gautham reddy
-
సచివాలయ వ్యవస్థే దిక్కయ్యింది!
బెజవాడను వరద ముంచెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యల్లో ఘోరంగా విఫలమైంది. అదే సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన గడచిన ఐదేళ్ల పాలనలో జరిగిన మంచిని అడుగడుగునా గుర్తుచేసింది. ఇదే ఇప్పుడు చంద్రబాబు సహా కూటమి నేతలకు మింగుడు పడటం లేదు. ప్రజల్లో తమకు లేని ఆదరణ జగన్‌కు వస్తుంటే కడుపు మంట రెట్టింపైంది. జగన్ ఇడుపులపాయ నుండి వస్తుంటే మార్గమధ్యంలో కృష్ణలంక వాసులు ఆయన కారును ఆపేసి రిటైనింగ్ వాల్ నిర్మాణం వల్లే తాము బతికి ఉన్నామంటూ దండాలు పెట్టారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టలేదంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. అదేరోజు మధ్యాహ్నం జగన్ సింగ్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. అప్పటి వరకూ బోట్లలో తిరుగుతూ కాలక్షేపం చేసిన చంద్రబాబు... జగన్ నీటిలోకి దిగి ప్రజలతో మమేకమయ్యేసరికి ఉండ బట్టలేక పోయారు. జగన్ నీళ్లలోకి దిగాడని తాను కూడా నీళ్లలో దిగి ఫీట్లు చేయడానికి పడరాని పాట్లు పడ్డారు. ఇక జగన్ ఈ క్రమంలోనే అడిగిన అనేక ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పలేక ఇప్పటి వరకూ ఊరుకుని... ఇప్పటికిప్పుడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనను తెరపైకి తీసుకొచ్చారు. అసలు వీడియోలే లేవంటూ ఆడపిల్లల ఆందోళనను అవమానించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ముందస్తు సమాచారం లేకుండా నీటిని విడుదల చేయడం వల్ల సింగ్‌నగర్, పాయకాపురం, ఆర్ఆర్ పేట, కండ్రిక... ఇలా అనేక ప్రాంతాలు కేవలం రెండు గంటల వ్యవధిలో చెరువుల్లా మారి పోయాయి. శనివారం సాయంత్రం నుండి ఈ పరిస్థితి ఉంటే సోమవారం సాయంత్రం వరకూ సహాయక చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు వెళ్లిన టీవీ రిపోర్టర్ల వద్ద ప్రజల నుండి ఆగ్రహవేశాలు వ్యక్తమవడం చూసిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. నిన్నమొన్నటి వరకూ రేషన్ సరుకులు సరఫరా చేసే వ్యాన్లను వద్దంటే వద్దన్న బాబు అండ్ కో ఇప్పుడా వ్యాన్లలోనే ఫుడ్ ప్యాకెట్లను సరఫరా చేసింది. సచివాలయాలను నిర్వీర్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడదే సచివాలయాలను కేంద్రంగా చేసుకుని సహాయక చర్యలను చేపట్టింది. ఇదిలా ఉంటే సహాయక చర్యల్లోనూ ముమ్మా టికీ అవినీతే కనిపిస్తోంది. పడవ పంపాలంటే రూ. 2 వేల నుండి రూ. 10 వేల వరకూ డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. ఇక ఆహారం కూడా చివరి ప్రాంతాలకు అందలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇచ్చిన ఆహారం కూడా పురుగులు, కుళ్లిన వాసన వస్తోందని మండిపడ్డారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీచేసినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండమే పునరావాస కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయలేకపోవడానికి కారణమని అర్థమవుతోంది. చంద్రబాబు తన నివాసమే కృష్ణా నదిలో ఉన్న విషయాన్ని కూడా మరచిపోయారు. శనివారం నుండి వరద ఉధృతి ఉంటే బుధవారం తన ఇంటిపై అప్పుడెప్పుడో రెండు రోజుల క్రితం జగన్ ఆరోపించిన అంశాలను లేవనెత్తడం వెనుక రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. అందరి ఇళ్లు మునిగిపోయినట్లే తన ఇల్లూ మునిగిపోయిందని చంద్రబాబు ఎందుకన్నారన్న ప్రశ్నకు కనీసం ఆయన దగ్గర కూడా సమాధానం దొరకుతుందో లేదో! అందరి ఇళ్లు ప్రభుత్వం నీటిని విడుదల చేయడం వల్ల మునిగాయి. కానీ, చంద్రబాబు ఇల్లు మాత్రం కృష్ణా నదిలో ఉన్నందువల్ల మునిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను యథేచ్ఛగా ఉల్లంఘించిన చంద్రబాబు... బుడమేరు ఆక్రమణదారులను కఠినంగా శిక్షిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. మరీ ముఖ్యంగా బుడమేరు 2019 నుండి ఆక్రమణలకు గురైందంటూ వైసీపీ మీదకు నెట్టేందుకు పన్నాగం పన్నారు. నిజానికి చంద్రబాబు పాలనా కాలంలోనే బుడమేరు ఆక్రమణలకు గురయిందన్నది బహిరంగ రహస్యం.ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రా తరహా సంస్థను నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తరహా సంస్థలు నెలకొల్పితే ముందు చంద్రబాబు నాయుడి నివాసం నుండి పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ మేరకు పవన్ కల్యాణ్‌కు ధైర్యం ఉందా అనేది చూడాలి. జన సైనికులు తమ నేత ప్రశ్నించాల్సిన సమయంలో నిశ్శబ్దంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డి వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ‘ 98484 05455 -
యువనేత జైత్రయాత్ర!
