మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరుకు తగ్గట్లే పిచ్చిపుల్లయ్యలా తయారయ్యారని వైఎస్ఆర్‌సీపీ నాయకుడు గౌతం రెడ్డి మండిపడ్డారు. ఆయన తీరు పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టుకున్నట్లుందని ఎద్దేవా చేశారు. తాను అగ్రిగోల్డ్ సంస్థకు లీగల్ అడ్వైజర్‌నని ఆయన చెప్పారని, దమ్ముంటే దాన్ని నిరూపించాలని చాలెంజ్ చేశారు