణ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, గ్రేటర్ ఎన్నికలపై చర్చించనున్నట్టు తెలిపారు. గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ మాత్రమేనని శివకుమార్ చెప్పారు. -
రైతు రుణ లక్ష్యం రూ. 10 కోట్లు
జలుమూరు: రానున్న ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు పది కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శిమ్మ జగదీశ్వరరావు తెలిపారు. డీసీసీబీ పరిధిలోని 49 పీఏసీఎస్‌ల పరిధిలో 350 కోట్లరూపాయల విలువ ధాన్యాన్ని ఈ ఏడాది కొనుగోలు చేయడం ద్వారా సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు కమిషన్ రుపేణా లాభాలు అర్జించామన్నారు. చల్లవానిపేట పీఏసీఎస్‌ను గురువారం సందర్శించిన ఆయన రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్, రబీలో రైతులకు రూ. 10 కోట్లు దీర్ఘకాలిక రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రుణ మాఫీకి సంబంధించి మొదటి విడతలో రూ.79.35 కోట్లు, రెండో విడతలో రూ. 18.46 కోట్లు అయ్యిందన్నారు. రూ. 240 కోట్లు వర్తించాల్సి ఉండగా రూ. 180 కోట్లు అర్హత పొందారని ఇంకా రూ. 60 కోట్లు పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పటికీ రుణ మాఫీ కాని రైతులు రైతు సాధికారికా సంస్థలో ఫిర్యాదు చేసుకోవాలన్నారు. నరసన్నపేటలో డీసీసీబీ బ్రాంచి భవన నిర్మాణాలు పూర్తయ్యావని, మే నెలలో వీటిని ప్రారంభిస్తామన్నారు. ఈయన వెంట మేనేజర్ డీవీఎస్ రమణమూర్తి, అధ్యక్షుడు వాన కనకయ్య, సీఈవో భాస్కర్ పట్నాయక్ ఉన్నారు. -
బడ్జెట్ కేటాయింపుల్లో.. రైతుకు దక్కేది పిడికెడే!
ఈ ఏడాది తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పోటీపడి తగ్గించాయి. రుణ మాఫీ పథకానికి కేటాయించిన నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, సిబ్బంది జీతాలు మినహాయిస్తే నికరంగా రైతుకు చేరేది చాలా తక్కువ. చిన్న రైతుల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే చర్యలకు నిధులు కేటాయిస్తే బాగుండేదంటున్నారు డాక్టర్ డి.నరసింహారెడ్డి. వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో నిధుల కేటాయింపులు తగ్గిపోతున్నాయి. చిన్న రైతులకు అవసరమైన పథకాలను కుదించడం లేదా ఎత్తివేయడం జరుగుతోంది. కేటాయింపులను సైతం పూర్తిస్థాయిలో ఖర్చు చేయటం లేదు. రైతులు అధికారుల వద్దకు తిరగలేక, పథకాలు ఉన్నా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇచ్చిన వారికే ఇవ్వటం, నిబంధనల పేరిట అర్హులకు ఇవ్వకపోవటం, అరకొరగా ఇవ్వటం వంటి కారణాలతో రైతులకు ప్రయోజనం కలగటంలేదు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖకు 2014-15లో రూ. 6,276 కోట్లు, 2015-16లో రూ. 5,545 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే 13 శాతం నిధుల కేటాయింపు తగ్గింది. ప్రణాళికా కేటాయింపులు రూ. 1,035 కోట్లు కాగా ప్రణాళికేతర కేటాయింపులు రూ. 4,510 కోట్లు! ప్రణాళికా కేటాయింపులు గతేడాది కంటే భారీగా 76 శాతం తగ్గించారు. మొదటి నుంచి కూడా కేంద్ర పథకాలు, తద్వారా వచ్చే నిధులనే రాష్ట్రాలు నమ్ముకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వమేమో రాష్ట్రాలకు నిధులు నేరుగా బదలాయించి, స్వేచ్ఛ కల్పించానంటుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవటం శోచనీయం. నికర కేటాయింపులు స్వల్పమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులు ఇందుకు భిన్నంగా ఏమీలేవు. 2015-16 సంవత్సరానికి వ్యవసాయ శాఖ కేటాయింపులు రూ. 6,454 కోట్లు. గత సంవత్సర కేటాయింపుల కన్నా ఈ కేటాయింపులు తొమ్మిది శాతం తక్కువ. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లలో రుణ మాఫీ పథకం నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలను మినహాయిస్తే వ్యవసాయానికి నికర కేటాయింపులు చాలా తక్కువ. రుణమాఫీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి సంవత్సరం రూ. 5 వేల కోట్లు కేటాయించి 2015-16లో రూ. 4,300 కోట్లకు తగ్గించింది. తెలంగాణ ప్రభుత్వం రూ. 4,250 కోట్లు కేటాయించింది. రెండు రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, వ్యవసాయాభివృద్ధికి సమృద్ధిగా నిధులివ్వకపోవడం ఆయా ప్రభుత్వాల హ్రస్వ దృష్టిని సూచిస్తుంది. రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చే నిధులు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రూ. 10 కోట్లకు మించవు. మిగతా నిధులు, బిల్డింగులు పరిశోధనలు పెద్ద కమతాలకు ఉపయోగపడేవే. అధికార టి.డి.పి., టి.ఆర్.ఎస్. పార్టీలు ఎన్నికల సమయంలో ఘనమైన హామీలు ఇచ్చాయి. కాంప్లెక్స్ ఎరువుల సరఫరాకు రూ. 500 కోట్లు ఇస్తానని టీడీపీ హామీ ఇచ్చింది. మార్కెట్ స్థిరీకరణ నిధికి రూ. 