పట్టుదల, దీక్షా దక్షతలు కలిగిన యువనేత జగన్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెల 27న ఇడుపులపాయలో ప్రారంభించిన బస్సు యాత్ర 23 జిల్లాల గుండా సాగి ఏప్రిల్ 24న శ్రీకాకుళం జిల్లాలో దిగ్వి జయంగా ముగిసింది. ఈ యాత్రకు ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ రోడ్‌షోలు కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించాయి. యువ నేతకు ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేక ఆయనపై హత్యాయత్నానికి తెగబడ్డప్పటికీ వెరవ లేదు. నుదిటిపై తీవ్ర గాయమైనా చెదరని సంకల్పంతో సీఎం జగన్ తనయాత్ర కొనసాగించారు. తన తండ్రి చనిపోయిన సందర్భంలో ఢిల్లీ పీఠాన్ని ఎదిరించి ఓదార్పు యాత్ర చేసినా, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వేలాది కిలోమీటర్ల మేర కాలినడకన ప్రజా సంకల్ప యాత్ర చేసినా, ముఖ్యమంత్రి పీఠమెక్కి రాష్ట్రాన్ని జనరంజకంగా పాలించినా, ఎన్నికల ప్రచారం కోసం ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేసినా... వీటన్నింటిలోనూ ఒక ఆర్ధ్రత, ఒక ఆప్యాయత, ఒక ఆత్మీయ మేళ వింపు, కుటుంబ సభ్యుడితో మాట్లాడిన అను భూతి కనిపిస్తున్నాయి. ఫలితంగా మే 13న జరగ బోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఏకపక్షంగా మారిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఈ యాత్ర సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుండి 221 మంది రాష్ట్ర స్థాయి నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకవైపు బస్సు యాత్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ, మరో పక్క తమ పార్టీలోని ముఖ్య నేతలు వైఎస్సార్ సీపీలో చేరడం వంటివి ప్రతిపక్ష పార్టీలకు మింగుడుపడడం లేదు. దీంతో బస్సు యాత్ర ఆపేందుకు కుటిల యత్నాలు చేశారు. ముఖ్య మంత్రిపై దాడిచేస్తే బస్సు యాత్రకు బ్రేక్ వేయవచ్చన్న దుర్బుద్ధితో వారు చేసిన ప్రయ త్నాలకు జగన్ వెరవలేదు. ఈ క్రమంలోనే దత్తపుత్రుడి చరిష్మా తగ్గిందని భావించిన పసుపు నేత చిరంజీవి అనే ముఖాన్ని మళ్లీ ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడ్డారు.అన్నింటికంటే మిన్నగా బస్సుయాత్ర మొదలైనప్పటి నుండి వలంటీర్ల వ్యవస్థ మీద విషం చిమ్మడం ద్వారా జగన్ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నానికి తెర తీశారు. అయితే అదికాస్తా తిరిగి వారి మెడలకే చుట్టుకోవడంతో పాలుబోని పరిస్థితి నెలకొంది. దురదృష్టవశాత్తూ వలంటీర్‌గా పనిచేస్తున్న గీతాంజలి అనే ఒక ఆడబిడ్డ ప్రాణాలు తీసు కునేలా పచ్చ బ్యాచ్ బరితెగించింది. వలంటీర్ల వ్యవస్థ మీద చేయకూడని ఆరోపణలు చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే తాము కూడా వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. మరో అడుగు ముందుకేసి వారి గౌరవ వేతనం రూ. 5 వేల నుండి రూ. 10 వేలకు పెంచుతామంటూ ఉత్తుత్తి హామీలు ఇచ్చారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయాన్ని ప్రజలు ఇప్పుడు సర్వత్రా చర్చించుకుంటు న్నారు. నిన్న మొన్నటి వరకూ జగన్ ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేశారన్న చంద్ర బాబు... తీరా ఎన్నికలు వచ్చేటప్పటికి ఇప్పు డున్న సంక్షేమానికి మించి తాము సంక్షేమాన్ని అందిస్తామంటున్నారు. ముస్లిమ్‌ల రిజర్వేషన్‌పై మిత్రపక్షమైన బీజేపీ చేస్తున్న ప్రకటనలను కనీసం ఖండించలేని దుఃస్థితిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేస్తామని ఒక్క మాట కూడా ఈ కూటమి నాయకులు ఎవరూ అనక పోవడమూ గమనార్హం. ఇలా చెప్పు కుంటూ పోతే తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి జిమ్మిక్కులూ, అబ ద్ధాలూ, కుయుక్తులూ, విషప్రచారాలూ చాలానే ఉన్నాయి.ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్‌లో అవకాశవాద రాజకీయాలు ఒకవైపు, చిత్తశుద్ధి – అంకిత భావంతో కూడిన రాజకీయాలు ఇంకోవైపు ఉన్నాయని సామాన్య ప్రజలు అర్థం చేసుకున్నారు. పేదలు – పెత్తందార్ల మధ్య ఇప్పుడు యుద్ధం జరుగుతోందని ప్రతిపక్ష కూటమి చర్యలు మరోసారి రుజువు చేశాయి. ముఖ్యమంత్రి జగన్ తాను ఇప్పటివరకూ ప్రజలకోసం చేసిన పనులూ, మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తే చేయనున్న పనుల గురించి తప్ప మరో మాట మాట్లాడటం లేదు. అలా ఆయన ప్రజల మనసులు గెలుచుకోగలిగారు. ఇదే వైసీపీ విజయం సాధించడానికి మూల మంత్రంగా మారనుందనడంలో ఎటువంటి సందేహం లేదు. డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ‘ 98481 05455 -
దొంగ ఓట్ల దొంగలెవరు?
మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగబోతోంది. ఈ క్రమంలో దొంగ ఓట్ల అంశం మళ్లీ తెరపైకి రావడంతో ఓటర్లలో గందరగోళ పరిస్థితులు నెలకొనే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే దొంగ ఓట్లకు సంబంధించి పోటాపోటీగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసలు దొంగ ఓట్లను ఎవరు ప్రోత్సహిస్తున్నారన్న దానిపై పలు కోణాల్లో అనేక మంది విశ్లేషణలు చేశారు. అయితే, ఎవరైనా దొంగతనం చేసినప్పుడు భయపడటం పరిపాటి. అదే పరిస్థితి తెలుగుదేశం ఎదుర్కొంటోంది. టీడీపీ పాలన కాలం నుంచి తమకు తెలియకుండా తమ ఇంటి నెంబరుతో కొన్ని ఓట్లు చలామణిలో ఉండటాన్ని ఇప్పుడు తెలుసుకుని ఇంటి యజమా నులు విస్తుపోతున్నారు. ఇదెలా సాధ్యమంటూ ముక్కున వేలేసు కుంటు న్నారు. ‘ఓటర్ల జాబితాల్లో అక్రమాలు’ అంటూ గావు కేకలు పెట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు మౌనం దాల్చడం అనుమానా లకు తావిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు భారీ మెజారిటీతో గెలవడం కోసం పక్కనే ఉన్న తమిళనాడుకు చెందిన వందల మంది పేర్లను తన నియోజకవర్గంలో చేర్పించారన్న అపవాదు ఉండనే ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ నకిలీ ఓటర్ల అంశం తెరపైకి రావడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకున్నాయనీ, వాటిని సరిదిద్దాలనీ, ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్లను కలసి ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో కలెక్టర్లకు వైసీపీ నుండి ఫిర్యాదులు అందాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని తమకు తెలిసిందనీ, వీటిని సరిదిద్దాలనీ వైసీపీ కోరింది. 2019కు ముందు నుంచే ఒకే డోర్ నెంబర్లో 50 నుంచి 100 ఓట్ల వరకు ఉన్నాయని వైసీపీ ఫిర్యాదులో పేర్కొంది. అదే విధంగా ఒకే వ్యక్తి ఏపీలోనూ, తెలంగాణ లోనూ రెండుచోట్లా ఓటుహక్కు కలిగి వున్నారని వివరించింది. ఒకే వ్యక్తికి మున్సిపల్ ఏరియాలోనూ, గ్రామంలోనూ, వేరు వేరు నియోజకవర్గాల్లో కూడా ఓటుహక్కు ఉందని పేర్కొంది. తమ పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి పరిశీలన చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయనీ, ఆ చిరునామాలలో ఉంటున్న వారిని అడగగా తమకు ఈ విషయం తెలియదని చెబుతున్నారనీ వైసీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ఉద్దేశ్యపూర్వకంగా దొంగ ఓట్లను చేర్చారనీ, ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత ఇలాంటి ఓట్ల అవకతవకలు, బోగస్ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా వైసీపీ ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా తుదిజాబితా విడుదలకు ముందు ఇలాంటి బోగస్, అక్రమ ఓట్లపై విచారణ జరిపి ప్రజాస్వామ్యయుతంగా అర్హులైన ప్రతి ఓటరుకూ ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఈసీ ఉపక్రమించబోతోందని తెలుస్తోంది. ఓటర్ల ఓట్లను ఇంటింటికీ వెళ్లి పరిశీలిస్తున్న టీడీపీ కార్యకర్తలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇలా చేయడం చట్ట విరుద్ధం. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడమే కాక టీడీపీ యాప్‌లో సేకరించిన సమాచారాన్ని ఎక్కించే మిషతో టెలిఫోన్ నెంబర్ తీసుకుని ఓటీపీ సైతం అడుగు తున్నారని అన్నమయ్య జిల్లాలో ప్రజలు వాపోతున్నారు. ఓటీపీ కాని, వ్యక్తిగత సమాచారం కాని ఇవ్వని వారిపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కూడా అనేక మంది చెబుతున్నట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందుతున్నాయి. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు ఓ ఇంట్లోకి వెళ్లి సమాచారం అడగటం... వారు ఇవ్వటానికి ఇష్టపడక పోవడంతో వారిపై దౌర్జన్యానికి దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. బాబు భరోసా, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడానికి సమాచారం అడిగారనీ, 2024లో టీడీపీ ప్రభుత్వం రానుందని ప్రజలను మభ్యపెడుతూ మోసగిస్తున్నారని అనేక చోట్ల ప్రజలు బహిరంగంగానే అంటున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించకుండా చూడటంతో పాటు దౌర్జన్యాలను అరికట్టడం ఇప్పుడు ఎన్నికల సంఘం ముందున్న తక్షణ కర్తవ్యం. అలా చేసినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. దొంగ ఓట్లను అరికట్టడానికి ఆధార్ కార్డును అనుసంధానం చేయడం ఉత్తమమైన మార్గం. ఈ విధానాన్ని ఇటీవలికాలంలో తెలంగాణ ఎన్నికల సంఘం ప్రారంభించింది. అయితే, మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రజాస్వామ్యం పరిపుష్టం కావడానికి, దొంగ ఓట్ల గోల పోవడానికి ఇది ఎంతో మేలు చేకూర్చే అంశం. వైసీపీపై ఇష్టారీతిన ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్న తెలుగుదేశం పార్టీగానీ, ఆ పార్టీని భుజాన వేసుకుని మోసే మీడియా కానీ ఈ ప్రతిపాదనపై ఎందుకు స్పందించడం లేదో అర్థం కావట్లేదు. ఇలా కోరడానికి కూడా నిజంగా ధైర్యం ఉండాలి. తాము తప్పు చేయనప్పుడు భయమెందుకు అన్న రీతిలోనే వైసీపీ అధినేత జగన్ ఈ కార్యక్రమానికి తెరతీశారు. ఆ ధైర్యం మాత్రం తెలుగుదేశం పార్టీ అధి నేత చేయలేకపోతున్నారంటే ఏమను కోవాలి. ఆయనే దొంగ ఓట్లను ప్రోత్స హిస్తున్నారనుకోవాల్సి వస్తోంది. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో అటు తమిళనాడు, ఇటు కర్ణాటకల నుండి పెద్ద ఎత్తున (వేలల్లో) ప్రజల పేర్లను చేర్పించిన తాను తన కేడర్‌కు ఏం చెబుతారన్నది బహిరంగ రహ స్యమే. ‘ఆవు చేలో మేస్తే .. దూడ గట్టున మేస్తుందా’ అన్న సామెత ఇందుకు అతికినట్లు సరిపోలుతుంది. వివేకవంతులైన ఓటర్లు ఈ తంతు అంతా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటి నుండే వారి వారి ప్రాంతాల్లో నివాసం లేని అనేకానేక మంది పేర్లను గుర్తించి బహిరంగ పరుస్తున్నారు. ఇది నిజంగా ప్రజల్లో వచ్చిన చైతన్యం. ప్రజల్లో ఈ తరహా చైతన్యం రావడం స్వాగతించదగ్గ పరిణామం. గ్రామాలు, వార్డులు, పట్ట ణాలు ఇలా... అన్ని చోట్లా తమకు తెలియని ఓటర్లు ఉంటే వెంటనే గుర్తించి ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టేలా ప్రజలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మొబైల్: 98481 05455 -
మరిన్ని వ్యాపారాల్లోకి ఏపీ ఫైబర్‌గ్రిడ్
సాక్షి, అమరావతి: కేబుల్ టీవీ, టెలికాం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) మరిన్ని వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ పి.గౌతమ్ రెడ్డి తెలిపారు. శనివారం విజయవాడలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశం నిర్ణయాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల నిర్వహణను ఏపీఎస్ఎఫ్ఎల్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా దేశవ్యాప్తంగా టెలికాం సంస్థలు పిలిచే టెండర్లలో పాలొ్గని ఆ ప్రాజెక్టులను కూడా చేపడతామన్నారు. వ్యాపార విస్తరణకు అనుగుణంగా మూలధనం పెంచుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపిందని, ప్రస్తుతం రూ. 7 కోట్లుగా ఉన్న మూలధనాన్ని రూ. 2,000 కోట్లకు పెంచుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఏపీఎస్ఎఫ్ఎల్ ఆస్తుల విలువ రూ. 3,586.22 కోట్లుగా ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ ఫేజ్–2 ప్రాజెక్టును చేపట్టామని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ రూ. 627 కోట్లను రుణ రూపంలో సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. 2020–21 ఆర్థిక సంవత్సరం వరకు ఏపీఎస్ఎఫ్ఎల్ అకౌంట్లను ఇంటర్నల్/ఎక్స్టర్నల్ ఆడిటింగ్ తర్వాత కాగ్‌కు సమర్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సెట్‌టాప్ బాక్స్‌ల కొరత ఉండటంతో ఎంఎస్‌వోలు సొంతంగా వాటిని కొనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తే తొమ్మిది నెలల గడువులో ఆ మొత్తం చెల్లించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. యనమల పాత్ర గురించి అప్పట్లోనే చెప్పా.. ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో చంద్రబాబు, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పాత్ర ఉందని గతంలోనే చెప్పానని గౌతమ్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ కుంభకోణంలో లోకేశ్ పాత్ర ఉందా లేదా అన్న విషయం దర్యాప్తులో తేలుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తనను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంకారంతో చంద్రబాబు ఉండేవారని, ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి జైల్లో ఉన్నారన్నారు. చంద్రబాబు బాధితుల్లో తానూ ఒకడినని, తనను కూడా జైలుకు పంపించారన్నారు. ఒక వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఆ కుటుంబం ఎంత వేదన చెందుతుందో ఇప్పుడు బాబు కుటుంబసభ్యులకు కూడా తెలుస్తుందన్నారు. -
ఈ యాప్‌లో సినిమాలు రిలీజ్
సాక్షి, అమరావతి: త్వరలోనే ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ఒక యాప్‌ను రూపొందిస్తుందని, ఇకపై ఆ యాప్ ద్వారా పాత, కొత్త సినిమాలను కూడా వీక్షించే అవకాశం లభిస్తుందని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి గురువారం చెప్పారు. ఇటీవల విశాఖలో ‘నిరీక్షణ’అనే సినిమాతో రిలీజ్ రోజే థియేటర్లో మాదిరిగా కొత్త సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షోని కుటుంబమంతా కలిసి ఇంట్లోనే కూర్చొని వీక్షించే విధానాన్ని ప్రవేశపెట్టామని..దానికి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. ఈ స్ఫూర్తితో ఏపీ ఫైబర్‌నెట్ జూన్ 16న రూ.39 కే ‘లవ్ యూ టూ’ చిత్రాన్ని అందిస్తోందని, దీన్ని ఏపీఎస్ఎఫ్ఎల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వివరించారు. సబ్‌స్రై్కబ్ చేసుకున్న తర్వాత 24 గంటల వరకు ఈ సినిమాను చూడవచ్చని చెప్పారు. చిన్న చిత్రాల నిర్మాతలను ప్రోత్సహించి, వీక్షకుడికి అతి తక్కువ ధరకే నేరుగా సినిమాను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని ఇది ఓటీటీలకు, థియేటర్ల యాజమాన్యానికి పోటీ కాదన్నారు. రూ.100 కోట్ల బడ్జెట్ మూవీకి మొదటి వారంపాటు టికెట్ ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం జీవో 13ను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. రూ.20 కోట్లలోపు నిర్మించిన సినిమాలను చిన్న చిత్రాలుగా భావిస్తూ వాటిని కూడా పండుగ రోజుల్లో ప్రతి థియేటర్లో పెద్ద చిత్రంతో పాటు ఒక షో చిన్న చిత్రానికి కేటాయించే అవకాశం కల్పించామన్నారు. రాబోయే రోజుల్లో థియేటర్లలో ప్రదర్శించే ప్రతి చిత్రాన్ని ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తామన్నారు. -
