జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో న్యాయానికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. రెండుసార్లు వాయిదా అనంతరం మూడో దఫా చైర్మన్ ఎన్నికను ఆదివారం నిర్వహించనున్న నేపథ్యంలో గౌతమ్‌రెడ్డి శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు.
-ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి
ఆత్మకూరు: జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో న్యాయానికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. రెండుసార్లు వాయిదా అనంతరం మూడో దఫా చైర్మన్ ఎన్నికను ఆదివారం నిర్వహించనున్న నేపథ్యంలో గౌతమ్‌రెడ్డి శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో 46 మంది జెడ్పీటీసీలు ఉండగా 31 మంది వైఎస్సార్‌సీపీ తరపునే గెలిచారన్నారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పై నమ్మకం, విశ్వాసంతో ఓటర్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు జెడ్పీ ఎన్నికల్లో పట్టం కట్టారన్నారు. టీడీపీ తరఫున 15 మంది మాత్రమే గెలిచారన్నారు. వైఎస్సార్‌సీపీ తరపున గెలిపిస్తే ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, ప్రలోభాలకు లొంగి టీడీపీ వైపు నిల వడం భావ్యం కాదని వారిని గెలిపించిన ప్రజలే వాపోతున్నారన్నారు. ఆత్మప్రబోధం మేరకు 31 మంది జెడ్పీటీసీ సభ్యులు సమాజంలో తమ విలువలు కాపాడుకునేలా వైఎస్సార్‌సీపీ జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.
అధికారులూ..సహకరించండి: జిల్లాలో జెడ్పీ ఎన్నిక మూడో దఫా అయినా సజావుగా సాగేలా అధికారులు సహకరించాలని మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు. ప్రజాస్వామ్య దేశంలో అధికారులు చిత్తశుద్ధిగా, న్యాయబద్ధంగా వ్యవహరించడం ధర్మమన్నారు. అధికారులు న్యాయంగా పాలన కొనసాగించినప్పుడే సమాజంలో వారి విలువలు మరింత రెట్టింపవుతాయన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.