5 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. ఆ పథకం ఊసే ఎత్తలేదు. అనేక పంటలకు గిట్టుబాటు ధర లభించటం లేదు. మార్కెట్ స్థిరీకరణ నిధి ఈ పరిస్థితిలో అత్యంత అవసరం. చిన్న, సన్న కారు రైతుల అవసరాలు తీర్చే కొత్త పథకం ఒక్కటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రణాళిక కేటాయింపులలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 2014-15లో కేటాయించిన రూ. 5415 కోట్లు వార్షిక ప్రణాళికలో 20.31 శాతం కాగ, 2015-16లో కేటాయించిన రూ. 1863 కోట్లు కేవలం 5.42 శాతం మాత్రమే. రైతులను, ఆదుకోవాల్సిన ప్రభుత్వం అరకొర కేటాయింపులు చేయటం దురదృష్టం. రైతుకు చేరేది తక్కువే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర బడ్జెట్లో అవీ ఇవీ ఒకచోట చేర్చి వ్యవసాయ బడ్జెట్ అన్నారు. వ్యవసాయాభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలేమిటో, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో పేర్కొని ఉంటే స్పష్టత ఉండేది. పట్టు పరిశ్రమకు రూ. 93 కోట్లు ఇచ్చామన్నారు. దీనిలో రూ. 82 కోట్లు, సిబ్బంది జీతభత్యాలకు ఖర్చుకాగా పరిశ్రమ అభివృద్ధికి మిగిలేది కేవలం రూ.7.25 కోట్లు మాత్రమే. అలాగే పశుగణాభివృద్ధికి ప్రకటించిన రూ. 672 కోట్లలో సిబ్బంది జీతభత్యాలకే రూ. 489 కోట్లు ఖర్చవుతాయి. రెండు రాష్ట్రాలు కలిపి కేటాయించిన రూ. 11,999 కోట్లలో రైతుల సమస్యలు తీర్చేందుకు ఉపయోగపడే నిధులు రూ. 500 కోట్లకు మించవు. చిన్న రైతులు దశలవారీగా ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తోడ్పడే చర్యలకు నిధులు కేటాయిస్తే బాగుండేది. ప్రభుత్వ పథకాల అమలులో సమన్వయం సాధించి, అవినీతిని తగ్గించి, నిధులను పరిపూర్ణంగా రైతులకు చేర్చే ప్రక్రియలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. (వ్యాసకర్త వ్యవసాయ విధాన విశ్షేషకులు. మొబైల్ : 90102 05742) -
అబద్ధాల బాబు
రైతుల, డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ పేరుతో దగా ఏడాదిలోపే ప్రజల నమ్మకం కోల్పోయిన బాబు తణుకు దీక్షలో ధ్వజమెత్తిన జిల్లా నేతలు రెండవరోజు జగన్‌ను కలిసిన పలువురు నాయకులు సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇష్టానుసారంగా హామీలు గుప్పించి, తర్వాత అధికారంలోకి వచ్చాక ప్రజలను వంచించడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ఆదివారం తణుకులో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు దీక్షలో ప్రజలనుద్దేశించి పలువురు నేతలు ప్రసంగించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజాద్బాష, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఆకేపాటి అమర్నాథరెడ్డి తదితరులు ప్రసంగిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేవలం అధికారం కోసమే అమలుకు సాధ్యంగానీ హామీలను గుప్పించారని వారు ధ్వజమెత్తారు. ఈ నేపధ్యంలోనే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ సర్కార్మెడలు వంచేందుకే దీక్ష చేపట్టారని వారు ప్రశంసించారు. ఊహించని రీతిలో దీక్షకు జనం రావడం చూస్తే జగన్‌పై ప్రజలకు ఉన్న అభిమానం ఇట్టే అర్థమవుతోందన్నారు. కాగా వైఎస్ జగన్ చేపట్టిన రైతు దీక్షకు జిల్లా నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు వెళ్లి సంఘీభావం తెలిపారు. -
మోసం బాబు నైజం!
కురుపాం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమా ఫీ పేరిట రైతులు, డ్వాక్రా మహిళలను నమ్మించి, మో సం చేశారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మోసం చేయడం చంద్రబాబు నైజమని ధ్వజ మెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతుదీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు ఆదివా రం ఆమె ఇక్కడి విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల్లో రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన అనంతరం విస్మరిం చిన చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నార న్నారు. కురుపాం నియోజకవర్గంలో ఒక రైతుకు రూ. 150 మాత్రమే రుణమాఫీ అయ్యిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఇదే నెలకొందన్నారు. ఎన్నికల మే నిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నీటిలో మూ టలగానే మిగిలాయన్నారు. బాబు ఏడు నెలల పాలన పై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు తమ పార్టీ ఎప్పుడూ అం డగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై ప్రజలకు నమ్మకం పోయిం దన్నారు. ఆయన మాయ మాటలను ప్రజలు గత తొమ్మిదేళ్లలో చూశారని చెప్పారు. భవిష్యత్తు వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. జగన్ దీక్షకు వెళ్లిన బొబ్బిలి నాయకులు బొబ్బిలి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల పాటు నిర్వహించిన రైతుదీక్షకు బొబ్బిలి నియెజకవర్గం నుంచి అధిక సం ఖ్య లో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. పార్టీ జిల్లా కార్యదర్శి, రామభధ్రపురం మండల నాయకుడు మడక తిరుపతినాయుడు, ఆ మండలానికి చెందిన కర్రొతు తిరుపతిరావు, డబ్ల్ల్యూవీఎల్ఎన్ రాయలు, బొ బ్బిలి పట్టణానికి చెందిన బొబ్బాది తవిటినాయుడు, పర్తాపు చంద్రశేఖర్, మండలానికి చెందిన అప్పలనాయుడు, సింహాచలం, రెడ్డి వెంకటనాయుడు, బాడంగి మండలానికి చెందిన గొర్లె శంకరరావు, శ్రీనివాసరా వు తరలివెళ్లారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు ఆధ్వర్యంలో వారంతా రెండు రోజుల పాటు దీక్షలో ఉన్నారు. -