కార్మికుల ఆధ్వర్యంలో..ఈనెల 15న బైక్ ర్యాలీ
సాక్షి, వైజాగ్ : ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఎక్కువ శాతం కార్మిక వర్గాలు మేలు పొందాయని వైయస్సార్ టియుసీ రాష్ట్ర్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 18 వేలు వేతనం ఇస్తామని అమలు చేసిన నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి అనూహ్య మేలు చేశారని తెలిపారు. ఈనెల 15న రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు గౌతంరెడ్డి పేర్కొన్నారు. (నంద్యాల: ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలం) విజయవాడ కేంద్రంగా ఓ మాఫియా జగన్ మోహన్‌రెడ్డిపై విషం చిమ్ముతున్నారని, కార్మికులకు జరిగిన మేలుపై చర్చకు రండి అంటూ టిడిపి నాయకులకు గౌతమ్ రెడ్డి సవాలు విసిరారు. ఐటి హబ్ పేరిట విశాఖలో నిధులు దోచుకున్న ఘనుడు చంద్రబాబు నాయుడు అంటూ ఫైర్ అయ్యారు. ఈ నెల 24న హాకర్స్ కు పదివేలు ఇవ్వడం కూడా పాదయాత్ర ఫలితమేనన్నారు. ఇప్పుడు కార్మికలు జయహో జగన్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని కొనియాడారు. ప్రధాని మోదీ కూడా సీఎం జగన్ మోహన్‌రెడ్డి పాలనను అభినందించడం నిజాయితీ పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు. (‘ప్రజా సంకల్ప యాత్ర’పై దేవిశ్రీ పాట) -
35 రోజుల్లోనే టెస్టింగ్ కిట్లు ఉత్పత్తి చేశాం
-
వైఎస్సార్ సీపీలోకి టీడీపీ కార్మిక నాయకులు
సాక్షి, విజయవాడ: టీడీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని 10వేల మంది సభ్యులు ఉన్న టీడీపీ మెడికల్ వింగ్‌కు చెందిన పలువురు ట్రేడ్ యూనియన్ నాయకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీలో చేరిన తెలుగునాడు ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎన్నెస్సార్ మూర్తి మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్రేడ్ యూనియన్ నాయకులను పట్టించుకోలేదని, తమ సమస్యలు చెప్పుకుందామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాము కలిసి.. సమస్యలు విన్నవించుకున్నామని, తమను అక్కున చేర్చుకుని సమస్యలు పరిష్కరిస్తానని వైఎస్ జగన్ మాటిచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి అందిస్తున్న జనరంజక పాలన చూసి వైఎస్సార్ సీపీలో చేరామని వారు ఆనందం వ్యక్తం చేశారు. -
వైఎస్ జగన్ నాయకత్వంలో అభివృద్ధి సాధిస్తాం
-
‘చంద్రబాబు కార్మిక వ్యతిరేకి’
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్‌లో వైఎస్సార్టీయూసీ ఆధ్వర్యంలో మే డే వేడుకలు జరిపారు. పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బుధవారం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్ సీపీ నేత ధర్మాన కృష్ణదాస్, పలువురు నేతలు పాల్గొన్నారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు జెండా ఎగురవేసి అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కార్మికులకు, కర్షకులకు న్యాయం జరగలేదన్నారు. చంద్రబాబు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభించారని ఆరోపించారు. కార్మికవర్గ ప్రభుత్వాన్ని ఈ నెల 23న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కార్మికుల మొహంలో చిరునవ్వులు చూడాలన్నది వైఎస్ జగన్ తాపత్రయం అని వైఎస్సార్ సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల సంక్షేమం గాలికొదిలేసిందని, వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మల్లాది విష్ణు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు మెహబూబ్ షేక్, ఎంవీఆర్ చౌదరి, విశ్వనాథ్ రవి, ప్రదీప్ కుమార్, మాదు శివరామకృష్ణ, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు అడ్డంగా అబద్ధాలు చెబుతున్నారు
విజయవాడ: రాష్ట్రంలో విచ్చలవిడిగా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతం రెడ్డి విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మేరుగు నాగార్జునతో కలిసి మాట్లాడారు. అడ్డగోలు దోపిడీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు తెరతీశారని, సెంట్రలైజ్డ్ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమయ్యాయి..ఇండస్ట్రియల్ హబ్స్ ఎక్కడ అని సూటిగా అడిగారు. చంద్రబాబు అడ్డంగా అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది మంది కాంట్రాక్టు ఉద్యోగుల జీవితం అగమ్యగోచరంగా మారిందని వెల్లడించారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే కార్మికులు, శ్రామికులకు అండగా ఉంటారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..చంద్రబాబు కేంద్రంపై యుద్ధం అంటున్నారు...ఇప్పటివరకు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా ఇదో కొత్త డ్రామా అని అభివర్ణించారు. ఎన్నికలు వస్తున్నాయని టీడీపీ నేతలు గంగిరెద్దుల వేషం వేసుకొస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను మోసగించడమే చంద్రబాబు నైజమని తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబూ నీ ఆటలు ఇక చెల్లవని హెచ్చరించారు. -
