అగ్రిగోల్డ్ పేరుతో జరిగినది వేల కోట్లతో కూడిన అతిపెద్ద స్కాం అని, ఇందులో 20 లక్షల కుటుంబాలకు నెత్తిన టోపీ పెట్టారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దీనిపై హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో సంస్థ భూములు, ఇతర ఆస్తులను వేలం వేసి మొత్తం బాధితులందరికీ వాళ్ల సొమ్ము ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ అంశం గురించి అసెంబ్లీలో మాట్లాడేందుకు, తనకు బాధితులు ఇచ్చిన ఆధారాలను చూపించేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. దానిపై ఆయన ఏమన్నారంటే...