బంగారం వేలం వేస్తాం:సీవీఆర్ రాజేంద్రన్
-
బంగారం వేలం వేస్తాం
రైతు రుణ మాఫీ పథకం మాకు గుదిబండగా మారింది ఆంధ్రాబ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ వ్యాఖ్యలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం కుదువ పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలకు రుణ మాఫీ వర్తించని పక్షంలో వెంటనే చెల్లించాలని నోటీసులిస్తున్నామని, గడువు తీరినా కూడా చెల్లించకపోతే ఆభరణాలను వేలం వేయటానికి వెనకాడబోమని ఆంధ్రాబ్యాంక్ స్పష్టంచేసింది. రుణ మాఫీపై వాస్తవ పరిస్థితులను రైతులకు వివరంగా చెబుతున్నామని, రుణం ఎన్పీఏగా మారిన తరవాత కూడా దాన్ని చెల్లించని పక్షంలో ఆభరణాలు వేలం వేస్తామని బ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ స్పష్టంచేశారు. నిజానికి రుణ మాఫీకి విధించిన నిబంధనల కారణంగా బంగారు ఆభరణాలను తనఖా పెట్టి తీసుకున్న రుణాల్లో చాలా వాటికి మాఫీ వర్తించడం లేదు. ఎందుకంటే రుణ మాఫీ వర్తింప చేయడంలో ముందుగా పంట రుణానికి, ఆ తర్వాత కన్వర్టెడ్ పంట రుణాలకు ప్రాధాన్యమివ్వాలని, ఆ తర్వాతే బంగారు రుణాలను పరిగణనలోకి తీసుకోవాలని నిబంధనలు చెపుతున్నాయి. వీటికి తోడు కుటుంబంలో ఒక ఖాతాకు మాత్రమే మాఫీ వర్తింపజేస్తుండటంతో చాలావరకూ తొలి ప్రాధాన్యంలో ఉన్న పంట రుణాలకే ఇది వర్తిస్తోంది. చాలా గోల్డ్ లోన్స్‌కు మాఫీ జాడే లేకుండా పోతోంది. ఈ పరిస్థితులన్నీ రైతులకు వివరంగా చెబుతున్నామని రాజేంద్రన్ తెలియజేశారు. డిఫాల్టర్లలో వీరే అధికం ఆంధ్రాబ్యాంక్ వద్ద పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వారిలో సినిమా స్టార్లు, రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నట్లు రాజేంద్రన్ వ్యాఖ్యానించారు. ‘‘నిరర్థక ఆస్తులను తగ్గించుకొని బ్యాంకును కాపాడుకోవడానికి రికవరీ సిబ్బంది మాత్రమే కాకుండా మొత్తం 18,000 మంది ఉద్యోగులూ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఎగవేతదారుల ఇళ్లు, ఆస్తుల ముందు బ్యాంకు సిబ్బంది నిరసన చేపడుతున్నారు’’ అని తెలియజేశారు. వ్యక్తిగతంగా ఎగవేతదారుల పేర్లు చెప్పలేనని, వారి ఇంటి ముందు నిరసన చేసినప్పుడు అవే తెలుస్తాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారాయన. మొత్తం 2.86 లక్షల ఎన్పీఏ ఖాతాలుండగా, అందులో కోటి అంతకంటే ఎక్కువ మొత్తం కలిగిన ఖాతాలు 1,038 మాత్రమే. ప్రస్తుతం ఆంధ్రాబ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు రూ.7,118 కోట్లకు చేరుకొని ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రికార్డు స్థాయికి వ్యవసాయ రుణ ఎన్పీఏలు ఆంధ్రాబ్యాంక్ చరిత్రలోనే తొలిసారిగా వ్యవసాయ రుణాల్లో 6.6 శాతం నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) జాబితాలోకి చేరాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2014 మార్చి నాటికి రూ.332 కోట్లుగా ఉన్న వ్యవసాయ రుణాల ఎన్పీఏలు రుణ మాఫీ పథకం పుణ్యమాని ఈ తొమ్మిది నెలల్లో ఏకంగా రూ.919 కోట్లకు చేరుకున్నాయి. ఎన్‌పీఏల్లో ఇప్పటి వరకు రూ.370 కోట్ల వరకు వసూలయ్యాయని, ప్రస్తుతం నికరంగా రూ.882 కోట్ల మేర వ్యవసాయ ఎన్పీఏలు ఉన్నాయని రాజేంద్రన్ తెలియజేశారు. అదే తెలంగాణాలో అయితే వ్యవసాయ రుణాల నికర నిరర్థక ఆస్తులు రూ.405 కోట్లుగా ఉన్నాయి. ‘‘ఆంధ్రా బ్యాంక్ చరిత్రలో వ్యయసాయ రుణాల్లో ఎన్పీఏలు ఏనాడూ సగటున రెండు శాతానికి మించి లేవు. కానీ ఈ రుణ మాఫీ పథకం వల్ల ఇప్పుడివి సుమారు ఏడు శాతానికి చేరుకున్నాయి. భారీగా పెరిగిన పని ఒత్తిడి... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రుణ మాఫీ పథకంలో అనేక నిబంధనలు పెట్టడంతో బ్యాంకు ఉద్యోగులపై తీవ్రమైన పని భారం పడుతోందని రాజేంద్రన్ చెప్పారు. ‘‘ఒక ఉద్యోగి రోజుకు 20-30 ఖాతాలు పునరుద్ధరించగలరు. మాఫీని వేగంగా చేయడానికి మా సిబ్బంది శని, ఆదివారాల్లో కూడా పనిచేస్తున్నారు. రోజుకు 50 ఖాతాల వరకు పూర్తి చేస్తున్నారు. బహుళ వ్యవసాయ రుణాలున్న రైతులకు ఒక రుణానికి మాత్రమే మాఫీ వర్తించడంతో ఏ ఖాతాకు వర్తిస్తుందో, దేనికి వర్తించదో తేల్చడం భారంగా మారింది.మార్చికల్లా 80 శాతం ఖాతా ల్ని పునరుద్ధరించలమన్న నమ్మకం ఉం ది’’ అని తెలియజేశారు. రాత్రింబవళ్లు పనిచేస్తున్నా... బ్యాంకుల వల్లే మాఫీ వర్తింప చేయలేకపోతున్నామని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు సిబ్బంది మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఒక బ్యాంకు మేనేజర్ వ్యాఖ్యానించారంటే వారిపై ఏ స్థాయి ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. -
అభివృద్ధే లక్ష్యంగా..
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని..బంగారు తెలంగాణకు బాటలు వేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. 66వ గణతంత్ర దిన వేడుకలు జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రంలో అభ్యుదయం వైపు పయినిస్తామని..అభివృద్ధి సాధిస్తామని అన్ని రకాలుగా బాగుపడుతామని తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో పురోగమింపచేయడానికి అవసరమయ్యే పథకాలను, ప్రణాళికలను రూపొందించి అమలు చేయడం జరుగుతోందని వివరించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఈ సందర్భంగా జోహార్లు అర్పించారు. సందర్భంగా సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. వ్యవసాయం పంట రుణాల మాఫీ పథకం కింద జిల్లాకు రూ.634 కోట్లు విడుదల చేయగా ఇప్పటి వరకు 4 లక్షల 74వేల రైతుల ఖాతాలకు రూ.561 కోట్లు జమ చేశారని తెలిపారు. 2009 నుంచి 2014 వరకు వడగండ్ల వాన, అతివృష్టి, అనావృష్టి, కరువు, తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.65 కోట్లు లక్షా 53వేలు వారివారి ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ చెప్పారు. ఖరీఫ్, రబీ సీజనల్లో పంట రుణాల కింద రైతులకు రూ.1752 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.1995 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఖరీఫ్‌లో 60 వేల 495 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.85 కోట్లతో కొనుగోలు చేసి రైతులకు ఆమొత్తాన్ని చెల్లించి మద్ధతు ధర కల్పించామని చెప్పారు. మిషన్ కాకతీయ రాష్ట్ర ప్రభుత్వం చెరువులు సంరక్షణ, పునరుద్ధర ణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది 952 చెరువులనను మరమ్మతు చేయనున్నారని వివరించారు. ఇప్పటి వరకు 472 చెరువులకు రూ.275 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు తయారు చేసి పరిపాలనా ఆమోదానికి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. వాటర్‌గ్రిడ్ వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.25 వేల కోట్లతో తెలంగాణలోని ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వాటర్ గ్రిడ్ పథకాన్ని రాష్ట్రంలో మన జిల్లాలోని చౌటుప్పుల్ గ్రామంలో త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదు గా పైలాన్ ఆవిష్కరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. నక్కల గండి జిల్లా ప్రజల దాహార్తి తీర్చడంతోపాటు, ఫ్లోరైడ్ నివారణకు 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.6,500 కోట్లతో నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణం అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. విద్యుత్ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు తీర్చడమేగాక, మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు గతేడాది డిసెంబర్ 23 తేదీన ఏరియల్ సర్వే నిర్వహించి 6,800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు రూపకల్పన చేశారని తెలిపారు. ఇప్పటికే 10,700 ఎకరాల్లో భూ సేకరణ సర్వే పూర్తి చేసుకుని అటవీ భూములను అటవీయేతర భూములుగా మార్చేందుకు గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. నిమ్స్‌కు బదులు ఎయిమ్స్ బీబీనగర్ మండలం రంగాపురంలో నిర్మాణ దశలో ఉన్న ని మ్స్‌ను సీఎం కేసీఆర్ ఇటీవల సందర్శించారని, రాష్ట్రానికే తలమానికంగా నిలిచే విధ ంగా ఎయిమ్స్‌గా మార్చుటకు, హెల్త్ హబ్ ఏర్పాటు చేయాలనే కీలక నిర్ణయాన్ని ప్రకటించినందుకు జిల్లా ప్రజల తరపున సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. మరో తిరుపతిగా.. యాదగిరిగుట్ట యాదగిరిగుట్టను ఆధ్యాత్మిక కేంద్రంగా అన్ని హంగులతో అభివృద్ధి పర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, దీనిలో భాగంగా రూ.750 కో ట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇప్పటికే మంజూరు చేసిన రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అదే విధంగా తెలంగాణకు హరితహారం, ఉద్యానవనశాఖ, ఆసరా పింఛన్లు, ఎస్సీ మహిళలకు 3 ఎకరాల భూ పంపిణీ, ఆహార భద్రత కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం, రోడ్ల మరమ్మతులు, తదితర పథకాల అమలును వివరించారు. రాచకొండతోపాటు జిల్లా గ్రామీణాభివృద్ధి, పురపాలన పురోగతి, ఇతర సంక్షేమ పథకాల అమలకు కృషి చేస్తున్న అధికారులను ఆయన అభినందించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎల్లవేళలా కృషి చేస్తూ, జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలలో పోలీస్ యంత్రాంగం సహాయ, సహకారాలందించడంతోపాటు, వాటిల్లో పాలుపంచుకుంటున్న వారందరికి కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్, ఎస్పీ టి.ప్రభాకర్‌రావు, నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ, జేసీ సత్యనారాయణ, ఏజేసీ వెంకట్రావు, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డీఆర్వో నిరంజన్, డీఆర్డీఏ పీడీ చిర్రా సుధాకర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వాగ్దానం ‘మాఫీ’
సాక్షి ప్రతినిధి, ఏలూరు :అధికారంలోకి రావాలి. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని అవిచ్ఛిన్నంగా ఏలాలి. రైతులు ఏమైపోతే ఏం. అందుకే.. అంకెల గారడీ చేశారు. రుణమాఫీ వాగ్దానంతో అందలమెక్కారు. మాఫీ చేసింది రుణాల్ని కాదని.. వాగ్దానాన్ని మాత్రమేనని తెలుసుకునేలోగా చంద్రబాబు మాయాజాలంలో పడిన పశ్చిమ రైతులు దారుణంగా మోసపోయారు. జిల్లాలో మాఫీ కావలసిన రుణాలు సరిగ్గా రూ.5,200 కోట్లు. 2013-14 నాటికి జిల్లాలో ఇచ్చిన వ్యవసాయ రుణాల మొత్తం అది. వాస్తవానికి చంద్రబాబు హామీ మేరకు రూ.5 వేల కోట్ల పైచిలుకు మాఫీ కావాలి. కానీ.. రాష్ర్టంలోని 13 జిల్లాల రైతుల రుణమాఫీకి కేటాయించింది రూ.5 వేల కోట్లే. పశ్చిమగోదావరి జిల్లాకు కేటాయించింది రూ.369 కోట్లు మాత్రమే. అంటే మిగిలిన రూ.4,831 కోట్ల రుణాలను రైతులే చెల్లించుకోవాలి. కేటాయించిన రూ.369 కోట్లయినా రైతుల ఖాతాల్లో జమ అయి పూర్తిగా రుణ విముక్తి కలిగిందా అంటే.. అవునని ఒక్క రైతు కూడా చెప్పలేకపోతున్నాడు. తేలని రూ.50 వేలలోపు రుణాల లెక్క ఒకేసారి మాఫీ అవుతాయని, రూ.లక్షన్నర వరకు ఉన్న రుణాల్లో తొలివిడతగా 20శాతం మాఫీ అవుతుందని ప్రభుత్వం నెలన్నర కిందట ప్రకటించింది. జిల్లాలోని మొత్తం 8.50 లక్షల రైతుల్లో తొలి విడత 3.50 లక్షల మంది మాత్రమే రుణమాఫీకి అర్హులని తేల్చింది. గత డిసెంబర్ 10వ తేదీ నుంచి మాఫీ ప్రక్రియ మొదలుపెట్టి వారంలోగా ముగిస్తామని సర్కారు ప్రకటించింది. నేటికీ తొలివిడత రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పటికీ జిల్లాలో ఏ ఒక్క రైతు రుణ మాఫీకి సంబంధించి తన ఖాతాలో పూర్తిగా సొమ్ము జమ అయిందని చెప్పే పరిస్థితి లేదు. ఇక రూ.50 వేల లోపు రుణాలు ఎన్ని ఉన్నాయో అధికారులే చెప్పలేని స్థితి. జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి ఎన్.లక్ష్మీనారాయణ సైతం తన వద్ద సరైన సమాచారం లేదంటూ చేతులెత్తేస్తున్నారంటే రుణమాఫీ ప్రక్రియ జిల్లాలో ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. 5 లక్షల ఖాతాల మాటేమిటి తొలి విడతకే ఇంత అయోమయ పరిస్థితి నెలకొంటే.. జిల్లాలో రెండో విడతగా రుణమాఫీ కావాల్సిన రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మలి విడతలో 5 లక్షల రైతుల ఖాతాలను పరిశీలించి పంపాలని తహసిల్దార్లను ప్రభుత్వం ఆదేశిం చింది. ఆధార్, రేషన్ కార్డుల వివరాలతో ముడిపెడుతూ 33 అంశాలతో ఉన్నా ఫారం నింపాలన్న నిబంధనతో చాలామంది రైతులు సకాలంలో వివరాలు ఇవ్వలేకపోయారు. ఈ సాకుతో జిల్లాలోని 96 వేల మంది ఖాతాలకు ప్రభుత్వం కోత పెట్టింది. మిగి లిన 4 లక్షల 4వేలమంది రైతుల ఖాతాలను పెండింగ్ లిస్ట్‌లో పెట్టి మళ్లీ ఆయా ఖాతాలకు పత్రాలను సమర్పించాలని సూచించింది. దరఖాస్తులు సమర్పించేందుకు ఈనెల 24 వరకు గడువిచ్చింది. ఇప్పటికే పలుమార్లు పత్రాలు సమర్పించినా.. ఎప్పటికప్పుడు కొర్రీలు పెడుతూ పదేపదే దరఖాస్తులు కోరడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క అధికారులు సర్కారు నిబంధనలు అమలు చేయలేక, రైతులకు సమాధానం చెప్పలేక నలిగిపోతున్నారు. రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి వ్యవసాయ శాఖ వద్ద కూడా ఇప్పటికీ సరైన సమాచారం లేదు. ప్రభుత్వమే రుణమాఫీ ప్రక్రియను గందరగోళపరిచి రైతులతోపాటు అధికార యంత్రాంగాన్నీ ఇబ్బంది పెట్టే కుట్రకు తెర లేపిందని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకులో ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో చేపట్టనున్న రైతు దీక్షకు పోటెత్తేందుకు పశ్చిమ రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. అన్నదాతను ముంచిన ప్రభుత్వంపై వైఎస్ జగన్ నేతృత్వంలో రాజీలేని పోరాటాలకు పశ్చిమగోదావరి జిల్లా నుంచే శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఇంత దారుణంగా వంచిస్తారా ఎన్నో హామీలతో అరచేతిలో స్వర్గం చూపించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. హామీల అమలు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి మోసపూరితంగా ఉంది. ఆయన అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుందని ఆశించిన రైతు ఈ రోజు నిలువునా దగాపడి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్నారు. దీంతో కష్టాల్లో ఉన్న రైతులు టీడీపీకి అధికారం కట్టబెట్టారు. తీరా రుణమాఫీ అమలుకు వచ్చేసరికిగాని తాము మోసపోయామనే విషయం వారికి తెలియలేదు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్లకు, రెవెన్యూ అధికారులకు స్పష్టత లేదు. ప్రభుత్వ పథకం అమలులో అధికారులు సైతం ఇంత గందరగోళం ఎదుర్కొన్న పరిస్థితి నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రూ.50 వేలలోపు రుణం పూర్తిగా మాఫీ అన్నారు. మిగిలిన రుణాలు ఐదేళ్లలో మాఫీ అంటున్నారు. మరోవైపు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలు అంటున్నారు. మొత్తంగా గందరగోళం సృష్టిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే తాకట్టులో ఉన్న బంగారు ఆభరణాలన్నీ వెంటనే ఒంటిపైకి వచ్చేస్తాయని రంగుల ప్రపంచాన్ని చూపించారు. డ్వాక్రా మహిళలనైతే నిలువునా మోసం చేశారు. మొన్నటి వరకూ బ్యాంకు అధికారులు డ్వాక్రా మహిళల ఇళ్లకు వెళ్లి రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడి మహిళలు రుణాలు కోసం వెళుతుంటే బ్యాంకు తలుపులు వేసేస్తున్నారు. వాగ్దానాల అమలులో మోసపూరిత విధానాల వల్లే ఇదంతా జరుగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో తణుకులో రైతు దీక్ష చేపడుతున్నారు. వైఎస్ జగన్ తనకోసమో.. పార్టీ కోసమో ఈ పోరాటం చేయడం లేదు. ఒకటి గమనించాలి. ఇప్పట్లో ఎన్నికలు లేవు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాల్సిన అవసరం.. ఆదుర్దా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేవు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు పడుతున్న బాధలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడిగా హామీల అమలుకు సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్ జగన్ ఈ దీక్ష చేపడుతున్నారు. - కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత -
‘రుణమాఫీ’పై మరో కొత్త విన్యాసం..
-
‘రుణమాఫీ’పై మరో కొత్త విన్యాసం..
* సర్కార్ సర్కస్ ఫీట్లు * తాజా సర్క్యులర్‌తో బ్యాంకుల్లో గందరగోళం * నేడు బ్యాంకర్లతో ఆర్థిక శాఖ సమావేశం * రుణమాఫీ అయిందో లేదో తెలియక రైతుల్లో ఆందోళన * పేరు ప్రకటించి మాఫీలేదంటే.. రైతులు కొడతారంటున్న బ్యాంకర్లు సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ పథకం విన్యాసాలతో రాష్ట్రంలో రైతులను అష్టకష్టాలు పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకర్లను కూడా ఇబ్బందులు పెడుతోంది. సర్కారు తీరుతో ఒకవైపు రైతులు విలవిల్లాడుతుండగా మరోవైపు బ్యాంకర్లు గగ్గోలు పెడుతున్నారు. రుణ మాఫీ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బ్యాంకులకు జారీ చేసిన సర్క్యులర్‌తో మేనేజర్లు తలపట్టుకుంటున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా తమ పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఒక రైతు ఒక సర్వే నంబర్‌పై సహకార బ్యాంకులో పట్టాదారు పుస్తకం పెట్టి రుణం తీసుకుని, ఆ రుణం సరిపోక అదే పట్టాదారు పాసుపుస్తకం ద్వారా వాణిజ్య బ్యాంకులో బంగారం తనఖా పెట్టి మరో రుణం తీసుకుంటే... తొలుత తీసుకున్న రుణం ఒకటే మాఫీ కింద పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఆ మొత్తాన్ని సంబంధిత బ్యాంకు మేనేజర్ నుంచి రికవరీ చేస్తామని పేర్కొన్నారు. దీనిపై బ్యాంకు మేనేజర్లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘రైతుల రుణ విముక్తి’ తొలి జాబితాలో ఒక బ్యాంకులో కన్నా ఎక్కువ బ్యాంకుల్లో రుణం తీసుకున్న వారి పేర్లనూ ప్రకటించారని ప్రభుత్వం భావిస్తోంది. కానీ సర్క్యు లర్‌లో మాత్రం ఒక సర్వే నంబర్‌పై ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని రుణాలు తీసుకున్నా తొలుత తీసుకున్న రుణం మాత్రమే మాఫీ పరిధిలోకి తీసుకోవాలనే నిబంధనను ఇప్పుడు కొత్తగా విధించారు. ఒకే సర్వే నంబర్‌పై ఒక రైతు ఎన్ని బ్యాంకుల్లో ఎంత రుణం తీసుకున్నారనే వివరాలు బ్యాంకు సెర్చ్ కొడితే తెలిసిపోతాయని, దాని ప్రకారం బ్యాంకు మేనేజర్లు ఒక బ్యాం కులో రుణం మాత్రమే మాఫీకి వర్తింపచేయాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఒకసారి జాబితాలో పేరున్నట్లు రైతులు తెలుసుకున్నాక ఇప్పుడు రెండు బ్యాంకుల్లో తీసుకున్నందున మాఫీ వర్తించదని చెబితే బ్యాంకుల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని బ్యాంకు అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏ బ్యాంకులో రుణం మాఫీ చేయాలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ధారించకుండా తమను బలి పశువులను చేయాలనుకుంటోం దని వ్యాఖ్యానిస్తున్నారు. ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే తమకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ముందుకు సాగని రుణమాఫీ పథకం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ నేపథ్యంలో ఎక్కడా కూడా రుణ మాఫీ పథకం అమలు ముందుకు సాగడం లేదు. రైతుల నుంచి ఎక్కడెక్కడ రుణాలు తీసుకున్నారనే వివరాలను ముందుగానే ప్రచురించిన అఫిడవిట్ ద్వారా బ్యాంకులు సేకరిస్తున్నాయి. అలాగే సర్వే నెంబర్ గల ఒరిజినల్ పట్టాదారు పాసుపుస్తకం తేవాలని కోరుతున్నాయి. అయితే బ్యాంకు మేనేజర్లు వ్యక్తం చేస్తున్న సందేహాలతోపాటు మళ్లీమళ్లీ అడుగుతున్న వివరాలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా గ్రామాల్లోని రైతులు తమ పొలంపై సహకార సంఘాల నుంచి పట్టాదారు పాసుపుస్తకంపై రుణం తీసుకున్నారు. ఆ రుణం వ్యవసాయ పెట్టుబడికి సరిపోకవడంతో అదే సర్వే నెంబర్ భూమిని చూపెట్టడంతో పాటు వాణిజ్య బ్యాంకులో బంగారం కుదువపెట్టి వ్యవసాయానికి రుణం తీసుకున్నారు. రుణమాఫీ జాబితాలో రెండు బ్యాంకుల్లో రుణం ఉన్నట్లు రైతుల పేర్లను సర్కారు ప్రకటించింది. కానీ తాజా సర్క్యులర్‌లో తొలుత తీసుకున్న రుణం మాత్రమే మాఫీ చేయాలని పేర్కొంది. లేదంటే అందుకు సంబంధిత బ్యాంకు మేనేజర్‌నే బాధ్యుడిని చేస్తామని, ఆ మొత్తాన్ని మేనేజర్ నుంచి రికవరీ చేస్తామని స్పష్టంచేసింది. ఈ అంశంపై బ్యాంకర్లు పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించినా స్పందన రాకపోగా... బ్యాంకులే కచ్చితంగా ఈ విషయాన్ని రైతులకు చెప్పాలంటున్నారు. ఈ నేపథ్యంలో రుణ విముక్తికి అర్హులంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తొలి జాబితాలోని రైతుల ఖాతాలకు ఇంకా ప్రభుత్వ నిధులను బ్యాంకులు జమ చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేరకైతే తొలి జాబితాలోని రైతుల ఖాతాలకు రుణ విముక్తి సొమ్ము ఈ నెల 12వ తేదీలోగా సర్దుబాటు కావాల్సి ఉంది. అయితే డిసెంబర్ నెలాఖరు వస్తున్నా చాలా బ్యాంకుల్లో రైతుల రుణ ఖాతాలకు ప్రభుత్వం తొలుత ఇచ్చిన సొమ్ము ఇంకా సర్దుబాటు కాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు శనివారం ప్రధానమైన బ్యాంకు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. -
బాబుకు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదు: జ్యోతుల నెహ్రూ
వైఎస్సార్సీపీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ సాక్షి, హైదరాబాద్: రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే హక్కు ఎంత మా త్రం లేదని, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాల యంలో ఆయన మాట్లాడుతూ తొలుత చెప్పిన విధంగా రూ. 87 వేల కోట్ల వ్యవసాయ రుణాలతోపాటు, డ్వాక్రాలోని ప్రతి మహిళ రుణం పూర్తిగా మాఫీ చేసిననాడే ఆయనకు పదవిలో కొనసాగే అర్హత ఉంటుందన్నారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని తొలుత చెప్పిన చంద్రబాబు క్రమంగా వాటిని కుదించుకుంటూ వచ్చారని దుయ్యబట్టారు. రుణ మాఫీకి సంబంధించి జారీ చేసిన పత్రాల్లో ఒక రైతుకు రూ.3.15లు మాత్రమే మాఫీ అయితే మరో రైతుకు కేవలం రూ.95లు మాత్రమే రద్దయ్యాయని చెప్పారు. ఇంకొక రైతు రూ.60 వేల రుణం తీసుకుంటే అందులో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ.13 వేలు రద్దుకు మాత్రమే అర్హత ఉందని తేలుస్తూ, అది కూడా ఐదు విడతలుగా మాఫీ చేస్తామనడం విచిత్రమని వ్యాఖ్యానించారు. -
రుణమాఫీపై అబద్ధాలు చెప్పిస్తున్నారు : వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాల మాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతాను మాయ మాటలు చెబుతున్నది చాలక అధికారులతో కూడా అబద్ధాలాడిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబు పాల్గొన్న తిరుపతి సభలో పురుషోత్తం అనే రైతుకు రూ.29,999ల మేరకు మాత్రమే రుణం రద్దయితే ఆయన చేత తనకు రూ.లక్షన్నర రుణం మాఫీ అయిందని చెప్పిం చారని గుర్తు చేశారు. అలా ఎలా చెప్పారని ఆ రైతును ప్రశ్నిస్తే... అధికారులే చెప్పమన్నారని ఆ రైతు బదులిచ్చారని తెలిపారు. నిజాయితీపరులైన అధికారులతో సైతం చంద్రబాబు తనకు అనుకూలంగా అబద్ధాలాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ జరక్కుండానే జరిగినట్లుగా చంద్రబాబు రైతుల చేతుల్లో పెడుతున్న సర్టిఫికెట్ల తీరు చూస్తే ఇపుడు టికెట్లు ఇచ్చి నాలుగేళ్ల తరువాత భోజనం పెట్టిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. రుణమాఫీకి కూడా ఆధార్ కార్డును వర్తిం పజేస్తున్న ఫలితంగా ఆంధ్రా ప్రాంతంలో పొలాలు ఉన్న ఆడపడుచులు గాని, మరొకరు గాని హైదరాబాద్‌లో కాపురం ఉంటే వారికి రుణమాఫీ లేద ని చెబుతున్నారని తెలిపారు. పెళ్లయిన ఒక ఆడపడుచుకు తన తల్లిదండ్రుల నుంచి పసుపుకుంకుమల కింద సంక్రమించిన పొలానికి, ఆమె భర్తతో హైదరాబాద్‌లో ఉన్న కారణం చూపి రుణమాఫీ లేదనడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. -
తొలివిడత రుణమాఫీకి 15వేల కోట్లు
-
కేంద్రం సహకరించట్లేదు!
అయినా రుణ మాఫీ చేస్తున్నా రైతు సాధికార సదస్సులో సీఎం చంద్రబాబు సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు రుణమాఫీ చేస్తే మిగతా రాష్ట్రాల్లో ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్బీఐ, ఇతర బ్యాంకులైతే అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినా మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ అమలు చేస్తున్నా’మని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రైతు సాధికార సదస్సులో ఆయన ప్రసంగించారు. రైతు రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదంటూనే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ సహకారం వల్లనే రాష్ర్టంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేవలం కేంద్రం వల్లే సాధ్యమవుతుందని చెప్పారు.ఈ లోగా ఎత్తిపోతల పథకం నిర్మించడం ద్వారా సముద్రంలోకి వృథాగా పోతున్న మిగులు జలాలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీనిపై కొందరు ఇక్కడి రైతుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారని ఆయన నిందించారు. ‘నాకు ముందుగా గోదావరి జిల్లాల రైతులే ముఖ్యం. ఇక్కడ రెండో పంటకు నీరిచ్చిన తర్వాతే సముద్రంలోకి వృథాగా పోతున్న 3 వేల టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తాం’ అని ఉద్ఘాటించారు. ఇంటికే పింఛన్ పంపిస్తా.. అర్హులైన వారికి ‘మీసేవా’ కేంద్రాలు, పోస్టాఫీసుల్లోనే కాదు రేషన్ షాపుల్లోనూ పింఛన్ల సొమ్ము పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. నడవలేని వృద్ధులకైతే ఉద్యోగులను వారి ఇళ్లకు పంపించి పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. వరి ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ప్రకటించారు. రూ.4 లక్షలు రైతు పెట్టుబడి పెడితే మిగిలిన 75 శాతం అంటే 12 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సినీనటులు, వివిధ రంగాల ప్రముఖులు ఒక్కో పల్లెను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాల్సిందిగా చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రసంగానికి ముందు అధికారులు ఎంపిక చేసిన నలుగురు రైతులకు సీఎం రుణ విముక్తి పత్రాలను అందజేశారు. మొక్కుబడిగా సాగిన సభ.. గత నెలలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా జిల్లా పర్యటనకు చంద్రబాబు విచ్చేసిన సందర్భంలో ఐకేపీ యానిమేటర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది, ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన రైతు సాధికార సదస్సుకు పోలీసులు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. సభకు తరలించిన రైతులు, టీడీపీ కార్యకర్తల కంటే పోలీసులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచే జిల్లావ్యాప్తంగా వందలాది మంది రైతు సంఘాల నేతలను, నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా సభకు ఎక్కువమంది రైతులను తేలేక పోయారు. -
రుణ విముక్తి సరే..బ్యాంకు నోటీసుల సంగతేంటి?
సంతమాగులూరు: ‘రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిందని సదస్సులు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతున్నారు సరే..ఇప్పుడు కూడా బంగారం కుదువపెట్టి తీసుకున్న రుణాలు కట్టకపోతే వేలం వేస్తామని బ్యాంకులు నోటీసులు పంపుతున్నాయి..వాటి సంగతేంటి’ అని రైతు సాధికారత సదస్సులకు వెళ్లిన అధికారులను రైతులు నిలదీస్తున్నారు. మండలంలోని పుట్టవారిపాలెం, మామిళ్లపల్లి, పరిటాలవారిపాలెం, కొమ్మాలపాడు, కుందుర్రు, మక్కెనవారిపాలెం గ్రామాల్లో శుక్రవారం రైతు సాధికారత గ్రామసభలు నిర్వహించారు. అన్ని గ్రామాల్లో రైతులు అధికారులను నోటీసుల సంగతి తేల్చాలని నిలదీశారు. కుందుర్రుల్లో తహశీల్దార్ బీ గంగాధరరావు పర్యవేక్షణలో నిర్వహించిన సభలో రైతులు వేదిక వద్దకు వచ్చి అధికారులను నిలదీశారు. ‘అన్ని రోగాలకు ఒకటే మందన్నట్లుగా మీరేమో బంగారు రుణాలను కూడా ఐదు భాగాలు చేసి ఐదో వంతు జమ చేస్తారంటున్నారు. ఇలా అయితే బంగారంపై అప్పు పోయేదె ప్పుడు.. వారు మాకు బంగారు నగలు ఇచ్చేదెప్పుడు’ అని ప్రశ్నించారు. ఈవిషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహశీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అక్కడే ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకు నిబంధనల ప్రకారం రుణం పొందిన తరువాత రెండేళ్ల వరకే గడువు ఉంటుందని..ఆ తరువాత వేలం నోటీసులు ఇస్తామన్నారు. 300 మంది గడువు మీరిన వారికి నోటీసులు జారీ చేశామని చెప్పారు. -
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణమాఫీ
-
పరపతే కొలమానం
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణమాఫీ: పరకాల జాబితాలో పేర్లు లేని రైతులు జనవరి 9వ తేదీ లోపు సవరణలు చేసుకోవాలి నేడు చిత్తూరులో సీఎం చేతుల మీదుగా రుణ విముక్తి సర్టిఫికెట్లు సాక్షి, హైదరాబాద్: ‘‘రైతులు తీసుకున్న రుణం అంతా మాఫీ చేయమంటే ఎలా సాధ్యం? బ్యాంకర్లు ఇష్టం వచ్చినట్లు రుణాలు ఇస్తే ప్రభుత్వానికి ఏమి సంబంధం? అందుకే ప్రభుత్వం రుణ మాఫీ పథకం అమలుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను కొలమానంగా తీసుకుంది’’ అని ప్రభుత్వ సమాచార సలహాదారుడు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన బుధవారం సచివాలయంలో విలేకరులతో మాటాడారు. రైతులను అయోమయానికి గురి చేసే విధంగా కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని ఆరోపించారు. వాటిని నమ్మి ఎవ్వరూ అపోహలకు గురి కావద్దన్నారు. ‘రుణ మాఫీ హామీ ప్రకటన చేసిన సమయంలో చంద్రబాబు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని రైతులకు చెప్పలేదు కదా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. నేరుగా సమాధానం చెప్పకుండా ‘‘ఒక రైతు కుటుంబం 15 ఖాతాల ద్వారా రూ. 70 లక్షల రుణం తీసుకుంది.. అదంతా మాఫీ చేయమంటారా?’’ అని పరకాల ఎదురు ప్రశ్న వేశారు. మొదటి విడతగా 22.79 లక్షల రైతు కుటుంబాలను రుణ విమోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో 10 లక్షల మంది రైతులకు మొత్తం రుణం ఒకేసారి మాఫీ అవుతోందన్నారు. డేటా ఎంట్రీ సమయంలో కొన్ని తప్పులు దొర్లాయని వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. లోపాలున్న జాబితాను ఆన్లైన్లో ఉంచామని.. ఏ కారణం చేత తొలి జాబితాలో పేరు లేదో తెలుసుకొని సంబంధిత డాక్యుమెంట్లను జనవరి 9వ తేదీ లోపు ఆధారాలతో సహా ఇస్తే సరిచేసి రుణ మాఫీకి అర్హులుగా గుర్తిస్తామని చెప్పారు. రుణ మాఫీ పథకాన్ని సీఎం చంద్రబాబు గురువారం చిత్తూరు జిల్లాలో ప్రారంభిస్తారని.. ఈ సందర్భంగా రైతులకు వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను అందజేస్తారని ఆయన వివరించారు. తెలంగాణలో ఆధార్, రేషన్ కార్డు ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్‌లో పొలం ఉండటంతో పాటు అక్కడే రుణం తీసుకున్న వారి విషయంలో ఏమి చేయాలని ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా 2013 డిసెంబర్ 31వ తేదీ తర్వాత వచ్చే బీమా మొత్తం రైతుల ఖాతాకే జమ అవుతుందన్నారు. -
రుణవిముక్తి లబ్ధిదారుల రెండవ జాబితా సిద్ధం
హైదరాబాద్: రుణవిముక్తి లబ్ధిదారుల రెండవ జాబితాను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. రెండవ జాబితాలో 25లక్షల 71వేల మంది పేర్లు ఉన్నాయి. వెరిఫికేషన్ కోసం ఈ సాయంత్రం ఆన్లైన్లో పెడతారు. నాలుగు వారాలపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆధార్, రేషన్ కార్డు ఉన్నవారినే ఏపీ ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. **