ఆయన వైఎస్ఆర్సీపీ సభ్యుడు కాదు: విజయసాయిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: విజయవాడకు చెందిన పూనూరు గౌతమ్‌రెడ్డి తమ పార్టీ సభ్యుడు కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఆయనను గతంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని మరోసారి గుర్తుచేసింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ‘గౌతమ్‌రెడ్డి తనను తాను వైఎస్ఆర్సీపీ నాయకుడిగా పేర్కొంటూ కొద్దిరోజులుగా టీవీ చర్చల్లో పాల్గొంటున్న విషయం పార్టీ దృష్టికి వచ్చింది. గౌతమ్‌రెడ్డి పార్టీ సభ్యుడు కాదు. ఆయన అభిప్రాయాలకూ పార్టీకి ఏ సంబంధమూ లేదు. ఆయనను వైఎస్ఆర్సీపీ సభ్యుడిగా పరిగణించరాదు’ అని మీడియా సంస్థలకు తెలియజేస్తున్నట్టు ప్రకటనలో విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. -
వంగవీటి రంగాను విమర్శిస్తే ఊరుకోం: రాధా
విజయవాడ: దివంగత నేత వంగవీటి రంగాను విమర్శిస్తే ఊరుకోబోమని ఆయన తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించారు. వంగవీటి రంగాపై గౌతమ్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన అభిమానులు బాధపడ్డారని తెలిపారు. రంగాను అభిమానించే వారు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని, ఆయనను విమర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. సోమవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గౌతం రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో రంగా అభిమానులు ఎవరూ బాధపడొద్దని, ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. రెండు హత్య కేసులతో గౌతంరెడ్డికి సంబంధాలు ఉన్నాయని, ల్యాండ్ మాఫియాతోనూ ఆయనకు ప్రమేయముందని రాధా ఆరోపించారు. గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించడానికి నిన్న (ఆదివారం) ప్రెస్‌మీట్ పెట్టేందుకు ప్రయత్నిస్తే.. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. మహిళ, మాజీ ఎమ్మెల్యే అని చూడకుండా రత్నకూమారిని పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళ్లారని, ఈ ఘటనపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. కొంతమంది పోలీసుల అతివల్లే నిన్న ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. గౌతంరెడ్డిని సస్పెండ్ చేస్తూ మా పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని రాధా సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో అన్ని వర్గాల కోసం వంగావీటి రంగా పనిచేశారని అన్నారు. చనిపోయిన వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన సూచించారు. -
పిచ్చి పుల్లయ్యలా తయారయ్యారు!
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరుకు తగ్గట్లే పిచ్చిపుల్లయ్యలా తయారయ్యారని వైఎస్ఆర్సీపీ నాయకుడు గౌతం రెడ్డి మండిపడ్డారు. ఆయన తీరు పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టుకున్నట్లుందని ఎద్దేవా చేశారు. తాను అగ్రిగోల్డ్ సంస్థకు లీగల్ అడ్వైజర్‌నని ఆయన చెప్పారని, దమ్ముంటే దాన్ని నిరూపించాలని చాలెంజ్ చేశారు. ఈ విషయమై ఆయన శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు ఒక విషయంపై విచారణ పూర్తికాగా, దానిపై ఆయన విచారణకు ఆదేశిస్తామంటున్నారని, ఇదెక్కడి వ్యవహారమని ప్రశ్నించారు. చంద్రబాబు మాట్లాడమంటే ఈయనేదో మాట్లాడేస్తారని విమర్శించారు. రెండు ఎకరాల భూమి కొన్న వ్యక్తి తన భూమికి దారి లేదని, దారి చూపించాలని అడిగితే.. దానిపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీసీఐడీ విచారణ జరిగిందని ఆయన తెలిపారు. ఈ భూములతో తనకు గానీ, తన కుమారుడికి గానీ సంబంధం లేదని పోలీసులు తమ నివేదికలో తెలిపారని, అలాగే అగ్రిగోల్డ్‌తో కూడా సంబంధం లేదని చెప్పారని.. స్వయంగా డీజీపీయే దీనిపై డిక్లరేషన్ ఇచ్చారని అన్నారు. మీ పోలీసులు ఇచ్చిన నివేదికలను మీరు నమ్మరా అని ప్రత్తిపాటి పుల్లారావును గౌతం రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే విచారణ అయిపోయిన తర్వాత.. మళ్లీ ఇప్పుడు విచారణకు ఆదేశిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి కొన్నట్లు ఆయనే చెప్పారని.. తాను మాత్రం రైతుల నుంచి తన కుమారుడి పేరు మీద కొన్నానని చెప్పారు. తాను కూడా అగ్రిగోల్డ్ బాధితుల్లో ఒకడినని, తనకు రావాల్సింది అడగలేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలో 18 లక్షల మందికి పైగా ఉన్నబాధితుల గోడును వినిపించుకోవడం లేదని, ప్రత్తిపాటి పుల్లారావు మీద పరువునష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. -
పిచ్చి పుల్లయ్యలా తయారయ్యారు!
