
మైండ్‌గేమ్ ఆడుతున్న టీఆర్‌ఎస్
రుణమాఫీ’ పేరుతో మోసం
మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
వేములవా రూరల్ : రైతులకు రుణమాఫీ పథకం వర్తింపజేసి కష్టాలు తీర్చుతామని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ అన్నదాతలను మోసం చేసిందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. సెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పట్టణానికి చేరుకున్న ఆయన బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన ఒక్కహామీని అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సీఎం కేసీఆర్ అమలుకు నోచని హామీలు లేవన్నారు. సెస్ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపిస్తే సెస్ సంస్థను మరింత ప్రగతిపథంలో తీసుకెళ్తామని ఆయన అన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గుగ్గిళ్ల జయశ్రీ, నాయకులు అంజలీకుమార్, జయరామారావు, ఏనుగుమనోహర్‌రెడ్డి, చిలుక రమేశ్, పాత్య సత్యలక్ష్మి, ఎల్జబెత్‌రాణి, అరుణ్‌తేజ చారి, సాగరం వెంకటస్వామి, ముడికె చంద్రశేఖర్, కూరగాయాల కొమురయ్య, నరాల శేఖర్, గుడిసె సదానందం, గడ్డం రవీందర్‌రెడ్డి, బాసెట్టి రవీందర్, నామాల పోశెట్టి పాల్గొన్నారు.