-
ఎన్ఆర్ఐ అనుమానాస్పద మృతి
అదృశ్యమైన ఐదు రోజులకు మృతదేహం లభ్యం హైదరాబాద్: నగరంలో ఓ ఎన్ఆర్ఐ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంటి నుంచి వాకింగ్‌కని వెళ్లి ఐదు రోజుల తర్వాత శవమై కనిపించాడు. బోయిన్పల్లి పోలీసుల కథనం ప్రకారం...పాత బోయిన్పల్లి రాజారెడ్డి కాలనీకి చెందిన గౌతమ్‌రెడ్డి (30) ఎనిమిదేళ్ల క్రితం కెన్యా వెళ్లి వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అతనికి ఎనిమిది నెలల క్రితం కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన యామినితో వివాహమైంది. గౌతమ్‌రెడ్డి గత నెల 29న కెన్యా నుంచి రాజారెడ్డి కాలనీలోని తన ఇంటికి వచ్చాడు. అదే రోజు రాత్రి 7.20కి వాకింగ్‌కు వెళ్లొస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు 30న బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని డెయిరీ ఫారం వద్ద చెట్ల పొదల్లో ఒంటిపై దుస్తులు కాలిపోయి, కుళ్లిన స్థితిలో ఓ మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని చూడగా మృతదేహం పక్కనే ఖాళీ పెట్రోల్ బాటిల్, ఓ పర్సు పడి ఉన్నాయి. పర్సు ఆధారంగా మృతుడిని ఎన్ఆర్ఐ గౌతమ్‌రెడ్డిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గౌతమ్‌రెడ్డికి నగరంలో శత్రువులెవరూ లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. ఏం జరిగి ఉంటుంది? గౌతమ్‌రెడ్డి మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గత నెల 29న సాయంత్రం ఇంటికి చేరుకున్న గౌతమ్‌రెడ్డి.. ఇంట్లో ఉన్న మూడు గంటల్లో ఏదైనా సంఘటన జరిగిందా అని అనుమానిస్తున్నారు. ఈ విషయంపై మృతుడి భార్య, ఇతర కుటుంబ సభ్యులు నోరు విప్పితేనే అసలు విషయం బయటకు వస్తుందంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు గౌతమ్‌రెడ్డి సెల్‌ఫోన్ పట్టుకెళ్లాడని, వాచ్ ధరించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తొలుత పేర్కొన్న కుటుంబ సభ్యులు ఆ తర్వాత సెల్‌ఫోన్ తీసుకెళ్లలేదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
బోయిన్ పల్లిలో ఎన్ఆర్ఐ దారుణ హత్య
-
వైఎస్సార్ కాంగ్రెస్ ఏపీ అధికార ప్రతినిధిగా గౌతంరెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ ఏపీ అధికార ప్రతినిధిగా విజయవాడ (సెంట్రల్)కు చెందిన పూనూరు గౌతంరెడ్డి నియమితులయ్యారు. పార్టీ ఏపీ కార్యదర్శిగా అనంతపురం (అర్బన్)కు చెందిన బుర్రా సురేష్‌గౌడ్‌ని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నారై డాక్టర్ల విభాగం అధ్యక్షుడిగా వాసుదేవరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నారై డాక్టర్ల విభాగం అధ్యక్షుడిగా డాక్టర్ వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి (మెల్బోర్న్, ఫ్లోరిడా), ఇదే విభాగానికి యూఎస్ ఎన్నారై కన్వీనర్‌గా రాజశేఖర్ కేశిరెడ్డి (బేఏరియా, కాలిఫోర్నియా)లను నియమించారు. వీరితో పాటు మరో 15 మంది ఎన్నారై డాక్టర్లను అడ్వైజరీ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా, ఆయా ప్రాంతాల ఇన్చార్జిలుగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అద్దంకి, నరసాపురం సమన్వయకర్తల నియామకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు శాసనసభా నియోజకవర్గాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించింది. అద్దంకి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యను, నరసాపురం నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజును నియమించింది. -
న్యాయానికి పట్టం కట్టండి
-ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు: జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో న్యాయానికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. రెండుసార్లు వాయిదా అనంతరం మూడో దఫా చైర్మన్ ఎన్నికను ఆదివారం నిర్వహించనున్న నేపథ్యంలో గౌతమ్‌రెడ్డి శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో 46 మంది జెడ్పీటీసీలు ఉండగా 31 మంది వైఎస్సార్సీపీ తరపునే గెలిచారన్నారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పై నమ్మకం, విశ్వాసంతో ఓటర్లు వైఎస్సార్సీపీ అభ్యర్థులకు జెడ్పీ ఎన్నికల్లో పట్టం కట్టారన్నారు. టీడీపీ తరఫున 15 మంది మాత్రమే గెలిచారన్నారు. వైఎస్సార్సీపీ తరపున గెలిపిస్తే ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, ప్రలోభాలకు లొంగి టీడీపీ వైపు నిల వడం భావ్యం కాదని వారిని గెలిపించిన ప్రజలే వాపోతున్నారన్నారు. ఆత్మప్రబోధం మేరకు 31 మంది జెడ్పీటీసీ సభ్యులు సమాజంలో తమ విలువలు కాపాడుకునేలా వైఎస్సార్సీపీ జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. అధికారులూ..సహకరించండి: జిల్లాలో జెడ్పీ ఎన్నిక మూడో దఫా అయినా సజావుగా సాగేలా అధికారులు సహకరించాలని మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు. ప్రజాస్వామ్య దేశంలో అధికారులు చిత్తశుద్ధిగా, న్యాయబద్ధంగా వ్యవహరించడం ధర్మమన్నారు. అధికారులు న్యాయంగా పాలన కొనసాగించినప్పుడే సమాజంలో వారి విలువలు మరింత రెట్టింపవుతాయన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. -
రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం :గౌతమ్‌రెడ్డి
మర్రిపాడు, న్యూస్‌లైన్: రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలని యువనేత, ఆత్మకూరు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. మండలంలోని పొంగూరుకండ్రిక, పొంగూరు గ్రామాల్లో మంగళవారం ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ర్టంలో మంచి పాలన రావాలంటే తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమన్నారు. ప్రస్తుతం పంటలు పండక రైతులు, రైతు కూలీలు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. మహా నేత వైఎస్సార్ పాలనలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి పంటలు బాగా పండాయన్నారు. దీంతో రైతులు అన్ని విధాలా అభివృద్ధి చెందారన్నారు. ప్రజాసంక్షేమం కోసం వైఎస్సార్ ఫీజురీయింబర్స్‌మెంట్, 108, 104 వైద్యసేవలు, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. మహానేత మరణానంతరం ఈ పథకాలు మూలనపడటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. సంతోషంగా ఉంది: మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు గౌతమ్‌రెడ్డి పాదయాత్ర చేయడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. జనం ఉప్పెనలా వస్తూ హారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్, పార్టీ నాయకులు రూప్‌కుమార్ యాదవ్, బిజివేముల వెంకటసుబ్బారెడ్డి, పందిళ్లపల్లి గోపిరెడ్డి, అల్లారెడ్డి సతీష్, శేషం హజరత్‌బాబు, యర్రమళ్ల శివశంకర్‌రెడ్డి, మందా రామచంద్ర, చిట్టిబాబు పాల్గొన్నారు. -
జనంతో మమేకం
సాక్షి, నె ల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి చేపట్టిన గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర శనివారం నాటికి వారంరోజులు పూర్తి చేసుకుంది. ఈ వారంలో ఆయన 110 కిలోమీటర్లు నడిచారు. శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సూచన మేరకు ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు. పాదయాత్రకు సంకల్పించిన గౌతమ్‌రెడ్డి ఈ నెల 22న ఏఎస్‌పేట మండలం హసనాపురం నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు నుంచి ఈ పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. గ్రామగ్రామాన పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజలు గౌతమ్‌రెడ్డికి ఘనస్వాగతం పలుకుతున్నారు. తొలుత ఏఎస్ పేట మండలంలో 7 గ్రామ పంచాయతీల్లో 18 గ్రామాల పరిధిలో ఈ పాదయాత్ర జరిగింది. అనంతరం ఆత్మకూరు మండలంలో రెండు పంచాయతీల్లో, మర్రిపాడు మండలంలో 6 గ్రామ పంచాయతీల్లో యాత్ర కొనసాగింది. శనివారం నాటికి యాత్ర చిన్నమాచనూరుకు చేరుకుంది. మొత్తం మీద శనివారం నాటికి 30 గ్రామాల పరిధిలో 110 కిలోమీటర్ల యాత్రను గౌతమ్‌రెడ్డి పూర్తిచేశారు. యాత్ర సందర్భంగా ప్రజలు ఆయా గ్రామాల్లో రోడ్లు, తాగునీటి సమస్య, విద్యాలయాల్లో గదుల కొరత తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గౌతమ్‌రెడ్డి దృష్టి సారించారు. నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. చాలాచోట్ల పంటలకు నీరు అందని విషయాన్ని రైతులు ఆయనకు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పొగాకు రైతుల అవసరాలను తెలుసుకుంటున్నారు. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో రైతాంగంతో పాటు అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వపరంగా అందిన సహాయాన్ని,సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి వివరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని, పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గౌతమ్‌రెడ్డి యాత్రలో ప్రజలకు వివరిస్తున్నారు. జనంతో మమేకమవుతూ సాగుతున్న గౌతమ్ యాత్రకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మంత్రి ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన గౌతమ్‌రెడ్డిపై వెల్లువెత్తిన ప్రజాదరణ చూసి నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాదరణ మరువలేనిది: మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో తాను చేపట్టిన పాదయాత్రకు ప్రజాభిమానం వెల్లువెత్తుతోందని, వారి ఆదరణ మరువలేనిదని మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. వారంలో వందరోజుల పాదయాత్రను పూర్తిచేసిన గౌతమ్ శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. వైఎస్ కుటుంబంపై ప్రజాభిమానం చెక్కుచెదరనిదన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తనను నియోజకవర్గ ప్రజలు ప్రేమతో ఆశీర్వదిస్తున్నారన్నారు. సోమశిల నీరు సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు ఇక్కడ కోట్ల నిధులు కుమ్మరిస్తున్నా.. అవి నేతల జేబుల్లోకి వెళ్తున్నాయే తప్పా ప్రజాసమస్యల పరిష్కారానికి వినియోగించిన దాఖలాలు లేవన్నారు. అందుకే ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మూడునెలల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని గౌతమ్‌రెడ్డి చెప్పారు. -
జగన్ ఆదేశాల మేరకే గౌతమ్ పోటీ
ఆత్మకూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకే గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నుంచి బరిలోకి దిగుతున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. ఆత్మకూరులోని పంచాయతీరాజ్ అతిథిగృహంలో శుక్రవారం నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ మండల కన్వీనర్లు, ముఖ్యనేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డితో గౌతమ్‌కు ఎంతో సాన్నిహిత్యం ఉందని గుర్తు చేశారు. సొంతగడ్డపై పోటీకి గౌతం ముందుకు వచ్చారన్నారు. ఆయన్ను ఆశీర్వదించాలని ఎంపీ అభ్యర్థించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రాఘవేంద్రరెడ్డికి సముచిత స్థానం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, నాయకులు రాపూరు వెంకట సుబ్బారెడ్డి, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, ఇందూరు నారసింహారెడ్డి, ఐవీ కృష్ణారెడ్డి, కడివేటి సంజీవరావు, బండ్లమూడి అనిత, బాలచెన్నయ్య, బాలకొండయ్య, పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ శేషారెడ్డి, మైనార్టీ నేత ఖాజావలి, దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తిలో మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటన